పరిమాణమా, గుణాత్మకతా ఏది ముఖ్యం ?

·         సాంఘికశాస్త్ర పరీక్షలలో మనం దేనిని  పరీక్షిస్తున్నాము ?

·         పాఠశాలల్లో ప్రస్తుతం సాంఘికశాస్త్ర బోధన ఈ విధంగా ఉండడానికి ఈ పరీక్షలే కారణమా ?

ఇవి   

C.B.S.E మరియు I.C.S. E వారు మరియు కర్ణాటక రాష్ట్రవిద్యామండలి వారు మూల్యాంకనం కోసం ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను పరిశీలించిన తరువాత నాలో కలిగిన ఆలోచనలు 

ఈ విషయాన్ని మరింతగా చర్చించడానికి ముందుగా మనం C.B.S.E,  I.C.S.E మరియు కర్ణాటక రాష్ట్ర విద్యామండలి వారు రూపొందించిన 2008-09 విద్యాసంవత్సర వార్షిక  పరీక్షా ప్రశ్నాపత్రాలను నిశితంగా పరిశీలిద్దాం. ఈ  ప్రశ్నాపత్రాలలోని  ప్రశ్నలు మదించగలిగే సామర్థ్యాన్ని (జ్ఞానాన్ని, అవగాహనను, అనుప్రయోగాన్ని) లేదా నైపుణ్యాన్ని విశ్లేషిస్తాం. 

Q.2. దేశంలో ప్రజలకు అందుబాటులో గల రెండు మంచినీటి     వనరులను తెలపండి?

Q.3. రెండు ముఖ్య ఇనుప ధాతువులను తెలపండి?

Q.4. మనదేశంలో అతి పెద్ద Solar Plant ఎక్కడ ఉంది?(CBSE)

C.B.S.E  మరియు కర్ణాటక రాష్ట్ర విద్యామండలి పరీక్షాపత్రాలు ఈ క్రింది విషయాలను స్పష్టం చేస్తున్నాయి.

·         30 మార్కులకే భౌగోళికశాస్త్ర ప్రశ్నలు అడగబడ్డాయి.

·         ఇందులో  95% నుండి 96 % వరకు జ్ఞానానికి సంభంధించిన ప్రశ్నలే ఉన్నాయి, ఉన్నతస్థాయి నైపుణ్యానికి సంభంధించిన ప్రశ్నలు 4 % మాత్రమే ఉన్నాయి . ఉదాహరణకు 

Q.45.  జాతీయ ఉద్యానవనాలను  ఎందుకు ఏర్పాటుచేసారు?

A. అడవులను సంరక్షించడానికి                     B. పక్షులను రక్షించడానికి                       

C. అడవి జంతువులను సంరక్షించడానికి           D. పులులను సంరక్షించడానికి (కర్ణాటక రాష్ట్ర                                                          విద్యామండలి )

·         నైపుణ్యాన్ని ప్రశ్నించేవిగా కనిపించే  ప్రశ్నలు కూడా పాఠ్యాంశం చివరన అభ్యాసం కోసం ఇచ్చిన ప్రశ్నలలోనివే కావున,  ఈ ప్రశ్నలు కూడా ఆవిధంగా జ్ఞానానికి చెందినవే అవుతాయి. పైన  పేర్కొన్న ప్రశ్నలో సమాధానంగా ఇచ్చిన ఎంపిక జవాబులన్నీ సరైనవైనందున అడిగిన ప్రశ్ననే తప్పు.

·         ఈ ప్రశ్నాపత్రం  పిల్లలలో  ఆలోచనలను ఏ మాత్రం ప్రోత్సహించదు. అన్ని ప్రశ్నలను కంఠతాపధ్ధతిలో నేర్చుకొన్న జవాబులతో వ్రాయవచ్చు.

·         ఈ రెండు విద్యామండలిలు నిర్దిష్టమైన పాఠ్యపుస్తకాలను కలిగిఉన్నాయి

         I.C.S.E ప్రశ్నాపత్రంమాత్రం   ఈరెండు ప్రశ్నాపత్రాలకన్నా కొంతవిబిన్నంగా ఉంది.

Q.7. చమురుని అత్యధికంగా ఉత్పన్నం చేస్తున్న దేశం ఏది ? దేశంలో గల ఏవైనా రెండు నూనెబావులను పేర్కొనండి ?భారతదేశం సముద్రతీరం ఆవల ఉన్న రెండు నూనె నిక్షేపాలను తెలపండి ?  భారతదేశంలోని అతి పెద్దదైన మరియు ప్రాచీనమైన బొగ్గు గని ఏది ? బొగ్గు నుండి ఏర్పడే రెండు ఉప ఉత్పన్నాలను తెలపండి? వివిధ ఇనుప ధాతువులను తెలపండి. ఏది మంచి ధాతువు? I.C.S.E

ప్రశ్నాపత్రాల  పరిమితి   

ఈ మూడు విద్యామండలిలుల ప్రశ్నాపత్రాలు కొన్ని సారూప్యతలను కలిగిఉన్నాయి. ఈ ప్రశ్నలు విషయపరిజ్ఞానం యొక్కపరిజ్ఞానాన్ని గానీ, నిత్యజీవితంలో సాంఘికశాస్త్రం యొక్క ఆవశ్యకతను మరియు దైనందికజీవితానికి మరియు సాంఘికశాస్త్రానికి  మధ్యగల సంబంధం గురించి ప్రశ్నించడం లేదు?  

