ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18476 registered users
7227 resources
గణితంలో ప్రఙ్ఞాపాటవాలను పెంపొందించడంవ్యాసం | By Padmavathy , Ananthapadmanabhan | సెప్టె 24, 2012  | గణితశాస్రం | 0 Likes

గణితంలో ప్రతిభాపాటవాలంటే ఏవి ? గణితశాస్త్రం అంటే ఒట్టి సంఖ్యలే కాదు. పరిధి చాలా ఎక్కువ. గణితమంటే వివిధ అంశాల మధ్య సంబంధాలను చూడగలగడం, తర్కము,అనుప్రయోగ సామర్థ్యము, సృజనాత్మకత, ఒక ఆత్మపరిశీలన అని ఎన్నో. గణిత ప్రతిభాపాటవాలను ఎదుర్కోవడానికి సరైన సన్నివేశాలను కల్పించి వారి నైపుణ్యాలను పెంపొదించడం ఒక్కటే సరైన మార్గము.

విఙ్ఞానశాస్త్ర తరగతిగదులలో పిల్లల అభిప్రాయాలను విందాం- జ్యొస్త్న విజపుర్కర్వ్యాసం | By Learning Curve | ఆగ 27, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

విఙ్ఞానశాస్త్ర విద్యకు సంబంధించిన చాలా పరిశొధనలు, పిల్లలు విఙ్ఞానశాస్త్ర తరగతిగదుల్లో బోధించిన భావనలకు ప్రత్యామ్న్యాయ భావనలను ఏర్పరుచుకోంటారని నిరూపిస్తున్నాయి. చాలా సందర్భాలలో బోధన, పిల్లలో ఒక తప్పు భావనను మార్పు చేస్తుంది, కానీ ఏర్పడే కొత్త భావన కూడా తప్పుదే ఉంటోంది. మంచి సమాచారం ఏమిటంటే బోధన భావనలో మార్పు తెస్తుంది, దుర్వార్త ఏమిటంటే బోధన వలన విద్యార్థులలో ఏర్పడే భావన ఉపాధ్యాయుని మనస్సులో ఉండే భావన కాకపోవడం.

పగటికల E-Book | By Common Resources | సెప్టె 04, 2012  | ఇతరములు | 0 Likes

ప్రఖ్యాత విద్యా వేత్త గిజుభాయి పూర్తీ పేరు గిరిజాశంకర్ భగవాన్ జీ బధేకా. ఇరవై సంవత్సరాలు పాటు శిశు విద్యలో రావలసిన మార్పుల కోసం గిజుబాయి శ్రమించారు. పగటికల లో ఆయన ఒక స్వాప్నికుడిగా ఆచరణ యోగ్యమైన కలలుకనే విద్యావేత్తగా జీవించాడు.గిజుభాయి ఒక విద్యావేత్తగా బాలవిద్యలో ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు చేసి గుజరాత్ ప్రాథమిక విద్యారంగంలో మౌళిక మార్పును ప్రవేశపెట్టారు. గిజుభాయిని గుజరాత్ లో “మూంచ్ వాలీ మా”(మీసాలున్న అమ్మ ) అని ఎంతో ప్రేమగా పిలిచివారు.

“భూమికి చేరువలో అతిధిగా శుక్రగ్రహం"E-Book | By Common Resources | జూలై 25, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

జూన్ 6 , 2012 వ తేదీన ఒక క్రొత్తరకమైన సూర్యగ్రహణం జరుగబోతోంది. ఇది శుక్రగ్రహం మన భూగ్రహానికి, సూర్యునికి మధ్య రావడం వలన జరగబోతోంది.
ఖగోళ శాస్రవేత్తలు దీనిని “భూమికి చేరువలో అతిధిగా శుక్రగ్రహం” అని పిలుస్తున్నారు .ఆ రోజున శుక్రున్ని చూడడానికి చాలామంది ఇప్పటినుండే తయారవుతున్నారు. ఈ శుక్రగ్రహం ఒక నల్లని బిందువులాగా నిదానంగా సూర్యుని వలయానికి దగ్గరగా ఆకాశంలో కదలి వెళుతుంది.
ఆంగ్ల మూలం నిరుజ్ మోహన్ రామానుజం, తెలుగు సేత యన్.నాగరాజు

