నూతన విద్యాసంవత్సరం పాఠశాలఫీజుల పెంపు

By editor_te | మార్చి 28, 2013

 

విద్యాసంవత్సరం ప్రారంభమౌతుందంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పాఠశాల యాజమాన్యాలు తమ అభీష్టం మేరకు ప్రతి సంవత్సరం ఫీజులను పెంచివేస్తున్నారు? చాలా సంధార్భాలలో వీటి నియంత్రణకు తగిన చట్టాలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నారు ? 

pragathiprasadmeda యొక్క చిత్రం

నేడు విద్య వ్యాపారం ఐపోయినది. పాఠశాలలు విద్యార్థులకు సమగ్ర విద్యను ఇవ్వకుండా రకరకాల పేర్లతో పాఠశాల స్థాయిలోనే ఐఐటియన్లను, మెడికోలను, ఐ ఏ ఎస్ లను తయారు చేస్తామని ఊదరగొట్టి పిల్లల భవిష్యతును నాశనం చేస్తున్నారు. కార్పోరేట్ విద్యా సంస్థలు విద్యా విదానంలో విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టి విద్యార్థుల తల్లిదండ్రులనుండి వేలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్పోరేట్ విద్యా సంస్థల మాయలో పడి ఎన్ని వేల రుపాయలైన అప్పు చేసైనా కడుతున్నారు. కార్పోరేట్ విద్యా సంస్థలు చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుంటున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో లొసుగులు లోపాలు లేకుండా అమలు చేయాలి. విద్యా హక్కు చట్టంను ఉన్నాయా లేవా అనే విధంగా ఉన్న వరకట్న నిరోధ చట్టం, భహిరంగ ధూమపాన నిరోధ చట్టం లాంటి చట్టాల లాగా కాకుండా కట్టుదిట్టం గా అమలు చేస్తే ఈ ఫీజు సమస్యతో బాటు విద్యా రంగంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను.

shivaprasad యొక్క చిత్రం

ఇది అక్షరాల నిజం, దీని ఫై చర్య తీసుకునే వారు లేరనిపిస్తోంది. ఈ సమస్యకి పరిష్కారం ఎలా? నిస్సహాయ స్థితి లో చూస్తూ వున్దాల్సిన్దేనా?

twodanimator యొక్క చిత్రం

ప్రజాప్రతినిధులు చట్టాల్ని కటినం చేసేంతవరకు దీనికి పరిష్కారం లేదు.

18094 registered users
6935 resources