విజ్ఞానశాస్త్ర బోధనా పధ్ధతులలో ప్రాజెక్ట్ పధ్ధతి యొక్క ప్రాముఖ్యత---- Dr.ప్రియాంక

విద్యార్థులందరూ ఆటలుఆడి పాటలుపాడి  అంతే శక్తితో, ఉత్సాహంతో తరగతిగదిలోకి  ప్రవేశించారు. కొంత మంది విద్యార్థులు ఇంకా అంతవరకు వారు ఆడిన ఆటల ధ్యాసలోనే ఉన్నారు , కొంత మంది విద్యార్థులు సేదతీరుతున్నారు  కానీ చాలా మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గుంపులో చాలా సేపటినుండి బయటకే చూస్తున్న ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు తరగతిగదికి వస్తున్నట్లు   ప్రకటించాడు.  ఉపాధ్యాయుడు తరగతిగదిలోకి వస్తూనే విద్యార్థులు అందరూ ఆమెతో  ఏదో ఒక విషయాన్నైనా చెప్పాలని చూస్తున్నారు.  చాలా కొద్దిసమయంలోనే వారందరూ ఒక సమావేశంలోలా అందరూ బృందాలుగా మారి ఒక విషయం గురించి చర్చిస్తూ, వాదిస్తూ, ప్రతివాదిస్తూ కనిపించారు. ఉపాధ్యాయుడు కూడా తొందరగా ఒక బృందంలోచేరితాను ఆ చర్చలలో పాల్గొని  మిగిలిన బృందాలలో కూడా కొద్ది సమయంలోనే పాల్గొంటానని చెప్పాడు.   ఇది అన్ని పాఠశాలలో కనిపించే సాధారణ  సన్నివేశమా లేక ఈ తరగతిగదిలోనే కనిపించిన ప్రత్యేకమైన సన్నివేశమా ? 

తొందరలోనే వారుచేస్తున్న చర్చలు,వాదనలు వారంతా  విద్యుత్తు ఆదా (కరెంటు పొదుపు)  గురించినవని తెలుస్తుంది. ఈ చర్చలను వారు క్రిందటినెలనుండి మొదలుపెట్టారు. వారు ఇందుకోసం వారంలో ఒక రోజు దీనికి కేటాయిస్తున్నారు.     

·         ఉపాధ్యాయుని సహాయంతో కరెంటు బిల్లుని అధ్యయనం చేయడం-ఎంత కరెంటుని వారు వాడారు ఎంత డబ్బులు కట్టారు మొదలైన విషయాలు .

·         ఇంట్లో ఉన్న పెద్దవారిసహాయంతో నియమిత సమయాల్లో కరెంటు రీడింగ్ ని నమోదు చేయడం

·         ఇంట్లో ఉన్న పెద్దవారిసహాయంతో  ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితాను (ఉదాహరణకు ఫాన్ల,లైట్లు, కూలర్ ,మిక్సర్ మొదలైనవి) వాటి వినియోగానికి అవసరమైన కనీసవిద్యుత్తిని  తెలుసుకోవడం.

·         ఇంట్లో ఉన్న బల్బ్ ట్యూబ్ లైట్ లను ఇంట్లో వారి ఆంగీకారంతో CFL లైట్లతో మార్చడం

·         ఉపయోగంలో లేనప్పుడు బల్బ్ ట్యూబ్ లైట్ లను  ఆర్పి వేయడం, సాకెట్ నుండి టివీ కంప్యూటర్ మొబైల్ ఫోన్ వాటి ప్లగ్ లను తీసివేయడం  మొదలైన పధ్ధతులు పాటించి  విద్యుత్ ని ఆదాచేయడం

·         ఇంట్లోని ఏ ఎలక్ట్రానిక్ ఉపకరాన్ని  రోజూ ఎంత సేపు వినియోగిస్తారు, ఎంత విధ్యుత్ అవసరమౌతుందనే  విషయాలను నమోదు చేయడం.  ఉదాహరణకు 3 బల్బ్లు  6 గంటలు  సమయం పాటు ఉపయోగించడం 200 వాట్ల కరెంటు.

