పఠనావగాహన మరియు శ్రవణ నైపుణ్యాలను విభిన్నంగా బోధించడం

రచయిత, ఉపాధ్యాయురాలిగా తన విద్యార్థులలో పఠనావగాహన మరియు శ్రవణ  నైపుణ్యాలను  పెంపొందించడానికి నిర్వహించిన ఆసక్తికరమైన  కృత్యాన్ని మీతో  పంచుకొంటున్నారు.

విద్యార్థికి భాషకు సంబంధించినంతవరకు వినడం,మాట్లాడడం,చదవడం మరియు వ్రాయడం అనే నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. పఠనావగాహన వినడం మరియు చదవడమనే నైపుణ్యాలకు సంబంధించినది. చదివిన పేరాను లేదా విన్న విషయాన్ని అవగాహన చేసుకొనే సామర్థ్యాన్ని విద్యార్థులలో అభివృధ్ధి చేయాలనేది  విద్యావేత్తలుగా మనకందరికీ విదితమైన విషయమే.     

చదవడం-రకాలు

1.     బిగ్గరగా చదవడం

2.    నిశ్శబ్ద పఠనం

నైపుణ్యాలకు  సంబంధించినంతవరకు నిశ్శబ్ద పఠనం ప్రముఖపాత్రను వహిస్తుంది. నేను బోధన చేస్తున్న రెండు తరగతులకు అమలు పరిచిన కృత్యాన్ని మీ కోసం వివరిస్తున్నాను. ఈ కృత్యాన్ని విద్యార్థులు చాలా ఆనందించారు

కార్యక్రమ రూపకల్పన

ఇలాంటి కృత్యాన్ని నిర్వహించడానికి ఉపాధ్యాయుడు చాలా శ్రమపడాలి. నేను వేసవిసెలవులలో 6 వ తరగతి విద్యార్థుల సామార్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 300  పదాల నిడివి గల 100  పేరాగ్రాఫులను సేకరించాను.  ఇందులో వారి అవగాహనకు, స్థాయికి మించిన పదాలేవీ లేవని మరొకసారి ధృవపరచుకొన్నాను.

కార్యక్రమాన్ని నేను ఈ విధంగా మొదలుపెట్టాను.

మొదటి సోపానం

వార్తాపత్రికలు, పత్రికలు, వివిధ పుస్తకాల నుండి పేరాగ్రాఫుల సేకరణ ఈ కార్యక్రమంలోని మొదటి సోపానం. వీటిని కత్తిరించి వాటిని రంగు రంగుల  పేపర్లపై అతికించాలి. ఇలా తయారుచేసిన వాటిని మరొకసారి చదివి వారి స్థాయికి తగినట్లుగానే ఉన్నాయని ధృవీకరించుకోవాలి.     

రెండవ సోపానం

ఏడవ తరగతి విద్యార్థులకోసం

ఏడవ విద్యార్థులతో పఠనావగాహన మరియు శ్రవణ నైపుణ్యాలనే భావనలను చర్చించండి. ప్రతి విద్యార్థికి ఒక పేరాను ఇవ్వండి.  ఈ సేకరణలో కొన్ని పేరాలు కథలనుండి, కొన్ని సమాచారాన్ని అందించేవిగా మరికొన్ని పేరాలు  సంఘటనలు ఉండేలా చూసుకోండి. చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి నిశ్శబ్దాన్ని పాటించాలో వివిరించండి. “నిశ్శబ్ద పఠనం” అని బోర్డుని తగిలించండి.

1.     చదువుతున్నపుడు పెదవులు కదలకూడదు

2.    చదువుతున్నప్పుడు కనుగుడ్లను మాత్రమే కదిలించాలి, మెడను కాదు

3.    చదువుతున్నపుడు గుసగుసలు చేయరాదు 

4.    ఒక పదానికి లేదా వాక్యానికి అర్థం తెలియకపోతే చదవడాన్ని ఆపకుండా ఆ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని అవగాహన చేసుకొనేందుకు ప్రయత్నం చేయాలి

ఇలాంటి సూచనలతో కృత్యం మొదలౌతుంది. వారికి వారిప్పుడు విద్యార్థులు కాదని చదివిన తరువాత ఉపాధ్యాయుల పాత్రలో ఆరవ తరగతి విద్యార్థులకు  ప్రశ్నలు రూపొందించాలని చెప్పండి.

