భాగస్వామ్య సంస్థలు

18824 registered users
7334 resources

సంపాదక భాగస్వామ్యులు

ప్రాథమికంగా పాఠశాల ఉపాధ్యాయులని దృష్టిలో ఉంచుకొని, 1989 సంవత్సరంలో ఏర్పడిన పత్రిక "టీచర్ ప్లస్".  ఇది  ఉపాధ్యాయులు తమ సమస్యలను వెలిబుచ్చడానికి, తమ ఆలోచనలలను పంచుకోవడానికి, చర్చించడానికి, తమ పరిఙ్ఞానాన్ని మెరుగు పరుచుకొనేందుకు ఒక వేదిక.  భారతదేశ  తరగతి గదిలో ఉపాధ్యాయుడు రోజూ ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకొంటూనే  వాటి ప్రత్యామ్న్యాయాల  గురించి టీచర్ ప్లస్ చర్చిస్తుంది. ఇదే కాకుండా ఉపాధ్యాయులలో వారంతా ఒకే సాముదాయక వర్గమనే భావనను నెలకొల్పడానికి, సామాజిక పరివర్తనకు దోహద పడే ముఖ్యమైన సమూహం అనే భావనలను ఏర్పరచడానికి కృషి చేస్తోంది.

టీచర్ ప్లస్ హైదరాబాద్ నుండి నెల నెలా ప్రచురించ బడుతుంది.  దీని తోడ్పాటు దారులు వైవిధ్య భరితంగా భారతదేశమంతటా విస్తరించి ఉన్నారు. విద్యకు సంబంధించిన వివిధ విభాగాలనుండి అంటే ప్రాథమిక స్టాయికి, బోర్డ్ పరీక్షలకు, కళలను బోధించే వారి నుండి, పిల్ల అభివృధ్ధి మరియు తరగతి గది నిర్వహణ వరకు విషయాలను బోధించే అందరూ ఉన్నారు. ప్రతినెలా, టీచర్ ప్లస్ అన్ని తరగతి గదులలోనూ ఉపయోగించ గలిగే ప్రత్యక్షానుభవాలనుండి, అలోచనలను రేకెత్తించే విధంగా ఉండే వివిధ శీర్షికల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది.  ఇది మేధావులకు సంబంధించినది కాదు. ప్రస్తుతం ఉపాధ్యాయునిగా పని చేస్తోన్న వ్యక్తికి ప్రస్తుత విద్యారంగంలో జరుగుతున్న విషయలను మరియు తరగతి గదిని సమర్థవంతంగా తీర్చి దిద్దుటకు అవసరమైన కొత్త ఆలోచనలను, పధ్ధతులను ఇవ్వగలగిన పత్రిక.

http://www.teacherplus.org/

విషయ భాగస్వామ్యులు

తమిళనాడు లోని ప్రజల  విద్య, ఆరోగ్యం మరియు జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 1996 లో ఎయిడ్ ఇండియా ప్రారంభించారు.ఇప్పుడు ఇది 1000 గ్రామాలకు విస్తరించింది, ప్రస్తుతం ముఖ్యంగా విద్య పై దృష్ఠి సారించింది. గ్రామంలోని బాలబాలికలందరికీ గుణాత్మక విద్యను అందించాలనే కలను సాకారం చేసేక్రమంలో, వీలైనంత మంచి విద్యను ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యక్షంగా పెద్దయెత్తున పని చెయ్యడమే కాకుండా ప్రభుత్వంతోనూ,ప్రభుత్వేతర సంస్థలతోనూ మరియు సమాజం తోనూ కలసి పని చేస్తొంది. ఎయిడ్ ఇండియా,  చదివే నైపుణ్యాలను ,విఙ్ఞానశాస్త్ర విద్యను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది, అలాగే వివిధ పారితోషకాలను ఇవ్వడం (అవార్డ్ ల) ద్వారా గ్రామీణ గ్రంధాలయాలను ప్రొత్సహిస్తోంది.ఎయిడ్ ఇండియా గురించి మరింత తెలుసుకొనేందుకు www.eurekachild.org ని చూడండి.

http://www.eurekachild.org

ఏకలవ్య ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ.  ఇది విన్నూత్నమైన విద్యా కార్యక్రమాలను రూపొందించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించి , ఈ కార్య క్రమాలను అమలుచెయ్యడానికి అవసరమైన బోధకులను కూడా తయారు చేస్తుంది.  ఇది మధ్యప్రదేశ్ అంతటా విస్తరించిన విద్యా వనరుల  కేంద్రాల సమాహారంతో విధులను నిర్వర్తిస్తుంది.

ఇప్పటికి రెండు దశాబ్దాలుగా ఏకలవ్య  నియత విద్యలోను, అనియత విద్యలోను విషయ -పరిఙ్ఞానాన్ని మరియు భోధనా పధ్ధతిని అనుసంధానించి తద్వారా  అభ్యాసకునిలో సాంఘిక పరివర్తనను మరియు సమగ్ర మైన అభివృద్ధిని సాదించడానికి  కృషి చేస్తోంది.

