ఇతరములు

 

జనగణమన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911 లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ప్రఖ్యాత విద్యా వేత్త గిజుభాయి పూర్తీ పేరు గిరిజాశంకర్ భగవాన్ జీ బధేకా. ఇరవై సంవత్సరాలు పాటు శిశు విద్యలో రావలసిన మార్పుల కోసం గిజుబాయి శ్రమించారు. పగటికల లో ఆయన ఒక స్వాప్నికుడిగా ఆచరణ యోగ్యమైన కలలుకనే విద్యావేత్తగా జీవించాడు.గిజుభాయి ఒక విద్యావేత్తగా బాలవిద్యలో ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు చేసి గుజరాత్ ప్రాథమిక విద్యారంగంలో మౌళిక మార్పును ప్రవేశపెట్టారు. గిజుభాయిని గుజరాత్ లో “మూంచ్ వాలీ మా”(మీసాలున్న అమ్మ ) అని ఎంతో ప్రేమగా పిలిచివారు.

ఉపాధ్యాయ శిక్షణ

By editor_te | ఆగ 30, 2012

తిరిగి మీరు ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకొంటే ప్రస్తుతతరాలకు అనుగుణంగా ఎలాంటి మార్పులు అవసరమని అనుకొంటున్నారు ?

ఉపాధ్యాయుల ఎజన్సీ

భారతదేశ పాఠశాల విద్యలో సంస్కరణలకోసం చేపట్టిన ప్రయోగాలు, ఉదాహరణకు  హొసంగాబాద్ విఙ్ఞాన శాస్త్ర బొధనా కార్యక్రమం గుణాత్మ విద్యలో ఉపాధ్యాయులు అత్యంత కీలక పాత్ర పొషిస్తారని చూపాయి.  ఉపాధ్యాయులకు సంస్కరణల పై  సానుకూల అలోచన కలిగి మనస్ఫూర్తిగా అమలుజరిపితేనే అవి ఫలవంతమయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు సంస్కరణల పట్ల సానుకూల వైఖిరి లేకపొతే అవి  విఫలమయ్యే  దిశగా పయనిస్తాయి.

ఇది కథలను లేదా వివిధ దశలలో వివరించాల్సిన ఏదైనా విషయపరిజ్ఞానాలను సులభంగా వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేయడంలోనూ ఉపయోగించడంలోనూ పిల్లలు ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని కనపరచడమే కాకుండా ఆ భావనను సులభంగా అభ్యసిస్తారు.

పేజీలు

18094 registered users
6935 resources