ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

పాఠశాలల్లో శారీరక దండన

By editor_te | ఆగ 30, 2012

చాలా పాఠశాలలో ఇప్పటికీ క్రమశిక్షణ కోసం శారీరక దండననే అమలు పరుస్తున్నారు.దండన లేకుండా పాఠశాలలో క్రమశిక్షణ అమలు పరచలేమా ?

ఉపాధ్యాయ శిక్షణ

By editor_te | ఆగ 30, 2012

తిరిగి మీరు ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకొంటే ప్రస్తుతతరాలకు అనుగుణంగా ఎలాంటి మార్పులు అవసరమని అనుకొంటున్నారు ?

విఙ్ఞానశాస్త్ర విద్యకు సంబంధించిన చాలా పరిశొధనలు, పిల్లలు విఙ్ఞానశాస్త్ర తరగతిగదుల్లో బోధించిన భావనలకు ప్రత్యామ్న్యాయ భావనలను ఏర్పరుచుకోంటారని నిరూపిస్తున్నాయి. చాలా సందర్భాలలో బోధన, పిల్లలో ఒక తప్పు భావనను మార్పు చేస్తుంది, కానీ ఏర్పడే కొత్త భావన కూడా తప్పుదే ఉంటోంది. మంచి సమాచారం ఏమిటంటే బోధన భావనలో మార్పు తెస్తుంది, దుర్వార్త ఏమిటంటే బోధన వలన విద్యార్థులలో ఏర్పడే భావన ఉపాధ్యాయుని మనస్సులో ఉండే భావన కాకపోవడం.

గణిత విద్యాబోధనలో ముఖ్య విషయం ఏమిటంటే విద్యార్ధులు ఎప్పటికీ సాధారణ వ్యవస్థీకరణ విధాన సంబంధంగా ఉండిపోతారు. ఉదాహరణకు వారికి సంకలనం, గుణకారం తెలుసుకాని ఇచ్చిన సమస్య సంకలనానికి చెందినది లేక గుణకారాణానికి సంబంధించినదా తెలుసుకోలేకపోవడం. కావున మన ముందు ఉన్న సవాలు ఏమిటంటే పిల్లలను విధాన సంబంధం నుంచి విధాన భావనగా మార్చడం. ఇక్కడ విధానభావన అన్నది అవగాహనకు, అనువర్తనానికి సంబంధించినది. విధానభావనా ప్రక్రియ కలిగిన విద్యార్థులు 5 లక్షణాలను కలిగి ఉంటారు. వీటిని వరుసగా చూద్దాం.

సాధారణంగా పాఠశాల గ్రంధాలయాన్ని పాఠశాల పాఠ్యప్రణాళికకు ప్రతిస్పందించేదిగా, ఒక సహాయకారిగా చూస్తాము. గ్రంధాలయ నిర్వాహకుడు ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు గ్రంధాలయంలో ఉన్న సరికొత్త, యుక్తమైన వనరులకు సంబంధించిన సమాచారం అందించడంతోపాటు సమగ్రమైన, ఎంపిక చేయబడిన సామగ్రినుంచడం ఇతని బాధ్యతలు. అంతే కాక, పాఠశాల పాఠ్యప్రణాళికను సమృద్ధి చేసేందుకు కొన్ని కృత్యాలను, కార్యక్రమాలను గ్రంధాలయాన్ని ఉపయోగిస్తూ ఎలా మొదలుపెట్టవచ్చో అనే దృక్కొణాన్ని దీనికి జత చేస్తున్నాను. ఈ విధంగా గ్రంధాలయం పని చేయాలంటే దీనికి కొన్ని మార్పులు అవసరం.

విఙ్ఞానశాస్త్రంలో మూల్యాంకన అవకాశాల గురించి మాట్లాడే ముందు అసలు విద్యా లక్ష్యాలేవో అవగాహన చేసుకొంటే మనం దేనిని మూల్యాంకనం చేయాలను కొంటున్నామో తెలుస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం 2005 యొక్కజాతీయ కీలక చర్చా బృందం తయారు చేసిన పత్రం విఙ్ఞానశాస్త్ర బోధన అన్నది పరిశీలనను, క్రమాన్ని, పధ్దతిలను చూడడం, ప్రకల్పనలను ఏర్పరచడం, వివరణాత్మక మరియు గణిత నమూనాలను చెయ్యడం, వాటి ఫలితాలను ఊహించడం మరియు సిధ్దాంతాలను మనం నియంత్రించ కలిగిన ప్రయోగాలు చేయడం, పరిశీలనల ద్వారా పరీక్షించడాన్ని శాస్త్రీయపధ్ధతిలోని సోపానాలుగా చెప్పింది.

మంచి ప్రయోగశాల విఙ్ఞానశాస్త్ర భొధనాభ్యసనను ఇనుమడింప చేస్తుందనడంలో సందేహం లేదు. ఇది నిర్వివాదాంశం. ప్రతిరొజూ జరిగే సంఘటనలు లెదా నిజ జీవిత అనుభవాలు ఆదారంగా, కొన్ని సాధారణ ప్రశ్నల ద్వారా, సులభంగా అందుబాటులో ఉండే సామాగ్రి వలన మరియు కొన్ని పరికరాలను కొనడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోగశాల లేనప్పటికి విఙ్ఞానశాస్త్ర బోధనలో పరివర్తనలు తీసుకొనిరావచ్చు.

తొమ్మిదవ తరగతికి వెళ్ళేదాకా అందరి ఇతర ఆడపిల్లలలాగే నాకు కాలేజిలో ఏం చదవాలో తెలియలేదు. ఒక రోజు సాహిత్యం, ఇంకొక రోజు కళలు, మరొకరోజు వైద్యం, ఇలా ఉండేవి నా అలోచనలు. భవిష్యత్ అంధకారంగా ఉండేది, మిగిలిన విద్యార్థుల అలోచనలతోపాటు నా అలోచనలు కూడా వివిధ రూపాలను సంతరించుకొనేదనడంలో సందేహంలేదు.

నేను గణితశాస్త్రాన్ని ద్వేషించను. కాని చాలాకాలం పాటు గణితాన్ని ద్వేషించానని చాలా కారణాల వల్ల నమ్మాను. చాలా ముఖ్యమైన కారణమేమిటంటే గణితాన్ని నాకు బోధించిన ఉపాధ్యాయుడు నిరంకుశుడు. ఎప్పుడూ బెత్తాన్ని, క్రూరాత్వాన్ని కలిగి ఉండడం వలన గణితం నాకు ఒక దుర్భేధ్యమైనదిగా మారింది. నలభై సంవత్సరాల తరువాత నన్ను నేను పరిశీలించుకొన్నప్పుడు నాకర్థమైనదేమిటంటే నేను గణితం బాగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నానని. దురదృష్టవశాత్తు పాఠశాల రోజుల్లో జరిగిన ఇతర సంఘటనలన్నీ, నా శ్రేయోభిలాషులు నాపై చూపిన సానుభూతితో సహా, నేను ఎప్పటికీ గుణితం నేర్చుకోలేనేమో అనే నమ్మకాన్ని కలిగించాయి.

పేజీలు

18617 registered users
7272 resources