ఒక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కామన్ సిలబస్ విధానం అవసరమా లేదా...?

By pragathiprasadmeda | ఏప్రి 28, 2015

ఒక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడులలో, ప్రైవేటు బడులలో(కాన్సెప్ట్, టెక్నో, ఈ టెక్నో, ఇంటర్నేషనల్, గ్లోబల్ మొదలుగు...) ఒకే సిలబస్ వుండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ బడులలో స్టేట్ సిలబస్ వుంటే, వివిధ ప్రైవేటు బడులలో టెక్నో, ఈ టెక్నో మరియు ఒలింపియాడ్ పేర్లతో 6 వ తరగతికే 8 వ తరగతి అంశాలు, 7 వ తరగతికే 9 వ తరగతి అంశాలు, 8 వ తరగతికే 10 వ తరగతి అంశాలు, 9, 10 వ తరగతుల్లోనే ఇంటర్మీడియట్ అంశాలు చొప్పించి అదో గొప్ప విషయంగా భావించి పిల్లల మీద వారి వయసుకు మించి విషయాలను అర్థం పర్థం లేకుండా రుద్దేస్తున్నారు. వయసుకు మించి అధిక ప్రజ్ఞా సామర్థ్యం వున్న కొందరు పిల్లలు దీనిని భరిస్తున్నారు, మామూలు పిల్లలు ఈ వొత్తిడిని భరించలేక లేని మానసిక సమస్యలకు గురౌతున్నారు అని భావిస్తున్ను. అండరి పిల్లలను దృష్టిలో వుంచుకొని పిల్లల సమగ్ర వికాస ఆవశ్యకతను పరిగణించి ఏ తరగతికి కేటాయించిన సిలబస్ ను ఆ తరగతి పిల్లలకు అన్ని బడులలో అర్థవంతంగా బోధించితే మంచిదని నేను భావిస్తున్నాను, రకరకాల పేర్లతో పిల్లల తల్లిదండ్రులని మభ్యపెట్టే ప్రైవేటు బడుల విపరీత పోకడలను నిలువరించి భావి పౌరుల సమగ్ర వికాసానికి బాటలు వేయవచ్చంటాను మరి మీరేమంటారు?

18094 registered users
6935 resources