నిత్యజీవితంలో బౌగోళికశాస్త్రం

 

ఒక రోజు నేను ఇంటికి నడచి వెళుతూ ఉండగా  ఒక తల్లికి,  తన ఏడెనిమిది సంవత్సరాల వయస్సు గల కూతురుకు మధ్య జరిగిన సంభాషణ విన్నాను.  వారిద్దరికి  ముందు ఇద్దరు ఆఫ్రికా యువకులు వెళుతున్నారు.  ఈ అమ్మాయి తన తల్లితో వారికి వెంట్రుకలు చుట్టచుట్టుకొని ఎందుకుంటాయి, మన కెందుకు అలా ఉండవు ?  అని అడిగింది.  దానికి ఆమె  ఆఫ్రికా ప్రజలందరికీ అలాంటి జూట్టే ఉంటుంది  అని సరైన వివరణ లేని జవాబిచ్చింది . ఆ తల్లి ఇచ్చిన  జవాబు పిల్లలకు అసంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తూ వారి జ్ఞానాభివృధ్ధికి గొడ్డలి పెట్టౌతుంది . ఆ సమయంలో వారు తమ పరిసరాలల్లో చూసినవన్నీ తమ స్వంత పధ్ధతులతో తమదైన వేగంతో నేర్చుకొంటారు . ఆ ప్రశ్న భౌగోళికశాస్త్రాదైనందున  ఆ కారణం వివరించాలని  నాకు ఎంతగానో అనిపించింది.

నాకు సంబదించినంతవరకూ బౌగోళికశాస్త్రం ఒక జీవన మార్గం. మనందరి దినచర్య తూర్పున ఉదయించే సూర్యునితో మొదలౌతుంది.  సూర్యుడు పడమర అస్తమిస్తాడని, అలాగే రుతువులు  గురించి ఓనమ్,  పొంగల్,  ఉద్భిజాలు (వృక్ష సమూహాలు)  సునామీ, ఉష్ణోగ్రతలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి  వివిధ రకాల దుస్తులు, ప్రాంతీయమైన కొన్ని వ్యాధులు, ప్రాంతీయం కానివి కొన్ని వ్యాధులు గురించి  పిల్లవానికి ముందే తెలుసు. కానీ బౌగోళిక ప్రాంతానికి  దీనికి గల సంబంధం మాత్రం విద్యార్థులకు తెలియక పోవచ్చు.  

పిల్లలు నేర్చుకోవడానికి అంతర్గత సామర్థ్యం గల వాటిలో మాతృభాషతో పాటు భౌగోళికశాస్త్రం కూడా ఒకటి అని నేను నమ్ముతాను.  వీటిని వారు జీవితాంతం నేర్చుకోంటూనే ఉంటారు.  4 నుండి 14 సంవత్సారల వయస్సు గల పిల్లలు అడిగే కొన్ని ప్రశ్నలను మనం పరిశీలిధ్ధాం

·         గ్లోబన్నది గుండ్రటి బంతి అయితే మనమెందుకు పడిపోము ?

·         రాజు  “మంగోల్” లో  ఉన్నంత  నిశ్చింతగానే  “బ్రెజిల్లో” కూడా ఉంటాడా ?

·         అరబ్బులకు మాత్రమే ఎందుకు తలపాగా ఉంది ? అమ్మా, నాన్నా మీకేందుకు తలపాగా లేదు ?

·         ఏప్రిల్,  మే నెలలే ఎందుకు వేడిగా ఉంటాయి, డిశంబర్లో ఎందుకు వేడిగా ఉండదు ?

·         కేరళలో ఉన్నప్పుడు  నేను నూలు దుస్తులే వేసుకొంటాను,  ఉన్ని దుస్తులు ఎందుకు ధరించను  ?

·         మధ్యాహ్న సమయంలో డిల్లీలో నీడ చాలా పొడుగ్గా ఉండి పూనేలో అలా ఎందుకు ఉండదు ?

·         డిశంబర్ లోని  నా పుట్టిన రోజుకి కొన్ని మామిడిపండ్లను చూడవచ్చా?