ఈ ఏకలవ్య శిశు  కేంద్రీకృత బోదనా పధ్ధతులను సృష్ఠిస్తోంది. ఈ పద్ధతిలో అభ్యాసకులలో సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని అందించి, వారిని సహజ మరియు సాంఘిక వాతావరణం, గురించిన ప్రశ్నలను అడగడాన్ని ప్రోత్సహించడం వలన విద్యార్ధులు స్వయం అభ్యసకులుగా తయారవుతారు

ఏకలవ్య విన్నూతనత్వాన్ని సమగ్రంగా చూస్తుంది. అంటే తరగతి గదిలో మారే  బోధనాభ్యసన పధ్ధతులు, పరీక్షా పధ్ధతుల్లలోను, ఉపాధ్యాయ శిక్షణా పధ్ధతులలో, పాఠశాల నిర్వహణలోనూ  అనుసంధానించబడి ఉండాలి. అలాగే అభ్యసనం తరగతి గది నాలుగు గోడలకే పరిమితమైనదిగా కాకుండా సమాజానికి కూడా విస్తరించాలి.

ఏకలవ్య విస్త్రుతమైన వనరులను నిర్మించింది, ఇందులో కొన్ని విద్యా సంబధమైనవి,  కొంత బాల సాహిత్యం, పుస్తకాలు, కొన్ని పాఠ్యపుస్తకాలు మరియు మరికొంత  ఇతర అభ్యసనా సామాగ్రి.

http://www.eklavya.in

విద్య ద్వారానే మార్పు సాధ్యమనే లక్ష్యాన్ని, ఉత్తమమైన విద్యను ఉచితంగా అందింఛి సాధించాలని 2008వ సంవత్సరంలో “ఖాన్ అకాడెమి” ఒక లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పడింది. వివిధ విషయ పరిజ్ఞానాలలో అంటే చరిత్ర మొదలు కొని గణితశాస్రం వరకు దాదాపుగా 3300 వీడియోలను ఉచితంగా తన వెబ్ సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వీడియోలు “యూ ట్యూబ్” ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అందరి విద్యావసరాలకు అనుగుణంగా బోధనావనరులను అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిస్తోంది.

ప్రస్తుతానికి అజీం ప్రేమ్ జి యూనివర్సిటీ వారి టీచర్ అఫ్ ఇండియా బృందం ప్రాథమిక స్థాయికి చెందిన కొన్ని గణిత వీడియోలను హిందీ, తమిళ్ ,కన్నడ భాషలలోకి అనువదిస్తోంది.

ఇది 1995 నుండి అమలులో ఉంది. ప్రపంచం అంతటా విస్తరించిన జిడ్డూ క్రిష్ణమూర్తి పాఠశాలలలోని ఉపాధ్యాయులు తమ అనుభవాలను తమ విఙ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక వేదికలా ఇది ఉంటుందని  దీనిని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఈ సమాచార పత్రిక  తోడ్పాటుదారుల విషయంలోనూ చదువరుల విషయంలోను విస్తరించించింది, కానీ  దీని ముఖ్య ఉద్దేశ్యం మారలేదు. జిడ్డూ క్రిష్ణమూర్తి పాఠశాలల సమాచార పత్రిక,  పాఠశాల విద్య గురించి రచనలు చేసే ఉపాధ్యాయుల అవసరాల కోసం, ఒక ప్రత్యేక మైన స్థలం.  

ఈ పత్రికలోని వ్యాసాలు ఎక్కువగా వివిధ బోధనా పద్దతులు, తత్వశాస్ర విభాగాల గురించి ఉంటాయి. ఈ వ్యాసాలను రచించినవారు, జీవితానికి మరియు విద్యకు సంబంధించి  క్రిష్ణమూర్తి అడిగిన ప్రశ్నలు  ఏవిధంగా తమను ప్రభావితం చేసాయో, వారి రచనలలోనూ, బోధనలోనూ వ్యక్తమౌతాయి.జీవితానికి సంబంధించి మరియు తరగతి గది పరిధిని మించి అభ్యసనాన్ని ఎంత హృద్యంతరంగా చెయ్యవచ్చో ఈ సమాచార పత్రిక తెలియజేస్తుంది.

అంతర్జాలంలో జిడ్డూ క్రిష్ణమూర్తి పాఠశాలల సమాచార పత్రిక:

1 నుండి 14 సంపుటి వరకు గల అన్ని వ్యాసాలు అంతర్జాలంలోని www.journal.kfionline.org  వెబ్ సైట్లో లభిస్తాయి.

