వనరులను పంపడానికి మార్గదర్శకాలు

www.teachersofindia.org  పోర్టల్ ఉపాధ్యాయులు తోటి  ఉపాధ్యాయులతో సంప్రదించడానికి, చర్చించడానికి తమ ఆలోచనలను పంచుకోవడానికి, అలాగే వనరులను ఏర్పరచడానికి మరియు పంచుకోవడానికి ఒక వేదిక. ఇది ముఖ్యంగా దేశం నలుచెరుగులా విస్తరించి ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఏర్పరచబడింది.  ప్రాంతీయ భాషలలో వనరులను అందించడం పోర్టల్ లక్ష్యం.  ప్రస్తుతం ఆంగ్లంతో పాటు మరో నాలుగు ప్రాంతీయ భాషలలో లబిస్తుంది. ఒక భాషలో ఏర్పరిచే వనరులు ఇతర భాషల వారు కూడా ఉపయోగించుకొనేందుకు అనువుగా ఉండాలని పోర్టల్ వాంఛిస్తోంది.

ఏర్పరచిన వనరులు అందరి ఉపాధ్యాయులకు అందుబాటులోనూ మరియు ఉపయోగపడేలా ఈ క్రింది విధంగా  మార్గదర్శకాలను  రూపొందించింది.

పోర్టల్ లో వనరులు లభించే, రెండు ప్రధాన విభాగాలలో ఒకటి ఉపాధ్యాయ సముదాయాలు రెండవది వనరులు.

మీరు ఏదైనా వనరులను పోర్టల్ కు పంపేముందు  “పోర్టల్ వనరుల విధానం”  పై దస్రాన్ని(Content Policy File) చదవండి.

సముదాయాలు:
ఉపాధ్యాయులు స్వేచ్చగా ఒకరి కొరకు సంప్రదించుకోవడానికి ఏర్పాటు చేసిన  వేదికలే  “ఉపాధ్యాయ సముదాయాలు”. పోర్టల్ లోని వనరులన్నీ  పోర్టల్ ని ఉపయోగించేవారు ఏర్పాటు చేసినవే.  ఈ విభాగాలన్నింటిలో  భాషా పరమైన దోషాలు లేకుండా చూడడానికి  పోర్టల్ చే పరిశీలింపబడతాయి.  విద్య మరియు సామాజిక అభివృద్దికి సంబధించిన ఆలోచనలను, పరిపక్వతో కూడిన సంభాషణలను పోర్టల్ ప్రోత్సహిస్తుంది. మీ ఆలోచనలను పంచుకొనే విషయంలో వ్యంగంగా వ్యవహరించడం, అసభ్యంగా ప్రవర్తించడం ఉండకూడదు కానీ హాస్యాన్ని  స్వాగతిస్తోంది.

వనరులు:
ఇవి  ముఖ్యంగా రెండు రకాలు  

  1. తరగతిగది వనరులు - ఉపాధ్యాయులు తమ తరగతిగదులలో బోధన కోసం  ఉపయోగించడానికి,   
  2. ఉపాధ్యాయ అభివృద్ది కోసం - ఉపాధ్యాయులు వృత్తి పరంగా మరింత ఎదగడానికి ఉపయోగపడుతాయి.

రెండూ కూడా వివధ రూపాలలో అంటే దస్త్రాలు (File), దృశ్య, శ్రవణ సంబందిత రూపాలలో లభ్యమౌతాయి.

పోర్టల్ లో ప్రచురించిన వనరులు ఏ సందర్బానివైనా ఉండవచ్చు. కానీ ఈ విషయాలు బావితరాలకు ఉపయోగపడాలి అలాగే తరగని విలువలను కలిగిఉండాలి.  వనరులను పోర్టల్ బృందానికి ఆన్ లైన్ లో కానీ  తపాలా ద్వారా కానీ పంపవచ్చు.

