విలువలతో కూడిన విద్యకోసం మనం

భారతదేశం నందు విలువలతో కూడిన పలు విద్యా కార్యక్రమాలు మత సంస్థల ద్వారానే ప్రారంభించబడినవి. అయినప్పటికీ ఇవి సాధారణంగా మతప్రమేయం లేకుండా ఉంటూ విశ్వవిలువలైన నిజాయితీ, నమ్మకం, బాధ్యత, జాలి, దయ మొదలైన వాటికి ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. సత్యసాయి సంస్థలు, రామకృష్ణ మిషన్, ఆనంద సంఘ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మ కుమారిస్, ది చిన్మయానంద మిషన్ మరియు మరెన్నో సంస్థలు ఉత్సాహంగా వారి విద్యాసంస్థల నందు విలువలతో కూడిన విద్యను నియత లేదా అనియత రూపంలో విద్యార్ధులకు బోధించడం జరిగినది. గాంధీజీ చెప్పినట్లుగా ‘ప్రవర్తనను రూపొందించడం అనేది అక్షరాలను దిద్దడం కంటే ముందు జరగాలి’  మరియు స్వామి వివేకానంద బోధించినట్లుగా మత సంబంధ విషయాలను బోధించడం అనేది విద్యావిధానంలో ఒక భాగంగా ఉండవలెను ఎందుకంటే విలువల విద్యకు ఇది పునాది . అయినప్పటికీ, ఎన్నో సంవత్సరాల తరబడి విలువలతో కూడిన విద్యకు గుర్తింపు తక్కువగానే ఉంది.

ఇటీవల కాలంలో C.B.S.E మరియు N.C.E.R.T విలువలతో కూడిన విద్యను తిరిగి ప్రవేశపెట్టాలని కృషి చేస్తున్నవి. N.C.E.R.T విలువలతో కూడిన విద్య కొరకు నేషనల్ రిసౌర్స్ సెంటర్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఇది 2002  సంవత్సరంలో ‘విలువలతో కూడిన విద్యను బలోపేతం చేయడానికి జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని’ ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా విలువలతో కూడిన విద్య పట్ల అవగాహనను కలిగించడం, సామాగ్రిని  అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మానవిక విలువలను బోధించడంలో పరిశోధనలను మరియు సృజనాత్మక అంశాలకు మద్దతునివ్వడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.  పాఠశాల వ్యవస్థలో విలువలతో కూడిన విద్యను బోధించుటకు మార్గదర్శకాలు అభివృద్ధి చేయబడవలెను. C.B.S.E 2003 నందు 6 మరియు 7వ తరగతులలో జీవన నైపుణ్యాలు అనే అంశమును ప్రవేశపెట్టి దానిని 2005 నాటికి 10 వ తరగతి వరకు పొడిగించినది. ఇపుడు కేవలం ప్రతి విషయానికి  సంబంధించిన ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు కలిగివుండడమే కాకుండా వాల్యూ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ (V.B.I.L) అనే అంశం ద్వారా ప్రతీ పాఠ్యాంశానికి  కొంత ‘విలువను’ జోడించి బోధించడం జరుగుతుంది. N.R.C.V.E ప్రవేశపెట్టబడి 12 సంవత్సరాలు, C.B.S.E వారానికి కనీసం రెండు పీరియడ్లు జీవన నైపుణ్యాలను నేర్పించాలనే తన మార్గదర్శకాలను పంపి 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, వాస్తవంగా నెలకొని ఉన్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది.