ఏ ప్రశ్న కూడా భౌగోళికశాస్త్ర భావనలను వివరించలేక పోతున్నాయి ఉదాహరణకు    

A. కర్ణాటక రాష్ట్ర విద్యామండలి పరీక్షాపత్రం

Q.No.33. బుట్టలతయారీ కుటీరపరిశ్రమ అయితే Fan లను  తయారుచేసే పరిశ్రమ ఏది ?   

a) చిన్నతరహా పరిశ్రమలు b) మధ్యతరహా పరిశ్రమలు c) పెద్దతరహా పరిశ్రమలు d)  ప్రత్యేకపరిశ్రమ

 

Q.No.44 భారతదేశానికి కుటీరపరిశ్రమలు మరియు చిన్నతరహా పరిశ్రమలు అనువైనవి, ఎందుకు ?

a) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నందుకు                    b) పెట్టుబడి తక్కువ కావున                       c) అవసరమయ్యే ముడిసరకు దేశంలోనే లభించడం వలన  d) విద్యుత్తు తక్కువ అవసరం కనుక        

Q.46. దేశంలోని సంస్థ కుటీరపరిశ్రమలు మరియు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలను  అందిస్తుంది?

a) State Finance Corporation                         b) Industrial Development Bank of India                   C) Nationalized Bank                                    d) SBI

ప్రశ్నలన్నీ విద్యార్థులు సమాధానాలను సులువుగా ఊహించేవిధంగానూ, తెలుసుకొన్న సమాచారాన్ని  ప్రశ్నించేవిగా ఉన్నాయి. ఏ సామార్థ్యాన్ని మాపనం చేయడానికి ఈ ప్రశ్నలు అడిగారు ? ఇవి ఏవీ పరిశ్రమల భావనను పరీక్షించడానికి అడిగిన ప్రశ్నల్లా లేవు.     

B. C.B.S.E  పరీక్షాపత్రం

Q.2. రెండు మంచినీటి వనరులను తెలపండి?

Q.4. భారతదేశంలో అతి పెద్ద solar plant ఎక్కడ ఉంది?(CBSE)

పై రెండు ప్రశ్నలు “మంచినీరు”, “ఉప్పునీరు” లేదా solar energy అనే భావనాలను పరీక్షించడం లేదు.

Q.No.16. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను ఏర్పరచడానికి గల మూడు కారణాలను వివరించండి

ఈ ప్రశ్నను ఈ క్రింది విధంగా అడిగి ఉండవచ్చు. ఈ క్రింద ఇచ్చిన పటం భారతదేశంలోని మూడు ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలైన ముంబాయి, జంషెడ్ పుర్, మరియు విశాఖపట్టణాన్ని చూపుతున్నది.  ముంబాయి ప్రాంతం వస్త్రాలకు,  జంషెడ్ పుర్ ఇనుము, స్టీల్ పరిశ్రమలకు, విశాఖపట్టనంలో నౌకా నిర్మాణానికి  సంబంధించిన పరిశ్రమలకు ప్రసిధ్ధి.  ఏ పరిశ్రమనైనా ఏ ప్రదేశంలోనైనా  ఎందుకు ఏర్పాటు చేయలేము ? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచించే ఏ విద్యార్థి అయినా నిర్మించే పరిశ్రమకుఆ ప్రాంతానికి మధ్య ఒకనిర్దుష్టమైన సంభంధం ఉంటుందని భావిస్తాడు. ప్రశ్నాపత్రంలో వాడిన భాష విద్యార్థులకు అనుగుణంగా లేదు, కొన్ని సంధార్భాలలో ప్రశ్నలు సమాధానాన్ని అందించేవిగా ఉన్నాయి.

మరి కొన్ని ఉదాహరణలను చూద్దాం ఇవి నేను వెలిబుచ్చిన విషయాన్ని దృఢపరుస్తాయి.  

ఉదాహరణకు :

A. కర్ణాటక రాష్ట్ర విద్యామండలి పరీక్షాపత్రం

Q.No.69 వ్యవసాయం, వాణిజ్యవ్యవసాయం, మిశ్రమవ్యవసాయం అంటే ఏమిటి ?

Q.No.73 భారతదేశం వ్యవసాయంలో ఎందుకు వెనుకబడి ఉంది ?

ఈ ప్రశ్నను పాఠ్యపుస్తకం నుండి యధావిధిగా గ్రహించారు.(పేజ్ నంబర్ 230 Q.No.2)

B. C.B.S.E  పరీక్షాపత్రం

Q. No.21 ఇచ్చిన చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి క్రింద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

Q. No. 21.1)  చిత్రంలో చూపిన పంట ఏది?  

Q. No 21.2)  ఈ పంటకు అనువైన వాతావరణ పరిస్థితుల గురించి వ్రాయండి.

Q.No 21.3) ఈ పంటను ప్రధానపంటగా పండించే రెండు రాష్ట్రాలు ఏవి ?    

ఈ ప్రశ్నలను మరో విధంగా అడిగి ఉండవచ్చు.

      I.        పండగ రోజుల్లో సంతలోగానీ,  జ్యూస్ దుకాణం దగ్గర కానీ ఈ మొక్కను చూసిఉంటారు ? గుర్తుపట్టండి ?  

    II.        ఎటువంటి వాతావరణ పరిస్థితులలో ఈ మొక్కలను పెరుగుతాయని అనుకొంటున్నావు?

   III.        ఈ పంట కర్ణాటక రాష్ట్రంలో అధికంగా పండుతుంది ? మన దేశంలో ఈ పంటను పండించే మరి రెండు రాష్ట్రాలను చెప్పండి?

·         సాధారణ సమాచారాన్ని  లేదా “పేరు” గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రశ్నించారు. దీని వలన   ఇది భౌగోళికశాస్త్రం అంటే ఎక్కువగా ఆ ప్రాంతానికి సంభందించిన లేదా సాధారణపరిజ్ఞానమని, పరిశీలన, వర్గీకరణ, కొలతలు, ప్రయోగాలు అవసరమైన ఒక విజ్ఞానశాస్త్ర విభాగం కాదని అర్థమౌతుంది.

·         సృజనాత్మకత,  అనుప్రయోగాన్ని, విశ్లేషణ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలులేవు ?  

·         పిల్లలు సృజనాత్మకంగా జవాబులను తెలియచేయడానికి అవకాశంలేనివిధంగా  ప్రశ్నలు ఉంటున్నాయి.  

పై విశ్లేషణ ద్వారా మనమేమీ తెలుసుకోగలము?

ప్రశ్నాపత్రాలన్నీ తరగతిగదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు సాధారణ సమాచారాన్ని అందించేందుకు అవసరమైన బోధనాపధ్ధతులను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయి.

కంఠతా పట్టిన సాధారణ సమాచారం లేని విద్యార్థులు ఇలాంటి ప్రశ్నాపత్రాలకు సమాధానాన్ని ఇవ్వలేరు.

విద్యార్థులకు పై ప్రశ్నాపత్రాలు ఆలోచించి పరిష్కారాన్ని చూపడానికి  తగిన అవకాశం ఇవ్వడంలేదు. మూల్యాంకనాపత్రంలోని  ప్రశ్నలు,  విద్యార్థులు ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులను పొందడమే పరమావధిగా ఉంటున్నాయి.   

ఈ రోజుల్లో సాంఘికశాస్త్ర తరగతిగదులు ఇలా ఉండడానికి ఈ రకమైన ప్రశ్నాపత్రాలే కారణమా ? అన్న ప్రశ్నకు, పాఠశాల మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన చాలా సమస్యలు ఉదాహరణకు 

1.     చాలామందిలో NCF (జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం)తో పాటు  పాఠశాల యొక్క దార్శనికత, తరగతిగదిలో నిర్వహించాల్సిన  బోధనా అభ్యసన ప్రక్రియలకు సంబంధించిన పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేకపోవడం.  

2.    ఈ విషయంలో పిల్లల, తల్లితండ్రుల, సమాజం మరియు పాఠశాలలో సరైన దృక్పథం  మరియు ఆసక్తులు లేకపోవడం 

విద్యార్థులు కంఠతాపధ్ధతిలో జావాబులను వ్రాసే పరీక్షగానే భౌగోళికశాస్త్రం ఉంటోంది.  దీని వలన నైపుణ్యాలు లేదా సృజనాత్మకతన పెంపొడడం లేదు, తగినంతాగా జ్ఞానాన్ని ఇవ్వడం లేదు, లేదా భౌగోళికశాస్త్ర అభ్యసనం ఆనందకరంగా కూడా లేదు.     

భౌతిక్షాస్త్ర బోధన ఈ విధంగా ఉండడానికి  పాఠ్యపుస్తకాలా, బోధనాపధ్ధతులా, పాఠశాలలా లేదా ఉపాధ్యాయుని లేదా తల్లితండ్రుల దృక్పథమా లేదా విద్యామండలి లేదా ప్రశ్నాపత్రాల ఎవరు కారణం అన్నది  ప్రస్తుతప్రశ్న.    