·         ఋతుపవనాలు వచ్చిపోతూంటాయి అంటారు ? అవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి ?

·         చంద్రుని పరిమాణంలో ఎందుకు మార్పు ఉంటుంది ? ఎందుకు మాయమౌతుంటాడు ?

·         చెన్నైలో ఎందుకు ఒకే కాలం ఉంది ? అగర్తలా లో ఎందుకు నాలుగు  కాలాలున్నాయి ?

·         వేసవిలో పర్వత ప్రాంతానికి, శీతాకాలంలో సముద్రతీర ప్రాంతానికి ఎందుకు వెళ్తాం ?

·         కొందరు ఎందుకు “చోలే బతూరా” నే ( శనగలతో చేసే ఒక వంటకం) కావాలంటారు ? కొందరు “ఇడ్లీ సాంబారే”  కావాలంటారు ? ఎందుకు ?  

·         అమెరికాలో  మనం Chiken Pox  కానీ Yellow fever లాంటి వ్యాధుల గురించి కానీ వినం,  ఎందుకు ?

·         ఇంద్రధనస్సు పూర్తీ వృత్తంగా అంటే నేను వేసుకొనే జడలాగా ఎప్పుడూ ఉండదా ?

·         హైదారాబాద్ లో ఎందుకు మంచు పడదు ?  దీనిని చూడడానికి మనం హిమాలయాలకు ఎందుకు వెళ్ళాలి ?

·         సూర్యాస్తమయం తరువాత సూర్యుడు ఎంత వేగంగా తూర్పున ఉదయించడానికి వెళతాడు ?

·         చలికాలంలో మేఘాలు క్రిందకు వచ్చి మంచుగా మారతాయా ?

·         దేవదారు వృక్షాలు శృంగాకారంలో పెరుగుతాయి, మరి వేప చెట్లు అలా ఎందుకు పెరగవు ?

·         ఇక్కడ  మనం  జింకలను, పులులనే  చూస్తాము ఎందుకు ? కివీ (Kiwi) సీల్ (krill)  మొదలైన జంతువులు ఎందుకు కనిపించవు?

·         విమాన చోదకుడు ఆకాశంలో ఎలా ఎగరగలడు ?  ఎప్పుడూ దారి తప్పడా ? ఎందుకు ?

ఇలాంటి ప్రశనలన్నింటికి నాకు జవాబులు ఎక్కడ లభిస్తాయి..

తల్లితండ్రులు, తాతా- అవ్వలు, మరియు ఉపాధ్యాయులు  పైవాటిలో చాలా వాటికి వారి స్వానుభవాలతో సమాధానం ఇవ్వగలరు.  వీరిచ్చే సమాధానాలు పిల్లలకు చాలా నమ్మకమైనవి, అంగీకరించేవిగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు మాత్రమే మరికొంత జ్ఞానాన్ని,  వివరణను ఇతర వాటికి సంబంధించిన  భావాలను కలిగి ఉంటాయి.

కొన్ని ప్రత్యుత్తర సూచిక ప్రశ్నలను పిల్లలను అడగడం ద్వారా మనం వారికి వారే సమాధానాలు కనుగొనేలా చేయవచ్చు.  ఉదాహరణకు మొదటి ప్రశ్ననే తీసుకొందాం మనం ఒక ఫుట్ బాల్ ని తీసుకొని దానిపై  ఒక చీమను వదులుదాం. అది దాని మీద అలా ఇలా కదులుతూనే ఉంటుంది .దీనిని పిల్లలకు చూపిద్దాం, వారిని అడుగుదాం చీమ పడిపోతుందా ? అలాగే ఉందా? వారినే బంతిని కదలించి చూడమందాం.

మరొక ఉదాహరణను తీసుకొందాం  అరబ్బులకు ఎందుకు తలపాగా (Thoub) ఉంటుంది ? అమ్మో, నాన్ననో ఎందుకు  తలపాగాను ధరించారు?