కొన్ని పాఠశాలలు దీనిని ‘విలువలతో కూడిన విద్య’ అని మిగిలినవి ‘జీవన నైపుణ్యాలు’ అని పిలవగా కొన్ని పాఠశాలలు వ్యక్తిత్వవికాసం  అని కూడా పిలుస్తున్నాయి. ఈ విషయాంశానికి సంబంధించి  కొన్ని పాఠశాలలు పాఠ్యపుస్తకాలను కూడా సూచిస్తున్నాయి కాని సంగీతం, నృత్యం లేదా శారీరక విద్య వంటి సబ్జెక్టులకు ఉన్నట్లుగా దీనికి ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరు. ఇప్పటివరకు నాకు తారసపడిన ఏ పాఠశాలలో కూడా వారానికి ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు V.E(Value Education) ను బోధించడం లేదు . ఈ తరగతులన్నీ కూడా ఈ విషయంలో  ఏవిధమైన శిక్షణా పొందని మరియు ఆసక్తిని చూపని విద్యార్థులచే  ఉపాధ్యాయులచే బోధించబడుతున్నాయి.  

ఈ  విషయాన్ని బోధించడానికి  C.B.S.E  చేస్తోన్న కృషి పట్ల చాలా మందికి  అవగాహన లేదు. చాలామంది ఉపాధ్యాయులు ఈ సబ్జెక్టును బోధించడానికి కేటాయించిన పీరియడ్‌ను వేరే సబ్జెక్ట్ బోధించడానికి వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో విలువలతో కూడిన విద్య మార్పును తీసుకువస్తుందని ఎలా ఆశించగలము?

జీవ నైపుణ్యాలు మరియు ప్రవర్తన మరియు విలువలను  అంచనా వేయడాన్ని సులభతరం చేయడానికి C.B.S.E  నిరంతర సమగ్ర  మూల్యాకనం నందు మార్గదర్శకాలను అందించారు.  మరొకవైపు ఇది కొంతమంది ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మధ్య తగాదాలను సృష్టించడమే కాకుండా పాఠశాలలలో ఘర్షణలను కూడా సృష్టించింది. సబ్జెక్టును బోధించే తరగతి ఉపాధ్యాయులు తరచుగా పిల్లల ప్రతిచర్యలను, ప్రవర్తనను మరియు స్పందన మొదలైన వాటిని గమనించడంపై దృష్టి పెట్టడం కంటే విద్యార్ధుల విద్యావిషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. అందువల్ల సవివరమైన మూల్యాంకనా పత్రమును నింపడం ఒక పెద్దపని అవుతుంది. విద్యార్ధుల రిపోర్ట్ పత్రాలనందు ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి విద్యార్ధి గురించి ఇవ్వబడిన అంశముల గురించి ఉపాధ్యాయులను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మనం కనుక విలువలతో కూడిన విద్య/ జీవన నైపుణ్యాల (VE/LS) కొరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను కలిగివుండి, వారు పిల్లలను ఒక నిర్మాణాత్మక వాతావరణంలో పరిశీలించినట్లయితే, వారి అందించే అభిప్రాయాలు అధిక విలువను కలిగివుంటాయి. మనం మిగిలిన అన్ని సబ్జెక్టులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ఉన్నప్పుడు, ఈ సబ్జెక్ట్ కొరకు ఎందుకు ఉండకూడదు?

గొప్పనాయకులు మరియు తత్త్వవేత్తలు దశాబ్ధాల తరబడి మనకు తెలియజెప్పిన దానిని మనం అనుసరించకుండా ఉంటామా? విద్యకంటే కూడా మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి ప్రాధాన్యతను ఇవ్వకూడదా? ఈ మార్పును ఆచరణలోనికి తేవడానికి దశాబ్దాలు పట్టవచ్చును కాని ఈలోపు ప్రస్తుతం ఉన్న లోపాన్ని పూరించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంకూడా ఒకటి.

