భాష

వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులలో  ప్రశ్నించడమనే సామర్థ్యాన్ని పెంపొందించడం వలన వారిలో ఆలోచనా నైపుణ్యం మరియు భావావగాహన భావన పెరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను సులభమైన అవగాహనకు సంబంధించిన ప్రశ్నలను కాకుండా ఫలితాన్ని ఊహించమని, లేదా ఇచ్చిన సమాచారాన్ని కొత్తసన్నివేశంలో ఉపయోగించడానికి అవసరమయ్యే ప్రశ్నలను,  అలాగే ఆ సమాచారాన్ని సరిచూడడానికి  సంబంధించిన ప్రశ్నలను అడగాలి.

క్రింద, ఒక కథ ఆధారంగా వివిధరకాలైన ప్రశ్నలతో విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని, అవగాహనా సామర్థ్యాన్ని  పెంపోదించడానికి మరియు ఇందులో వారి సామర్థ్యాలను   అంచనా వేయడమెలానో  వివరించారు.

కథ

 

విద్యార్థులను నిత్యజీవితంలోని అంశాల గురించి కానీ లేదా వారు సులువుగా అవగాహన చేసుకోగలిగిన అంశాలగురించి వ్రాయమన్నప్పుడు ఈ నైపుణ్యం ఆసక్తికరంగానూ ఆనందంగానూ మారుతుంది. పిల్లలు తగినంతగా పదజాలాన్ని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కలిగిఉండరు గనుక సాధారణంగా వ్రాయడానికి విసుగును ప్రదర్శిస్తారు. చర్చలను నిర్వహించడంతో మొదలుపెట్టి మేధోమథనం, ఆలోచనలను క్రమంలో ఉంచడం, పదజాలాన్ని పెంపొందించడం మొదలైన కృత్యాల ద్వారా విద్యార్థులలో విద్యార్థులలో వ్రాయడంఅనే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.

రచయిత, ఉపాధ్యాయురాలిగా తన విద్యార్థులలో పఠనావగాహన మరియు శ్రవణ  నైపుణ్యాలను  పెంపొందించడానికి నిర్వహించిన ఆసక్తికరమైన  కృత్యాన్ని మీతో  పంచుకొంటున్నారు.

విద్యార్థికి భాషకు సంబంధించినంతవరకు వినడం,మాట్లాడడం,చదవడం మరియు వ్రాయడం అనే నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. పఠనావగాహన వినడం మరియు చదవడమనే నైపుణ్యాలకు సంబంధించినది. చదివిన పేరాను లేదా విన్న విషయాన్ని అవగాహన చేసుకొనే సామర్థ్యాన్ని విద్యార్థులలో అభివృధ్ధి చేయాలనేది  విద్యావేత్తలుగా మనకందరికీ విదితమైన విషయమే.     

చదవడం-రకాలు

1.     బిగ్గరగా చదవడం

2.    నిశ్శబ్ద పఠనం

ఈ పుస్తకం ఒకటవ తరగతి పిల్లలకు రంగులను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది ఆలాగే వారిలో అన్వేషణను పెంపొదిస్తుంది.  

వ్రాత పరీక్షల యందు మంచి ఫలితాలను పొందిన విద్యార్ధులు, దానిని మాట్లాడే విషయంలో ఎందుకు ఇబ్బంది పడతారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ వ్యాసం నందు రచయిత పాఠశాలల యందు ఆంగ్లమును ఒక భాషగా ఎలా బోధించాలో వివరించడం జరిగినది.

నా ముప్ఫై ఏళ్ళ బోధానానుభవంలో విద్యార్ధులు MBA పూర్తిచేసినప్పటికీ, ఆంగ్లమును మాట్లాడడాన్ని కష్టతరంగా భావించే చాలా మంది నాకు తారసపడడం జరిగినది. నేను ఆయా పాఠ్యపుస్తకాలు అతి క్లిష్టమైన ఆంగ్లము నందు రచించబడినవని ఊహించాను కాని నేను వాటిని చూసిన తరువాత ఆంగ్లము మాట్లాడడం అనర్గళంగా వస్తే ఆయా పరీక్షలను అతి సులభంగా దాటవచ్చునని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.

ఇందులో ఒక అమ్మాయి తన శరీరభాగాల గురించి అవి చేసే ధ్వనుల గురించి చాలా చక్కగా తెలియచేస్తుంది. 

భాషాభ్యసనం  చాలా సంక్లిష్టమైనది. ఆంగ్ల వ్యాకరణాన్ని సాధారణ పద్ధతిలో బోధించినప్పుడు మందకొడిగాఉంటుంది. విసుగుకలిగిస్తుంది. దీనికి కొన్ని ఆటలను చేర్చినప్పుడు ఇవి ఆనందకరంగా మారుతాయి. ఇక్కడ అలాంటి ఆరు పాఠ్యాంశాలను ఇచ్చారు. 

కథలు చెప్పేకళ చాలా ప్రాచీనమైనది. చాలా ఆనందాన్నిచ్చే కృత్యం. సాధారణంగా ప్రజలు బావితరాలకు అందించదగిన ప్రపంచానికి సంబందించిన సంగతులను, కాల్పనిక గాథలను, పౌరాణికాలను స్మృతిభాండాగారాలుగా కలిగి ఉంటారు. వీటిని భాషానైపుణ్యాల అభివృద్ధికి కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇది రెండవ తరగతి విద్యార్థుల కోసం, ఇందులో చెందూ కలలో ఎగురుతూ తాను ఏమేమి చూసింది ఇందులో వివరించారు. పిల్లల ఊహాలోకం ఇందులో ఆవిష్కృతమౌతుంది. 

అత్యధికసంఖ్యలో పిల్లలు పాల్గొన్న ఒక వేసవి శిబిరంలో వారి కోసం నిర్వహించిన కొన్ని కృత్యాలను ఇక్కడ ఇస్తున్నాము. విద్యార్థులు ఈ కృత్యాధార అభ్యసనాన్ని బాగా ఆనందించడమే కాకుండా తాము ఆంగ్లంలో మాట్లాడగలిగే, వ్రాయగలిగిగే, చదువగలిగే సామార్థ్యాన్ని కలిగి ఉన్నామని తెలుసుకొని చాలా సంతోషించారు. ఈ కృత్యాలను ఉపాధ్యాయులు తమ తరగతిగదులలో కూడా ఉపయోగించవచ్చు.

పేజీలు

18476 registered users
7227 resources