మా బృందం

అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ లోని ఎంపిక చేసిన వ్యక్తులు, భాగస్వామ్య సంస్థల సభ్యలు మరియు విద్యారంగంలో ఆసక్తి కలిగినవారు ఇక్కడ బృందంగా ఉన్నారు.

18824 registered users
7334 resources
జయకుమార్ మరియప్ప

ఈయన స్నేహపూరితమైన విధేయుడైన వ్యక్తి, కన్నడ విభాగానికి సంపాదకునిగా  విషయాలను ప్రామాణీకరిస్తారు ఎంపిక చేస్తారు. ఇతను పద్యాలను, చిన్నకథలను వ్రాస్తారు అలాగే  విస్త్రుత పరిధిలోని విషయాలను అనువదిస్తారు. భాషా విమర్శకుడు కూడా. వంట చెయ్యడం, ఫోటోలు తియ్యడం, ప్రపంచ పురాణాలను చడవడం, బోధన ఇతని అభిరుచులు. “భాష అందరినీ కలపాలని అది ఒక అడ్డంకి కాగూడదని” ఇతను భావిస్తారు.   విశ్వమానవుని భావనను నమ్ముతారు.

జూని. కె. విల్ఫ్రెడ్

దాపరికంలేని,నిష్కపటమైన ,కల్పనాశక్తిని కలిగియున్నమంచి తర్కరి. E.T.D  బృందంలో Visual and Interactive Designer గా పనిచేస్తున్నారు. గొప్ప చదువరి. జ్యూనీకి చిత్రకళ,సినిమాలను చూడడం మరియు సైకిల్ పై ఊరంతా చుట్టడం ఎంతో ఇష్ఠం.  ఎంతో శక్తినిచ్చే మధ్యాహ్నపు  కునుకును  కోల్పోవడానికి ఇష్టపడడు.   

ముజాహిద్

ఇతను విద్యా సాంకేతిక వేత్త, సృజనాత్మకతతో చలాకిగా ఉంటాడు.  విద్యా విషయాలలో ఉపయోగించదగిన  సరికొత్త  సాంకేతిక నమూనాలను  బృందానికి అందుబాటులోకి  తెస్తారు. వినియోగదారులు ప్రభావవంతంగా నిరంతరం పోర్టల్ ని ఉపయోగించేందుకు  సహకరిస్తారు.  ఇతను ప్రత్యేకంగా  “విద్యలో మొబైల్ ఫోన్”  ఉపయోగం గురించి ప్రయోగాలు చేస్తున్నాడు.  సాంఘిక పరిధిలో సాంప్రదాయాలనే చాంధసం నుండి బయటపడిన యధార్థవాది.  ఇతనికి చదవడం ( పుస్తకాలు ఒకటే కాదు ) నియమాలు లేకుండా వంటలు చెయ్యడం , కొత్త ప్రదేశాలను సంస్కృతులను అన్వేషిస్తూ ప్రయాణాలు చెయ్యడం ఇతని అభిరుచులు. . “ Be yourself, everyone else is already taken” is Mujahid’s   take on life.

రమణిక్ మోహన్

ఇతను  టీచర్ పోర్టల్ హిందీ విభాగ సంపాదక మండలి సభ్యుడు. ఇతను ఎంపిక చేసిన చేసుకొన్న వనరులను అనువదించి పోర్టల్ నియమాలకు అనుగుణంగా ప్రామాణీకరిస్తాడు. ఆంగ్ల సాహిత్యంలో పరిశోధకపట్టాను పొందాడు. ఒక కళాశాలలో 25  సంవత్సరాలపాటు అధ్యాపకునిగా చేసి, మరొక రంగంలో పని చేయడానికి  స్వచ్చంద విరమణ చేశారు. ఇతను సంపూర్ణ అక్షరాస్యతా ప్రచారంలో పాల్గొన్నారు.  పాకిస్థాన్ మరియు భారతదేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు అవసరమని దృడంగా విశ్వశిస్తారు .  సమాజ హితం  కోసం పాటు పడుతారు. హర్యానా రాష్ట్ర  వనురుల విభాగం నుండి వెలువడే త్రైమాసిక పత్రికకు 10 సంవత్సరాల పాటు సంపాదకునిగా వ్యవహరించారు.  ఇతను విద్యారంగంలో  “దిగంతర్”  లాంటి  సంస్థలతో కలసి పనిచేస్తున్నాడు. ‘Work to the best of your ability, and move on’ is what he believes in.

రాజేష్ ఉత్సాహి

పోర్టల్ బృందంలో హిందీ విభాగ సంపాదకునిగా ఇతను విషయాన్ని ఎన్నిక చేసి, ప్రామాణీకరిస్తాడు, ఏర్పరుస్తాడు.   వివిధ  భాగస్వాములతో  చర్చలను జరుపుతాడు . ఇతను శాస్త్రీయదృష్టిని కలవాడు మరియు తర్కభద్దంగా అలోచిస్తాడు. గతంలో మధ్య ప్రదేశ్ విద్యావిభాగానికి చెందిన” గుల్లాక్”  మరియు “పలాష్” పత్రికలను, ఏకలవ్య సంస్థ  ప్రచురించే  “చంపక్”  పత్రికకు  సంపాదకత్వం వహించారు. ఇంతకు ముందు ఇతను మధ్యప్రదేశ్ విద్యా విభాగంలోని  రూమ్ టు రీడ్, నలందాకు విషయనిపుణుడుగా పనిచేసాడు. He lives in search of his mission in life.

రాజ్ కిషోర్

ఒక విషయ నిపుణుడుగా  ఇతడు పోర్టల్ కి సంబంధించిన వనరులను ప్రామాణీకరిస్తాడు, ఏర్పరుస్తారు. ప్రత్యక్షానుభవాలు మరియు ప్రదర్శనల ద్వారా విఙ్ఞానశాస్త్రాన్ని వ్యాప్తిలోకి తెచ్చే ప్రపంచంలోనే  అతి పెద్దదైన కదిలే విఙ్ఞానశాస్త్ర రైలులో విఙ్ఞానశాస్త్ర సంధానకర్తగా పని చేశారు. కష్టమైన  ప్రయాణాలు చెయ్యడం (Trekking ) అనగ్రాం తయారు చెయ్యడం మరియు చదవడం ఇతని అభిరుచిలు. హాస్యాన్ని అందించే సినిమాలను పలు మార్లు వీక్షిస్తారు. పనిచేసే వాడే పనిని నేర్చుకొంటాడు అన్నది ఇతని సిద్దాంతం. “Doer alone learneth” is what he believes in.

రామ్ గోపాల్ వల్లత్

“జీవితాన్ని ప్రేమించే వ్యక్తి”.  ఇతనికి వాణిజ్యవిభాగాలలో చాలా సంవత్సరాల  పని అనుభవం ఉంది. విద్యారంగమంటే ఎంతో ఆసక్తి.  తీరిక సమయాలలో  గణిత లేదా భౌతికశాస్త్ర సమస్యలను పరిష్కరించనపుడు చరిత్రకు లేదా పురాణాలకు సంబంధించి చదువుతారు. పిల్లలకు ఆశ్చర్యంకలిగించే వింత కథలను చెప్పడానికి ఇష్ట పడుతారు ఈ మధ్యనే రచయిత కూడా అయ్యారు. ఇతను ముధ్రణా విభాగానికి అధిపతి.