వివిధ పాఠశాలలు అనగా ఆర్మీ మరియు ప్రైవేటు పాఠశాలలను కూడా కలిపి సుమారు 400 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులతో చర్చలను జరిపి ఆయా పాఠశాలలలో (VE/LS) కు సంబంధించి క్రింది పట్టిక తయారుచేయడం జరిగినది

 

సంగీతం/PT

ఆంగ్లము

విలువలతో కూడిన విద్య/జీవన నైపుణ్యాలు

వారానికి తరగతుల సంఖ్య

1-2

6+

గరిష్ఠంగా 1

ప్రామాణిక పాఠ్యాంశాలు

లేదు

అవును

లేదు

ఉపాధ్యాయుల శిక్షణ

అవును

అవును

లేదు

ప్రత్యేకంగా ఎంచుకున్న ఉపాధ్యాయులు

అవును

అవును

లేదు

సబ్జెక్ట్ నందు ఉపాధ్యాయుల ఆసక్తి

అవును

అవును

లేదు

పాఠశాల అంతటా విస్తరణ

లేదు

అవును

లేదు

 

N.C.E.R.T మరియు C.B.S.E. తమవంతు కష్టపడుతున్నప్పటికీ ఈ అంశంలో జరిగవలసినది ఎంతో ఉన్నది. దీనిలో మొదటి భాగంగా అభిరుచి మరియు నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను ఎంచుకుని వారిని VE/LS బోధించడానికి శిక్షణ అందించవలెను.

విలువలను బోధించగలమా?

ప్రస్తుతం మనదేశంలోని ప్రజల యొక్క స్థితిని చూసినట్లయితే వారి జీవితంలో  అవినీతి, హింస మరియు అసహనం అధికంగా తారసపడుతున్నవి- మన విద్యావేత్తలు విలువలను బోధించేలా కృషి చేయడానికి ఇది అతి కీలకమైన సమయం కాదా? చాలామంది ముందుగా విలువలను మనం బోధించలేము మరియు అవి సహజంగా అలవడాలి అని అభ్యంతరం తెలియజేస్తున్నారు. నా ఉద్దేశ్యం ప్రకారం ఇది ఎక్కువగా సహజంగా అలవడేదైనా బోధించడం కూడా జరగడం ముఖ్యం. విలువలను బోధన  ఆదర్శవ్యక్తులచే జరగవలెను. అదృష్టవశాత్తూ, భారతీయ సంప్రదాయం ఇప్పటికీ మన మధ్యలో మంచి ఆదర్శ వ్యక్తులను చూడగలమని నిర్ధారించినది. మనం కేవలం వారిని అనుసరించడం మాత్రం చేయవలెను.

నా ఉద్దేశ్యం ప్రకారం విలువలను మూడు కోణాలలో ఎలా బోధించాలో నేను వివరిస్తాను - తార్కికంగా, తత్త్వశాస్త్ర పరంగా మరియు వాస్తవాల ద్వారా.

తార్కిక పర భోధన - బోధించడం అంటే  ఆదేశాలను ఇవ్వడం లేదా జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని పెంపొందించడం అయితే  వీటిని  చర్చలు, పరిశోధనలు, సందేశాలు, ప్రదర్శనలు/నమూనాలు, నాటకాలు మొదలైన వాని ద్వారా జరిగినట్లయితే, ఈ పద్దతులను VE/LS బోధించడానికి ఎందుకు ఉపయోగించ కూడదు ? ఇక్కడ పరిజ్ఞాన సమాచారం విశ్వసత్యాలైన నిజాయితీ, గౌరవం, దయ వంటివి ఇక్కడ విషయాంశాలు అవుతాయి,అలాగే ఇక్కడ ఉపయోగించే పద్దతులు మిగిలిన సబ్జెక్టులకు ఉపయోగించేవే అయి ఉంటాయి.

క్రింద ఇవ్వబడిన పట్టికను చూడండి. ప్రతీ సబ్జెక్టు లాగానే విలువలను బోధించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగించవచ్చునా? చర్చా పధ్ధతిలో అన్ని సబ్జెక్టులను బోధించవచ్చా? అన్ని రకాల సబ్జెక్టులను బోధించడానికి అన్ని రకాల బోధనా పద్దతులను ఉపయోగించవచ్చును. కేవలం మోతాదులు మారుతాయి. నృత్యం లేదా సంగీతాన్ని బోధించేటపుడు అధిక సమయం ప్రదర్శనలను నిర్వహించి చర్చలపై తక్కువ సమయం వెచ్చిస్తారు. సాంఘికశాస్త్ర బోధన  విషయంలో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. విలువలను బోధించడానికి ఆంగ్ల ఉపాధ్యాయుల వలెనె పలకడం నందు సమర్ధవంతంగా ఉండి, మంచి ఆదర్శవ్యక్తిగా ఉండవలెను. దీనినే మరోలా ప్రదర్శించి చూపడమని చెప్పవచ్చును.