 

http://www.journal.kfionline.org

తరగతి గదిలోని సమస్యలకు ఆచరణీయ మైన పరిష్కారాలను కనుగొనేందుకు  ఈ జోడో గ్యాన్ సంస్థ పని చేస్తోంది. 1998 నుండి విద్యార్థులకు గణితాన్ని విఙ్ఞాన శాస్త్రాన్ని కొన్ని సృజనాత్మక గా పద్దతుల ద్వారా పరిచయం చేసేందుకు, పిల్లలు బాగా అవగాహన చేసుకొనేందుకు, అనందించేందుకు విధ్యార్థుల తోనూ ఉపాధ్యాయులతోనూ, ప్రశిక్షకులతోనూ (Teacher Educator), తల్లితండ్రుల తోనూ కలసి దగ్గరిగా పనిచేస్తోంది. వృత్తిగత శిక్షణ, ఛాత్రోపాధ్యాయులకు, కార్యశాల (Work-ShoP)లను నిర్వహించడం, తక్కువ వెల తో కూడిన బోధానా అభ్యసనా సామాగ్రిని రూపొందించడం, ఉత్పత్తి చెయ్యడం, పంపిణీ చెయ్యడం అన్నీ  దీని లోని భాగాలయ్యాయి. చాలా పాఠశాలలో గణిత ప్రయోగశాలలను విఙ్ఞానాశాస్త్ర ఆవిష్కార గదులను రూపొందించారు  ప్రస్తుతం వారు యెన్ .సి. ఆర్(NCR) లోని నాలగు వర్థమాన పాఠశాలలో  ప్రాథమిక  స్థాయిలో గణితశాస్త్రానికి విన్నూత్న మైన పాఠ్య ప్రణాళికను రూపొందించి అభివృద్ధి పరచడంలో నిమగ్నమై ఉన్నారు.ఇది పాఠ్య ప్రణాళిక రూపొందించడం, కరదీపికలను తయారు చెయ్యడం, తరగతి గదిలోనీ నమూనా సంభాషణలను చెయ్యడం, మూల్యాంకనమూ మరియూ నిర్ధారణలను కలిగిఉంది.

వీరు మొదటి తరం అభ్యాసకులకు పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక స్థాయిలలో ఒక ప్రయోగాత్మక పాఠశాలను పశ్చిమ ఢిల్లీ లోని శాకూర్పుర్ లో నిర్వహిస్తున్నారు. ఇక్కడే జోడో గ్యాన్ కూడా ఉంది. ఈ పాఠశాలలో తరగతులుగా విభగించని ఒక సమీకృత పధ్దతిలో బోధన జరుగుతుంది  అలాగే గణితాణ్ని విన్నూత్నమైన పధ్ధతులలో బోధిస్తారు.  జోడో గ్యాన్ ఒక లాభాపేక్ష లేని సాంఘిక సంస్థ.  పిల్లలకు గుణాత్మక విద్యను ఇస్తూ వారిని అన్వేషణా పద్దతిలో అభ్యసన కొనసాగించడానికికి సామర్థ్యాన్ని ఇస్తూన్న వ్యక్తుల మరియు సంస్థల సమాహరాన్ని ఏర్పరచడానికి  జ్యొడో గ్యాన్ ప్రయత్నిస్తోంది.

http://www.jodogyan.org

పశ్చిమబెంగాల్ లోని 12 జిల్లాలలొనూ మరియు ఇతర రాష్ట్రాలలోనూ అభివృద్ది రంగంలో పనిచేస్తోన్న ఒక ప్రభుత్వేతర సంస్థ D.R.C.S.C సహజవనరులను సమర్తవంతంగా పర్యావరణానికి అనుకూలంగా గ్రామాలోని పేదవారికి ఆహారాన్ని జీవనోపాధిని అందివ్వడమే ఈ D.R.C.S.C సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.

వివిధ సాంఘిక ఆర్ధిక సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, మదించి అందరికీ అందుబాటులోకి తేవడం ,భూమిలేని నిరుపేదల,అసంఘటిత కార్మికుల, చిన్న మరియు సన్నకారు రైతుల   సామాజికన్యాయం కోసం పోరాడుతున్న వివిధ సంస్థలను, వ్యక్తులను వెలుగులోకి తీసుకొనిరావడానికి 1982లోఈ D.R.C.S.C  ఏర్పడింది.  గ్రామీణ పేదప్రజల జీవనాన్నిమెరుగు పరచడానికి,ఆహార భద్రతను ఇవ్వడానికి 1992 నుండి D.R.C.S.C   నిర్వహణీయ వ్యవసాయం మరియు సహజవనరుల నిర్వహణను చేపట్టింది. ఉపాధ్యాయులు అభివృద్ది చేసిన పాఠ్యప్రణాళికలను,పుస్తకాలను,బోధనాసామాగ్రిని మరియు విద్యార్థుల ఆలోచనల అభివృధ్ధికి ఈసంస్థ అనుసంధానకర్తగా వ్యవహరించింది. ఇది దీని కార్యకలాపాలను ప్రాంతీయ స్వఛ్చంద సంస్థల సమాహారం తోనూ   అభివృధ్ధి సమాహార బృందాలతోను కలసి విస్తరించింది.

