ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

మనం  ఏ విషయాన్ని పిల్లలకు, ఎందుకోసం బోధిస్తాం? తరగతిగది బోధనా లక్ష్యాలను, సమీకృత అభివృధ్ధితో బాధ్యతలు తెలిసి క్రియాశీలకంగా ఉండే పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా గల విద్యాలక్ష్యాలతో పోల్చినప్పుడు  తరగతిగది బోధనా లక్ష్యాల పరిధి తక్కువగా అనిపిస్తుంది. విద్యార్థులలో భౌధ్ధికసామర్థ్యాలను, సాంఘిక వివేచనను, క్రియాశీలక నైపుణ్యాలు, భావోద్వేగాలు, వైఖరులు, విలువలను అభివృధ్ధి చేసేదే సమగ్రవిద్య.  1950 సంవత్సరంలో Benjamin Blooms విద్యాలక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు, అవి జ్ఞానాత్మకరంగం, భావాత్మకరంగం మరియు  చలనాత్మక రంగం.

విద్యార్థులందరూ ఆటలుఆడి పాటలుపాడి  అంతే శక్తితో, ఉత్సాహంతో తరగతిగదిలోకి  ప్రవేశించారు. కొంత మంది విద్యార్థులు ఇంకా అంతవరకు వారు ఆడిన ఆటల ధ్యాసలోనే ఉన్నారు , కొంత మంది విద్యార్థులు సేదతీరుతున్నారు  కానీ చాలా మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుని కోసం ఎదురుచూస్తున్నారు.

పర్యావరణ-కార్యకలాపాల నుండి అభ్యసనం- సాంఘికశాస్త్ర కృత్యాలు   

పాఠశాల విద్యార్థులను వారికి అయిష్టమైన విషయమేదని అడిగితే 10 మందిలో 9 మంది గణితమనే చెపుతారు. మరింత దగ్గరగా పరిశీలిస్తే వీరిలో 7 మంది విద్యార్థులు గణితశాస్త్రం భయంకరమైనది అభివర్ణిస్తారు. పిల్లలనే ఎందుకు పెద్దలని అడిగినా ఇంచుమించు మనం ఇదేరకమైన సమాధానాన్నే వినవచ్చు. నేను అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్లోని సహచరులను ఫౌండేషన్ వెలుపల ఉన్న కొంత మంది మిత్రులను, నేను గణితశాస్త్రం అనగానే మీకు వెంటనే స్ఫురణకు వచ్చిన సమాధానమేది ?

1965 వ సంవత్సరంలో నేను కలకత్తాలోని సెయింట్ మరీ కాన్వెంట్ లో ఐదవ తరగతి చదువుచున్నాను. అది భూగోళశాస్త్ర తరగతిగది. శాంతి నంది గారు మా భూగోళశాస్త్ర ఉపాధ్యాయులు. ఆ రోజు మాకు పట నైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) బోధిస్తునారు.

మాకు పటనైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) బోధించిన విధానం:  

అది వారానికి  ఒక సారి జరిగే పట నైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) తరగతి.  అందరూ కూడా ఎప్పటిలాగే తరగతికి అవసరమైన మాప్ –పుస్తకం, అట్లాస్, పెన్సిల్  రబ్బరు తెచ్చుకొన్నాము.(ఆరోజుల్లో అందరూ కూడా తప్పనిసరిగా ఎవరికి వారే  పటాలను చిత్రించుకోవాలి).

పూర్వకాలంలో ఒక కళాకారుడు ప్రదర్శనలను ఇస్తూ ఊరూరు తిరుగుతూనట్టుగా  ఇప్పుడు Agastya International Foundation (A. I. F) వారి సంచార విజ్ఞానశాస్త్ర  ప్రయోగశాలలు ఆంద్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు తిరుగుతూ ఉన్నాయి . పూర్వకాలంలో కళాకారునికి ఘనస్వాగతం లభించినట్లుగానే ఈ సంచార ప్రయోగశాలలకు కూడా దీని కోసం  ఎదురు చూస్తున్న విద్యార్థుల నుండి  కరతాళ ధ్వనులతో  ఘనస్వాగతం లభిస్తోంది.  ఈ ప్రయోగశాల వారి పాఠశాల ముంగిట ఆగి, ఆగగానే విద్యార్థులంతా  దానిలో ఏమున్నదని ఆశ్చర్యంతో వరుసగా నిలబడి చూస్తారు.