పోర్టల్ కి వనరులను పంపడానికి మూడు పద్ధతులున్నాయి .

  1. పోర్టల్ లో "వనరులను ఏర్పరచండి" క్లిక్ చెయ్యడం ద్వారా పంపవచ్చు (ఇది చాలా మంచి పద్ధతి, దీని వలన మీరు పంపిన వనరులను తొందరగా  సమీక్షించి  పోర్టల్ లో అందరికీ అందుబాటులో తేవడానికి వీలౌతుంది.)
  2. మీరు  E- మెయిల్  ద్వారా teachers@azimpremjifoundation.org   చిరునామాకు పంపవచ్చు. (మీరు పంపే వనరులను వర్డ్ లో టైప్ చేసి మీ మెయిల్ కు అనుబంధంగా  పంపండి.  మీ మెయిల్ లోనే విషయమంతా టైప్ చెయ్యకండి. మీ మెయిల్ లో మీ ఫోన్ నంబరును తెలియ చేయండి. అవసరమైనచో మిమ్ములను సంప్రదించడానికి వీలౌతుంది)
  3. తపాలా ద్వారా అయితే ఈ క్రింది చిరునామాకు పంపండి :The Editor, Teacehrs of India,  Azzim Premji Foundation, # 401, My Home Mount View Apts, Navodaya Colony, Yellareddy Guda,  Hyderabad-500 073- 040-32436279

(మీ చిరునామాను మీ ఫోన్ నంబరుని జతచేయండి . మీరు మీ రచనలను ముద్రణ రూపంలోకానీ,  మీ దస్తూరీలో కానీ పంపవచ్చు. మీరు పంపే రచనలు పేజికి ఒక వైపున మాత్రమే వ్రాయండి /టైప్ చెయ్యండి. పేరాలో వరుసల మధ్య రెండు లైనుల స్థలాన్ని వదలండి. లాగే నలువైపులా 1.5” స్థలాన్ని వదలండి. మీరు మీ రచనలను  C.D  ద్వారా పంపాలనుకుంటే ఆ C.D  పై ఆ రచనల సారాంశాంతో పాటు  మీ పేరును, ఫోన్ నంబరుని వ్రాయండి.)

మీ  దస్త్రాల(files)ను సులభంగా గుర్తుపట్టేలా  పేర్లను ఇవ్వండి.

మీరు మీ రచనలను E-మెయిల్ ద్వారా కానీ  C.D ద్వారా కానీ పంపుతుంటే  వాటిపై  ఆ రచనలోని విషయాన్ని అవగాహన  చేసుకొనేలా వాటికి పేరుని ఇవ్వండి. మా సంపాదకులకు ఒకే సమయంలో వివిధ విషయాలో, వివిధ తరగతులకు సంబంధించిన వనరులు అందుతుంటాయి కావున ఈ విషయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి.

“E-మెయిల్” "Subject" లో విషయాన్ని స్పష్టంగా, అర్థవంతంగా వ్రాయండి.

C.D పై కూడా విషయాన్ని స్పష్టంగా అర్థవంతంగా వ్రాయండి. మీ ఫోన్ నంబర్ మరియు మీ పేరుని కూడా వ్రాయండి. అవసరమైనచో మిమ్ములను సంప్రదించడానికి, పోర్టల్ లో త్వరగా ప్రచురించడానికి వీలౌతుంది.

మీరు మీ రచనలను E-మెయిల్ ద్వారా కానీ  C.D ద్వారా  పంపుతుంటే  వాటికి పేరు వ్రాయడానికి కొన్ని సూచనలు. మీ పేరుని మీ భాషను వనరుకు సంబంధించిన విషయాన్ని, అంశాన్ని, వనరు యొక్క రకాన్ని చేర్చడం మంచిది.

