విజయపథాన్ని సమర్పించండి విన్నూత్న బోధన

లక్ష్మీభాయి గారికి బోధనలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈమె ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని లింగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తిని నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు తరగతుల విద్యార్థుల బోధనకు ఈమె  ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తారు. ఈమె పాఠశాలలో నిర్వహించే కొన్ని బోధనాకార్యక్రమాలు:

భాషకు సంబంధించిన కృత్యాలు: ఈమె పాత పాఠ్యపుస్తకాలలో, వార్తాపత్రికలలో ప్రచురింపబడిన చిత్రాలను  బోధనావనరులుగా ఉపయోగిస్తారు.  ఈ చిత్రాలను ఉపయోగించి ఈమె “మెరుపుఅట్టల” ను తయారుచేస్తారు. ఈ మెరుపుఅట్టలను చాలా సందర్భాలలో ఇతివృత్తాల ప్రకారం కూడా తయారుచేస్తారు, ఉదాహరణకు రంగులు, పక్షులు, జంతువులు, రవాణా సాధనాలు మొదలైనవి. కానీ  సాధారణ మెరుపుఅట్టలలోలాగా వీటికి పేర్లు ఉండవు. ఈ మెరుపు అట్టలను 1,2, మరియు 3 తరగతులకు  తెలుగు, ఆంగ్లము మరియు పరిసరాలవిజ్ఞానాన్ని బోధించడానికి ఉపయోగిస్తారు. ఈ కార్డులని బృందకృత్యాలకి, వ్యక్తిగత కృత్యాలు నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తారు. (అనుబంధాన్ని చూడండి )

వార్తాపత్రికలలో కనిపించే కొన్ని చిత్రాలను కూడా ఈమె భాషను బోధించడానికి(భాషణం మరియు లేఖనం)   ఉపయోగిస్తారు. వీటినే గొడపత్రికకు ఉపయోగిస్తారు. ఈ గొడపత్రికకు సేకరించే చిత్రాలు వివిధ అంశాలకు చెందినవై ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని 1,2, మరియు 3 తరగతులకు కలిపి నిర్వహిస్తారు. ఈ కృత్యాన్ని వారానికి రెండు రోజుల పాటు రోజులో మధ్యాహ్నం సమయాన దీనికి కేటాయిస్తారు.

ఉదాహరణకు:  విద్యాసంవత్సర ఆరంభంలో పాఠశాలకు వెళ్లేపిల్లల ఫోటోను ఒక రోజు గొడపత్రికలో అతికించారు. దానికి సంబంధించిన సంభాషణ;

·         ఫోటోలో ఎవరున్నారు ?

·         ఎక్కడికి వెళుతున్నారు ?

·         ఏమి తీసుకొని వెళుతున్నారు ?

·         ఎందుకు వెళుతున్నారు ? ఎలాంటి దుస్తులను దరించారు ?ఎందుకు ?    

ఇదే పధ్ధతిని గణితాన్ని బోధించడానికి కూడా ఉపయోగిస్తారు. కాకపోతే ఇక్కడ అంకెలతో మెరుపుఅట్టలను తయారుచేస్తారు.

·         ఈ అంకెలకు (సంజ్ఞలు) ఒకమూర్త రూపాన్ని ఇవ్వడానికి సమయానుకూలంగా అందుబాటులో ఉన్న  వివిధవస్తువులను ఉపయోగిస్తారు.  ఉదాహరణకు తనా బ్యాగ్ లో ఉండే  బస్ టికెట్లను పిల్లలకు కౌంటింగ్ చేయడానికి ఇస్తారు. వాటిని ఎంచి వాటికి సరిపొయ్యే అంకెను వారు దానికి జతచేయాలి.

·         ఈ కార్డులనే అంకెలను ఒక క్రమంలో ఉంచడానికి, ఆరోహణ అవరోహణా కృత్యాలను నిర్వహించడానికి చతుర్విద ప్రక్రియలను చేయడానికి (మూడు తరగతులకు) వీటిని కూడా ఉపయోగిస్తారు.

