గోప్యతా విధానం

www.teachersofindia.org  పోర్టల్ కి మీ వివరాలను అందించడంలో మీకు గల అనుమానాల్ని నివృత్తి చేస్తూ వాటి గోప్యతకు పోర్టల్ పాటించే నియమాలను వివరించే పత్రం ఇది.

సభ్యత్వ నమోదు మరియు మీ వివరాలు

ఈ పోర్టల్ లోని కొన్ని శీర్షికలను ఉపయోగించుకోవడానికి  మీరు సభ్యులుగా నమోదు చేసుకోవాలి. ఈ నమోదు ప్రక్రియలో మీ e-మెయిల్ లాంటి కొన్ని వివరాలను ఇవ్వాలి.  అలాగే  సంకేత పదాన్ని (Password)   ఏర్పరుచుకోవాలి.  ఇది మీ e-మెయిల్ రహస్య సంకేత పదానికి వేరుగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

ఈ పోర్టల్ లో మీరు మీ నేపథ్యాన్ని, మీ అభిరుచులను, మీరు నిర్వహించే కృత్యాలను, ఇతర విషయాలను  ఉంచవచ్చు. ఈ సమాచారం వలన ఉపాధ్యాయ సముదాయంలో మీలాంటి దృక్పథాలు, ఆలోచనల గల ఇతర ఉపాధ్యాయులతో కలుసుకోవచ్చు.  మీ వివరాలను  పోర్టల్ లో బహిరంగంగా లేదా గోప్యంగా ఉంచవచ్చు. గోప్యంగా ఉంచిన మీ వివరాలను మీరు అనుమతించిన వారు మాత్రమే చూడడానికి వీలౌతుంది. బహిరంగంగా ఉంచిన వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. 

మీరు పోర్టల్ కి అందించిన వివరాలను ఎవ్వరికీ అందించము. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో అంటే ప్రభుత్వం చట్ట ప్రకారం కోరినపుడు, కంపెనీ హక్కులకు భంగం కలిగినప్పుడు, వీటిని బహిరంగ  పరచడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి.

మీరు  వేదికలలో చేసే వ్యాఖ్యానాలు  మరియు వనరులతో పాటు మీ  సమాచారం

పోర్టల్ లో ప్రచురితమయ్యే మీ రచనలన్నింటిలో మీ పేరు ప్రచురితమౌతుంది.  మీరు గోప్యంగా ఉంచిన వివరాలను మాత్రం  ప్రచురించరు.

చర్చల్లోని మీ వ్యాఖ్యానాలు ,మీరు పంపే ఫోటోలు పోర్టల్ లో అందరికీ అందుబాటులో ఉంటాయి.        

పోర్టల్ కు సంబధించని  Web sites

ఈ పోర్టల్ లో కొన్ని పోర్టల్ కు సంబధించని  ఇతర  Web sites లింక్ లు ఉన్నాయి.  వీటిపై పోర్టల్ కు ఎటువంటి నియంత్రణ లేదు. వారు మీ వివరాలను అందించమని అడిగితే  మీరు ఆ Web site ల గోప్యతా విధానాలను చదవండి. మాకు ఆ Web site ల గోప్యతా విధానాలపై బాధ్యత లేదు.

పోర్టల్ నుండీ మీకు అందే సమాచారం :

 www.teacehrsofinida.org  నుండి మీకు E-మెయిల్-వార్తాపత్రిక, మరియు నియమిత వ్యవధుల్లో ఇతర విషయాలు పంపబడుతాయి.  ఇవి అవసరం లేవనుకొంటే మీరు  “చందాదారుల నుండి తొలగించండి “ అనే లింక్ ని క్లిక్ చెయ్యండి.  ఈ లింక్  పోర్టల్ లో మీ వివరాల పేజిలోనూ ఉంది.

ఈ గోప్యతా విధానాన్ని సవరించడానికి సర్వ హక్కులూ పోర్టల్ కు ఉన్నాయి.  ఈ విషయాన్నిగోప్యతా విధానదస్రం(Privacy Policy File)లోనూ ఇతర అనుభంద ప్రదేశాలలోనూ ఉంచడం జరుగుతుంది. teachers@azimpremjifoundation.org   కి మెయిల్ ని పంపి మీ ఖాతాను నిలుపుదల చేయవచ్చు లేదా మార్చవచ్చు, లేదా అదనపు సమాచారాన్ని చేర్చవచ్చు.

19656 registered users
7777 resources