<Language>-<State>-<Subject>-<Lesson Name>-<Resource Type>-<Author>.
ఉదా: Telugu-Andhra Pradesh-Science-Photosynthesis-Lesson Plan-Raju

దీనికి జత చేయాల్సిన ముఖ్య సమాచారం :
మీరు పంపిన వనరులను త్వరితగతిన ప్రచురించడానికి వనరుకు సంబధించిన కొన్ని విషయాలను మీరు అందించాల్సిన అవసరం ఉంది.  మీరు పంపే వనరు మొదటి పేజిలో ఈ క్రింది విషయాలను స్పష్ఠంగా వ్రాయండి .

విషయం:  పరిసరాల విజ్ఞానం, సాంఘికశాస్త్రం, గణితశాస్రం మొదలైనవి  

అంశం : ఋతువులు, వ్యక్తిగత పరిశుభ్రత మొదలైనవి

“వనరు”  రకం :  వ్యాసం, కృత్యం, అభ్యాసపత్రం, వీడియో మొదలైనవి

సంబంధమైన పాఠ్యప్రణాళిక :  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక,కేరళ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక, C.B.S.E,  మొదలైనవి

తరగతి : ఏ తరగతికి సరిపోతాయో సూచించండి (ఉదా: 1-2 తరగతులు లేదా 3-5 తరగతులు మొదలైనవి)               

మీ వివరాలు :  మీ వృత్తిలో మీ అనుభవం గురించి , మీ ప్రావీణ్యతల గురించి మొదలైన విషయాలను  50 పదాలకు మించకుండా వ్రాయండి. అలాగే వీలయితే మీ ఫోటోను E-మెయిల్ ద్వారా పంపండి.

వనరులో ఉపయోగించే font, font size మొదలైనవి క్రింద పట్టికలో ఇవ్వబడినవి.

ఫాంట్

వనరులోని ముఖ్య భాగం

శీర్షిక

ఉపశీర్షిక-1

ఉపశీర్షిక-2

గౌతమి

                12 pt

18 pt bold

16 pt bold

12 pt bold

 

 

మీరు సరళంగా, స్పష్టంగా భాషలో తర్కబద్ధంగా వ్రాయండి. వాక్యాలు చిన్నవిగా ఉంటే సాధారణ చదువరి కూడా సులభంగా అవగాహన చేసుకోగలడు.

సంక్షిప్తరూపాలు  మరియు మారుపేర్లు:
మీ రచనలో సంక్షిప్తరూపాన్ని మొదటి సారి ఉపయోగించినపుడు దాని పూర్తీ రూపాన్ని కూడా పేర్కొని , సంక్షిప్త రూపాన్ని బ్రాకెట్లో ఉంచండి. రచన తరువాత దశలలో మీరు  సంక్షిప్త రూపాన్నే ఉపయోగించవచ్చు.
ఉదాహరణ: ఈపాఠ్య పుస్తకాన్ని జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (NCF-National Curriculam Framework)) 2005 నియమాల ఆధారంగా రూపొందించారు.  జాతీయ విద్యా వ్యవస్థ  NCF 2005 అధారంగా ఉండాలని  జాతీయ విద్యా విధానం(NPE-National Policy on Education) పేర్కొంటోంది.  ఈ క్రమంలో 2005 NCF మూడవది. ఇంతకు ముందు 1986 మరియు 2000 లోను రూపొందించారు.

చిత్రాలు మరియు ఛాయాచిత్రాలు:
కొన్ని సందర్భాలలో మన రచనలకు చిత్రాలు మరియు ఛాయాచిత్రాలు చాలా విలువను చేకూరుస్తాయి. ఐతే తక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాలను లేదా ఛాయాచిత్రాలను ఉపయోగించినపుడు  అవి ఆకర్షణీయంగా లేకపోవడమేకాక, ముద్రణలో కూడా సరిగా కనపడవు. తద్వారా ఉపాధ్యాయులు వాటిని ఉపయోగించుకోలేరు. 

మీరు  ఉపయోగించే చిత్రాలు లేదా ఛాయాచిత్రాల