·         ఈ నమోదు వివరాలను తోటి మిత్రులతోనూ ఉపాధ్యాయునితోనూ  నిర్ణీత వ్యవధుల్లో పంచుకోవడం

·         వారు నమోదుచేసిన వివరాల ప్రకారం ఎంత విద్యుత్ వినియోగించారో కనుగొని ఎంత బిల్ అవుతుందో లెక్కపెట్టడం

గడచిన నెల బిల్లుని రాబోయే నెల బిల్లుతో పోల్చి ఈ క్రింది విషయాలను చర్చించడం

·         మీరు లెక్కపెట్టిన యూనిట్లకు బిల్లులో ఉన్న యూనిట్లకు తేడా ఉందా ?సరిపోయిందా ?

·         సరిపోతే  కారణాలేమిటి ?

·         ముందు బిల్లు కంటే ఈ బిల్లు  తక్కువా ఎక్కువా ?

·         విద్యుత్ ఆదాచేయడానికి సూచించిన పధ్ధతులను పాటించడానికి ఏమైనా కష్టపడ్డారా ?

·         ఆ కష్టాలేమిటి?

·         ముందుకు కూడా ఇలాంటి పధ్ధతులనే పాటిస్తారా, లేకపోతే  ఎందుకు ?

·         ఒకరోజుకు ఒకఇంటికి సరసారిన ఎంత విద్యుత్ అవసరమో లెక్కపెట్టడం

·         వీటి వివరాలను ఒక పట్టికరూపంలో తయారు చేసి తరగతి వారీగా బృందాల వారీగా ప్రదర్శించడం

·         వీరు ఇలా తలసరి విద్యుత్తు అంశాల పైనే ప్రాజెక్టుని నిర్వహిస్తున్న ఇతరపాఠశాలల విద్యార్థులతో  (ఇతర దేశాలతోపాటు )వారు కనుగొన్న విషయాలను పరస్పరం మార్చుకోవడం మరియు  పోల్చిచూడడం

·         రెండు బిల్లులను ?  ఒక దానితో మరొకటి పోల్చి కనుక్కోవచ్చు.

కానీ పైలా చేయడం వలన ఉపయోగం ఏంటని  ఎవరైనా అడగవచ్చు లేదా ప్రశ్నించవచ్చు. ఇలాంటి కృత్యాల వలన విద్యార్థులు ఎలా విద్యుత్ కి సంభందించిన భావనలను, నియమాలను సూత్రాలను జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకొంటారు? దీనిని  మరోరకంగా ప్రశ్నిద్దాం ?  మనకు మనమే కొన్ని ప్రశ్నలు వేసుకొందాం ?

ఈ కృత్యం యొక్క లక్ష్యం ఏమిటి?  ఈ అభ్యాసం వలన విద్యార్థులలో ఎలాంటి అభ్యసనాన్ని నీవు ఆశి స్తున్నావు ? ఎంచుకొన్న బోధనాభ్యసన ప్రక్రియ విజ్ఞానశాస్త్ర విషయ స్వభావానికి, విజ్ఞానశాస్త్ర  అధ్యయన లక్ష్యాలకు, సాధారణ విద్యా లక్ష్యాలకు సరిపోతుందా ?

