విఙ్ఞానశాస్త్రం మరియు విజ్ఞానం

విద్యార్థులలో సహజఙ్ఞానానికి చెందిన విషయాలే, విఙ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులందరూ ఎదుర్కొనే ముఖ్యమైన సవాలు  (దశాబ్దకాలంగా నేను కూడా వీటిని ఎదుర్కొంటున్నాను). ఒకవైపున ఒక దృగ్విషయం గురించి పిల్లలలో సహజఙ్ఞానం మంచిదే ఎందుకంటే ఇది చురుకైన మెదడుని సూచిస్తుంది.  అదే సమయంలో పిల్లలలోగల సహజజ్ఞానం మంచిది కావు ఎందుకంటే  డేవిడ్ మూరీ చెప్పినట్లు ఈ సహజజ్ఞానాలన్నీ విఙ్ఞానాశాస్త్ర అవగాహనకి విరుద్ధంగా ఉంటాయి.  ఇవి విఙ్ఞానశాస్త్ర బోధనవలన మరింత ప్రభలమౌతాయి. నాకున్న అనుభవం నుండి ఒక ఉదాహరణను చెపుతాను. ఒక రోజు  సాయంకాల సమయాన అనుకోకుండా ఒక మిత్రుని ఇంటివద్ద దాదాపుగా 12 మంది మిత్రులము సమావేశమయ్యాము. అందరూ మంచి విద్యావంతులే ఒకరిద్దరు బౌతికశాస్త్రంలో పరిశోధనాపట్టాను కూడా పొందారు.  చండ్రుడు ఎక్కడ ఉదయిస్తాడు?  అని ఆథిత్యాన్ని ఇచ్చిన మా మిత్రుడు అడిగాడు. అందిరి ముఖాలలొనూ ఆందోళన స్పష్ఠంగా కనింపించింది. చంద్రుడు అసలు ఉదయించనే ఉదయించడు అనే సమాధానంతొ పాటు అన్ని రకాలైన సమాధానాలు వచ్చాయి. ఇద్దరు మాత్రమే ధైర్యంగా  విశ్వసంబంధమైనవన్నీ తూర్పుననే ఉదయిస్తాయని అలాగే భూపరిభ్రమణం వలననే ఉదయించడం మరియు అస్తమించడం అభివ్యక్తమౌతాయని చెప్పారు. పిల్లలలో గల  సహజజ్ఞానాన్ని మరియు భావాలను దృష్ఠిలో ఉంచుకోకుండా విఙ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తే పిల్లలకు అదో అంతు చిక్కని రహస్యం  అవుతుంది.  కొద్దిరోజుల్లోనే విజ్ఞానాశాస్త్ర అభ్యసనా ప్రక్రియకు ప్రతిబంధకాలుగా తిరిగి దర్శనమిస్తాయి.  ఇది వ్యక్తులలో అగుపించే వేదాంతధోరణికి మరియు స్థితివాజ్యానికి మధ్య ఉన్న సంబంధం లాంటిది.  

వ్యక్తులు నేను,నాది అన్న భావనను కలిగి ఎల్లపుడూ వాటి అదుపులో ఉంటారు. ఈ భావన నుండి బయటపడడా నిశితపరిశీలన ఒకటే మార్గం. విషయం ఏదైనా సహేతుకత, ప్రఙ్ఞతో కూడిన సంవాదం మరియు  పరిశీలనతో మొదలయ్యే  పరిశొధననే ముఖ్యమైనవి. జాగరూకత మరియు పరిశీలనలో నిష్కాపట్యత  రెండూ వివేకానికి  ముఖ్యమైనవి.   

గడచిన రెండు సంవత్సరాలలో ఐదవ తరగతిస్థాయిలోని విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక విద్యార్థుల అంతర్ దృష్టికి   ముందే ఏర్పడిన ప్రకల్పనలను సరిచెయ్యడానికి ఒక ప్రయత్నం చేసాయి. ఈ లక్ష్యం రెండు దశలను కలిగిఉంది. ఒకటి  పిల్లలలొ ముందే ఏర్పడే ప్రకల్పనలను బృందంలోని సభ్యుల చేతనకు తీసుకొనిరావడం,రెండవది రూపకల్పన చేసిన ప్రయోగాలు మరియు పరిశీలనల ద్వార ఈ ధృగ్విషయాన్ని సరికొత్తగా చూసేలా చెయ్యడం.