NCF దార్శనికత

·         పిల్లల అనుభవాలకు, అభిప్రాయాలకు అభ్యసనాప్రక్రియలో ఉన్నప్రాధాన్యతని NCF గుర్తించింది.

·         పాఠశాలలో ఏర్పరిచే అభ్యసనానుభవాలు పిల్లలు జ్ఞానాన్ని సమపార్జించడానికి , వారిలో సృజనాత్మకతను పెంచడానికి అనుకూలంగా ఉండాలి. వారికి ఈ అనుభవాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి గానీ  బాధించేవిగా ఉండకూడదు.

·         బోధనా పధ్ధతులు ఎక్కువగా ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవిగా గానీ లేదా ప్రాజెక్టు పధ్ధతిలో ఉండాలి. పాఠ్యప్రణాళికలో పర్యావరణానికి,విలువలకు, సమానాత్వానికి సంబంధించిన సమస్యల గురించిన అంశాలు  ఉండాలి.   

·         సమీకృత అంశాలను (ఉదాహరణకు నీరు ) బోధన శాస్త్రాంతర పరిధులను గుర్తించేదిగా ఉండాలని NCF చెపుతోంది.  

·         సాంఘికశాస్త్రంలోని పాఠ్యప్రణాళిక  సమాజంలోని వివిధ వ్యవస్థలను, మార్పు మరియు అభివృధ్ధి భావనలను  విద్యార్థులు కృత్యాలద్వారా, ప్రాజెక్టుల ద్వారా అవగాహనచేసుకొనేలా రూపొందించాలి.

·         పరీక్షలు కంఠతాపధ్ధతిలో విషయాన్ని పరీక్షించేవిగా కాకుండా సామర్థ్యాలను పరీక్షించేవిగా మరియు సమస్యాపరిష్కార సామర్థ్యాన్ని పెంపోదించేవిగా ఉండాలి.

NCF లో పేర్కొన్న లక్ష్యాలు ?

·         పిల్లలు తమ తక్షణ పరిసరాలకు సాంఘిక, సాంస్కృతిక పరిస్థితిలకు మధ్యగల సంబంధాన్ని అవగాహన చేసుకొనేలా శిక్షణ ఇవ్వాలి.

·         పిల్లలలో జీవనవిధానాలకు  సంభంధించిన భౌతిక, జీవ, సాంస్కృతిక,  అంశాలను అమూర్తంగా కాకుండా పరిశీలనలు, చిత్రాల ద్వారా అవగాహనను పెంపోదించాలి.

·         పిల్లలలో జిజ్ఞాసను సృజనాత్మకతను పెంపోదించడం అలాగే తక్షణపరిసరాలపై అవగాహన కల్పించడం, వాతావరణ సమస్యల పట్ల సామాజిక స్పృహను పెంపోదించడం.  

NCF దార్శనికతను సాధించడానికి అందరూ తమవంతు భాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. 

విద్యామండలి,పాఠశాల మరియు ఉపాధ్యాయుడు దీనిని అమలుపరచడంలో కీలకపాత్రను నిర్వహిస్తారు. విద్యామండలే విద్యాప్రణాళికను, పాఠ్యపుస్తకాలను చివరికి పరీక్షలను రూపొందింస్తాయి. వీటిని పాఠశాల మరియు ఉపాధ్యాయుడు వీటిని తరగతిగదిలో అమలుపరుస్తారు.

NCF సమర్థవంతంగా అమలుపరచడానికి బోధనాపద్దతులే ముఖ్యమార్గం, అయితే నిజానికి విద్యామండలులు,  పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎవరికీ NCF గురించి సరైన అవగాహనలేదు. 

తరగతిగదిలోకానీ , పాఠశాలలో కానీ లేదా వార్షిక పరీక్షలలో గానీ ఎప్పుడూ NCF గురించి ప్రస్తావించరు. ఉపాధ్యాయులెవరికీ NCF గురించి తెలియచేయడం లేదు. ఏ శిక్షణాకార్యక్రమాలలో కూడా దీని గురించి వివరించడంలేదు. బోధనాపధ్ధతులు,పరీక్షలు మార్కుల కోసమే ఉపయోగిస్తున్నారు. విషయపరిజ్ఞానాకి నిత్యజీవితానికి గల సంబంధాన్ని ఎవరూ చూడడం లేదు,  విద్యావిధానం ఈ విధంగా మారడానికి చాలావరకు సమాజం మరియు కుటుంబం కూడా కారణం.

ఇప్పటికైనా మించిపోయ్యింది లేదు, It’s  better never late.         

18627 registered users
7275 resources