మనం ఏదైనా కొత్తదానిని నేర్చుకోవాలంటే ప్రయోగం మరియు అభ్యాసన కీలకం. జీవితం యొక్క నియమాలను ప్రయోగాత్మకంగా చేయకున్నా మరియు అనుసరణలోనికి తీసుకురాకున్నా విలువలను బోధించడం సాధ్యం కాదు. అందువలన అన్ని పద్దతులను వినియోగించినప్పటికీ, ప్రదర్శించి చూపడం, చర్చించడం మరియు అభ్యసించడం అనేవి విలువలను బోధించడానికి అతి కీలకమైనవి.

 

ఆంగ్లం

గణితం

సాంఘిక శాస్త్రం

PE

సంగీతం/నృత్యం

విలువలు

 

ఉపన్యాసములు

అవును

అవును

అవును

అవును

అవును

అవును

ప్రదర్శించుట

అవును

అవును

అవును

అవును

అవును

అవును

చర్చించుట

అవును

అవును

అవును

అవును

అవును

అవును

ఆటలు/కార్యకలాపాలు

అవును

అవును

అవును

అవును

అవును

అవును

అభ్యసన

అవును

అవును

అవును

అవును

అవును

అవును

 

తత్త్వపరమైన విధానం - గొప్ప శాస్త్రజ్ఞులు మరియు తత్త్వవేత్తలు బోధన గురించి ఏమన్నారో ఇపుడు మనం తెలుసుకుందాం.

శ్రీ అరబిందో ‘బోధన యొక్క మొదటి నియమం ఏమనగా దేనిని కూడా బోధించలేము’ అని చెప్పారు

స్వామి వివేకానంద ‘ ఏ ఒక్కరూ కూడా వాస్తవానికి ఇతరుల ద్వారా నేర్చుకోలేదు. ప్రతి ఒక్కరు తనకు తాను బోధించుకోవలెను. బాహ్య ఉపాధ్యాయులు కేవలం అంతరంగా ఉన్న ఉపాద్యాయుడు అంశములను అర్ధం చేసుకోవడానికి సలహాలను అందిస్తారు.’ అని పలికెను.

సోక్రటీస్ ‘నేను ఏఒక్కరికీ దేనిని బోధించలేను, కేవలం వారిని ఆలోచించేలా మాత్రమే చేయగలను’

గెలీలియో ‘ మీరు ప్రజలకు దేనినీ బోధించలేరు. మీరు కేవలం వారిలో ఆ బోధనను కనుగొనేలా మాత్రమే చేయగలరు’ అని చెప్పెను.

ఐన్‌స్టీన్ ‘నేను నా శిష్యులకు ఎప్పుడూ బోధించలేదు. నేను కేవలం వారు నేర్చుకోవడానికి కావల్సిన పరిస్థితులను అందించడానికి ప్రయత్నించాను.’ అని చెప్పెను.

అందువల్ల  నిష్ణాతులు, శాస్త్రవేత్తలు లేదా తత్త్వవేత్తలు, భారతీయులు లేదా గ్రీకులు అందరి ప్రకారం దేనిని మనం బోధించలేము. ఇది కేవలం నేర్చుకోబడుతుంది, మనం చేయవలసినదంతా దానికి తగిన సౌకర్యం కలిగించడమే. గణితం, శాస్త్రం, ఆంగ్లం, సంగీతం లేదా విలువలు ఏవైనప్పటికీ నేర్చుకొనే పద్దతి మాత్రం ఒక్కటే. అందువల్ల ఉపాధ్యాయుల యొక్క భాద్యతలు అనేకరకాలుగా పెరుగును మరియు మంచి ఆదర్శమైన వ్యక్తుల యొక్క అవసరం కీలక అవసరంగా మారును.

