భాషాబోధనలో తోలుబొమ్మల ఉపయోగం-- ప్రేమా డేనియల్

పిల్లల అభ్యసనంలో భాష చాలా కీలకపాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం పిల్లలకు మాతృభాషతో పాటు ఇతరబాషను కూడా  తొలినాళ్ళలోనే పరిచయం చేస్తున్నారు. ఆంగ్లభాషాభ్యసనం జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి  దోహదపడుతుందని చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకే  పంపుతున్నారు.

పిల్లలకు ఆంగ్లభాష తెలియకపోతే చాలా సందర్భాలలో వారిని ఉపాధ్యాయులు మందమతులగానూ, తక్కువ IQ కల పిల్లగానూ చూస్తున్నారు. ఆంగ్లభాషను త్వరగా నేర్పాలనే ఆతృతతో ఉపాధ్యాయులు తరచుగా ఐదారు మార్లు ఐదో ఒక విషయాన్ని వ్రాయమనడం,సూచనలను ఆంగ్లంలో చెప్పడం వలన ఏదో ఒక విధంగా పిల్లలకు ఆంగ్లం వస్తుందని అనుకొంటున్నారు.  

భాషాభ్యాసనానికి ఉత్తమ పధ్ధతి Language Experience Approach పధ్ధతి ఇందులోని ముఖ్యాంశాలు 1. చలనాత్మక కౌశలాలు 2. దృశ్య విచక్షణ 3. శ్రవణ విచక్షణ, ఈ మూడు భాగాలు 4 ముఖ్యమైన  భాషానైపుణ్యాలైన వినడం,మాట్లాడడం, చదవడం మరియు వ్రాయడం అభివృధ్ధి చెండడానికి దోహదపడుతాయి. ఈ భాషాబోధనా పధ్ధతిలో తోలుబొమ్మలను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు.

తోలుబొమ్మలే ఎందుకు ?

ఉపాధ్యాయుడు తరగతిగది లో భాషా బోధనకోసం ఏదైతే చేయగలడో అవన్నిటిని తోలుబొమ్మలు కూడాచేయగలవు ! తోలుబొమ్మలు నృత్యం చేయగలవు, పాడగలవు, మాట్లాడగలవు, చదవగలవు వ్రాయగలవు మరియు బోధించగలవు కూడా. తోలుబొమ్మలు తరగతిగదికి సహజత్వాన్ని అందిస్తాయి.

దీని ద్వారా పిల్లలు

·         ఒకరితో మరొకరు చక్కగా సంభాషించగలరు, వినేనైపుణ్యాన్ని అభ్యాసం చేయవచ్చు, మంచి సాహిత్యాన్ని ఆనదించడమే కాక అభినందిస్తాడు కూడా, వ్యాకరణదోషాలు లేని చక్కని భాషని ఉపయోగిస్తారు, తమ భావాన్ని సహజంగానూ  సులువుగానూ  వ్యక్తపరుస్తారు.        

·         తోలుబొమ్మతో పాటు లిపిని ఉపయోగించినట్లైతే వ్రాయడం కూడా నేర్చుకొంటారు.

 

తోలుబొమ్మలు పిల్లలకు సజీవమూర్తులుగా అనిపిస్తాయి పిల్లలు చాలా ఆనందంగా వాటికి స్పందిస్తారు.  చాలా మంది ఉపాధ్యాయులు ఆంగ్లాన్ని మాతమే మాట్లాడే తోలుబొమ్మలను కలిగి ఉంటారు. వీటిని సమర్థవంతంగా ఉపయోగించి పిల్లలు కూడా  ఆంగ్లాన్ని మాట్లాడేలా చేస్తారు.  పిల్లలు తమ మిత్రుల పేర్లను, వయస్సుని, వారి ఇష్టాలను,  అయిష్టాలను తెలుసుకోనేందుకు తోలుబొమ్మలు ఉపయోగపడుతాయి ఈ విధంగా సమాచార వినియయాన్ని, ప్రోత్సహిస్తాయి. 

