విలువలతో కూడిన విద్యను అందించేందుకు తగినపధ్ధతులు

తరగతిగదిలో నైతికవిద్యను బోధించడానికి పలు పధ్ధతులున్నాయి. ఈ వ్యాసం మీకు ఆ పధ్ధతులను పరిచయం చేస్తుంది.

ప్రస్తుతతరానికి నైతిక విద్య ముఖ్యమని  భావిస్తూ కానీ వీటిని ఎలా బోధించాలని అనుకొంటున్నారా?  అయితే ఈ వ్యాసం నైతికవిద్యను అందించడానికి  ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తూన్న  మూడు ముఖ్య పధ్ధతుల గురించి తెలియచేస్తుంది. వీటి ఆధారంగా మరిన్ని పధ్ధతులను మీరు రూపొందించుకోవచ్చు.

ప్రత్యక్ష పధ్ధతి: నైతికవిద్యను బొధించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిండం

ఈ పధ్ధతిలో అన్ని ఇతర విషయాంశాలలాగే నైతకవిద్యను కూడా ఒక నిర్ణీత అవధులలో బోధిస్తారు.  ఇందులో పాఠ్యాంశాలను విలువల ఆధారంగా ఉదాహరణకు నిజాయితీ, గౌరవం,నమ్మకం, భాధ్యత లేదా పాఠశాల ఎదుర్కొంటూన్న ఒక సమస్య (ను ఎలా పరిష్కరించాలి) ఆధారంగా రూపొందించవచ్చు. పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యను ఒక పాఠ్యాంశంగా బోధించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. పాఠశాలలో పిల్లలు ఎక్కువగా  ధూర్భాషాలాడుతుండడం, తరచూ ఒకరితో మరొకరు పోట్లాడుతుండడం లాంటివి జరుగుతూ ఉంటే వీటిని పరిష్కరిస్తూ పాఠ్యాంశాలను రూపొందించవచ్చు.  చర్చలు, పాత్రధారణ, కళలు, రచనలు, సంవాదల ద్వారా లేదా పాఠశాలమొత్తం  పాల్గొనగలిగే సర్వే, నాటకాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పధ్ధతి  ద్వారా ఆశించిన ఫలితాలు చాలా తొందరగా లభిస్తాయి, ఉపాధ్యాయులకు విజయానందం లభించి వారు మరింతగా వీటిని బోధించడానికి తగిన ప్రేరణ లభిస్తుంది. 

సమీకృతవిధానం : ఇతర విషయాంశాలతో కలిపి నైతికవిద్యను బోధించడం :       

ప్రస్తుత పాఠ్యప్రణాళిక, విద్యార్థులు సత్ప్రవర్తన మరియు విలువల గురించి ఆలోచించడానికి వీలు కలిగించేలా బోధించడానికి తగినన్ని అవకాశాలను కల్పిస్తోంది. ఉదాహరాణకు  ఒక కథానాయకుని గురించిన కథను బోధిస్తూ సాధారణ మూసప్రశ్నలు ఆడగకుండా కథానాయకుని బలాలు బలహీనతలు ఏవి అడగవచ్చు?అతను తన సంధిగ్ధావస్థను ఎలా ఎదుర్కొన్నాడు ? ఆ సంధిగ్ధత నుండి బయట పడటానికి అతనికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని నీవనుకొంటున్నావు? అతను ఎంచుకొన్న పరిష్కారమార్గం నిన్నెందుకు బాధిస్తోంది ? ఆ పరిస్థితులలో నీవైతే ఏమి చేస్తావు ? నీ జీవితంలో ఇంత కష్టమైన సమస్యను నీవేప్పుడూ ఎదుర్కొలేదా ? దానిని ఎలా పరిష్కరించావు ? నేకమనిపించినది ?  లాంటి  ప్రశ్నలు అడగవచ్చు.

చరిత్రను అభ్యసించే సమయంలో  పూర్వకాలంలో జరిగిన సంఘటనలే కాక వాటిని  గురించి నైతికంగా వ్యాఖ్యానించుటకు కూడా విద్యార్థులకు తగిన అవకాశాన్ని కల్పించాలి. చరిత్ర అంటే తేదీలు మరియు  కంఠతాపధ్ధతిలో వాటిని గుర్తుంచుకోవడమే కాదు ఆ కాలంలో నివసించిన ప్రజల జీవనవిధానం,  వారు ఎంచుకొన్న విధానాలు, వాటి వలన కలిగిన మార్పులు మొదలైనవి.  ప్రముఖులు తీసుకొన్న నిర్ణయాలు, ఆ సంఘటన జరిగిన సంధర్భంలో వారికిగల అవకాశాలు , వారి ప్రవర్తనకు కారణాలు , వారు తీసుకొన్న చర్యలు,  ఇంకెలా ప్రతిస్పందించి ఉండవచ్చు వీటన్నింటినీ నైతికవిలువల దృష్టిలో ఉంచుకొని చర్చించవచ్చు. చాలా సందర్భాలలో గణితాన్ని విజ్ఞానశాస్త్రాన్ని నైతికవిద్యతో సమీకృతం చేయడం కష్టమని భావిస్తారు, కానీ ఇది నిజంకాదు.   