ఈ అంశానికి సంబంధింకి తరగతిగదిలో ఆచరించదగిన కొన్ని అభ్యాసాలను చూద్దాం

1.     పాఠ్యపుస్తకాన్ని చదివి ఆ అధ్యాయం చివరన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం

2.    విద్యుత్ ఆదా చేయడం కోసం నీవు ఆచరించే ఐదు పధ్ధతులను వ్రాయండి ? మొదలైన మరికొన్ని  ప్రశ్నలనుఅడగడం

3.    విద్యార్థులను విద్యుత్ ఆదా గురించి ఒక ప్రదర్శనను, ఒక చార్టుని లేదా ఒక చిత్రాన్ని తయారుచేసి తరగతిగదిలో చర్చించమనడం

4.    విద్యుత్ లేదా శక్తి వనరుల కొరత లేదా విద్యుత్తయారీ—ఆదా గురించి ఒక చిత్రాన్ని లేదా వీడియోను విద్యార్థులకు ప్రదర్శించడం

5.    ఒక జల విధ్యుత్ ఉత్పత్తి / లేద థర్మల్  కేంద్రాన్ని దర్శించిన తరువాత నిపుణిచే ఆ అంశంపై  ఉపన్యాసాన్ని ఇప్పించడం

6.    అంశాలను ఒక కథాలాగా మలచడం, ఒక కేస్ స్టడీ ని చర్చకోసం ఉపయోగించడం లేదా అభ్యాసకులను ప్రశ్నల ద్వారా వారిని ఈ అంశంపై ఆలోచించేలా చేయడం

7.    ఎక్కువ విద్యుత్ ని తీసుకొనే  ఉపకరణాలను తక్కువ విద్యుత్ ని వినియోగించుకొనే  ఉపకరణాలతో మార్చి విద్యుత్ బిల్లు ద్వారా పోల్చి ఒక చర్చను నిర్వహించడం

8.    విద్యుత్ ఆదా పధ్ధతులను ఒక నెలపాటు ఆచరించి వీటి గురించి తరచుగా బృందాలుగా  చర్చలు జరిపి  వీటి ని అందరికీ  తెలియచేయడం    

పైవి కొన్ని సూచనలు మాత్రామే, మీ వనరులకు, సన్నివేశాలకు, ఉపాధ్యాయుని ఆలోచనలకు  అనుగుణంగా మీ బోధనాభ్యసన పద్దతిని తీర్చిదిద్దుకోవచ్చు.  

·         ఆనందకరమైన అభ్యసనాన్ని అందించే నిత్యజీవితంలోని లాంటి సంఘటనల  స్పురణకు తెచ్చేవి  

·         అర్థవంతగా జ్ఞానాన్ని నిర్మించుకోవడాన్ని పెంచేవి

·         విద్యార్థులు తమంతట తామే వారి అభ్యసనాస్థాయిలను  తెలుసుకొనేలా

·         అంచనావేయడం , కొలచడం , దత్తాంశ నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానించడంమొదలైన నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకొని వాటిలో నైపుణ్యతను సాధించడానికి సహాయపడడం

·         పరిశీలనా, అన్వేషణ, మరియు ఆలోచనా సామర్థ్యాలను విద్యార్థులలో  అభివృధ్ధి  చెండడానికి దోహదపడడం 

·         బృందాభ్యాసనాన్ని బృంద ప్రవర్తనలను విద్యార్థులకు అందించేది

·         నిత్యజీవితంలోని  సమస్యలపట్ల  వారి దృక్పథాలను, అలవాట్లను మార్చగలిగేది, 

ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల స్థాయిలోని విద్యార్థులకోసం  పంటల ఉత్పత్తి అంశానికి సంబంధించి   కొన్ని అభ్యసనా పధ్ధతుల సంభావ్యతను అన్వేషిధ్ధాం.