తోలుబొమ్మలను, కబుర్లు చెప్పడానికి పాఠ్యాంశాన్ని పరిచయం చేయడానికి, ఆదేశాలు ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. వీటిని పాటలు పాడడానికి, సాధారణ సంభాషణలు జరపడానికి, నాటకాలు ప్రదర్శించడానికి ఉపయోగించవచ్చు.  

Stage పై ప్రదర్శించడానికి కష్టమైన దయ్యాలు, డైనొసార్లను కూడా ఆసక్తికరమైన తోలుబొమ్మలలాగా తీర్చిదిధ్ధవచ్చు. వీటిని మీరు చెప్పే కథలలో ఉపయోగించి వచ్చు లేదా పిల్లలే వీటిని ఉపయోగించి కొత్త కథలను చెప్పవచ్చు.

తోలుబొమ్మలను ఉపయోగించడానికి కూడా నాటకాలను ప్రదర్శించడానికి అవసరమైన వివిధ రకాలైన గొంతుకలు  అవసరమౌతాయి. తోలుబొమ్మలాట కళాకారులు కొన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు  వారి సంభాషణలకు అనువుగా వారు తోలుబొమ్మల నోటిని కదిలించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాటిని నిశ్చలంగా కదలకుండా ఉంచాల్సి ఉంటుంది లేదా వాటిని వివిధ రకాలుగా కదిలించ్చాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల ప్రేక్షకులు సహజంగా తోటి విద్యార్థులే అయిఉంటారు కావున  వారు తోలుబొమ్మలను వారి నాటకాలను ఆసక్తికరంగా మార్చడానికి అవసారమైన  కదలికలను నిర్వహించగలిగితే చాలు.    

తోలుబొమ్మలను తయారుచేయడం:  

తోలుబొమ్మలను తయారుచేయడానికి  పిల్లలు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. బయట కొన్న తోలుబొమ్మలకంటే  ఉపాధ్యాయులు లేదా పిల్లలు  తోలుబొమ్మలను తయారుచేయడం వలన  రెండు లాభాలు ఉన్నాయి. మొదటిది ఈ తోలుబొమ్మల తయారు చేసే ప్రక్రియ  పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. రెండవది వారికి కావల్సిన పాత్రలను వారు రూపొందించుకోగలరు. మనుష్యుల తోలుబొమ్మలు చేయడం కంటే జంతువుల తోలుబొమ్మలను తయారు చేయడమే సులభంగా ఉంటుంది.

ముందే తెలిపినట్లు తోలుబొమ్మ తయారీ ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.  తరగతిగదిలో తరువాత నిర్వహించబోయే కృత్యాలకు  ఈ తోలుబొమ్మే  ముఖ్యపాత్రను  నిర్వహిస్తుంది.

ప్రభావవంతంగా తరగతిగదిలో తోలుబొమ్మలను ఉపయోగించడం  

·         ముందే బోధించిన భావనను లేదా కృత్యానికి పునరాభ్యాసం చేయించడానికి లేదా ఒక కొత్త భావనను, లేదా ఒక  కృత్యాన్ని పరిచయం చేయడానికి తోలుబొమ్మలను ఉపయోగించవచ్చు. పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు తోలుబొమ్మను నిలకడగా ఉంచండి. మీరు మాట్లాడుతున్నప్పుడు తోలుబొమ్మవైపు చూడండి. తోలుబొమ్మ పిల్లలతో మాట్లాడుతున్నపుడు దాని నోరుని, శరీర భాగాలను అనుగునంగా కదిలించండి. మరో సారి గుర్తుంచుకోండి. ఇతరులు కానీ లేదా మరోతోలుబొమ్మ మాట్లాడుతున్నప్పుడు ఈ తోలుబొమ్మని నిశబ్ధంగా ఉంచాలి.

·         కొన్ని తోలుబొమ్మలను ప్రత్యేకంగా ఉపాధ్యాయుడే తరగతిగదిలో ఉపయోగిస్తాడు, ఇవి పరిమాణంలో కొద్దిగా పెద్దవిగా ఉదవచ్చ. వీటిని తరగతి mascot గా పెట్టవచ్చు. ఇవి తరగతిగదిని ఆసక్తికరం చేయవచ్చు లేదా తరగతిగది వాతావరణానికి బయపడి అదృశ్యమైనా అయిపోవచ్చు.

