వర్షపునీటి సంరక్షణ వ్యవస్థలు

“ఆళ్వార్”  రాజస్థాన్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది అర్థశుష్క మండలానికి చెందినది.  ఈ జిల్లా సంవత్సరంలో సరాసరి 620 మీ.మి వర్షపాతాన్ని పొందుతుంది.  ఈ జిల్లాలో కరువు పరిస్థితులు సర్వసాధారణం. 1980 సంవత్సరంలో జనాభాపెరుగుదల వలన, నీటి వినియోగం ఎక్కువవ్వడం  వలన,  వాతావరణంలో  క్షీణతవలన నీటిలభ్యత మరింత తగ్గిపోయ్యింది. ఈ జిల్లాలో భూగర్భజలం పునరుద్దరింప బడని స్థాయికి పడిపోయ్యింది. ప్రభుత్వం కూడా  ఈ జిల్లాను “Dark Zone” జాబితాలోకి చేర్చింది.  

దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు 1985-86వ సంవత్సరంలో విపరీతమైన కరువు వచ్చింది. ఈ పరిస్థితులలో TBS(Tarun Bharat Sangh)అనే స్వచ్ఛంధ సేవా సంస్థ  వారి  స్వచ్ఛంధ సేవకుల బృందం ఈ జిల్లాలో ప్రవేశించింది. వీరు గతంలో ఇలాంటి పరిస్థితి నుండి అల్వార్ జిల్లాప్రజలను బయటపడవేసిన ప్రాచీనపధ్దతైన Johad ని(నీటి సంరక్షణకోసం భూగర్భంలో నిర్మించిన Checkdam లాంటి నిర్మాణం) తిరిగి ఉపయోగించడం మంచిదని భావించారు.  ఈ పనిని చేపట్టడానికి ప్రజలతో చర్చించడం, వారిని ఒప్పించడం మంచిదని భావించారు. ఇది అంత సులభమైన పని కాదు. తరువాత కాలంలో ప్రజలతో ఈ విషయాన్ని చర్చించడం కన్నా ఆచరించి చూపడం మంచిదని TBS భావించి గోపాలపుర  గ్రామంలో ముందే ఉన్న johadని పునరుద్దరించడం మొదలుపెట్టారు.

ఈ విషయంలో TBS సంస్థ పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించారు. ప్రజలు నిదానంగా చర్చలల్లోనూ Johadలను పునరుద్దరించడంలోనూ పాల్గొనడం మొదలు పెట్టారు. ఈ సందేశాన్ని ప్రాంతమంతా వ్యాపింపచెయ్యడానికి TBS వారు Paani Yaathra లను నిర్వహించారు. 

నీటిసేకరణకు సంబంధించిన ఈ అనుభవాలను ప్రజలతో పంచుకొనేదుకు ప్రతిసంవత్సరం 30 నుండి 45 రోజులపాటు ఈ Jalayaathraaలు నిర్వహించేవారు. ఈ యాత్రలలో “వాననీరు”  మరియు పర్యావరణ సంరక్షణ కోసం పురాతనపధ్ధతుల గురించిన సమాచారాన్ని అందించేవారు. ఇప్పుడు దాదాపు 4000 Johad లను సమాజ సంపదగాభావించి ప్రజలే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాలలో వీటినిర్మాణానికి అవసరమైన 90% డబ్బుని ప్రజలే సమకూర్చారు. ఈ మొత్తం ప్రక్రియలో TBS ఒక  ప్రేరకురాలి  పాత్రను నిర్వహించింది.

Johadల నిర్మాణం వలన ప్రజలమనోభావాలలో వచ్చిన మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీని వలన సంవత్సరమంతా ప్రజలకు, పశువులకు అవసరమైన నీరు అందుబాటులో ఉండేది. అంతేకాకుండా పంటల దిగుబడిలో పెరుగుదల ఉండేది. నేల క్రమక్షయం తగ్గింది. ఈ చర్యలవలన  “అరవన్” (Araven) మరియు  “రూపరేల్”  (Ruparel) నదులకు తిరిగి  జీవం వచ్చింది. ఈ రెండు జీవనదులు 1980 వ సంవత్సరకాలంలో సంభవించిన  కరువువలన ఎండిపోయ్యాయి. వ్యవసాయం విస్తృతమయ్యింది. ఈ నిరంతరశ్రమ వలన Dark zone ఆళ్వార్ జిల్లా ఇపుడు  Water Surplus Zoneగా మారింది. 

Source: Mamta Pandya and Meena Raghunathan, Towards Sustainability—Learnings from the Past, Innovating for the Future, (2002); Ministry of Environment and Forests, New Delhi Photograph: Farlwl Contracto

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

ఈ విధముగా మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కరువు జిల్లాలో ఆ సంస్థ చేస్తే మన రాష్ట్రము సస్యశ్యామలం అవుతుందని ఆశిద్దాం.మీకు ఈ విషయమును తెలియ జేసినంధులకు కృతజ్ఞతలు.

18627 registered users
7275 resources