భౌధ్ధిక విధానం :  ఏదైనా అంశమును తనకు తానుగా నేర్చుకోనపుడు, దానిని బోధించలేమని చెప్పబడినది. అందువల్ల శాస్త్రజ్ఞులు నేర్చుకోవడం అనేది ఎక్కడ జరుగుతుందో దానిపై దృష్టి కేంద్రీకరించెను. క్రింది పిరమిడ్ స్పష్టంగా తెలిపేది ఏమనగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయిక విద్యావిధానం అంత సమర్ధవంతమైనది కాదని మరియు ప్రదర్శినలు, చర్చలను నిర్వహించడం మరియు ప్రత్యక్షానుభవాలు కలిగించడం అనేవి వాని ద్వారా మాత్రమే సమర్ధవంతమైన బోధన సాధ్యమని స్పష్టం చేస్తున్నది. విలువలను బోధించే విషయంలో చర్చించుట కన్నా ఆచరించిచూపడం (ఆదర్శవ్యక్తులు) ఉత్తమవిధానం అని నేను విశ్వసిస్తాను. అయినప్పటికీ, ఇతరులకు నేర్పడం అనేది అత్యంత సమర్ధవంతమైన నేర్చుకునే ప్రక్రియ అనేది కీలకమైన అంశము. ఇది VE ని బోధించే ఉపాధ్యాయులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల విలువలను ఒక పద్దతిలో, ఈ సబ్జెక్ట్ నందు ఆసక్తి, ఆభిరుచి, మరియు శిక్షణ పొందిన ఉపాద్యాయుల ద్వారా బోధించినట్లయితే ఇది మరెన్నో ఫలితాలను సాధిస్తుంది. కేవలం విద్యార్ధులు మాత్రమే నేర్చుకోవడం కాకుండా, దీనిద్వారా ఉపాధ్యాయులు కూడా లబ్ధిని పొందినట్లయితే దీని ఫలితాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

ఈ అంశం వాస్తవానికి విలువలను బోధించడం వీలుపడుతుందా లేదా అనే దాని గురించి కాదు. దీని ప్రధాన ఉద్దేశ్యం ఆధునిక బోధనా పద్దతుల ద్వారా విలువలను బోధించి, పిల్లలు వారి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా వారిని తీర్చిదిద్దగల మంచి ఆదర్శ వ్యక్తులను కనుగొనడమే.

పాఠశాలలు విద్యార్ధుల తల్లిదండ్రులతో చేతులు కలిపి ఆధునిక జీవన విధానం యొక్క ప్రతికూల ప్రభావాలపై పోరాడుటకు మరియు పిల్లలు తమను సతమతం చేసే తమ సమస్యలను, కనీసం వారానికి ఒకసారి  చర్చించుటకు ఒక ఆదర్శమైన వ్యక్తి అవసరం ఉన్నది అని అంగీకరించడమే  ఈ అంశంలోమొదటి సోపానం . ఇప్పటికే చాలా పాఠశాలలలో ఈ అంశాల కొరకు ఒక పీరియడ్ అందుబాటులో ఉన్నది. ఈ సమయాన్ని ఉపాద్యాయులను మరింత సమర్ధవంతంగా కావలసిన లక్షణాలతో, ఆసక్తితో మరియు అభిరుచులతో ఉన్న వారిని (ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారి నుండే) ఎంచుకుని మరియు అందుబాటులో ఉన్న వనరులను మరింత బాగా వినియోగించుటకు ఈ సమయాన్ని ఎందుకు వెచ్చించలేము? VE తరగతులను ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు ఇద్దరూ ఎదురుచూసే విధంగా ఎందుకు మెరుగుపరచలేము?

 

 

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

viluvalu  sahajamga vasthayi.

18624 registered users
7274 resources