నేషనల్ నాలెడ్జ్ కమీషన్

 National Knowledge Commission (NKC) నేషనల్ నాలెడ్జ్ కమీషన్:
నేషనల్  నాలెడ్జ్ కమీషన్ (NKC) ను 2005వ  సంవత్సరం జూన్ 13న ఏర్పాటు చేసారు. ప్రధానమంత్రకి అత్యున్నత సలహాల కమిటీగా  విద్య, విజ్ఞానశాస్రం  మరియు సాంకేతిక పరిజ్ఞానం,వ్యవసాయం, పరిశ్రమలు, E-పాలన మొదలగు రంగాలలో సంస్కరణలకు అవసరమైన  మార్గదర్శకాలను రూపొందించడానికి దీనిని ఏర్పాటు చేసారు. జ్ఞానాన్ని, వీటి ప్రక్రియలను ఏర్పరచడం, సమకూర్చడం, అందరికీ అందుబాటులో ఉంచడం,  మొదలైనవి కేంద్ర నాలెడ్జ్ కమీషన్ ముఖ్యవిధులు.

National Knowledge Commission (NKC) నేషనల్ నాలెడ్జ్ కమీషన్:
నేషనల్ నాలెడ్జ్ కమీషన్, (NKC)   పరిజ్ఞానాన్ని సేకరించి,  అభివృద్ది పరచాల్సిన కీలక రంగాలుగా  శక్తి వనరులు, పర్యావరణం, విద్య, జీవ వైవిధ్యత మరియు నీటిని గుర్తించింది.  ఈ రంగాలలో ఇప్పటికే గణనీయంగా కృషిచేసిన సంస్థలను గుర్తించి వారిని  ఈ రంగాలలో అంతర్జాలం ఆధారంగా ఒక వేదికను ఏర్పరచి వాటిని నిర్వహించడానికి ఆహ్వానించింది. విద్యారంగంలో ఉపాధ్యాయులకోసం  ఒక పోర్టల్ ని ఏర్పరచమని అజీం ప్రేమ్ జి ఫౌండేషన్ ని నేషనల్  నాలెడ్జ్ కమీషన్ (NKC) ఆహ్వానించింది.  పరస్పరం సంభాషించడానికి, ఉత్తమ బోధనా పద్ధతులను పంచుకోవడానికి, ఒక జ్ఞాననిధిని ఏర్పరచడానికి, ఉపాధ్యాయులను ఈ పోర్టల్ ఉపయోగించుకోనేలా అలాగే వారి అనుభవాన్నిఇతరులకు అందించడమే లక్ష్యంగా గల పోర్టల్ ను  ఏర్పాటు చేయడం గురించి  నేషనల్ నాలెడ్జ్ కమీషన్ (NKC) గోష్టి లను సంమావేశాలను ఏర్పాటు చేసింది.  నేషనల్ నాలెడ్జ్ కమీషన్ (NKC) మరియు అజీం ప్రేమ్ జి ఫౌండేషన్  కలసి దీని దార్శనికతను రచించారు. పోర్టల్  ను అజీం ప్రేమ్ జి ఫౌండేషన్ నిర్వహిస్తుంది.

17602 registered users
6697 resources