నీటిలొ వస్తువులు తేలియాడడానికి సంభందించిన  దురూహలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు: బరువైన వస్తువులు నీటిలో మునిగి పోతాయి. కావున ఒక టన్ను బరువైన దుంగ నీటిలొ మునిగి పోతుందని అనుకోవడం.(సాంద్రతకు సంబందించిన సరైన  అవగాహన లేకపోవడం)

ఇనుము /లోహం ఎప్పుడూ  నీటిలొ ముని పోతుంది( ఇది నీటిని ఒక మాధ్యమంగా ఎప్పుడూ ఊహించడం వలన జరుగుతుంది అలాగే మాధ్యమం యొక్క సాంద్రతను పరిశీలనలోకి తెసుకోక పోవడం వలనకూడా ) దీనికి రూపొందించే ప్రయోగాలు పరిశీలనలు     

ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట చెయ్యవలసిన పని ఒక సరళ ప్రయోగ ఫలితాన్ని విద్యార్థులను ఊహించుకోమని  వారి ఆలోచనలను తెలుసుకోవడం. ఉదాహారణకు సరలలోలక  ప్రయోగంలోని డోలనావర్తనా కాలం మరియూ కంపనా పరిమితి మధ్య గల సంభందాన్ని వివరించడానికి ఉదాహరణగా చెప్పవచ్చు.పిల్లలకు గడియారం లోని పెండులం మరియూ ఆటమైదానాల్లోని తాడులకు సంబంధించి చాలా అనుభవాలు ఉంటాయి. ప్రదేశం విస్తీర్ణంలోని  తేడావలన ఒక పూర్తీ డొలనానికి పట్టే సమయంలో తేడాలు ఉంటాయా ? అని  పిల్లలను అడగవచ్చు. ఈ ప్రశ్నను సామాన్య భాషలో సాంకేతిక పదాజాలం ఉపయోగించకుండా అడగాలి.  ప్రదేశమేదైనా పిల్లల నుండి వచ్చే సమాధానం అవుననే. వారి సమాధానానికి వెనుకగల ఆలోచనను సులభమైన ప్రశ్నలను అడగడం ద్వారా కనుగొని వారిలోని ఆ దురూహను పోగొట్టవచ్చు.

సాధారణంగా ప్రదేశవిస్తీర్ణం పెరిగితే దూరం కూడా పెరుగుతుందనేది దాని ద్వారా సమయం పెరుగుతుందని  ఒక ఆలోచన, ఇక్కడ వారి దురూహను సరిచెయ్యడం లేదు. ఇక్కడ వారి గల ప్రకల్పనలను స్పష్ఠంగా ముందుంచడానికి  మాత్రమే సహాయపడుతున్నాము.  వేరు వేరు విద్యార్థులు అందరూ ఒక దృగ్విషయానికి సంబంధంచి  ఒకే రకమైన దురూహను కలిగి ఉండడం కూడా ఉపాధ్యాయునికి  ఒక బహుమానమే.  తరువాత ఈ విషయాన్ని అందరూ నిశితంగా పరిశీలిస్తారు. కొని సందర్భాలలో వారు  తమ అభిప్రాయాన్ని చెప్పబోయేముందే వారిలొ ఒక కొత్త ఆలోచన మొదలౌతుంది. ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ ఎత్తునుండి డోలకం విడవడం వలన ఎక్కువ వేగంగల ఇది ఎక్కువ విస్తీర్ణాన్ని తగ్గిస్తుందనే  ఆలోచన మొదలౌతుంది. ఇది ఇంకా నిజమైన ప్రయోగం పరిశీలన  ప్రారంభం జరుగక ముందే జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియఅంతా  సరికొత్త ప్రదేశంలో విద్యార్థి ఈ దృగ్విషయంపై  తన దృక్కోణాన్ని మార్చుకోవడానికే.

సరికొత్త  ప్రదేశం భావనను విబేధించడానికే. ఈ క్రొత్తదృక్కోణం ఇంకా నిర్ధారింపబడలేదు, ఇది నూతనభావన కు నాంది మాత్రమే ఇది మరోజ్ఞానానికి తెరతీస్తుంది. ఆలోచింపచేసే పాఠ్యప్రణాళిక మెదడుని వికసింపచేసి, ప్రపంచంలో చాలా లోతుగా ఉండే విషయాల వాస్తవిక అవగాహనకు దోహదపుడుతుంది. అటువంటి విషయాలను నిశితమైన పరిశీలన ద్వారామాత్రమే అవగాహన చేసుకోగలం.      

18493 registered users
7235 resources