http://www.drcsc.org

1980 లో మద్రాస్ విశ్వవిద్యాలయంలోని కొంత మంది పరిశోధక విద్యార్ధులు శాస్త్రవేత్తల బృందంగా ఏర్పడి విఙ్ఞానశాస్త్రాన్ని ప్రచారం చెయ్యడానికి తమిళనాడు సైన్స్ ఫొరమ్ (TNSF) ని ఏర్పరచారు. ఎనభయ్యోదశకం చివరికి ప్రజా విఙ్ఞానశాస్త్ర ఉద్యమంలో తమిళనాడు సైన్స్ ఫొరమ్ (TNSF)చేరి,  పర్యావరణ పరిరక్షణను పునర్ నిర్వచించింది. విఙ్ఞానశాస్త్ర విద్యను నిత్యజీవితంతో  అనుసంధానించడానికి , తమిళంలో విఙ్ఞానశాస్త్ర సామాగ్రిని ఉత్పన్నం చెయ్యడంలోను కృషి చేసింది.

తొంభైలలోని సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం"అరివోళీ ల్యాక్కం"లో  TNSF చాలా ఉదృతంగా పాల్గొని, గ్రామీణ  ప్రాంతంలోని పేదవారి అవసరాలను గుర్తించడం వలన  ఇది పూర్తీగ ప్రజా ఉద్యమంగా మారేలా చెయ్యగలిగింది. ఇదే తరువాత దశలలో పాఠశాల విద్య (సార్వజనీకరణ, సమాజ సమీకరణ,పాఠ్యప్రణాళిక మరియూ బోధనా పధ్ధతులు) మరియు గ్రామీణ మహిళల ఆరోగ్యానికి ( ముఖ్యంగా స్ర్తీ  పునరుత్పాదక ఆరోగ్యానికి సంబందించినవి) వాటికి  విస్తరించింది.  

ఇప్పుడు TNSF  సభ్యుల సంఖ్య 12,000 విస్తరించింది. ఇందులో శాస్త్రవేత్తలు, కళాశాల ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులే కాక స్వయం సహాయక బృందాలలోని మహిళలు, మరియు అన్ని వర్గాలవారు సభ్యులుగా ఉన్నారు. విఙ్ఞానశాస్త్రాన్ని లోకవ్యాప్తం చెయ్యడం, విఙ్ఞానశాస్త్ర    సామాగ్రి ప్రచురణ, అక్షరాస్యతా కార్యక్రమాలను, మరియు నిరంతర విద్యా కార్యక్రమాలు, ప్రాథమిక విద్య, ఆరోగ్యానికి చెందిన అభివృధ్ది కార్యక్రమాల్లో మధ్యవర్తిత్వం వహించడం,  గ్రామీణ మహిళ అభివృద్ధి, మరియు ఆదాయాన్ని జనింపచెయ్యడం, మొదలైన కార్యక్రమాలను నిర్వర్తిస్తొంది.

తుళిర్ (THULIR)( పిల్ల కోసం మాస పత్రిక), విజుతు (VIZHUTHU)(పాఠశాల ఉపాధ్యాయులకొసం త్రైమాసికం) సిరగు(SIRAGU) (శాస్త్రవిఙ్ఞానం లోనూ అభివృద్ది రంగంలోనూ విధానాలకు సంబందించిన చర్చలు మొదలైన వాటిని అందించే మాస పత్రిక) మరియు అరివు తెర్నల్ (ARIVU THERNAL) (కొత్తగా అక్షరాస్యులైన వారి కోసం ) జంతర్ మంతర్ ( విఙ్ఞానశాస్త్ర ద్విమాస పత్రిక, పెద్ద పిల్లల కోసం) ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పటి వరకు TNSF 250 పుస్తకాలను ప్రచురించింది, వాటిలో ఎక్కువ శాతం విఙ్ఞానశాస్త్రానివే.

http://www.tnsf.in/

కర్ణాటక లోని నీల్ బాఘ్ లో గల డేవిడ్ హోర్స్ బార్ వద్ద  శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులు 1978 లో రాజస్థాన్ లోని  జైపూర్ నగర శివారులోని సమాజంలోని అణగారిన వర్గాల, యొక్క  ప్రత్యమ్న్యాయ మరియు గుణాత్మక విద్య కోసం దిగంతర్ శిక్షా ఏవం ఖేల్ ఖూద్ సమితి ని ఏర్పరిచారు.

పిల్లలను స్వయం ప్రేరణతో విమర్శనాత్మకంగా  ఆలోచించి  స్వతంత్ర అభ్యాసకుడిగా తయారు చెయ్యాలన్నది దిగంతర్ నమ్మకం. ఈ ఆలోచనతోనే, పిల్లలందరికీ అవకాశాలివ్వాలనేది   దిగంతర్  ఆకాంక్ష .