పట్టు చిక్కని గణితం వ్యాసం | By Learning Curve | జూలై 27, 2012  | గణితశాస్రం | 0 Likes

అజీమ్ ప్రేమ్ జీ ఫౌంఢేషన్,గిరిధర్ నుండి రాబోయే ‘లెర్నింగ్ కర్వ్’ వార్తాలేఖ యొక్క ఇతివృత్తం గణిత శాస్త్రానికి సంబందించినదని తెలియగానే, నా మెదడులో రెండు పదాలు జనించాయి, ఒకటి ప్రేమ రెండవది ద్వేషం అలాగే ఆలేఖను ఇంకాస్తా చదవగానే నాకు అనందంతో కూడిన అశ్చర్యం కలిగింది, ఎందుకంటే నాకు చాలా బాధను కలిగించే గణితాభ్యసనానికి సంబంధించిననా అనుభవాలను గురించి వ్రాయమని అడిగారు

పాఠశాల గ్రంధాలయం- భాషా విద్యలో ఒక ముఖ్యమైన వనరు- ఉషా ముకుంద వ్యాసం | By Learning Curve | ఆగ 23, 2012  | భాష | 0 Likes

సాధారణంగా పాఠశాల గ్రంధాలయాన్ని పాఠశాల పాఠ్యప్రణాళికకు ప్రతిస్పందించేదిగా, ఒక సహాయకారిగా చూస్తాము. గ్రంధాలయ నిర్వాహకుడు ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు గ్రంధాలయంలో ఉన్న సరికొత్త, యుక్తమైన వనరులకు సంబంధించిన సమాచారం అందించడంతోపాటు సమగ్రమైన, ఎంపిక చేయబడిన సామగ్రినుంచడం ఇతని బాధ్యతలు. అంతే కాక, పాఠశాల పాఠ్యప్రణాళికను సమృద్ధి చేసేందుకు కొన్ని కృత్యాలను, కార్యక్రమాలను గ్రంధాలయాన్ని ఉపయోగిస్తూ ఎలా మొదలుపెట్టవచ్చో అనే దృక్కొణాన్ని దీనికి జత చేస్తున్నాను. ఈ విధంగా గ్రంధాలయం పని చేయాలంటే దీనికి కొన్ని మార్పులు అవసరం.

అర్ధవంతమైన గణిత బోధన - దేవకి నాదిగ్, విజయ్ గుప్తావ్యాసం | By Learning Curve | ఆగ 23, 2012  | గణితశాస్రం | 0 Likes

గణిత విద్యాబోధనలో ముఖ్య విషయం ఏమిటంటే విద్యార్ధులు ఎప్పటికీ సాధారణ వ్యవస్థీకరణ విధాన సంబంధంగా ఉండిపోతారు. ఉదాహరణకు వారికి సంకలనం, గుణకారం తెలుసుకాని ఇచ్చిన సమస్య సంకలనానికి చెందినది లేక గుణకారాణానికి సంబంధించినదా తెలుసుకోలేకపోవడం. కావున మన ముందు ఉన్న సవాలు ఏమిటంటే పిల్లలను విధాన సంబంధం నుంచి విధాన భావనగా మార్చడం. ఇక్కడ విధానభావన అన్నది అవగాహనకు, అనువర్తనానికి సంబంధించినది. విధానభావనా ప్రక్రియ కలిగిన విద్యార్థులు 5 లక్షణాలను కలిగి ఉంటారు. వీటిని వరుసగా చూద్దాం.

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం