విషయానికి (content) సంబధించిన విధానం

www.teachersofindia.org  పోర్టల్  భారతదేశ మంతటా గుణాత్మక విద్యను మెరుగుపరచాలానే లక్ష్యంతో  పనిచేస్తుంది. దేశమంతటా విస్తరించిన ఉపాధ్యాయుల సముదాయాలు వనరులను ఏర్పరచడానికి, పంచుకోవడానికి  సామర్థ్యాన్ని ఇస్తుంది అలాగే వీటి కోసం వారిని ప్రోత్సహిస్తుంది.

ఇది ముఖ్యంగా దేశం నలుచెరుగులా విస్తరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల కోసం ఏర్పరచబడింది. వీరందరూ ఆంగ్లం కంటే వారి వారి ప్రాంతీయ భాషలలో ప్రావీణ్యం గలవారు, కావున  www.teachersofindia.org పోర్టల్ యొక్క ఒక ముఖ్య లక్ష్యం మరియు విధానం, వనరులను ప్రాంతీయ భాషలలోవివ అందించడం. ప్రస్తుతం ఆంగ్లంతో పాటు మరో నాలుగు ప్రాంతీయ భాషలలో ఇవి లబిస్తాయి. కాలక్రమేణా అన్ని భారతీయ భాషలకు దీనిని విస్తరిస్తారు. 

ఉపాధ్యాయులు, పోర్టల్ ను ఉపయోగించేవారే పోర్టల్ కు వనరులన్నీ చేకూరుస్తారు(ముఖ్య నియమం):     

www.teachersofindia.org  పోర్టల్ ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులతో  సంప్రదించడానికి, చర్చించడానికి తమ ఆలోచనలను పంచుకోవడానికి, అలాగే వనరులను ఏర్పరచడానికి మరియు పంచుకోవడానికి ఒక వేదిక. పోర్టల్ లోని విషయానికి రెండు ముఖ్యమైన విభాగాలు ఒకటి, ఉపాధ్యాయుల సముదాయాలు రెండు,  వనరులు.

ఉపాధ్యాయుల సముదాయాలు : ఉపాధ్యాయులు స్వేచ్చగా ఒకరి కొరకు సంప్రదించుకోవడానికి ఏర్పాటు చేసిన  వేదికలే  “ఉపాధ్యాయ సముదాయాలు”.  పోర్టల్ లోని వనరులన్నీ  పోర్టల్ ని ఉపయోగించేవారు ఏర్పాటు చేసినవే (భాగస్వామ్య  సంస్థలు, ఫౌండేషన్ లోని విషయ నిపుణులు). ఈ విభాగాలన్నింటిలో భాషా పరమైన దోషాలు లేకుండా చూడడానికి  పోర్టల్  పరిశీలిస్తుంది. విద్య మరియు సామాజిక అభివృద్దికి సంబధించిన ఆలోచనలను పరిపక్వతో కూడిన సంభాషణలను పోర్టల్ ప్రోత్సహిస్తుంది. మీ ఆలోచనలను పంచుకొనే విషయంలో వ్యంగంగా వ్యవహరించడం, అసభ్యంగా ప్రవర్తించడం ఉండకూడదు కానీ హాస్యాన్ని  జతచేయండి.

తరగతిగది వనరులుమా సంపాదకులు ఈ వనరుల గుణాత్మకతను,సంభావ్యతను, ఫౌండేషన్ లోని విషయ నిపుణుల మరియు అంతర్జాల ఆధార పునర్విమర్శకుల  సహాయంతో పరిశీలిస్తారు.
చాలా మాత్రం వనరులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వివిధ భాషలకు సంబధించి ఉంటాయి. దీని వలన వనరులు ఆ ప్రాంత అవసరాలకు, సంస్కృతికి అనుకూలంగా ఉంటాయి. వీటిని పోర్టల్ కి అంతర్జాలం ద్వారా లేదా తపాల ద్వారా పంపవచ్చు.       

వనరులకు సంబధించి ఇంకొక ముఖ్య మైన విషయం, ఇతర సంస్థలు ఇప్పటికే ఏర్పరచిన గుణాత్మక మైన వనరులను అందరికీ అందుబాటులో తేవడం. దేశంలోని  వివిధ ప్రాంతాలలో గల  చాలా సంస్థలు వారి వారి భాషలలో ఉత్తమ వనరులను అభివృద్ది చేసాయి, కానీ అందరికీ అందబాటులో తేవడానికి వాటికి తగిన సౌకర్యాలు లేవు.  వీటి కోసం పోర్టల్  ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సంస్థలు పోర్టల్ లో విషయ భాగస్వామ్యులుగా చేరవచ్చు. (పోర్టల్ లో విషయ భాగస్వామ్యుల విభాగాన్ని చదవండి).

ఇలాంటి ఉత్తమ వనరులు అందరికీ ఉపయోగపడేలా వీటిని వివధ భాషలలోకి  అనువాదం చేసి అందుబాటులో ఉంచుతారు.

కొన్ని వనరులను ఫౌండేషన్ లోని విషయ నిపుణులు తయారు చేస్తారు.      

పోర్టల్ (www.teachersofindia.org) లోని వనరులు:
ముఖ్యంగా రెండు రకాలు,  ఒకటి తరగతిగది వనరులు,  రెండవది ఉపాధ్యాయ అభివృద్ది కోసం. 

  1. తరగతిగది వనరులు : ఉపాధ్యాయులు తమ తరగతిగదులలో బోధన కోసం  ఉపయోగించేవి. ఉదాహరణకు పాఠ్య ప్రణాళికలు, కృత్యాలు, అభ్యాసపత్రాలు, P.P.T ప్రదర్శనలు, ఆటలు, వీడియోలు మొదలైనవి.
  2. ఉపాధ్యాయ అభివృద్ది కోసం : ఉపాధ్యాయులు వృత్తి పరంగా మరింత ఎదగడానికి ఉపయోగపడుతాయి. నవీన బోధనా పద్ధతులు, విద్యా మనోవిజ్ఞానశాస్రం, దేశంలోని, ప్రపంచంలోని ఉత్తమ బోధనా పద్ధతుల గురించి ,  కృత్యాలు, చర్చలు, ఇంటర్వ్యూలు, చిత్రాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.

కాపీ రైట్ విధానం :
పోర్టల్ లో ఉంచే వనరులన్నింటిని దేశవ్యాప్తంగా అన్ని భాషల వారు అన్ని ప్రాంతాలవారు స్వేచ్చగా విద్యాభివృద్ది కోసం ఉపయోగించు కోవచ్చు. కావున మేము  ఇందుకోసం Creative Commons license నియమాలను అవలంబిస్తాము.

పోర్టల్ లోని ప్రతి వనరు ఈ క్రింది వాటిలో ఏదో ఒక గుర్తుని కలిగిఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండం వలన, పోర్టల్ లోని వివిధ వనరులను ఎంత స్వేచ్చగా ఉపయోగించ వచ్చో తెలుసుకోవచ్చు.

Attribution-NonCommercial-ShareAlike CC BY-NC-SA

 ఈ వనరుని  మీరు హక్కుదారులు ఉపయోగించే విధానంలో ఉపయోగించే విధంగా కాపీ చేసుకోవచ్చు, ఇతరులకు పంపిణీ చేయవచ్చు, వేరే ఇతర వనరులతో కలసి ఉపయోగించవచ్చు. కానీ వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు.

Attribution-NonCommercial-NoDerivs CC BY-NC-ND

ఈ వనరుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఇతరులతో పంచుకోవచ్చు, కానీ హక్కుదారుల గురించిన  వివరాలను తెలియచేయాలి, వాణిజ్యపరంగా ఉపయోగించ కూడదు.   