ప్రస్తుతం దిగంతర్ స్వంతంగా జైపూర్ శివారులలో పాఠశాలలను నిర్వహిస్తోంది. దిగంతర్ ప్రస్తుతం జైపూర్ లోని ఫాఘి లో  నాలగు పథకాలను నిర్వహిస్తోంది, అవి దిగంతర్ విద్యాలయ్, ది అకడెమిక్ రెసౌర్స్ సెంటర్, రెసోర్స్ సప్పోర్ట్ సెంటర్, శిక్షా సమర్థన్ ప్రాజెక్ట్ (SSP).

http://www.digantar.org
ప్రథం బుక్స్

పిల్లలలో పఠనాసక్తిని పెంపోదిందించడానికి దేశవ్యాప్తంగా ప్రారంభించిన Read India movement లో భాగంగా 2004వ   సంవత్సరంలో ప్రథమ్ పుస్తకాలను ఏర్పాటుచేశారు. ఇది ఒక లాభాపేక్షలేని స్వచ్చంధ సేవా సంస్థ.  ఈ సంస్థ  ఆశయాలు

  • నాణ్యత కల పుస్తకాలు భారతదేశ పిల్లలందరికీ అందుబాటులో ఉంచడం
  • భారతదేశం  నలుమూలలా ఉన్న పిల్లలకు అందుబాటులో ఉండాలని వీటిని పలు భారతీయ భాషలలో ముద్రించడం

చదవడంలోని ఆనందాన్ని పిల్లలందరికీ  అందించాలనే లక్ష్యంతో, “పిల్లవానికొ పుస్తకం” అనే నినాదంతో  “ప్రథమ్” పుస్తకాలు  ముందుకు వెళుతోంది.  గడచిన 7  సంవత్సరాలలో 11 భారతీయ భాషలలో షుమారుగా 235 పుస్తకాలను ప్రచురించి ఎన్నో లక్షల మంది పిల్లలకు చదవడంలో ఉండే ఆనందాన్ని అందించారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో వివిధ భాషలలో దాదాపుగా 50 పుస్తకాలను “Creative Commons”  కాపీరైటు క్రింద చేర్చారు. ఈ పుస్తకాలను అస్సామీ, ఫ్రెంచ్, జర్మన్ మరియు స్పానిష్ భాషలలోకి అనువదించడమే కాక, ఉన్న పుస్తకాలకు కొత్తరూపాన్ని ఇవ్వడంతో పాటు “ఆడియో” రూపంలోకి  తీసుకొనివస్తోంది  ఈ సంస్థ.

http://prathambooks.org/
రిషి వ్యాలీ ఇన్స్టిట్యుట్ ఫర్ టీచెర్ ఎడ్యుకేషన్, క్రిష్ణమూర్తి ఫౌండేషన్, ఇండియా:

రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ సెంటర్, ఉపాధ్యాయులు పిల్లలకు సమగ్ర విద్య ఇవ్వడానికి అవసరమైన విధంగా తత్వ సంభందమైన దృక్కోణంలో వారికి అవసరమైన బోధన పధ్దతులులను అందించి వారిని అబివృధ్ధి చేస్తోంది.వీటిని సాధించడానికి  దీనిని 2006 నవంబర్ లో ఏర్పాటు చేసారు.

రిషి వ్యాలీ ఉపాధ్యాయులకు వారి పాఠశాలలో ప్రత్యక్షానుభవాల పాఠ్య ప్రణాళికా అభివృద్ధి కార్యక్రమాలను  అందించడానికి అవసరమైన సహాయాన్ని ఇస్తోంది.అంతేకా ఈ కార్యక్రమాలను ఎక్కువ పాఠశాలలకు  ఎక్కువ మంది ఉపాధ్యాయులకు అందించేందుకు వీలయ్యేలా కార్యక్రమాలను అభివృద్ధి పరుస్తోంది.

ప్రస్తుతం ఇక్కడి  సిబ్బంది

  1. ఈ క్రింది పథకాలకు పాఠ్యప్రణాలికను మరియు సామాగ్రిని అభివృద్ధి చేస్తోంది.
  • తరగతి ఒకటి నుండి ఐదు వరకు రెండవ భాషగా హిందీ పాఠ్య ప్రణాలికను సామాగ్రిని,
  • ఆరు మరియు ఏడవ తరగతులకు విజ్ఞానశాస్త్రం (ఆంగ్లం మరియు తెలుగులో మాధ్యమాలలో)  

2.  వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులకై వర్క్ షాప్ మరియు తక్కువ కాలవ్యవధి గల శిక్షణలు 

3. అజీమ్ ప్రేమ్ జి యూనివర్సిటితో కలసి సంయుక్తంగా 2 సంవత్సరాల వ్యవది కల B. Ed, తో సమానమైన ఒక ఉపాధ్యాయ  శిక్షణా కార్య క్రమాన్ని తయారుచేస్తోంది. 

http://www.rishivalley.org

విక్రమశిల

పశ్చిమ బెంగాలులోని కలకత్తాలో 1989 సంవత్సరంలో విక్రమశిల విద్యా వనరుల సంస్థను ఏర్పాటు చేశారు. పిల్లలందరికీ గుణాత్మక-విద్య సాకారం చేసే దిశలో ఈ సంస్థ ఉపాధ్యాయులతోనూ, విద్యార్థులతోనూ, సమాజంతోనూ ప్రభుత్వంతోనూ కలసి  పనిచేస్తోంది.

