మన సమాజానికి చేటు- భ్రూణహత్యలు

విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికవిజ్ఞానముల యందు పురోగతిని తప్పుకారణాలకు ఉపయోగించడం జరుగుతోంది .అతిసున్నితమైన అధికధ్వనులనుపయోగించి శరీరలోపాలను కనుక్కోనే అల్ట్రాసోనోగ్రఫీ పద్ధతినే ప్రస్తుతం తల్లిగర్భంలో పెరుగుతున్న పిండలింగనిర్ధారణ కోసం ఉపయోగిస్తున్నారు.  తల్లితండ్రులు పుట్టబోయే శిశువుయొక్కలింగనిర్దారణ పరిక్ష చేయించుకొని,అమ్మాయనతెలిసినచో  గర్భస్రావం చేయించుకుంటున్నారు. దీనివల్ల దేశంలో  లింగనిష్పత్తి  చెదరడమే కాకుండా ఇది సమాఙంలో ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నది. ఎందుకు ఇలాంటి క్రూరమైనచర్యలను చేస్తున్నారు ? ఈ ప్రశ్నకు సమాధానం కూడా సమాజంలోనే ఉంది.   

భారతసమాజంలో మహిళల ఆధారతత్వము,వారికితగినంతస్వేచ్ఛ లేకపోవడంవలన పురుషునికి ఆడవారిపై కొంత ఆధిపత్యాన్ని ఇస్తోంది. ఇదే తల్లితండ్రులు ఆడపిల్లలకు జన్మనివ్వడానికి భయపడుతున్నారు. లోపించడం  వల్ల  పురుషు ని యొక్క పాత్ర ఆడ వారి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వలన తల్లితండ్రులకు అడశిశువులను జన్మనివ్వడానికి భయం రెకెత్తిస్తుంది. పూర్వకాలంనుండి తల్లితండ్రులు అడశిశువుకి జన్మనిచ్చాక యుక్తవయస్సులొ మంచివరుడికిఇచ్చి కళ్యాణంచేయడానికి తల్లితండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు, అలాగే ఆడశిశువులను భారముగానే తలచుచున్నారు. ఇది ఎంత లోతుగా ఆడపిల్లలు ఆలోచనలలో పాతుకుపోయిందంటే, పెళ్లవగానే ఆడపిల్లలు తన ద్యాసంనంతా   సులభంగా  తన భర్తమరియు కుటుంబంమీద కేంద్రికరించగలదు. అడపిల్ల తల్లితండ్రులు, భారీగావరకట్నం ఇవ్వాలి,  అంతేకాక తదనంతర కాలంలోకూడా వియ్యంకులవారి  కోరికలను ఆమోదిస్తునే ఉండాలి. ఇదంతా తమకూతురు  వేధింపబడకుండా  ఉండడానికే  చేస్తున్నారు. కానీ ఇవన్ని అబ్బాయికి వర్తించవు. ఎందుకంటే అబ్బాయిలను భారముగా భావించడం లేదా అబ్బాయిలకు కట్నంఇవ్వాల్సిన అవసరంకానీ వధువు కుటుంబంపై  దృష్టినుంచాల్సినఅవసరం కానీలేదు. మన సమాజం అమ్మాయికి, అబ్బాయికి మధ్య వ్యత్యాసం  సృష్టించింది. రాబోయే నంవత్సరాలలో మనసమాజము మహిళల ప్రయోజనం కోసం కృషి చేస్తుందని ఆశిస్తే దానికి ప్రతికూలంగా జరిగినది. మరితల్లితండ్రులు  అడపిల్లలు   కావాలలని ఎందుకనుకొంటారు?

ఆడపిల్లలుగా  ఉండడమే భారతసమాఙంలో  ఒకశాపం.  ఆడశిశువుల మరణాలశాతం కూడా చాలా ఎక్కువ. తల్లితండ్రులు  ఆడపిల్లల  ఆరోగ్యసంరక్షణ మరియు ఆహారముల నిబంధనల  పట్ల  చూపించే  వ్యత్యాసమే    దీనికంతటికీ కారణం.  సంపన్నుడు లేదా బీదవాడు మరియు  అక్షరాస్యుడు లేదా నిరక్ష్యరాస్యుడు అన్న తేడా లేకుండా పురుషాధిక్యత ఒక వ్యాధిలాగా వ్యాపించింది.  కొడుకు యొక్క విలువ ఎంతగా పెరిగినది అంటే తదుపరి పుట్టబోయే శిశువు కుమారుడు అని ఆశిస్తు,  ఇద్దరు లేదా ముగ్గురు కుమార్తెలను కలిగి ఉన్న తల్లిదండ్రులను చూడడం చాలా సాధారణమైన విషయం.    దీనివల్ల భారతదేశపు జనాభా చాలవరకు  పెరిగింది.