దీనికి పిల్లలు సమాధానం తమంతట తామే కనుగొనేందుకు మనం వారిని కొన్ని ప్రశ్నలను అడుగుదాం.  నీవు దుస్తులను, స్వెట్టర్ ఎందుకు ధరిస్తావు ? ఎండాకాలంలో  చెప్పులు(మేజోల్లు) లేదా మధ్యాహ్న సమయాన  గొడుగు ఎందుకు అవసరం ? వారి జవాబులు బాగా కనిపించడానికి  లేదా వెచ్చగా ఉండడానికి లేదా సూర్యుని నుండీ రక్షించుకోవడానికి మొదలైనవిగా ఉండవచ్చు.  దీనికి మనం ఇసుక  లేదా మట్టి నుండి దూరంగా ఉండడానికి అన్న ఆలోచనను తీసుకొని రావచ్చు. అలానే అరబ్ దేశాలలో ఎక్కువ వేడిగానూ, దుమ్ము, ఇసుక  ఉంటుంది , ఇలాంటి ప్రదేశాలలో తల నుండి కాళ్ళ దగ్గర వరకు దుస్తులను ధరించి ఎండలో ఉంటే ఎలా ఉంటుందని అడగవచ్చు.

ఇక్కడితో మన వివరణలను ఆపితే  పిల్లలు తమ వయసుకు తగిన అర్థవంతమైన జ్ఞానాన్ని  తమ ఆలోచనల ద్వారా అభివృధ్ధి చేసుకొంటారు. ఇందులో బట్టీ పధ్ధతికి స్థానం ఉండదు.

మాతృభాషలానే ఎక్కువ శ్రమ, పక్షపాతం లేకుండా పిల్లలు నేర్చుకోగలిగినది భౌగోళిక శాస్త్రమే.  కానీ వారికి కావాసినదంతా కొంత మార్గదర్శనమే.  ఇందుకు దోహదకారిగా మనం కొన్ని ప్రత్యుత్తర సూచిక ప్రశ్నలను ఆడగడం ద్వారా పిల్లల ఆలోచనలను  ప్రాథమిక స్థాయి నుండే తర్కబధ్ధం చెయ్యవచ్చు.  అలాగే వీరిలో ఆలోచనలను, పరిశీలనలను, అవగాహనను సరిచూడటాన్ని,  క్రమబద్దీకరణానికి సంబధించిన వాటిని అభివృధ్ధి చేయవచ్చు.  

ఒక బౌగోళిక  శాస్త్రోపాధ్యాయురాలిగా పాఠ్యాంశాలకు సంబంధించిన సామాగ్రి నాకెప్పుడూ తరగతి నుండి లేదా నేను కట్టుకొన్న చీర నుండి లేదా  విద్యార్థుల ఎత్తు, రంగు వారి సంచిలలో ఉన్న వస్తువులు వారు భోజనానికి తెచ్చిన పదార్థాలు మరియు నల్లబల్ల, సుధ్ధముక్క నుండి నాకు లభించేవి. నేను వాతావరణం గురించి  బోదిస్తున్నప్పుడు ఆకాశం, గాలి, ఉష్ణోగ్రత, మేఘాలు, వాన గురించి పిల్లలు అప్పుడు తరగతి గదిలోనూ, వారి పరిసరాల్లో ఉన్న స్థితిని ఆధారంగా చేసుకొంటాను. భౌగోళికశాస్త్రం నిత్యజీవితంతో పూర్తీగా ముడిపడి ఉన్నందున, ఉపాధ్యాయుడు పిల్లలకు తమ జీవితంలోని  స్వానుభవాల వెనుక గల బౌగోళిక భావనను చూడడానికి వీలయ్యేలా వాళ్ళను వారు అబివృధ్ధి చేసుకొనేందుకు సహాయపడాలి.

