బ్లూమ్స్ వర్గీకరణ- పరిచయం

మనం  ఏ విషయాన్ని పిల్లలకు, ఎందుకోసం బోధిస్తాం? తరగతిగది బోధనా లక్ష్యాలను, సమీకృత అభివృధ్ధితో బాధ్యతలు తెలిసి క్రియాశీలకంగా ఉండే పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా గల విద్యాలక్ష్యాలతో పోల్చినప్పుడు  తరగతిగది బోధనా లక్ష్యాల పరిధి తక్కువగా అనిపిస్తుంది. విద్యార్థులలో భౌధ్ధికసామర్థ్యాలను, సాంఘిక వివేచనను, క్రియాశీలక నైపుణ్యాలు, భావోద్వేగాలు, వైఖరులు, విలువలను అభివృధ్ధి చేసేదే సమగ్రవిద్య.  1950 సంవత్సరంలో Benjamin Blooms విద్యాలక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు, అవి జ్ఞానాత్మకరంగం, భావాత్మకరంగం మరియు  చలనాత్మక రంగం.  ఈ రంగాలలో ఉన్నతస్థాయి నైపుణ్యాల అభ్యసనం ఆ రంగంలోని తక్కువ స్థాయి నైపుణ్యాలను అభ్యసనం ఆధారపడి ఉంటాయి. ఈ మూడు రంగాలకు సరైన ప్రాముఖ్యతనిచ్చి సమీకృతవిద్యను అందించేలా విద్యావేత్తలకు ప్రేరణ కలిగించడమే  బ్లూమ్స్ వర్గీకరణ ముఖ్యలక్షణం.

 

జ్ఞానాత్మక రంగం

ఒక అంశానికి సంబంధించిన  అవగాహన, జ్ఞానం, మరియు విమర్శనాత్మక ఆలోచన  మొదలైన నైపుణ్యాలన్నీ ఈ జ్ఞానాత్మక రంగం క్రిందకి వస్తాయి. సాంప్రదాయ బోధనాపధ్ధతులు ఈ రంగంలోని సామార్థ్యాలకు ముఖ్యంగా తక్కువ స్థాయి సామర్థ్యాలకు  ప్రాధాన్యతనిస్తాయి. ఈ రంగంలో ఆరు స్థాయిలు ఉన్నాయి. స్థాయి పేరిగే కొలది విద్యార్థులలో కూడా సంక్షేపణం పేరగాల్సి ఉంటుంది. ఉపాధ్యాయునిగా విద్యార్థులు పై స్థాయి సామర్థ్యాలను చేరడానికి కృషిచేయాలి. విద్యార్థులను మంచి ఆలోచనా పరులుగా తయారు చేయడానికి  ఉపాధ్యాయులుగా మనం విద్యార్థులకు కాకుండా ఉన్నత స్థాయి సామర్థ్యాలైన  అవగాహన, ప్రయోగం, విశ్లేషణనను,అంచనావేయడాన్ని పరిచయం చేయాలి. వీటన్నింటిని  ఉష్ణ ఏడారులనే  భావనను కృత్యాల ఆధారంగా బోధిస్తూ అభివృద్ధిచేసే విధానాన్ని ఇక్కడ ఇచ్చాము.   

స్మృతి

బ్లూమ్స  వర్గీకరణలోని ఈ స్థాయి ప్రశ్నలు బోధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు గుర్తుంచుకోగలిగారనే విషయాన్ని పరీక్షిస్తుంది.  ఉదాహరణకు

·         ఎడారి అంటే ఏమిటి ?

·         ప్రపంచపటంలో సహారా ఎడారిని గుర్తించండి ?

·         ఐదు ఉష్ణఎడారులని పేర్కొనండి?

·         ఉష్ణఎడారులలో పేరిగే మూడు వృక్షాల పేర్లను వ్రాయండి ? 

అవగాహన

ఈ స్థాయిలో విద్యార్థులు బోధించిన పాఠ్యాంశాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా అందులోని సమాచారాన్ని అవగాహన చేసుకొంటారు. ఈ స్థాయిలో విషయాలను వివరించగలరు. ఈ స్థాయిలో విద్యార్థులను ఈ క్రింది విషయాలలో  పరీక్షించవచ్చు.

·         ఉష్ణ ఎడారులలోని   వాతావరణాన్ని వర్ణించండి?