2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది  పురుషులకి 933 మంది స్త్రీలు ఉన్నారు. 1981 నుండి 1991 వరకు స్త్రీ మరియు పురుషుల నిష్పత్తి 18 శాతం తగ్గినప్పటికి 1991 నుండి 2001 వరకు 6 శాతం అభివృద్ది చూపిస్తున్నది. ఈ సంఖ్యలన్నీ భారతదేశంలోని భ్రూణహత్యలను వివరిస్తున్నది.  ఉత్తరభారత దేశంలోని మహారాష్ట్ర , ఢిల్లీ , పంజాబ్, హర్యానా మరియు  గుజరాత్ రాష్ట్రాలలో నిష్పత్తి భారీగా తగ్గినది. పంజాబ్, హర్యానా మరియు గుజరాత్ రాష్ట్రాలలో ప్రతి1000 మంది పురుషులకు  స్త్రీ సంఖ్య బొటాబొటిగా 874, 861 మరియు 921 గాఉంది. కేవలము కేరళ అనే రాష్ట్రములోనే ప్రతి 1000 పురుషులకు 1058  స్త్రీలు కలరు. నా  వ్యగ్తిగత భావన ప్రకారము కేరళలో ఆడపిల్లల కుటుంబ సభ్యులు పూర్వికుల ఆస్తిని పొందుతారు కనుక ఆడపిల్లలు ఆర్ధిక స్వతంత్రం పొంది ఉంటారు.

ఇటీవలి ఐక్యరాజ్యసమితి వారి UNICEF సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారము లింగవివక్ష ఫలితంగా 50 మిలియన్ల అమ్మాయిలు మరియు మహిళలు భారతదేశపు జనాభాసంఖ్యలో లేరు. రోఙుల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఆడశిశువులను గుడిమెట్ల దగ్గర లేదా చర్చిలలోను వారి తలరాతలను దేవుడికే వదలివేస్తూ వదలివెళ్ళిన సందర్భాలు ఎన్నోఉన్నాయి. అలాగే పిల్లలులేని వాళ్ళకి ఆడశిశువులని అమ్మడం కూడా జరుగుతున్నది.

అనేక నంవత్సరాలుగా భారత సమాజము చాలా మార్పుచెందుతోంది ఇంతేవేగంగా స్త్రీలఅభ్యున్నతి జరగడంలేదు ఇది చాలానెమ్మదిగా జరుగుతున్నది. మహిళల స్థితిగతులనుమార్చడానికి మరియు  స్త్రీపురుష నిష్పత్తి మెరుగుపరచడానికి భారతప్రభుత్వం చాలాకార్యక్రమాలను మొదలుపెట్టిది. ప్రస్తుత ధోరణి,  మానవహక్కులసంస్థల మరియు ప్రభుత్వంనుండి, స్వచ్ఛంధసేవాసంస్థల మేధావులు,మతపరమైన  సంస్థలయొక్క ఆగ్రహానికి గురిఅయినది. ప్రభుత్వం జనన పూర్వ సెక్స్ నిర్ధారణ పరీక్షలను నిషేదించినది.  లింగనిర్ధారణ పరిక్షలకోసం జన్యుపరమైన సలహాలకేంద్రాలకు, వ్యాధినిర్ధారక ప్రయోగశాలలకు, స్త్రీవ్యాధులనిపుణురాలను సాంప్రదించే వ్యక్తులకు, ఇందుకు  సహకరించే నిపుణులకు పేర్కొన్న సంస్థలకు భారతదేశ శిక్షాస్మృతి23(3) విభాగముప్రకారం మూడు సంవత్సరాల ఖైదు మరియు 10,000 రూపాయల  జరిమానా విదించబడుతుంది.  

 దురదృష్టవశాత్తు ఈ న్యాయచట్టాలు ఆచరణకు నోచుకోవడంలేదు. అపరిపక్వతభుద్ధి కలవారు, వృత్తి -నిబధ్ధతలేని వైద్యులు, శస్త్రచికిత్సలో వైద్యులకు సహాయాకులుగా వ్యవహరించేవారు ఈ భ్రూణహత్య హత్యలకి పాలుపడుతున్నారు. ఈ భ్రూణహత్యలు పలువ్యాధులకు దారితీస్తున్నది. తరచు గర్భస్రావాల వలన మహిళల్లో శారీరకసంబంధ వ్యాధులు ముఖ్యంగా హృదయసంబంధ వ్యాధులు వచ్చేఅవకాశంఉంది.  దీని వల్ల హానికరమైన మానసికప్రభావాలు కలుగుతాయి. స్వచ్ఛంద గర్భస్రావం అనేది తల్లికి కూడా మానసికమైన  భాదాకరమైన సంఘటన. ఏతప్పుతెలియని గర్భంలోని ఆడపిల్ల పుట్టక ముందే చంపబడుతోంది.  పర్యవసానముగా స్త్రీ హింస సాధారణం అయింది. దీని కారణంగా మహిళలు కష్టాలకు గురి అవుతున్నారు.