“ఒక బౌగోళిక  శాస్త్రోపాధ్యాయురాలిగా పాఠ్యాంశాలకు సంబంధించిన సామాగ్రి నాకెప్పుడూ తరగతి నుండి లేదా నేను కట్టుకొన్న చీర నుండి లేదా  విద్యార్థుల ఎత్తు, రంగు వారి సంచిలలో ఉన్న వస్తువులు వారు భోజనానికి తెచ్చిన పదార్థాలు మరియు నల్లబల్ల, సుధ్ధముక్క నుండి నాకు లభించేవి”

పిల్లలలో అభ్యాసానికి  “సంభాషణ”  అన్నది ఒక ముఖ్యమైన చర్యగా కృష్ణకుమార్ నమ్ముతారు. పిల్లలు తాము చూసిన కొత్త విషయం అంటే ఒక గొంగళిపురుగు కావచ్చు లేదా కొత్త ప్రదేశం, కొత్త సినిమా, చదివిన పుస్తకం కావచ్చు, దేనినైన వారు వెంటనే ఇతరులతో సంభాషణ రూపంలో పంచుకొంటారు. ఈ విధంగా ఇరువురూ అభ్యాసనం  పొందుతారు.  పిల్లలు సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళి చాలా అనుభవాలను పొంది ఉంటారు, చాలా పరిశీలనలను చేసి ఉంటారు కావున, ముఖ్యంగా సెలవుల తరువాత జరిగే సంభాషణ వలన చాలా అభ్యసనం జరుగుతుంది. వీరు ఈ విషయాలను మిత్రులతో పంచుకొన్నప్పుడు  వారి ఊహాత్మకతను  పెంచి స్వీయాభ్యసనానికి దోహదపడుతుంది. ఈ ప్రదేశాలకు సంబంధించి పిల్లలు తెచ్చిన ఛాయాచిత్రాలను, పటాలను ఉపయోగించి ఉపాధ్యాయుడు ఈ భావనల పునరాభ్యసనకు దోహదపడవచ్చు.  

పెద్దపిల్లలైతే ఈ పరిధి ఇంకా ఎక్కువగా ఉంటుంది . వారు వార్తాపత్రికలు, వివిధ టి‌వి ఛానళ్ళు, సినిమాలు, పాటలు కథల పుస్తకాలు, ప్రయాణం,పర్వతారోహన, సాహస కృత్యాలు గురించి చెపుతారు. ప్రతి అనుభవాన్ని వ్యక్తీకరించినపుడు ఒక కొత్త వనరు ఏర్పడినట్లే.

మంచి జీవితం కొరకు తప్పని సరిగా బౌగోళికశాస్త్ర భావనలు నేర్చుకోవలసిందేనా ? ఈ భావనలు నిజంగా మన జీవితంలో సహాయపడుతాయా ? ఇవి జీవ నైపుణ్యాలా ? వారు  ఈ నైపుణ్యాలలో పరిణితి సాధించాలా ?

నిత్య జీవితంలో జరిగిన లేదా తెలుసుకొన్న ఈ సంఘటనలు లేదా జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అనుకొనే ఈ అనుభవాలను బౌగోళిక అనుభవాలు అనవచ్చా ? బౌగోళిక పరిజ్ఞానం మనకు జీవన నైపుణ్యాన్ని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి నిత్యజీవితంలో సమస్యా సాధనకు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఇతర విషయాలను అర్థం చేసుకోవడానికి, ఒక వృత్తిగా మలచుకోవడానికి  పనికివస్తుందా అని ప్రశ్నించుకొంటే ?  అంటే “అవునని”  చెప్పవచ్చు.

నేను ఈ వ్యాసాన్ని వ్రాస్తూ నా సోదరిని  నిత్యజీవితంలో భౌగోళికశాస్త్ర  ఉపయోగం గురించి  ఆమె అభిప్రాయాన్ని అడిగాను. ఆమె బాంకు ఉద్యోగి,  ఆమె గణితాన్ని అభ్యసించారు, ఆమె బ్యాంక్ ఖాతాలో సొమ్ముని ఎలా రెట్టింపు చేసుకోవచ్చో అలవోకగా చెప్పవచ్చు,కానీ భౌగోళికశాస్రం గురించి కాదు.  ఆశ్చర్యకరంగా ఆమె నేను ప్రశ్నను అడిగిన వెంటనే, పదే పదే ఎప్పటినుండో  ఆ ప్రశ్నను అడుగుతున్నట్లుగా అనిపించే విధంగా వెంటనే  ఈ విధంగా జవాబిచ్చారు. బౌగోళిక భావనల అవగాహన, జీవనశైలిని, నిత్యజీవితంలోని సమస్యలను , సంఘటనలను,  అవగాహన చేసుకోవడానికి అవశ్యము అని పాఠశాల స్థాయిలో తెలుసుకొని ఉంటే తప్పకుండా ఈ రోజుటికి ఇంకా మంచిస్థాయిలో  ఉండేదాన్నేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సమస్యను గ్రహించడమే ఒక సమస్య.  

