అజీం ప్రేమ్ జి ఫౌండేషన్

అజీం ప్రేమ్ జి ఫౌండేషన్ భారతదేశంలో “సర్వమానవ, సమసమాజ స్థాపనే”  లక్ష్యంగా గల ఒక లాభాపేక్ష లేని స్వచ్చంధ సేవా సంస్థ. గుణాత్మక విద్య  మరియు సమానతనతో పాటు పిల్లల ఆరోగ్యం పోషకాహారం , పర్యావరణం, పాలన మొదలైన అభివృద్ది చెందుతూన్న రంగాలలో దీర్ఘకాల మరియు విస్తృతమైన ప్రభావాన్ని చూపడానికి అజీం ప్రేమ్ జి ఫౌండేషన్  ప్రయత్నిస్తోంది.  విద్య పై దృష్టిని  సారిస్తూ  పరస్పర సంబంధంగల ఈ రంగాలలోని సమస్యలను పరిష్కరించడానికి  ప్రయత్నిస్తోంది.  దీనికోసం  సమీకృతపద్ధతులను అవలంబిస్తోంది. ఈ పద్ధతులలోని నాలగు ముఖ్యాంశాలు.  

ప్రతిభావంతుల బృందాన్ని  తయారు చేయడం: ప్రతిభను మెరుగు పరచడం: సామాజిక కార్యక్రమాలో తగినంత  ప్రేరణ, సామర్థ్యం, దార్శనికత గల నిపుణుల బృందాన్ని నిర్మించడం. అంటే ఉపాధ్యాయులలో, ప్రశిక్షకులలో,విద్యా వేత్తలలో, విద్యా అధికారులలో మరియు అభివృద్ది  రంగాలలోని నిపుణులకు మరియు కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వారికి తగిన సామర్థ్యం కలిగించడం.   

పరిజ్ఞానాన్ని ఏర్పరచడం : భారతదేశ విద్యా మరియు సామాజిక అభివృద్ది రంగాలలో గల సమస్యల పరిష్కారానికి  అవసరమైన పరిజ్ఞానాన్ని, రుజువులను ఏర్పరచడం. ఇది ప్రభుత్వ విధానాలను  కొన్ని రుజువులా ఆధారంగా ఏర్పరిచే విధానాన్ని ప్రోత్సహిస్తుంది.

సంస్థల మధ్య అనుసంధానం : క్రియాశీలకంగా ప్రతిభను, అభివృద్ధిచేసి జ్ఞానాన్ని నిర్మించి, నిరంతరంగా విద్యా సంస్కరణలు మరియు సామాజిక అభివృద్ది రంగాలలో  దేశావ్యాప్తంగా విస్తరించిన సంస్థలను అనుసంధానించడం .  

సంఘపరంగా ఒత్తిడి కల్గించడం : వ్యవస్థల మధ్య పటిష్టమైన అనుసంధానం, నిరంతర విద్య, జాగ్రుత్తం చేయడం  వలన  సమాజం మరియు విధానకర్తలలో విద్య మరియు అభివృద్ది రంగాలలో గల సమస్యల గురించిన ఆలోచనా ధోరణులను మార్చడం ద్వారా  వీటిలో గుణాత్మకత మరియు సమానత్వం కోసం ఒత్తిడి కలిగించడం.

19820 registered users
7791 resources