సమగ్ర పధ్ధతి:

నైతికవిద్యను బోధించడానికి సమీకృతపధ్ధతి కంటే మించిన ఉత్తమపద్ధతి లేదు. ఇందులో పాఠశాలలోని ప్రతి అంశాన్ని విలువలతో జోడించాలి. ఈ పధ్ధతి విజయవంతం అవ్వాలంటే పాఠశాలలోని బోధన,బోధనేతర సిబ్బంది నిబద్ధతను కలిగి ఈ విద్య సాధారణవిద్యాంశాలతో సమానమైనదని భావించగలగాలి. పాఠశాలలోని ప్రతి అంశం యొక్క ఉద్ధేశ్యం ఉపాధ్యాయుల, విద్యార్థుల, బోధనేతర సిబ్బంది,మరియు సమాజంతో సత్సంభంధాలు నెలకొల్పేదిగా ఉండాలి.  పాఠశాలలో విద్యావిషయాలకు ఇచ్చే ప్రాముఖ్యతనే సాంఘిక బావోద్వేగాల అభివృద్ధికి కూడా ఇవ్వాలి. పోటీతత్వానికంటే  సహకారతత్వానికి, వ్యక్తిత్వవికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నైతిక విలువలైన నిజాయితీ,దయ, జాలి, గౌరవం మొదలైనవి రోజువారి పాఠ్యాంశాలలో భాగంకావాలి. విద్యార్థులు వీటిని ఆచరించడానికి అనుగుణంగా తగిన సేవాకార్యక్రమాలు కూడా ఉండాలి. పాఠశాలలో ప్రజాస్వామ్యవిలువలను పాటించాలి, విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలలోని సమస్యల సాధనకు, క్రమశిక్షణకు మార్గదర్శకత్వాలను, రూపొందించడానికి  కలిసి ఉండడానికి  సమావేశాలు నిర్వహించాలి.

నేను సూచిస్తున్న మరియు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న మూడు పధ్ధతులకు లాభాలు నష్టాలు వేటికవి వాటిగా ఉన్నాయి. ఈ మూడింటిని సమ్మేళనపరచి కూడా ఎవరైనా ప్రయత్నించవచ్చు. కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు సహజంగానే ఈ పధఃతిని పాటిస్తుంటారు. అయితే నా సూచన ఏమిటంటే మీరు నైతికవిద్యను ప్రత్యక్షపధఃతిలో ప్రారంబించినప్పటికీ త్వర్లోనే దానిని  సమగ్ర పధ్ధతికి మార్చుకోండి.  

మనం ఒకరోజులోనూ, వారంలోనో, నెలలోనో లేదా సంవత్సరంలోనే సాధించలేము, భవిష్యత్తులో సాధించగలమనే నమ్మకంతో ఈ నైతికవిద్యను ప్రారంభించాలి అంతేకానీ ఎప్పటికీ మొదలుపెట్టకుండా ఉండకూడదు. దీని అమలుపరచడంలో భాగంగా ప్రస్తుతం పాఠశాలపాఠ్యప్రణాళికలో  నైతికవిద్యకోసం నిర్దేశించిన ఒక పీరియడ్ ని సద్వినియోగ పరచుకోవాలి. తొందరలోనే ఇతరవిషయాంశాలను బోధించే ఉపాధ్యాయులు కూడా ఈ నైతికవిద్యను సమీకృతం చేసి భోదిస్తారు.

ఈ పధ్ధతిలోకి మారేందుకు వీలుగా ఇక్కడ కొన్ని సోపానాలను ఇచ్చాము. ఇందులో మొదటి మూడుసోపానాలను కొన్నిరోజులలో పూర్తీచేయవచ్చు. తదుపరి మూడుమెట్లను కొన్ని నెలల వ్యవధిలో పూర్తీచేయవచ్చు. చివరిరెండు సోపానాలను పూర్తీచేయడానికి కావలసిన సమయం ఉపాధ్యాయులపై మరియు పాఠశాలయాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది.      

మొదటి సోపానం : ఉపాధ్యాయులందరికీ నైతికవిద్య ప్రాముఖ్యత గురించి సరైన అవగాహన కల్పించడం

ఈ అవగాహనా సమావేశంలో ఉపాధ్యాయులకు నైతికవిద్య పై వారికి గల అభిప్రాయాలను, అపోహలను  బావాలను తెలియచేయాలి. నైతికవిద్యా అవసరాన్ని ఆంగీకరించాలి,  ప్రపంచవ్యాప్తంగా నైతికవిద్య తీరుతెన్నలను గమనించి వారిబోధనా విధానాలలో అవసరమైతే మార్పులను తీసుకురాగలగాలి.

రెండవసోపానం : ఉన్నఉపాధ్యాయులలోనే ఆసక్తిగల అధ్యాపకులను ఇందుకోసం ఎంపికచేయాలి.