ఈ సంభాషణ నుండి మనమేమీ గ్రహించవచ్చు ?

నా మిత్రుని కుమారిని కొకరికి బౌగోళిక శాస్త్రం అంటే చాలా ఇష్టం, చాలా ఆసక్తి.  చాలా సమయాల్లో దీనిలోని భావనల గురించి చర్చించడం, వాదించడం జరిగింది. ఒకసారి  రేఖాంశాలు, అక్షాంశాలు వాటి యొక్క ఉపయోగం గురించి కూడా చర్చ జరిగింది.  చాలా సంవత్సరాల తరువాత వాణ్ని నేను ఒక యువ విమాన చోదకుడిగా చూశాను.  నేను గతకాలం విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు  అతనికి  రేఖాంశాలు- అక్షాంశాలు భావన, ఒక నిర్ణీత ప్రదేశం గురించిన అవగాహనకోసం  ఎలా ఉపయోగపడింది  చెప్పాడు. పిల్లలను  ఉత్సాహపరచడం చాలా ముఖ్యమని నేను ఈ విధంగా ఒక ముఖ్య పాఠాన్ని చేర్చుకొన్నాను.

ప్రస్తుతం అమలులో ఉన్న  భౌగోళిక పాఠ్యప్రణాళిక  పిల్లల అభ్యనానికి సహాయపడుతుందా ?

ఇక్కడ మనం ముఖ్యంగా రెండు విషయాల్లో మార్పులు చెయ్యాలని నాకనిపిస్తుంది . అవి ఒకటి

·         విషయపరిజ్ఞానం

·         ఈ విషయపరిజ్ఞానాన్ని పిల్లలకు  విశదీకరించే మార్గం

పిల్లలకు ఇప్పుటికే  చాలా విషయాలు తెలుసనుకొందాం. వాళ్ళు  ఈ తెలిసిన విషయాన్ని మరింత అభివృధ్ధి చెయ్యగలరని,  ఈ విషయానికిన్ అదనంగా విషయాలను కలపగలరని, మార్చగలరని,  మెరుగుపరచగలరని, మరిన్ని విషయాలను ఊహించగలరని, అవగాహన చేసుకోగలరని అనుకుందాం. వారికి తెల్సినదానికి ఒక సౌలభ్యదారునిగా మన మేమివ్వగలమో  చూద్దాం. వారి కేమిటి తెలుసో తెలుసుకొని, ఎలాంటి వాటిని అందిస్తే వారు స్వీయానుభావాల నుండి అభ్యసిస్తారో వాటినే ఇద్దాం.  ఉదాహరణకు  1,2,3,4వ తరగతుల  పిల్లలకు  గ్లోబు, భూభ్రమణం ,భూపరిభ్రమణం,  పగలు-రాత్రి ఏర్పడడంలో వీటి సంబంధం,  భూభ్రమణ సిద్దాంతాలు, ఇలాంటి ప్రతిస్థాపకాలను అర్థం చేసుకోవడం కష్టం. అలాకాకుండా వాళ్ళకు పరిచితమైన  అంశాలైన సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని,  పడమర అస్తమిస్తాడని, పగటి పూట సూర్యుడు వివిధ ప్రదేశాల్లో ఉంటాడని, అలాగే ఏర్పడే నీడలు వివిధ పొడవుల్లో ఉంటాయని, సూర్యుని స్థానంతో పాటు ఉష్ణోగ్రతల్లోని  భేదం మొదలైనవి చెప్పవచ్చు.   అలాగే పై తరగతుల్లో ఇదే సమాచారాన్ని  గ్లోబుకు, భూభ్రమణానికి భూపరిబ్రమణానికి చేర్చి చెప్పవచ్చు.