1.     దగ్గరలోని వ్యవసాయదారులతో తరచూ చర్చించడం , వ్యవసాయ పనులను ఒక పంటకాలం మొత్తం పరిశీలించడం (దీని కోసం విద్యార్థులను బృందాలుగా చేసి ఒక్కొక్క బృందం ఒక్కొక్క పంటను పరిశీలించేలా చేయాలి) పంట వివిధాస్థాయిలలో వ్యవసాయ పనులను వివిధ పంటలలో సరిపోల్చడం, వారి పరిశీలలనలను నమోదుచేయడం , వీటిని మిత్రులతో పంచుకోవడం

2.    వివిధ భౌగోళిక ప్రాంతాల  నుండి వచ్చిన విద్యార్థులను వారి ప్రదేశాలల్లో ఆచరించే వ్యవసాయ  పధ్ధతులను పండించే  పంటలను పరస్పరం తెలుసుకొనేలా చేయడం

3.    ఒకొక బృందంలో 4 లేదా 5 మంది విద్యార్థులు ఉండేలా వివిధ పంటలను(ధాన్యాలు , లేదా తృణధాన్యాలు, కూరగాయలు లేదా ఒక పంటను కొందరు రసాయన ఎరువులను ఉపయోగించి, కొందరు సేంద్రీయ ఎరువులు ఉపయోగించి ) 4 మీ  4 మీ కొలతగల ప్రదేశంలో ఉపాధ్యాయుల , పాఠశాల, సమాజ సహాయంతో పంటలు పండించి  వివరాలను నమోదు చేయడం,  వారి అనుభవాలను పంచుకోవడం.

ఈ ప్రాజెక్ట్ పధ్ధతి కొత్తది కాదు ఇది 1933 Dewey మొదలు పెట్టారు.

విద్యార్థులు ప్రాజెక్టులను  చేయడానికి సమయం ఎక్కువపడుతుంది. ఉపాధ్యాయుల  సహాయం అవసరమౌతుంది. ప్రాజెక్టులు చేయడానికి ఒక నిశ్చితమైన సన్నివేశం సంఘటన కారణం ఔతుంది. ఇందులో వారు పూర్తీగా నిమగ్నం కావాల్సి ఉంటుంది, ఇది విభిన్న మైన బోధన అభ్యసనా కృత్యాలను కలిగి ఉంటుంది. ప్రాజెక్టు చివరలో మనం ఒక ఆచరణీయమైన ఫలితాన్ని  నివేదికరూపంలో గానీ లేదా ప్రణాళిక రూపంగా కానీ లేదా ఒకనమూనా రూపంలోకానీ ఆవిష్కృతమౌతుంది.   

ప్రాజెక్టు పద్దతిలో గమనించ దగిన విలువలు  ఏవి ?

ప్రాజెక్టు పద్దతి విద్యార్థులు వారి అభ్యసనాసామర్థ్యానికి  తగినట్లుగా అన్వేషించడానికి, అనుభవాలను పొందడానికి తగినన్నిఅవకాశాలను కల్పిస్తుంది. ఇది విద్యార్థులలో తమకు తెలిసిన విషయాలు ఏవి ? తెలియనివి ఏవి ? ఎలా తెలుసుకోవాలి ? మొదలైన విషయాల గురించి ఆలోచించేలా చేస్తుంది.  క్రింది పట్టిక విజ్ఞానశాస్త్ర ప్రాజెక్టు పద్దతిలో అభ్యసించదగిన విలువలను తెలియచేసేందుకు చేసిన ఒక ప్రయత్నం.

ప్రాజెక్టు పద్దతిలో అభ్యసించదగిన విలువలు

బోధనాభ్యసన  ప్రక్రియలో వీటి ప్రభావం

పిల్లలు  అర్థవంతంగా ఆలోచిస్తారు  

·         పిల్లలలో అంతర్గతంగా ఉన్న ఆసక్తిని పెంపొందిస్తుంది అర్థవంతమైన జ్ఞాననిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది

·         నివేదికలను రూపొందిచడంతో పాటు ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది

·         తరగతిగదిలో జరిగే అభ్యసనాన్ని వారి నిత్యజీవితానికి అనుసంధానిస్తుంది

·         రోజు వారి అనుభవాలను పరీక్షించడానికి, విశ్లేసించడానికి తగిన ప్రేరణనిస్తుంది

పిల్లలలో ఏర్పడిన సరికాని పూర్వకల్పనలకు(ప్రత్యామ్న భావనలను) స్థానమిచ్చి వాటిని సరిచేయడం 

·         పిల్లలలో కల పూర్వకల్పనలు వారి అభ్యసనానికి ఆధారం (పిల్లలలో పరిశీలనల వలన ఇతరులతో పరిసరాలతో జరిపే కార్యకలాపాల వలన వారికి పూర్వకల్పనలు ఏర్పడుతాయి).