© అన్ని హక్కులు  నియంత్రించబడినవి.

అన్ని హక్కులూ వనరులను ఏర్పరచినవారికే ఉంటాయి. ఈ వనరులను వీటి హక్కుదారుల అనుమతి లేనిదే  కాపీ చేయరాదు, ఇతరులకు పంపిణీ చేయరాదు, మరియు ఏ విధమైన మార్పులు  చేయరాదు.

Creative Commons license గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ప్రామాణీకరించ బడిన  "యూ ట్యూబ్"  అనుమతి పత్రం:
ఇది “అన్ని హక్కులూ నియంత్రించ బడినవి” దానిని పోలి ఉంటుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇతర మాధ్యమాలలో ముందే ప్రచురించిన వాటిని పోర్టల్ లో తిరిగి ప్రచురించడం.
ఇతర మాధ్యమాలలో ముందే ప్రచురించిన వాటిని పోర్టల్ లో తిరిగి ప్రచురించడానికి కాపీరైట్  పొందినవారి అనుమతి అవసరం. ఈ వనరుల చివరలో ఆ వనరు ఇంతకు ముందు ఎక్కడ ప్రచురించారో ఆ ప్రచురణల వివరాలను తెలియచేయాలి(పత్రిక పేరు, సంచిక సంఖ్య మొదలైనవి).  కాపీదారుల నుండి అనుమతి పత్రాన్ని కూడా ఇలాంటి వనరులతో పాటు పోర్టల్ కి పంపాలి.  

మేధోపరమైన నిబద్ధత  (కాపీ రైట్ మరియు గ్రంథచౌర్యం):
పోర్టల్ మేధోసంపత్తి హక్కులను గౌరవిస్తుంది మరియు పోర్టల్ తోడ్పాటుదారులను కూడా వీటిని ఆచరించేలా  ప్రయత్నం చేస్తుంది. పోర్టల్ కు  వచ్చిన వనరులను అది రచయిత స్వీయమని ఇతరుల నుండి గ్రహించినది కాదని భావిస్తారు.  

పోర్టల్ కి పంపిన వనరులను పోర్టల్ కు చెందినవిగా భావిస్తారు. రచయితలు వీటిని వెనుకకు తీసుకోవడానికి లేదా పోర్టల్ నుండి తొలగించడానికి ఎటువంటి హక్కులూ ఉండవు.  ఎవరైనా తమ వనరులను వెనుకకు తీసుకోదలిస్తే  ఆ విషయాన్ని సంపాదకులకి తెలియజేయాలి.

పోర్టల్ కి పంపిన వనరులను అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత ఇవి లబ్దిదారులకు అనువుగా లేవని సంపాదక మండలి భావిస్తే వాటిని పోర్టల్ లో ప్రచురించకుండా నిలిపి వేయడానికి సంపాదకులకు సర్వహక్కులూ గలవు.  రచయితకు ఎటువంటి సమాచారాన్ని, కారణాన్ని తెలుపకుండానే  వారి వ్యాఖ్యానాలను, రచనలను పోర్టల్ నుండి తొలగించడానికి  హక్కు గలదు.

డిస్క్లైమర్: ద్యారంగంలోని సమాచారాన్ని ఉపాధ్యాయులు, ప్రశిక్షకులు పరస్పరం పంచుకోవడానికి టీచర్స్ అఫ్ ఇండియా ఒక వేదిక లాంటిది. అలాగే టీచర్స్ అఫ్ ఇండియా వివిధ వెబ్ సైట్ లకు లింక్ లను అందిస్తోంది. కానీ ఈ వెబ్ సైట్ ల లోని సమాచారానికి, మరియు వినియోగదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భాద్యత వహించదు. వెబ్ సైట్ ల లోని సమాచారాన్ని పొందడంలో గానీ లేదా ఉపయోగించడం వలన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ జరిగే నష్టాలకు భాద్యత వహించదు.

19656 registered users
7777 resources