ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18472 registered users
7227 resources
నేర్చుకోవడం పిల్లల నైజం -మూడు నాల్గవ అధ్యాయాలుE-Book | By Common Resources | అక్టో 25, 2012  | ఇతరములు | 0 Likes

 

నేర్చుకోవడం పిల్లల నైజం-మొదటి రెండు అధ్యాయాలుE-Book | By Common Resources | అక్టో 18, 2012  | ఇతరములు | 0 Likes

 

భాష మరియు పాఠ్యప్రణాళికా చట్రం-2005 వ్యాసం | By प्रसाद | అక్టో 03, 2012  | భాష | 0 Likes

పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడడానికి మరియు ఇతరులతో మాట్లాడడానికి భాష ఒక మాధ్యమం. వీరు పదాలతోనే వాస్తవాలను నిర్మించుకుంటారు మరియు దానిపై పట్టు సాధిస్తారు. అభ్యసనం జరగడానికి భాషను ఉపయోగించగల, అవగహన చేసుకొగల సామర్థ్యాలు అవసరం అన్న విషయం స్పష్టమైనది మరియు నిర్ణయాత్మకమైనది. భాష సమాచారం జరపడానికి ఒక సాధనమే కాక మన ఙ్ఞానసమపార్జనలో సగభాగం కూడా దీని ద్వారానే జరుగుతుంది. భాష చాలా వరకు మన చుట్టూ ఉన్న వాస్తవికతను రూపుదిద్దడమే కాక దాన్ని వెలిబుచ్చడానికి కూడా తోడ్పడును. భాష సమాజంలో మన ఆధికారానికి ,శక్తికి గుర్తింపు చిహ్నంగా పని చేస్తుంది

విఙ్ఞానశాస్త్రంలో మూల్యాంకనం యొక్క శక్తి -విష్ణు అగ్నిహోత్రి, నిశాల్ శుక్ల, అపూర్వ భండారివ్యాసం | By Learning Curve | ఆగ 22, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

విఙ్ఞానశాస్త్రంలో మూల్యాంకన అవకాశాల గురించి మాట్లాడే ముందు అసలు విద్యా లక్ష్యాలేవో అవగాహన చేసుకొంటే మనం దేనిని మూల్యాంకనం చేయాలను కొంటున్నామో తెలుస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005 యొక్కజాతీయ కీలక చర్చా బృందం తయారు చేసిన పత్రం విఙ్ఞానశాస్త్ర బోధన అన్నది పరిశీలనను, క్రమాన్ని, పధ్దతిలను చూడడం, ప్రకల్పనలను ఏర్పరచడం, వివరణాత్మక మరియు గణిత నమూనాలను చెయ్యడం, వాటి ఫలితాలను ఊహించడం మరియు సిధ్దాంతాలను మనం నియంత్రించ కలిగిన ప్రయోగాలు చేయడం, పరిశీలనల ద్వారా పరీక్షించడాన్ని శాస్త్రీయపధ్ధతిలోని సోపానాలుగా చెప్పింది.

పరికరాలను తయారుచేయడం, ఉపయోగించడం- అరవింద్ గుప్తా వ్యాసం | By Learning Curve | ఆగ 13, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

ఉత్తమమైన విజ్ఞానశాస్త్రం ఎక్కువ ఖరీదు కానక్కరలేదు. కానీ మంచి వినోదం కలిగించేది కావచ్చు .
ప్రాథమిక స్థాయి విజ్ఞానశాస్త్రంలో అన్నింటికన్నా మంచి పుస్తకమ , 1928వ సంవత్సరంలో ” రిచర్డ్ గ్రెగ్స్” (Richard Greggs), రచించిన Preparation for Science (విజ్ఞాన శాస్రం కోసం తయారి). ఇతను అమెరికాకు చెందిన ఒక ఆర్ధిక శాస్రవేత్త . ఇతను మహాత్మగాంధి గారి చే ఉత్తేజితుదైనాడు. హిమాచల్ ప్రదేశ్ లో అమెరికన్ మతాధికారి , S. E. Stokes నడిపిన ఒక పాఠశాలలో గ్రెగ్స్ రెండేళ్ళ పాటు కృత్యాధార పద్ధతిలో విజ్ఞానశాస్రాన్ని బోధించారు . భారతదేశ పాఠశాలల్లోని విద్యార్ధులకు విజ్ఞానశాస్రాన్ని ఎలా బోధించాలి అనే విషయంలో ఈ పుస్తకం ఇప్పటికీ అత్యంత ప్రామాణికమైనది.

శాస్త్రీయ దృష్టిని అభివృధ్ధి చెయ్యడంవ్యాసం | By Learning Curve | జూలై 27, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

విద్యకు గల చాలా లక్ష్యాల్లో నాకు ముఖ్యమైనదిగా అనిపించేది శాస్త్రీయ దృష్ఠిని అభివృధ్ధి చెయ్యడం. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు,నన్ను పెంచిన విధానం, నేను అందుకొన్న విద్య, ఇంటి దగ్గర వాతావరణం మరియు నా సోదరీ సోదరులు ఒక మోస్తరు పేరెన్నిక గల శాస్త్రవేత్తలు అన్న నిజం, లేదానేను పనిచేస్తున్న సంస్థలోని పని వాతావరణం.
రెండు అనుభవాలు నన్ను ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించేలా చేశాయి.మొదటిది పది నెలల వయసున్న నా మనవుడు అనురాగ్ పెరుగుదలనుగమనించడం;రెండవదిఈ మధ్యనే కర్ణాటకలోని షొరాపూర్ ప్రాంతంలో జరిగిన విఙ్ఞాన జాతరలో నేనుగడపడం

జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (NCF) 2005 పద్ధతిలో విజ్ఞానశాస్రాన్ని అభ్యసించడం వ్యాసం | By प्रसाद | జూలై 27, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

విజ్ఞానశాస్రాన్ని అభ్యసనాన్ని, జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (NCF) 2005 ఈ విధంగా వ్యక్తపరిచింది, “ప్రాచీనము నుండి అద్భుతమైన మహాత్వపూర్వకమైన ప్రకృతి కి మానవుని ముఖ్య ప్రత్యుత్తరము ఏమనగా తమ చుట్టూ ఉన్న భౌతిక, జీవ సంబంధిత పర్యావరణమును పరిశీలించుట, అర్ధవంతమైన రీతులు, సంబంధములు అన్వేషించుట, ప్రకృతి తో కలసి పనిచేయడం కోసం పరికరాలు తయారుచేసి ఉపయోగించుట, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడం కోసం భావనలు, నమూనాలు తయారు చేయడం. మానవుని ఈ కృషి ఆధునిక విజ్ఞానానికి దారితీసింది.”

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం