బహుళార్థక నల్లబల్ల

 

మీ పిల్లలు గోడలపై గీతలు గీస్తుస్నారా ? వారితో ఇంటిపని చేయించడానికి కష్టపడుతున్నారా ? ఈ విషయంలో ఇంక అందోళన చెందాల్సిన పనిలేదు, ఎందుకంటే పరిష్కారం చాలా సులువైనది వారికి ఒక మడిచి పెట్టగలిగే నల్లబల్లను కొనివ్వడమే.

దీనిని మీరు మీ ఇంటిగోడకి తగిలించి ఉపయోగించుకోవచ్చు.  దీని చుట్టచుట్టి ప్రక్కన పెట్టవచ్చు, కావున ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. సాధారణ నల్లబల్లను కూడా ఏర్పాటు చెయ్యవచ్చు కానీ అది పిల్లలకు వారిపై పడి హాని కలిగించవచ్చు. ఈ మడిచిపెట్టగల నల్లబల్ల వలన కాగితంకూడా ఆదా అవుతుంది. 

చాలామంది పిల్లలు  2 లేదా  3  సంవత్సరాల వయస్సులో గీతలు గీయడం మొదలుపెడుతారు. చిన్న కాగితాలు వారి సృజనాత్మకతకు సరిపోవు. పిల్లలకు ఒక మడిచిపెట్టే నల్లబల్లను కొన్ని రంగు సుధ్ధముక్కలను ఇచ్చి వారి సృజనాత్మకతను ఆనందించండి. ఇది వారిని గోడమీద రాయకుండా కూడా  నిరోధిస్తుంది. పాఠశాలకు వెళ్ళే ప్రతిపిల్లవాడికి నల్లబల్ల అంటేతప్పక ఇష్టం ఉంటుంది దానిపై వ్రాయాలని కోరుకొంటాడు. ఈ విషయంలో ఉపాధ్యాయుని చూసి అసూయ పడతారు . ఈ లక్షణాన్ని మీరు మీ ఇంటిదగ్గర అనుకూలంగా మార్చుకోండి.

వారిని వారే ఉపాధ్యాయునిగా అనుభూతి చెంది నల్లబల్లపై వ్రాసే అవకాశం ఇవ్వండి.

·         ఈ నల్లబల్ల వలన మీరు వారికి కొన్ని పదాలు  ఉల్లేఖనాన్ని చెప్పవచ్చు లేదా కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించుకోవచ్చు.  

·         మీరు విద్యార్థిలా నటిస్తే తాను ఉపాధ్యాయునిగా మారి ఎన్నో విషయాలను నేర్చుకొంటాడు.

·         విజ్ఞానశాస్త్ర తరగాతిగదికి ఇది ఎంతో ఉపయుక్తం.  బొమ్మలను రంగు రంగు సుధ్ధముక్కలను ఉపయోగించి వివిధ భాగాలను గుర్తించ డానికి వీలౌతుంది. దీని వలన వివిరణ సులువౌతుంది. పిల్లలు కూడా బొమ్మలను నల్లబల్లపై అభ్యాసం చేస్తారు.

·         దీనిని ఉపాధ్యాయుడు తరగతిగదిలో మరింత సమయాన్ని పొందడానికి ఉపయోగించవచ్చు. చిత్రించడానికి ఎక్కువ సమయం పట్టే బొమ్మలను ముందే దీనిపై చిత్రించుకొని తరగాతిగదికి వెళ్లడం వలన వివిరణ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించ వచ్చు.   

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

చాలా మంచి సలహా..

18336 registered users
7154 resources