·         ఉష్ణ ఎడారులలో పెరిగే మూడు వృక్షాల గురించి చర్చించండి ?

·         ఎడారులలో పెరిగే వృక్షాలు పొడవైన వేర్లను మరియు దళసరి పత్రాలను కలిగిఉంటాయి ఎందుకు?  వివరించండి ?

·         ఎడారులలో ఒంటె బాగా ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? 

ప్రయోగం

ఈ స్థాయిలో విద్యార్థులు తాము పొందిన విజ్ఞానాన్నివినియోగించాల్సి ఉంటుంది. విద్యార్థులను వారికి బోధించిన అంశం ఆధారంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని సూచించమని అడగవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలతో విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియచేశారు.

·         నీవు నీ సెలవలను గడపడానికి సహారా ఎడారికి వెళ్లవనుకో, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందని నీవు ఊహిస్తున్నావు, ఎలాంటి దుస్తులను తీసుకొని వెళతావు. కారణాలను వివరిస్తూ  మీ సమాధానాన్ని వ్రాయండి.    

విశ్లేషణ

ఈ స్థాయిలో విద్యార్థులు  తమ జ్ఞానాన్ని ఉపయోగించి ఇచ్చిన సమస్యలోని పధ్ధతి ఆధారంగా సమస్యను విశ్లేషించవచ్చు. ఈ క్రింది కృత్యాలు విద్యార్థులకు విశ్లేషణను నిర్వహించడానికి దోహదపడుతాయి.

·         వాతావరణం, వృక్షజాలం, జంతువులు, ధరించే దుస్తులు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉష్ణ మరియు శీతల ఏడారుల మధ్య తులనాత్మక అధ్యయనాన్ని నిర్వహించండి.  

ఫలితాన్ని నిర్ణఇంచడం

బ్లూమ్స్ వర్గీకరణలోని అత్యున్నత స్థాయి సామర్థ్యం  మూల్యాంకనం , ఈ స్థాయిలో విద్యార్థులు వారికి తెలిసిన సమాచారం ఆధారంగా ఫలితాన్ని నిర్ణఇంచాల్సి ఉంటుంది. ఈ ఫలితం అంకెరూపంలో ఉండవచ్చు లేదా ఒక కారణం లాంటిది కావచ్చు.  ఉదాహరణకు

·         ఎడారులలో ఒంటె బాగా ఉపయోగపడుతుంది. నిరూపించండి ?

ఏర్పరచడం

సహారాఏడారులలో నివసించే బెడోనియన్ల గురించి scrapbook ని తయారుచేయండి. ఇందులో వారి జీవనానికి సంబంధించిన విషయాలైనవారి ఆహారం, నివాసాలు, దుస్తులు మొదలైన విశేషాలను వ్రాయవచ్చు లేదా వాటిని చూపించే చిత్రాలను అతికించవచ్చు

భావాత్మక  రంగం 

ఈ నైపుణ్యం ప్రజలు ఇతరుల కష్టసుఖాలను, సంతోషాలను, బాధలను ఎలా అవగాహన చేసుకొంటారు, ఎలా ప్రతిస్పందిస్తారో తెలియచేస్తుంది. వ్యక్తులలోని  దృక్పథాలను, భావాలను, ఉద్రేకాలను ఈ భావాత్మక రంగం వివరిస్తుంది.

నీవు ఇప్పుడు సహారా ఎడారిలో నివసిస్తున్నావనుకోని ఊహిస్తూ  అక్కడ ప్రతిరోజూ  ఎలాంటి కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించు.    

మానసికచలనాత్మక రంగం

ఈ రంగంలోని నైపుణ్యాలు  ఒక వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులను లేదా ఒక వ్యక్తి అభివృధ్ధిలో కలిగే మార్పుల గురించి వివరిస్తుంది. ఉదాహరణకు ఒక పరికరాన్ని ఉపయోగించే సామార్థ్యం గురించి  వివరిస్తుంది.

·         వాతావరణం, వృక్షజాలం, జంతువులు, ధరించే దుస్తులు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సహారా ఎడారి చిత్రాన్ని చిత్రించండి.

·         ఏదైనా ఒక ఎడారిలోని వాతావరణం, వృక్షజాలం, జంతువులు, ధరించే దుస్తుల గురించి పరిశోధించి ఒక కరపత్రాన్ని రూపొందించండి.

·         ఒక ఎడారిని నమూనాని నిర్మించండి. 

18094 registered users
6935 resources