చిరునామా  ఆధారంగా ఒక ఇంటిని కనుక్కోవడంలో పిల్లవానికి సహాయపడుదాం.

ఇంటి నంబరు 5B 1వ ముఖ్య వీధి పాయ్ లేఔట్ (House # 5B 1 St Main, Pai Layout )

పిల్లవానిని పోస్ట్ మాన్ కి  ఇంటిని కనుక్కోవడానికి ఏ సమాచారం ఇచ్చారు అని అడుగుదాం.  వారి సమాధానం ఇంటి నంబరు (5B )మరియు రహదారి (1వ ముఖ్య వీధి పాయ్ లేఔట్) గురించి కావచ్చు.   నీవే పోస్ట్ మాన్ అయితే ఇంటిని ఎలా కనుగొంటావు ?  అని అడుగుదాం అతనికి ఒక సరైన రహదారి చిత్రాన్ని, ఇంటి నంబరుని చిత్రించి సహాయపడండి. ఈ స్థలాన్ని కనుగొనడానికి ఇచ్చిన ముఖ్యమైన రెండు సూచికలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి వివరించండి. తరువాత ఇదే అంశాలను గ్లోబుకు అన్వఇస్తూ అక్షాంశాలు- రేఖాంశాలు అంటే ఏమిటి ? వీటి సహాయంతో ఒక ప్రదేశాన్ని గ్లోబుపై ఎలా గుర్తిస్తారో వివరించండి.

నేత్రా మరియు ప్రీతం” త్రిభుజాకారం” లోని  “అలివా” (Aliva) బిస్కెట్ తినడానికి ఇష్టపడుతారు.  ఇప్పుడునేత్రా ఎపుడు ఏ –“త్రిభుజాకార” వస్తువుని చూసినా “అలివా” అని అలాగే ప్రీతం అలివాను చూడగానే త్రిభుజమని అంటారు. నిజానికి ఇద్దరూ ఆ ఆకారాన్ని ఏమంటారో తెలియజేయకనే గుర్తుపట్టగలిగారు. ఇద్దరూ త్రిభుజాకార అంశాన్ని తమ అనుభవాలతో తెలుసుకొన్నారు.  ఈ విధంగా పిల్లవాడు అలివాని త్రిభుజమని చెప్పినప్పుడు, అవును, “అలివా”  “త్రిభుజాకారం”గా ఉన్న బిస్కెట్, “పర్వతశ్రేణి” “క్రిష్టమస్ చెట్టు”  కూడా  ఒకే రకానికి అంటే త్రిభుజాలకు సంబంధించినవని ఉపాధ్యాయుడు విశదీకరించవచ్చు.

తమ చుట్టూ ఉన్న పరిసరాల గురించి లేదా ప్రపంచాన్ని  గురించి పిల్లలు ఎలా తెలుసుకొంటారు ?

 పి‌ల్లలు స్పర్శించడం, తినడం, ప్రయోగం చెయ్యడం, పరిశీలించడం, అనుకరించడం, ప్రశ్నించడం   ఇంకా ఇలాంటి అనేక విధాలుగా నేర్చుకొంటారు. నిర్మాణాత్మకవాదం (సిధ్దాంతం) ప్రకారం ప్రతి అభ్యాసకుడు తన జ్ఞానాన్ని ఇలాంటి అనుభవాల ద్వారా జీవితాంతం గుర్తుండేలా నిర్మించుకోంటారు. విద్యార్థుల జ్ఞాన సమపార్జనకు ఎలాంటి సంఘటనలను, సన్నివేశాలను, అనుభవాలగా ఉంచాలో జాగ్రత్తగా NCF 2005 ఈ ఉధ్ధేశ్యాలను గుర్తించింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఉపాధ్యాయుడు వీటిని ఎలా అర్థం చేసుకొంటాడు అని ?

పిల్లలు తమంతట తామే జ్ఞానాన్ని నిర్మిచుకొనేందుకు ఉపాధ్యాయుడు ఏం చెయ్యాలి ?

ఇందుకై ఉపాధ్యాయుడు ఉపయోగించగల ముఖ్యమైన ఆయుధం “అడగడం”.  అభ్యాసకుని నుండి “ఎందుకు” అన్న ప్రశ్నలు “కారణాన్ని” అన్వేషించవచ్చు లేద “వివరణను” ఆశించవచ్చు. కారణాన్ని తెలపడం, వివరణఇవ్వడంతో సమానం కాదు . కారణాలన్నవి నమ్మకాలను ఏర్పరచడం కోసం లేదా ఏదైనా విషయం నిజం అన్నది నమ్మడం కోసం.వివరణలు కొన్ని సహజ ప్రక్రియలకు,లేదా సంఘటనలకు సంబంధించినవై ఉంటాయి. ఉదాహరణకు  

పర్వతాలలో కొన్ని మాత్రమే మంచుతో కప్పబడి ఉంటాయి. ఎందుకు?

అరుణాచలప్రదేశలో గల నాందాపా(Namdhapa) 5 గంటలకు సూర్యోదయమైనప్పుడు, గుజరాత్ లోని ద్వారకలో (Dwaraka) సమయం  ౩ గంటలే అయి ఇంకా ఘాడాంధకారంగా ఉంటుంది ఎందుకు ? 

వీటి వివరణలలో సిద్ధాంతాలు మరియు నియమాలు రెండూ ఉన్నాయి. కొన్ని సమయాల్లో ఉపాధ్యాయుడు ఈ ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ముందు సంఘటనను వివరించాలి తరువాత ఆ నియమాన్ని వివరించాలి.

చాలా సంధర్భాలలో ఉపాధ్యాయుడు లేదా తల్లితండ్రులు ఇచ్చే వివరణ నిజానికి వివరణాత్మకంగా ఉండదు. ఉదాహరణకు  

1వ ప్రశ్న : సవన్నాలను ఎందుకు “పార్క్ లాండ్” (Park land) అని ఎందుకు అంటారు  ?

జవాబు : ఎందుకంటే ఈ గడ్డిమైదానాల చుట్టూ ఉద్యానవనాల చుట్టూ ఉన్నట్లు కొన్ని వృక్షాలు ఉంటాయి.

2వ ప్రశ్న “నీటిబుగ్గల”  ప్రత్యేకత ఏమిటి ? 

జవాబు: నీటిని తోడనవసరం లేదు నీరు బయటకు ఉబికి బయటకు వస్తూఉంటుంది

౩ వ ప్రశ్న: సహారా ప్రాంతం ఎందుకు ఎడారి అయింది ? ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ కనుక

ఇవన్నీ స్పష్టమైన వివరణలు కావు, ఈ జవాబుల్లో ఏదీ కూడా వ్యక్తంచేసిన  సందేహాన్ని తీర్చలేదు. ఎందుకు సవన్నాలో   కొన్ని వృక్షాలు అలా పెరిగి వాటికి పార్క్ లాండ్ ఆకారాన్ని ఇస్తాయి ?

“నీటిబుగ్గల” లో  నీరు అవంతట అవే తోడకనే బయటకు వస్తుంది?

ఎందుకు సహారాలో వర్షపాతం ఎక్కువగా ఉండదు.  ఇవన్నీ ఎప్పటికీ వివరించరు .

ఉపాధ్యాయులు  విషయ వివరణ, విద్యార్థులకు కొంత అంచనా వేయగల శక్తిని ఇచ్చేదిగా ఉంటూ దీని ఆదారంగా ఖచ్చితమైన బావి కథనాలను ఏర్పరచేలా ఉండాలి.

భూమి కంటే నీరు వేడెక్కడం మరియు చల్లారడం కొద్దిగా నిదానంగా జరుగుతుందని తెలుసుకొన్నచో, సముద్ర సమీపాన వాతావరణం సాధారణంగా ఉంటుందని అంచనా వేయగలగాలి .

అలాగే “నీటిబుగ్గ”  అన్నది ఒక చిన్న పళ్ళెం వంటిది, తక్కువ ప్రదేశంలో ఉంటుందని, తద్వారా ఒత్తిడి ద్వారా నీటిని బయటకు పంపుతుందని విద్యార్థులు గ్రహిస్తారు.  అలాంటి ప్రాంతంలో త్రవ్విన బావినుండి నీరు ఉబికి బయటకు వస్తుంది.  