1998 సంవత్సరంలో, మానవహక్కులప్రకటన’ యొక్క 50వ వార్షికోత్సవంలో భాగంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగాలింగఆధారితహింసనిర్మూలించాలని,ఈ సమస్య వైపు ప్రజల వైఖరిని  ప్రభావితం చేయడమే లక్ష్యం గా ఒక ప్రచారకార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడశిశువుల భ్రూణహత్య దేశంఅంతటా వ్యాపిస్తున్నఒక సామజికసమస్య ,ఇది మహిళాహింసపై తీవ్రమైన అభివ్యక్తీకరణ.  "జీవించడం ఒక్క హక్కు" అనే ప్రాధమిక హక్కును ఆడపిల్లలకు ఇందువల్ల నిరాకరింపబడుతున్నది.

 ఈతరం వారు తీవ్రమైనసమస్య గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎప్పుడో నిషేధం విధించిన వరకట్నం ఇకనైనా కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.   మహిళలకి  వృత్తిశిక్షణను   పేదపౌరులకి ఉచితసలహాసూచనల కేంద్రాలను ఏర్పరచాలి. గుణాత్మక ఉచిత పూర్వప్రాథమిక విద్యాకేంద్రాలను ఆడపిల్లలకోసం విస్తృతంగా స్థాపించాలి. దీని వలన మహిళలకి ఉద్యోగఅవకాశాలు కూడా కల్పించబడుతాయి. ఆడశిశువుల భ్రూణహత్యల గురించి మహిళలకు అవగాహన కలిపించవలయును. గర్భస్రావాలను వైద్యకారణాల కోసంమాత్రమే చట్టబద్ధం చేయాలి. అనగా కుటుంబనియంత్రణ చర్యలు విసృతంగా అందుబాటులో ఉండాలి. లేకపోతే దీని అమలు అవాంఛిత ఆడశిశువు పై పెరిగిన  తల్లిదండ్రుల దౌర్బాగ్య స్ధితికి కారణమౌతుంది. ఆడశిశువుల భ్రూణహింస మరియు అమ్మాయి మనుగడ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి జనన ధృవీకరణ మరియు మరణధృవీకరణ పత్రము రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వము ప్రతినెలా స్త్రీ,పురుషుల నిష్పత్తిని  పర్యవేక్షణ చేయాలని Registrar General of India నిర్దేశించినది.   

భ్రూణహత్య, మనసమాజంలో ఒక్కభాగంగా ఉన్నవారే చేస్తున్నారు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే కొడుకుని ఆస్థిలా బావించడం కూతురుని బరువులాగా బావించడం. మన ఆలోచనలోనే మార్పురావాలి , మనం అమ్మాయి లేక అబ్బాయి, పురుషుడు లేక స్త్రీ పై ఉండె దృక్కోణం మార్చుకోవాలి. అమ్మాయిలని అబ్బాయిలని,పురుషులని స్త్రీలని సమాన దృష్టితో చూడనంతవరకు భ్రూణహింస మనసమాజంలో కొనసాగుతూనే ఉంటుంది.  ఈ జన్మించని పిల్లలు మనకు మన దేశానికి ఎంతో ఆనందాన్ని  మరియు కీర్తిని ఇవ్వగలరు. వాళ్ళు వైద్యులు,పరిశోధకులు లేదా విమాన చోదకులో అవ్వగలరు అంతేకాక మంచి భార్యలు మంచి తల్లులు అవ్వగలరు.  

ఈ విధంగా మనం భ్రూణహత్యలు సమాజంలో  భూతంవలె వేధిస్తున్నాయి కావున మన అందరము కలిసి కట్టుగా పొరాడవలెనని నిర్ధారించవచ్చు.

 వారికి నిరూపించుకోవడానికి మరియు జీవించడానికి  ఒక అవకాశం ఇవ్వాలి.

 మమల్ని కాపాడండి , మిమల్ని మీరు కాపాడుకోండి. 

 

18618 registered users
7273 resources