·         తరగతిగదిలో తోలుబొమ్మల  తయారీ పిల్లలకు ఉత్తేజం కలిగించినా కొంత  గందరగోళంగా ఉంటుంది. పిల్లలు బృందాలుగా ఈ కృత్యాన్ని నిర్వహించవచ్చు లేదా ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు.

·         తోలుబొమ్మలను వీలైనంత సృజనాత్మకంగా తయారుచేయడానికి వారికి తగినంత అవకాశం కల్పించండి.

తోలుబొమ్మలను ఉపయోగిస్తూ తరగతిగదిలో సంభాషించడం

·         తోలుబొమ్మనే ఒక పాఠ్యాంశాన్ని బోధించమనండి.  పిల్లలను తోలుబొమ్మను ఆంగ్లంలో ప్రశ్నలను అడగమని చెప్పండి. తోలుబొమ్మ కూడా పిల్లను ఆంగ్లంలో ప్రశ్నలు అడగవచ్చు.  ఈ ప్రశ్నలను ఉపాధ్యాయుడు నల్లబల్లపై వ్రాయవచ్చు. 

·         ప్రతివిద్యార్థిని అతనికి ఇచ్చిన సామాగ్రితో 30 నిమిషాలలో ఒక తోలుబొమ్మను తయారుచేయమని చెప్పండి. ఈ ప్రక్రియలో భాషను ఉపయోగించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ ఆ బొమ్మ చాలా అద్భుతంగా ఉంది, ఇది ఆ బొమ్మ తలనా ? ఇవి కాళ్ళా  మొదలైనవి.

·         పిల్లలు తోలుబొమ్మలను తయారుచేసిన తరువాత ఒకరి తోలుబొమ్మలను  మరొకరికి చూపి వాటి గురించి మాట్లాడవచ్చు.

·         పిల్లలు తోలుబొమ్మలను తయారుచేసిన తరువాత వారిని వృత్తాకారంలో కూర్చోపెట్టి వాటి సహాయంతో ప్రక్కవిద్యార్థితో మాట్లాడమని చెప్పండి.  సంభాషణలో అడ్డంకులు ఎదురైతే  వారికి సహాయపడండి.

·         విద్యార్థులు తరగతిగది అంతా తిరగుతూ ఒకరి తోలుబొమ్మల గురించి మరొకరు తెలుసుకొంటారు.

·         ఇపుడు ప్రతి విద్యార్థి తాను చేసిన తోలుబొమ్మను  చిత్రించి దాని గురించి వ్రాయాలి.

·         ఈ విధంగా తయారుచేసిన తరువాత వారు ఒక నాటకాన్ని ప్రదర్శించవచ్చు.  ఇందుకు కావలసిన కథను మీరు సూచించవచ్చు.

చేతికి తొడుక్కోగల  పక్షుల తోలుబొమ్మలు

వీటిని ఈ క్రింది గేయాన్ని చెప్పడానికి ఉపయోగించవచ్చు

"Two little blackbirds sitting on a hill.

One named Jack and one named Jill

Fly away Jack, fly away Jill

Come back Jack, Come back Jill."

        [Traditional folk song]

ఇందుకోసం ఒక చేతికి ఒకటి చెప్పున రెండు చేతితో ఆడించగల  పక్షుల తోలుబొమ్మలు అవసరం. ఈ పక్షుల తోలుబొమ్మలను  ముందుకు తీసుకొని వస్తూ వెనుకకు జరుపుతూ  గేయాన్ని అభినయించాలి.

ఈ గేయాన్ని వ్యతిరేక పదాలు బోధించడానికి ఉపయోగించవచ్చు. పక్షులపేర్లను మొదటి లైను చివర పదాన్ని మార్చి చెప్పవచ్చు

…bell. Sick-Well,

…kite. Heavy-Light,

…park, Light-Dark,

…gate, Love -Hate

…bend, Start-End..  

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

18336 registered users
7154 resources