బయటి ప్రపంచాన్ని భౌగోళిక తరగాతిగదిగా మార్చలేమా ? ఉపాధ్యాయులు మరియు పాఠశాల తగినంత ముందుగా కొన్ని భౌగోళిక అంశాలను కలిపి ప్రణాళికను రూపొందించవచ్చు ( నేల, క్రమక్షయం సహజ వృక్ష సంపద , వ్యవసాయం పౌరుల వృత్తులు మొదలైనవి ) లేదా కొన్ని సమయాల్లో విజ్ఞానశాస్త్రాన్ని, బౌగోళిక శాస్త్రంతో కలిపి (సౌర వ్యవస్థ, ఖనిజాలు) బోధించవచ్చు.  శీతోష్ణస్థితి, వాతావరణానికి సంబంధించిన భావనలను సంవత్సరం అంతా కాలానుగుణంగా చెప్పవచ్చు, ఎందుకు  వీటిని తొందరగా బోధించాలి ? లేదా రెండు కాలాల గురించి 4 వ తరగతిలోనూ మరో రెండింటి  గురించి మరో తరగతి 7 లోనూ చెప్పవచ్చు . ఇవి కాకుండా బృందపని, సినిమాలు చూడడం, యాత్రావలోకనం గురించి చెప్పవచ్చు. పిల్లలు తాము నేర్చుకోవడానికి  ఇష్టపడే అంశాల ఆధారంగా తమ స్వంత పాఠ్యప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  కొన్ని అంశాలను పెద్ద తరగతుల విద్యార్థులే చిన్న తరగతుల విద్యార్థులకు బోధించవచ్చు. తరగతిగదిలో కానీ గ్రంధాలయంలోకానీ  ఎంపిక చేసిన అంశాలను పరిశీలన గ్రంధాల నుండి ఎన్నిక చేసుకొని చర్చించవచ్చు. ఇతర పుస్తకాలనుండి వార్తాపత్రికల నుండి  సేకరించిన అంశాలతో స్క్రాప్ పుస్తకాన్ని తయారు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది .

ప్రస్తుత కాలంలో మన జీవితం అర్థవంతం కావడానికి భౌగోళిక పరిజ్ఞానం ఎంతో అవసరం. స్వీయానుభ్వాల ద్వారా ఈ పరిజ్ఞానాన్ని పొందడానికి ఎంతో సమయం అవసరం. మనం జీవించడానికి అనువైనప్రదేశాన్ని  ఎన్నుకోవడానికి, గృహనిర్మాణానికి, మన ప్రదేశాలకు అనువైన వాహనాలు కొనుగోలుచేయడానికి, అవసరమైన పరిజ్ఞానం మన పాఠశాల ఉపాధ్యాయుడు మనలో ఏర్పరిచే బౌగోళిక నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది.

పై అంశాలన్నింటిని తెలుసుకోవడానికి  మరీ ముఖ్యంగా ఈ గ్రహంపై జీవనాన్ని సాగించడానికి బౌగోళిక పరిజ్ఞానం అత్యంత అవసరం.     

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

భోగోళిక శాస్త్రాన్ని ప్రకృతికి దగ్గరగా విద్యార్ధికి చూపగలిగితే ఆ విద్యార్ధికి ఆసక్తి కలిగి ఆనందంగా నేర్చుకుంటాడు.ఉదాహరణకు సూర్యుడు తర్పుదిక్కున ఉదయిస్తాడు అని చెప్పడం గాకుండా సూర్యుడు ఉదయాన్నే ఉదయించే సమయంలో చూపగలిగితే ఆ విద్యార్ధి ఆనందాన్ని అనుభవిస్తూ నేర్చుకుంటాడు.అదే విధంగా ఇంద్రదనస్సు ఏర్పడినప్పుడు చూపగలిగితే ఆ విద్యార్ధి తన జీవితంలో మర్చిపోలేడు.మీకు మా కృతజ్ఞతలు.

18338 registered users
7154 resources