విలువల బోధన సులభమైనది కాదు లేదా విషయాంశాలను బోదించినట్లుకూడా కాదు కావున అనుసరించాల్సిన పధ్ధతిలో మౌలిక తేడాలు ఉంటాయి. నైతికవిద్యను బోధించే ఉపాధ్యాయుని ఎంపిక  సాధారణ అంశాలు అంటే వయస్సు, అనుభవం,విద్యార్హతల ఆధారంగా కాకుండా ఆసక్తి,దృక్పథం, అభిరుచిల ఆధారంగా జరగాలి. నా అనుభవంలో ప్రతిపాఠశాలలోనూ ఈ అంశాలను కలిగి ఉన్న ఉపాధ్యాయులలో 10 % మంది బోధించగలరు వీరి సహాయసహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోవచ్చు.

మూడవ సోపానం:   ఎంపికైన ఉపాధ్యాయులు నైతికవిద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను,పాఠ్యప్రణాళికలను తయారుచేయాలి.

ఇందులో భాగంగా  ఉపాధ్యాయయులకు ప్రారంభ దశలలో కొన్ని నమూనాపాఠ్యప్రణాళికళలను  ఇవ్వవచ్చు.  కానీ కాలక్రమంలో పాఠశాల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికళలను సిధ్ధంచేయగలగలిగేలా వీరికి  తగిన శిక్షణాకార్యక్రమాలను నిర్వహించాలి.

ఈ పాఠ్యప్రణాళికలు విసుగులేకుండా, ఔదార్యాన్ని తెచ్చే ప్రవర్తనను కలిగించేలా ఆనందాన్ని ఇచ్చేలా తీర్చిదిద్దేందుకు అనువుగా ఉండేలా ఒక నిమియత నమూనా రూపొందించాలి.  పాఠ్యప్రణాళికలోని ముఖ్యభాగం  ప్రశ్నాపధ్ధతిలో జరిగే చర్చలలాగా రూపొందించడం చాలాముఖ్యమైన విషయం.  నైతికవిద్య తరగతిలో చర్చలను నిర్వహించేవిధానాన్ని అభ్యసించడం ముఖ్యం.

నాల్గవ సోపానం : తల్లితండ్రులను భాగస్వామ్యులను చేయడం

ఉపాధ్యాయులు పాఠశాలలో నైతికవిద్య తరగతులు మొదలుపెట్టకనే తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. వారికి పాఠశాలలో మొదలుపెట్టే నైతికవిద్య గురించి వివరించి అందుకు సంబంధించిన ఇంటిపనిని విద్యార్థులు పూర్తీచేయడంలో సహకరించాలి.  

ఐదవ సోపానం :నైతికవిద్య తరగతులను మొదలు పెట్టడం

విద్యార్థులు  విభిన్న సమాధానాలను ఇస్తారు కావున ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఈ  తరగతి అనుభవాలు   అభ్యసనం అవుతాయి. ఈ చర్చల సందర్భంలో  పిలలు అడిగే ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానాలు చెప్పే ఉపాధ్యాయుడు ప్రత్యేకతను సంతరించుకొంటాడు. విద్యార్థుల ప్రతిస్పందనలే ఉపాధ్యాయుల ప్రతిభను తెలియచేస్తాయి.

ఆరవసోపానం : తరగతిగదిలోని అనుభవాల ఆధారంగా పాఠ్యప్రణాళికలను మెరుగుపరచడం

ఉపాధ్యాయులు  చర్చలలను నిర్వహించడంలో నిష్ణాతులయ్యేవరకు పాఠ్యప్రణాళికలను నిర్ణీతఅవధులలో పునర్విమర్శ  నిర్వహించాలి.       

ఏడవ సోపానం : అన్ని విషయాంశాల బోధనలో నైతికవిలువలను సమీకృతం చేయడం.

ఉపాధ్యాయులు నైతికవిద్యను బోధించడం మొదలుపెట్టాక వారి విషయాంశాలబోధనోలో కూడా వీటిని సమీకృతం చేయవచ్చని తెలుస్తుంది. ఈ విధంగా సమీకృతం చేయడం వలన నైతికవిద్యను పిల్లకు అందించడంలో మనం తదుపరి మజిలీ చేరుకున్నట్లే.

ఎనిమిదవ సోపానం : పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ విలువలు ఉండేలా చూడాలి.

పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ విలువలు ఉండేలా పాఠశాల సంస్కృతిలో విలువలు ఒక భాగం కావాలి. ఈ పధ్ధతిని ఈ విలువలన్నీ పాటించడం వలన మీ పాఠశాల నైతికవిద్య అందించడంలో ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లే. మీ ఉపాధ్యాయులకు పనిభారం అనిపించదు,అదనపు వనరులు అవసరం ఉండదు. మీ విద్యార్థులు ఈ ప్రయాణాన్ని ఆనందిస్తారు మీ పాఠశాలలో సమగ్రమైన విద్యను అందించే మూలాలు ఏర్పడినట్లే. 

 

 

18615 registered users
7272 resources