సమాజంలో అణగారిన వర్గాలకు  వారి జీవితానుభవాల ఆధారంగా అర్థవంతమైన విద్యను అందించదానికి కృషి చేస్తోంది. గడచిన 20 సంవత్సరాలలో భారతదేశ వివిధ ప్రదేశాలలో  విస్తరించిన 200  స్వచ్ఛంధసంస్థలు, 25,000 మంది ఉపాధ్యాయులు మరియు  14,00000  మంది విద్యార్థులకు తన క్రియాశీలక పరిశీధన ద్వారా, ఉపాధ్యాయ అభివృధ్ధి కార్యక్రమాల ద్వారా పని చేస్తోంది.

విక్రమశిల  ఉపాధ్యాయ అభివృధ్ధి కార్యక్రమాలు, విద్యార్థులకు అభ్యసనానికి ఆధారమైన కార్యక్రామాలద్వారా  పిల్లల కోసం, ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేస్తోంది. క్రియాశీలకంగా పౌరసత్వం గురించి, మదరసాలలో గుణాత్మక విద్య,  నియతవిద్యను ఉపాధికల్పనా కార్యక్రమాలతో అనుసంధానించడానికి కృషి చేస్తోంది.    

దీనితో పాటు పిల్లల విద్యా హక్కు చట్టం గురించి తెలియచేస్తోంది,  ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, సమానత్వం కోసం  కృషి చేస్తోంది. ఈ సంస్థ ఇతర రాష్ట్రాల  రాష్ట్ర స్థాయి వనరుల బృందంలో సభ్యురాలు కూడా. 

http://www.vikramshila.org

1931 వ సంవత్సరంలో నాలగు తరగతులను కలిగిన మాధ్యమిక పాఠశాలగా విద్యాభవన్ రాజస్థాన్ లో ప్రారంభం అయ్యింది.   ఈ సంస్థ, విద్య యొక్క ప్రాధాన్యతను పుస్తక పరిఙ్ఞానాం నుండి శీల నిర్మానానికి మార్చింది. విద్యాభవన్ లోని విద్యాకార్యక్రమాలు పిల్లల భౌతిక,నైతికమైన మరియు సౌందర్యోపాసక అభివృద్దిని సమగ్రంగా కలిగి ఉంటాయి.

విద్యాభవన్ ఇప్పుడు ఉదయపూర్ మరియు ఉదయపూర్  పరిసర ప్రాంతాలలో 14 సంస్థలను కలిగిన సమాహారం. విద్యాభవన్  ప్రస్తుతం, పాఠశాల విద్య, సాంకేతిక మరియు వృత్తి సంభంధ విద్య,  ఉపాధ్యాయ శిక్షణ, విద్యాసంబంధ పరిశోధన, వ్యవసాయ రంగ పరిశోధన,దిగువ మధ్య తరగతి వారి కోసం నైపుణ్యాలను మెరుగు పరచడానికి సాంకేతిక పరమైన శిక్షణ, చేతిచే తయారు చేసిన కాగితం, పంచాయితి రాజ్ ఉద్యోగులకు మరియు అంగన్వాడి ఉద్యోగులకు  వృత్తి పరంగా శిక్షణ,మొదలైన కార్యక్రమాలన్నింటిని నిర్వర్తిస్తోంది.  భౌగోళికంగా విద్యాభవన్ చాలా ప్రదేశాలకు విస్తరించిందింది. రాజస్థాన్ లోని వివిధ పట్టణాలు,పల్లెలలోని విద్యార్థులకు విద్యాభవన్ తన సహాయాన్ని అందిస్తోంది, అలాగే విద్యాభవన్ యొక్క విభాగాలు రాష్త్రంలోని చాలా సంస్థలకు సహాయాన్ని ఇస్తున్నాయి.  వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పాఠ్య పుస్తకాల, ఉపాధ్యాయ శిక్షణా కరదీపికల తయారీకి సహకారం మరియు అలాగే చాలా రాష్ట్రీయ జాతీయ స్థాయీ కార్యశాల, (వర్క్ షాప్) లు, ఉపాధ్యాయ శిక్షణా సిబిరాలు నిర్వహించడం లో విద్యా భవన్ సిబ్బంది తలమునకలుగా ఉంటారు.

ప్రజాస్వామిక, లౌకిక మరియు సమాజ పరంగా అర్థవంతమైన గుణాత్మకమైన విద్యా సంభంద అనుభవాలను పిల్లలకు ఇచ్చి వారిని మంచి భాద్యత గల సమర్థవంతమైన పౌరురులుగా తీర్చి దిద్దడమే విద్యాభవన్ యొక్క నాలుగు పాఠశాలల లక్ష్యం. పిల్లలను వ్యక్తిగత పోటీకీ దూరంగా ఉంచి కలసిమెలసి ఉండడాన్ని  ప్రోత్సహిస్తుంది.  ఇక్కడికి వచ్చే పిల్లల నేపధ్యం పలు రకాలుగా ఉంటుంది, కొంతమంది ఉదయపూర్ నగర పరిసర గ్రామాలనుండి, కొంతమంది సుఖేర్ అనే అనాధాశ్త్రమం నుండి, మరి కొంతమంది సాంఘికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలనుండి వస్తారు.

విద్యాభవన్ లోని వివిధ సంస్థలలోని అనుభవాలను పంచుకోవడానికి, భోదనలో వివిధ ఆలోచనల సమ్మేళనాకి 1995 లో  విద్యాభవన్ ఎడ్యుకేషన్ రిసౌర్స్ సెంటర్ (VBERC)ని ఏర్పాటు చేశారు.  అప్పటి నుండి  VBERC, భావనలకు సంభందించి లోతైన అవగాహన , విషయం యొక్క నిర్మానం, పాఠ్య పుస్తకాలు, మరియు పాఠ్యప్రణాళికలకు సంభందించి రాజస్థాన్, చత్తీష్ గర్, బీహార్, ఆంద్ర ప్రధేశ్, మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి రాష్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వారిని మార్గ దర్శకులుగా చేస్తోంది.

http://www.vidyabhavansociety-seminar.org/default.htm

ఇది 2005వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మాధ్యమిక విద్య కొసం ఏర్పడిన ప్రయోగాత్మక పాఠశాల మరియు ఒక వనరుల కేంద్రం. ఈ పాఠశాల పిల్లకు చదువు ఒక గుదిబండగా కాకుండా ఆనందకరంగా, ప్రభావవంతంగా అవసరమైన ప్రయోగాలను పరీక్షిస్తే ఇక్కడి వనరుల కేంద్రం ఈ ప్రయోగాల ఫలాలను వీలైనంత మంది విధ్యార్థులకు,ఉపాధ్యాయులకు అందేలా చూస్తుంది. ఆ ప్రాంత అణగారిన వర్గాలకోసం సాయం సమయంలో ఒక వృత్తి విద్యా సంబంధమైన శిక్షణకూడా నిర్వహిస్తోంది.

శిక్షామిత్ర లోని విద్యావనరుల కేంద్రం(Educational Resource Centre)  విస్త్రుతంగా బోధనా వనరులను  కలిగి ఉపాధ్యాయుల, పర్యవేక్షకుల, పరిశోధకుల,విద్యావేత్తల,పత్రికారంగ,మరియూ  ప్రభుత్వంలోని విధాన రూపకర్తల సమాహారాలకు, ప్రభుత్వేతర సంస్థలకు తమ సేవలను అందిస్తోంది. ఈ కేంద్రంలోని గ్రంధాలయం చాలా పుస్తకాలను,చిత్రాలను, బోధనాభ్యసన సామాగ్రిని ,విధాన పత్రాలను కలిగి ఉంది.

సృజనాత్మక బోధనాపధ్దతులు మరియు భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ వీరు క్రమానుసారంగా విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల కోసం శిక్షణా తరగతులను నిర్వహిస్తూంటారు. విద్యావనరుల కేంద్రం సృజనాత్మక ఉపాధ్యాయులను, పాఠశాలను, విద్యారంగంలో పనిచేస్తోన్న వివిధ  స్వచ్చంధ  సేవాసంస్థలను కలుపుతుంది. ఇది ఉపాధ్యాయ సంఘాలను, పరిశోధక సంస్థలను రాష్ట్ర మరియు జాతీయ స్ఠాయిలలో అనుసంధానించాలనే తలంపుతో ఉంది.  వీరు పాఠశాలను 2010 డిశంబర్ లో మూసివేశారు కానీ శిక్షామిత్ర విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు తల్లితండ్రులకు ఒక పరస్పర అభ్యసనా కేంద్రంగా ఉంటుంది.

http://www.shikshamitra-bengal.org

1983 లో స్థాపించబడిన సంధాన్, ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వేతర లౌకిక సంస్థ. వ్యక్తులనువారి సామర్థ్యాలను వారే తెలుసుకొనేలా చెయ్యడమే సంధాన్ యొక్క ముఖ్యతత్వం. విభిన్నతను, వ్యక్తుల పరిఙ్ఞానాన్ని గౌరవించి వారిలో నేర్చుకొనేందుకు తగిన ఆత్మవిశ్వాశాన్ని కలిగించడమే సంధాన్ యొక్క ప్రాథమిక భావన.