ప్రతి విద్యార్థి వారికిచ్చిన కార్డుపై పేరుని వ్రాయమని చెప్పండి, దీని వలన ఆ పేరా వారికి పునరావృతం కాకుండా ఉంటుంది.

నాల్గవ సోపానం

విద్యార్థులకు క్రింది సూచనలు ఇవ్వాలి

25 మార్కుల ప్రశ్నాపత్రాన్ని  క్రింది అంశాలను దృష్టిలో ఉంచికొని తయారు చేయమని చెప్పండి

1.     5 ఒక వాక్యం జవాబుగా గల 5 ప్రశ్నలు 

2.    రెండు లేదా మూడు వాక్యాలు జవాబులుగా గల 5 ప్రశ్నలు

3.    5 ఖాళీలను పూరించే ప్రశ్నలు వ్రాయండి  

4.    పేరా నుండి ఐదు పదబంధాలను  ఎన్నుకొని వాటి ఆధారంగా ఐదు వాక్యాలు వ్రాయండి.  

5.    అలాగే పేరా నుండి ఐదు విశేషణాలను ఎన్నుకొనేలా ఒక ప్రశ్నను తయారుచేయండి.

ఈ ప్రశ్నాపత్రాన్ని పేరా కార్డుకి తగిలించండి.

ఆరవతరగతి విద్యార్థులు జవాబులు వ్రాసిన మరుసటిరోజు ఏడవ తరగతి విద్యార్థులు వాటిని మూల్యాంకనం చేస్తారు.

ఐదవ సోపానం

ఆరవతరగతి విద్యార్థులకు భాషలో పఠనావగాహన  

వీరికి  కూడా ఏడవ తరగతి విద్యార్థులకు వివరించినట్లుగానే పఠనావగాహన మరియు శ్రవణ నైపుణ్యాలను వివరించండి. ఇంతకు ముందే వ్రాసిన నిశ్శబ్దపఠనం సూచనల బోర్డుని ప్రదర్శించండి.  విద్యార్తులందరికీ కాగితాలను అందివ్వండి.  ఏడవ తరగతి విద్యార్థులు తయారుచేసిన పేరా కార్డులను  ప్రశ్నపత్రాలతో కలిపి ఇవ్వండి  

ఆరవ సోపానం

సూచనలను వివరించడానికి 15 నిమిషాల సమయం అవసరమౌతుంది. కృత్యం మొదలైన తరువాత ఎవరూ ఏవిధమైన ప్రశ్నలు అడగడానికి అవకాశంలేదు. కృత్యం పూర్తీఅవగానే ఆరవ తరగతి విద్యార్థుల నుండి పేరాగ్రాఫ్ కార్డులను ప్రశ్నాపత్రాలను మరియు జవాబుపత్రాలను తీసుకోండి.  

ఏడవ సోపానం

ఏడవతరగతి విద్యార్థులతో మూల్యాంకనం :

ఆరవతరగతి విద్యార్థుల నుండి తీసుకొన్న పేరాగ్రాఫ్ కార్డులను ప్రశ్నాపత్రాలను మరియు జవాబుపత్రాలను.  

ఏడవతరగతి విద్యార్థులకు ఇవ్వండి. వారు ప్రతి పేరాగ్రాఫ్ కార్డు వెనుక ఇంతకు ముందే వారి పేరు వ్రాయడం వలన వారు ప్రశ్నాపత్రం రూపొందించిన కార్డునే వారు తీసుకొంటారు.

మూల్యాంకనం చేసే సమయంలో విద్యార్థులకు కొంత సహాయం అవసరం కావచ్చు.  

ఎనిమిదవ సోపానం

అన్ని జవాబుపత్రాలను మూల్యాంకనం చేయడంతో ఈ కృత్యం ముగుస్తుంది. ఏడవ తరగతి విద్యార్థుల నుండివీటిని సమీకరించుకొని ఆరవతరగతి విద్యార్థులకు స్వీయపరిశీలన కోసం  ఇస్తారు.  

తొమ్మిదవ సోపానం

ఆరవతరగతి విద్యార్థులతో మూల్యాంకనం :

ఆరవతరగతి విద్యార్థులు వారి పేరాగ్రాఫ్ కార్డులను ప్రశ్నాపత్రాలను మరియు జవాబుపత్రాలను పరిశీలించుకొని సందేహాలున్నచో ఉపాధ్యాయున్ని సంప్రదించవచ్చు.  

పదవ సోపానం

ఇక్కడితో ఉపాధ్యాయుని పాత్ర ముగుస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులతో పేరాగ్రాఫ్ కార్డులను వెనుకకు తీసుకొని  ఇచ్చిన అంశం పునరావృతం కాని విధంగా విద్యార్థులకు ఇస్తూ తిరిగి వీటిని  ఉపయోగించవచ్చు.

నా మిత్రుడుఒకరు విద్యార్థులు ప్రశ్నాపత్రాలను, మూల్యాంకనాన్ని నిర్వహిస్తారని ఎలా నిర్ధారించు కొంటావని సందేహాన్ని వెలిబుచ్చాడు. ఉపాధ్యాయుడు ప్రతిపేరాని చ విద్యార్థులు తయారు చేసిన ప్రతిప్రశ్నాపత్రాన్ని,  మూల్యాంకనం చేసిన ప్రతిజవాబు పత్రాన్ని సరిచూడాలి  కావున నిజంగానే ఉపాధ్యాయునికి ఇదొక పెద్ద సవాలు.    

విద్యార్థులకు పనిని అప్పగించినప్పుడు వారు భాధ్యతతో నిర్వహిస్తారని నేను తెలుసుకొన్నాను. అన్ని ప్రశ్నాపత్రాలను, మూల్యాంకనం చేసిన అన్ని జవాబుపత్రాలను  సరిచూడడం కంటే యాధృచ్ఛికంగా కొన్ని పత్రాలను పరిశీలించడం మంచిది. పిల్లలకు పనులను ఉదాహరణకు ఉపాధ్యాయునిగా వ్యవహరించడం   లాంటివి  అప్పగించినపుడు వారు వాటిని నిబద్ధతతో, ఆనందంగా నిర్వహిస్తారని నేను రూఢిగాచెప్పగలను.

నేను ఆరవతరగతి విద్యార్థులకు వారి జవాబుపత్రాలను వారి ఏడవతరగతి  విద్యార్థులు మూల్యాంకనం నిర్వహిస్తారని తెలియచేస్తే వారు మరింత మెరుగుగా పనిని నిర్వహిస్తారు.

మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థులను క్రియాశీలులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి సహచరవిద్యార్థుల నుండి అందే సలహాలు సూచనలు వారి సామర్థ్యం పెంపోడేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సహచరవిద్యార్థులు మూల్యాంకనం చేయడం విద్యార్థులకు ప్రేరణ ఇస్తుంది,మూల్యాంకనకర్తలకు ఆనందాన్ని  ఇస్తుంది.       

విద్యార్థులలో పఠనావగాహన మరియు శ్రవణనైపుణ్యాలను ఆసక్తికరమైన పద్ధతులలో అభివృద్ధి చేసేవిధానంలో కొన్ని ముఖ్యఅంశాలు ఉంటాయి

1.     ఉపాధ్యాయుడు పాఠాన్ని ఆసక్తికరం చేయడానికి వివిధ పద్ధతులను అవలంబించాలి.

2.    మూల్యాంకనం  విద్యార్థులచే చేయాలి

3.    విద్యార్థులు స్వీయంగా మదింపు చేసుకోగలగాలి

4.      విద్యార్థులు స్వతంత్రంగా నైపుణ్యాలను అభివృద్ధిచేసుకోవాలి.   

 

18617 registered users
7272 resources