వ్రాత పరీక్షల యందు మంచి ఫలితాలను పొందిన విద్యార్ధులు, దానిని మాట్లాడే విషయంలో ఎందుకు ఇబ్బంది పడతారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ వ్యాసం నందు రచయిత పాఠశాలల యందు ఆంగ్లమును ఒక భాషగా ఎలా బోధించాలో వివరించడం జరిగినది.

నా ముప్ఫై ఏళ్ళ బోధానానుభవంలో విద్యార్ధులు MBA పూర్తిచేసినప్పటికీ, ఆంగ్లమును మాట్లాడడాన్ని కష్టతరంగా భావించే చాలా మంది నాకు తారసపడడం జరిగినది. నేను ఆయా పాఠ్యపుస్తకాలు అతి క్లిష్టమైన ఆంగ్లము నందు రచించబడినవని ఊహించాను కాని నేను వాటిని చూసిన తరువాత ఆంగ్లము మాట్లాడడం అనర్గళంగా వస్తే ఆయా పరీక్షలను అతి సులభంగా దాటవచ్చునని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.

విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికవిజ్ఞానముల యందు పురోగతిని తప్పుకారణాలకు ఉపయోగించడం జరుగుతోంది .అతిసున్నితమైన అధికధ్వనులనుపయోగించి శరీరలోపాలను కనుక్కోనే అల్ట్రాసోనోగ్రఫీ పద్ధతినే ప్రస్తుతం తల్లిగర్భంలో పెరుగుతున్న పిండలింగనిర్ధారణ కోసం ఉపయోగిస్తున్నారు.  తల్లితండ్రులు పుట్టబోయే శిశువుయొక్కలింగనిర్దారణ పరిక్ష చేయించుకొని,అమ్మాయనతెలిసినచో  గర్భస్రావం చేయించుకుంటున్నారు. దీనివల్ల దేశంలో  లింగనిష్పత్తి  చెదరడమే కాకుండా ఇది సమాఙంలో ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నది. ఎందుకు ఇలాంటి క్రూరమైనచర్యలను చేస్తున్నారు ? ఈ ప్రశ్నకు సమాధానం కూడా సమాజంలోనే ఉంది.   

భారతప్రభుత్వ Vigyan Prasar శాఖ వారు వెలువరించే  Dream 2047 - November 2013 సంచికను ఇక్కడ చూడవచ్చు, ఇందులో  2013 నోబెల్ బహుమతులను పొందిన శాస్త్రవేత్తల వివరాలు, తోకచుక్కల గురించి, వేరికోసిస్ గురించిన వ్యాసాలను ప్రచురించారు. 

ఉమాహరికుమార్

ఒలంపిక్ ఆటస్థలంలో స్కేటింగ్ చేస్తోన్న అమ్మాయి, పట్టుదలతో, ఉత్సాహంతో విన్యాసాలు చేస్తోన్న చైనాక్రీడాకారులు, సితార్ ను మధురంగా వాయిస్తున్న రవిశంకర్ మరియు  రమ్యంగా షహనాయ్ ని  ఆలపిస్తున్న బిస్మిల్ల ఖాన్ గార్ల ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. వారంతా ఆ అత్యున్నత స్థాయిని అందుకోవడానికి గల ముఖ్యకారణం వారందరిలోనూ ఉన్నఒకే ఒక లక్షణం  “ప్రతిభ” మరియు “అభ్యాసం”. 

పేజీలు

18617 registered users
7272 resources