చాలా మందిని సాంఘిక ఆర్థిక కారకాలు, కులం, తరగతి,లింగభేదం మొదలైనవి సమాజానికి దూరం చేస్తున్నవి. వీరందరిని ప్రధాన జీవన స్రవంతిలో కలిపేందుకు సంధాన్ రెండు దశాబ్దాల క్రితమే కృషి చేసింది ఒక జాతీయ వనరులకేంద్రం ద్వారా  పిల్లలకు యువతకు సమగ్రమైన విద్యను ఇచ్చి ఆరోగ్య, జీవన నైపుణ్యాలను,జీవనోపాధిని కల్పిస్తోంది. అన్వేషణ మరియు భాగస్వాంయం ద్వారా శాంతి మరియు ప్రగతి అనేదీ  సంధాన్  లక్ష్యం   

సమసమాజ స్థాపన  అన్న లక్ష్యంతో చేతనం కాబడినది ఈ సందాన్.  ప్రత్యేకమైన పధ్దతిలో రూపొందించిన విద్యద్వార అణగారిన వర్గాల ప్రజలు ఏర్పడే  ప్రక్రియలను  ఎదుర్కోవడం  సంధాన్ మరొక లక్ష్యం.

http://www.sandhan.org/

మధ్య హిమాలయలాలోని ముస్సోరీ కి 12 కిలోమీటర్ల దూరం లోని కెంప్టీ లో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవెలప్మెంట్  ఆఫ్ హిమాలయస్ సంస్థ ఉంది(యెస్.ఇ.డి.హెట్చ్) .ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్వాల్ జిల్లాలో గల జనపూర్ లో సిధ్   అక్కడి యువతకు, పిల్లలకు అర్థవంతమైన సరైన మరియు సమగ్రమైన విద్య నివ్వడానికి కృత నిశ్చయంతో ఉంది. విద్యను సాంఘిక పరివర్తనకు ఒక  ఉపకరణంగా చేసుకొని అర్థవంతమైన అన్వేషణ మరియు సంభాషణల ద్వారా సాంఘిక మరియు రాజకీయ రంగాలలతో పాటు వ్యక్తుల అలోచనలనలో మార్పును తీసుకురావడం  సిధ్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ప్రస్తుతం సిధ్  జౌన్పుర్ లోని అగ్లార్ వ్యాలీ లోని 40 గ్రామాలలో గల 11 పాఠశాలలో ప్రాథమిక స్టాయి నుండి ఉన్నత పాఠశాల స్ఠాయి వరకకు గల 500 మంది విద్యార్థులకు విస్తరించింది. సిద్ యువతకు,ఉపాధ్యాయులకు శిక్షణను, విద్యాసంబంధ పరిశోధన,విధానాల రూపకల్పనకు ముద్రణా రంగానికి విస్తరించడం ద్వారా గుణాత్మక విద్యలో పని చేసే వారందరిని ఒక దగ్గరకు చేరుస్తోంది,

సమాజంలో నాయకులుగా గుర్తింపుపొందిన, ప్రాంతీయ నిభద్దత కలిగిన యువకులే  సిద్ యొక్క బృందం. సిద్ యొక్క బృందం  మహిళా యువ బృందాలను అరోగ్య, విద్యా వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనేలా ప్రోత్సహించడంలో విజయవంతం అయ్యింది.

http://www.sidhsri.info

నీటికి సంబంధించిన విషయాలను విద్యావేత్తలు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం మరియు తల్లి, తండ్రులు అందరూ పంచుకో గలిగే అంతర్జాల వేదికే "స్కూల్స్ వాటర్ పోర్టల్"  అంటే ఇతర వర్గాలకు ఇది అందుబాటులో ఉండదని కాదు. నీటి గురించిన  ప్రాథమిక విషయాలను పంచుకోవాలనుకొనే, తెలుసుకోవాలనుకొనే  అందరికీ ఈ పోర్టల్ స్వాగతం పలుకుతోంది. ప్రజలలోను, వృత్తి పరంగానూ నీటి గురించి పని చేసే వారికి దీనికి సంభందించిన పరిఙ్ఞానాన్ని అందించడానికి ఇది ఒక ఆన్ లైన్ స్థలము.  "స్కూల్స్ వాటర్ పోర్టల్"  “ ఇండియా వాటర్ పోర్టల్ “యొక్క విభాగం. నందన్ నీలేకని వ్యక్తిగత  దాతృత్వ నిధి ఆధారంగా ఏర్పడిన "ఆర్ఘ్యం" అన్న లాభాపేక్ష లేని సంస్థ దీనిని నిర్వహిస్తోంది.  ఇది నీరు  మరియు పారిశుధ్ధ రంగాలలో పని చేస్తొంది.

https://washresources.wordpress.com/tag/sch2ools-water-portal/