తరగతిగది వనరులు

విద్యార్థులను నిత్యజీవితంలోని అంశాల గురించి కానీ లేదా వారు సులువుగా అవగాహన చేసుకోగలిగిన అంశాలగురించి వ్రాయమన్నప్పుడు ఈ నైపుణ్యం ఆసక్తికరంగానూ ఆనందంగానూ మారుతుంది. పిల్లలు తగినంతగా పదజాలాన్ని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కలిగిఉండరు గనుక సాధారణంగా వ్రాయడానికి విసుగును ప్రదర్శిస్తారు. చర్చలను నిర్వహించడంతో మొదలుపెట్టి మేధోమథనం, ఆలోచనలను క్రమంలో ఉంచడం, పదజాలాన్ని పెంపొందించడం మొదలైన కృత్యాల ద్వారా విద్యార్థులలో విద్యార్థులలో వ్రాయడంఅనే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.

ఇక్కడ 11 అభ్యాసపత్రాలను ఇచ్చారు. ఇవి విద్యార్థులు నేను, మా కుటుంబం, నా అభిరుచులు, అనుభూతులు , మా ఇల్లు అనే భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

ప్రత్యుత్తరప్రశ్నల ద్వారా  పిల్లలకు  రేఖాగణితంలోని వివిధ భావనలను పరిచయం చెయ్యడమే ఈ అభ్యాస  అభ్యాసపత్రం యొక్క ముఖ్య ఉధ్ధేశ్యం. అభ్యాసపత్రాలను పూర్తీచేయడం ద్వారా విద్యార్థులు  సిధ్ద్ధాంతలకు అవసరమైన ఉపపత్తులును పరోక్షంగా  తెలుసుకొంటారు.

ఈ అభ్యాసపత్రం అభ్యాసకులు నీటిప్రాముఖ్యతను అలాగే  ఇతర అంశాలైన నీటికొరత, నీటిసంరక్షణ   భావనలను అవగాహన చేసుకొనేందుకు  వారి అభిప్రాయాలను తెలిపేందుకు ఉపయోగపడుతుంది.

మా అమ్మగారు  చాలా గొప్ప ఆస్తికులు. ఆమెకు ఏ కష్టం వచ్చినా ప్రార్థనలు చేసేది. ఆ రోజు కూడా మా అమ్మ రోజంతా ప్రార్థనలు చేస్తూనే ఉంది ఎందుకంటే ఆ రోజు నాకు నా పదవతరగతి గణిత పరీక్ష. ఉదయం 8.00 గంటలకు నన్ను పరీక్షకు పంపి తాను నేరుగా పూజాగాదికి పూజలు చేయడానికి  వెళ్ళింది.  నేను పరీక్ష వ్రాసి మధ్యాహ్నం 1.00 గంటకు ఇంటికి వచ్చాను, అప్పటికీ మా అమ్మ ఇంకా పూజలు చేస్తూనే ఉంది. ఆ ఇంట్లో చివరి పిల్లనైన నేను నా గణితపరీక్షలో ఉన్నతశ్రేణిలో  ఉత్తీర్ణున్ని కావాలని ఆమె దేవునికి ఎన్ని ప్రమాణాలు చేసిందో ! 

ఇది వరలో మీరు కాగితంతో తయారుచేసిన అస్థిపంజరాన్ని చూశారు. ఇపుడు PVC పైపులను లను అయస్కాంతాలను ఉపయోగించి అస్థిపంజరాన్ని ఎలా తయారుచేయవచ్చో చూడండి. దీని సహాయంతో కీళ్లను, కదలికలను వివరించవచ్చు.    

ఈ పుస్తకం ఒకటవ తరగతి పిల్లలకు రంగులను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది ఆలాగే వారిలో అన్వేషణను పెంపొదిస్తుంది.  

ఇందులో ఒక అమ్మాయి తన శరీరభాగాల గురించి అవి చేసే ధ్వనుల గురించి చాలా చక్కగా తెలియచేస్తుంది. 

పదసమస్యలను సాధించడం వలన విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని పెరుగుతుంది. ఈ అభ్యాసపత్రం విద్యార్థుల సృజనాత్మకతకు కూడా తోడ్పడుతుంది. 

పౌరశాస్రం లేక రాజనీతిశాస్రం పాఠ్యాంశాలంటే విద్యార్థులకు విసుగు. విద్యార్థులు పౌరశాస్ర పాఠ్యాంశాలను కంఠతాపద్ధతిలో తమజీవితాలకు ఏమాత్రం సంభందంలేనివిగా అభ్యసిస్తారు. విద్యార్థులు ప్రభుత్వానికి మరియు పౌరశాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలను తమపరిసరాలలో చూస్తున్నా వాటిని తమజీవితాలకు ఏమాత్రం అన్వఇంచుకోలేకపోతారు. విద్యార్థులు తమ జీవితాలలోనే రాజనీతిశాస్ర సిద్ధాంతాల భావనల అనుభవాలను పొందిన తరువాత వాటిని పరిచయం చేయాలి. ఈ పాఠ్యాంశంలో మాదిరి ఎన్నికల ప్రక్రియ గురించి, ఎన్నికల ప్రచారం, రహస్య ఓటింగ్, చెల్లని ఓట్లు, ఓట్ల లెక్కింపు మొదలైన భావనలను వివరిస్తుంది.

పేజీలు

18074 registered users
6933 resources