·         జ్ఞాననిర్మాణ సమయంలో  వారికి ఈ పూర్వప్రకల్పనలను సరిచేసుకోవడానికి  సహాయపడడం

సామర్థ్యాలు అబివృద్ధిచెందేలా చూడడం మరియు ఆలోచనలలో సహాయ పడడం

·         స్వీయఅభ్యసనానికి, విమర్శనాత్మక ఆలోచనలకు, సమస్యాపరిష్కార నైపుణ్యాలకు మరియు పరిశోధనా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడడం

·         అభ్యాసించిన వాటికి బాధ్యతవహించడం ద్వారా అవగాహన చేసుకొన్న విషయాలకు,అవగాహన చేసుకోలేని విషయాలకు తేడా తెలుసుకొంటారు.

అభ్యసనం కోసం అభ్యసనం

·         అనుభవజన్య అభ్యసనం

·         అభ్యాసకులే అభ్యసించాల్సిన విషయాలను పద్ధతులను ఎన్నుకోవడం వలన అభ్యసనంలో నిమగ్నమౌతారు.

·         ప్రాజెక్టు పద్ధతిలోని వాతావరణం  సాంఘికనైపుణ్యాలు, విభిన్నమైన అభిప్రాయాలను  గౌరవించడం, శాస్త్రీయవైకిరి, దృక్కోణాన్ని కలిగి ఉండడం మొదలైనవి అభ్యసించడానికి దోహదపడుతుంది.

 

శిశుకేంద్రీకృత  అభ్యసనం

ఉపాధ్యాయుడు  క్రిందివాటికి సంధానకర్తగా మాత్రమే వ్యవహరించాలి

·         అభ్యసనా సామాగ్రి అందుబాటులో ఉంచాలి

·         శాస్త్రీయదృక్పథాన్ని మెరుగుపరుచు కోవాలి

·         అభ్యాసపూరక వాతావరణం ఏర్పరచాలి

·         నివేదికను అందుబాటులో ఉంచాలి   

తరగతిగది ఆవల

·         అభ్యసనం తరగతిగదిలోనే కాక  ఎల్లలుదాటి సమాజంలో కూడా జరుగుతుంది.

·         అభ్యసన ఫలితాలు, ప్రక్రియలు  సమాజానికే చేరాలి.

·         తరగతిగది ఆవల జరిగే అభ్యసనం విద్యార్థులను ఉత్తమపౌరులుగా  చేస్తుంది.

 

 