సాధించిన విజయాలు

·         2008 వ సంవత్సరంలో మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు

·         2009 వ సంవత్సరంలో డివిజన్లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు

·         బాలసాహిత్యం కోసం నిజామాబాద్ ఉపాధ్యాయశిక్షణా సంస్థ వెలువరించే “ఇందూరుబాల” పత్రికకు తాను రచించిన “గేయాల”తో దోహదపడుతున్నారు. మునుపు S.S.A.వారు వెలువరించిన చదువు పత్రికకు కూడా ఈమె రచనలు చేశారు.

·         ఆకాశవాణి,  హైదారాబాద్ మరియు నిజామాబాద్ వారు నిర్వహించే “బాలలలోకం”  “చిన్నారిలోకం” కార్యక్రమాల్లో పిల్లలసంరక్షణ, ప్రవర్తన, అభ్యసనం అంశాలకు సంబందించి ఉపన్యాసాలు ఇచ్చారు.  

·         ఈమె గతంలో రెండవతరగతి పాఠ్యపుస్తకానికి రచయితగా కూడా పాఠ్యాంశాలను సమాకూర్చారు.

 

అనుబంధం

 

కార్డు

1 వ తరగతికి

2 వ తరగతికి

3వ తరగతికి

తెలుగు

నెమలి పదాన్ని పరిచయం చెయ్యడానికి

నెమలి పదాన్ని ఉక్తలేఖనంగా వ్రాయడానికి

నెమలి గురించి రెండు మూడు వాక్యాలను వ్రాయడం

ఆంగ్లం

Spelling పలికించడానికి

వ్రాయడానికి

స్పెలింగ్ని ఉక్తలేఖనంగా వ్రాయడానికి

·         నెమలి ఒక అందమైన పక్షి

·         నెమలికి అందమైన పించమ్ ఉంటుంది

·         నెమలి మన జాతీయపక్షి  

·         నెమలి అడవిలో,కొండలలో,గుట్టలలో కనిపిస్తుంది.

·         నెమలి పురుగులను, ధాన్యాన్ని ఆహారంగా తీసుకొంటుంది

 

తెలుగు

 

పాఠశాల పదం

పాఠశాల పదాన్ని ఉక్తలేఖనంగా వ్రాయడానికి

పాఠశాల గురించి రెండు మూడు వాక్యాలను వ్రాయడానికి

·         పాఠశాల అన్నీ గ్రామాలలో ఉంటుంది

·         విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు

·         ఇది గ్రామంలో ఒక భాగం

·         గ్రామంలో ప్రజలు నివసిస్తారు

·         పాఠశాల గ్రామంలో ఉంటుంది

·         కావున పాఠశాల సమాజంలో ఒక భాగం

ఆంగ్లం

Spelling పలికించడానికి

వ్రాయడానికి

స్పెలింగ్ని ఉక్తలేఖనంగా వ్రాయడానికి

 

      

పైన పేర్కొన్న కృత్యంలో 3వ తరగతికి వివరించిన కృత్యం భాషకు మరియు పరిసరాలవిజ్ఞానానికి వర్తిస్తుంది. ఇలాగే ఇతర మెరుపుఅట్టలను కూడా ఈ అన్ని కృత్యాలకి ఉపయోగించవచ్చు   

 

 

 

 

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

ఆసక్తి కరమైన ఆనంద దాయకంగా తరగతి గది ఉన్నదీ.

saidulu యొక్క చిత్రం

చాల బాగున్నవి

pragathiprasadmeda యొక్క చిత్రం

మేడం గారికి అభినందనలు, మీ కృషి ఉపాధ్యాయలోకానికి ఆదర్శనీయం.

ravigotteti యొక్క చిత్రం

Really a good teacher 

arav యొక్క చిత్రం

ThanK u madam pillalaku chala Baga upayogapadtndi

arav యొక్క చిత్రం

thank u madam pillalaku chala baga upayogapdtndi

18787 registered users
7333 resources