అభ్యసనం మరియు అబివృధ్ధికోసం మూల్యాంకనం

ప్రస్తుత విద్యావ్యవస్థలో  మునుపటిలా  సంవత్సరం చివరన నిర్వహించే మూల్యాంకనం స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం  జరుగుతోంది.  ఈ మార్పు మూల్యాంకనం అభ్యసనాన్ని మదింపుచేసేదిగా గాక  అభ్యసనా పద్దతులను మదింపు చేసి వాటిఅభివృధ్ధి కోసం జరిగేది. ప్రాజెక్ట్ పధ్ధతిలో జరిగే అభ్యసనం ఈ  విధానానికి ఎంతో అనువైనది. పాఠ్యాంశం చివరలో సాధారణంగా మూల్యాంకనం  జరిగినట్లు  ప్రాజెక్టుపధ్ధతిలో జరుగదు. ఈ పధ్ధతి  బయం, ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులు, పిల్లల అభ్యసనా స్థాయిని అభ్యసనా ప్రక్రియ జరుగుతుండగానే మాపనం చేయగల అవకాశాన్ని ఇస్తుంది. ఈ మూల్యాంకనం పిల్లలకు గ్రేడ్ లు మార్కులు ఇచ్చే స్థాయిని మించి  అభ్యసనా ప్రక్రియవారిలో మంచి సాంఘిక ప్రవర్తనకు, దృక్పథాన్ని అలవరచు -కోవడానికి,  విలువలను  ఏర్పరుచుకోవడానికి , సమగ్ర అభివృధ్ధికి, దోహదపడుతుంది. ఈ పధ్ధతిని  సవరించుకోవడానికి  కూడా ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది.  ఇది ఉపాధ్యాయునికి రుజువుల ఆధారంగా పిల్లల అభివృధ్ధికి దోహదపడే ప్రణాళికను రూపొందించడానికి  ఉపయోగపడుతుంది.  తోటి విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల సహాయకుల నుండి అందే సూచనలు  విద్యార్థులు తమను తాము  భావనలను అవగాహన చేసుకొనేవిషయంలోనూ, వివిధ పద్ధతులకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడంలోనూ   స్వయంగా అంచనావేసుకోవడానికి, విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, తన బలహీనతల గురించి తెలుసుకొని అభివృధ్ధి చెందడానికి  ఉపయోగపడుతుంది.

విద్యాలక్ష్యాలు, పాఠ్యాంశాలు, భౌతికవసతులు,అభ్యాసకుల అవసరాలు, ఆ ప్రాంత సంస్కృతి ఆచారాలు తమసామర్థ్యం, మొదలైన విషయాలను దృష్టిలో ఉంచుకొని  ఉపాధ్యాయులు వివిధ రకాలైన బోధనా పధ్ధతులను ఎంచుకోవాలి. ఏ ఒక్క పధ్ధతివల్లనో ఉపాధ్యాయుడు అన్ని విద్యాలక్షాలను బోధించలేడు, లేదా విద్యార్థి అభ్యసించనూలేడు.  ఈ విధంగా ఒక ప్రభావవంతమైన విజ్ఞానశాస్త్ర  బొధనాభ్యసన ప్రక్రియ ఒకటికంటే ఎక్కువ పధ్ధతుల సమ్మేళనమై ఉంటుంది. ఇలాంటి అనువైన పధ్ధతులల్లో ప్రాజెక్ట్ పధ్ధతి ఒకటి.

ఒక ముఖ్య లక్ష్యం నిత్యజీవితంలో  వారి పరిసరాలకి దగ్గగా ఉండి ఉపాధ్యాయులకు విద్యార్థులకు సమాజానికి  ఉపయోగపడే సమస్యలకు ఈ పద్ధతిలో పరిష్కారాలు కనుగొనడం ఒకటి. దీనిని సమాచారాన్ని సేకరించడం ద్వారా, తరగతిగదిలో చర్చలు నిర్వహించడం ద్వారా , ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో పరిశోధనను నిర్వహించడం ద్వారా చేయవచ్చు. విద్యార్థులలో జ్ఞాననిర్మాణానికి, విజ్ఞానశాస్రసామర్థ్యాలు, విలువలు  పెంపొండడానికి, ముఖ్యంగా నిత్యజీవిత అనుభవాల నుండి నేర్చుకోవడానికి  అవకాశాలు ఉండడం ఈ పధ్ధతిలోని ముఖ్యఅంశం.

ఘజియాబాద్ లోని DLF పాఠశాల ఈ పధ్ధతులను ఆచరించడం ద్వారా  విద్యార్థుల అభివృధ్ధికి దోహదపడుతున్నందులకు రచయిత వారికి అభినందనలు తెలియచేస్తున్నారు.   

     

 

 

 

 

 

18477 registered users
7227 resources