చిరకాలం గుర్తుంచు కొనేలా బోధన

 బాగా అవగాహన చేసుకొన్న అంశమేదైనా  చాలా కాలం స్మృతిలో ఉంటుంది. ఈ వ్యాసం “స్మృతి మరియు విస్మృతి”కి సంబంధించిన  అంశాలను మరియు బోధించిన అంశాలను  విద్యార్థులు ఎక్కువకాలం స్మృతిలో ఉంచుకొనే  సామర్థ్యాన్ని కలిగించచే మార్గాలను  వివరిస్తుంది.  

స్మృతి మరియు విస్మృతి  ఒక నాణేనికి రెండు పార్శ్వాల వంటివి.  మొదటిది  బోధించిన అంశంలో  గుర్తుంచుకొన్నదైతే  రెండవది ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి ఇద్దరికీ బాధను కలిగించే విస్మృతి. అయితే రెండుకూడా ప్రయత్నపూర్వకంగా జరిగేవే. అభ్యసించినవన్నీ గుర్తుంకోలేము  అలాగే అన్నీ మరచిపోలేము. ఇవి ఒక పధ్డతి ప్రకారం జరుగుతాయి. నిజానికి “విస్మృతి ఒక బహుమతే. మెదడుకూడా ఈ విషయంలో ఒక నిర్దుష్టమైన సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.  అందుబాటులో ఉన్న అన్నిసంగతులను, సంఖ్యలను గుర్తుంచుకోవడం  సాధ్యంకాదు. కావున ఈ సంగతుల, సంఖ్యల ఆధారంగా రూపొందిన కొన్ని సూత్రాలు, సాధరానీకరణలు  ఎప్పటికీ స్మృతిపథంలో మసలుతూ ఉంటాయి.  సంఖ్యలకు, సంగతులకు విద్యలో స్థానంలేదు కానీ ఇవన్నీ అమూర్త భావనలను, పరిణామాన్ని అవగాహన చేసుకోవడంలో దోహదపడుతాయి. వీటికి మన స్మృతిపథంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది.    

మనం ఎందుకు మరచిపోతాం ? లేదా  ఒక అంశాన్ని తరగతిలో బోధించాక  కొంతమంది కొన్ని అంశాలనే గుర్తుంచుకొంటారు,  కొంతమంది  వీరు గుర్హ్తుంచుకొని మరికొన్ని అంశాలను గుర్తుంచుకొంటారు,  మరి కొంత  -మంది  అన్ని అంశాలను  గుర్తుంచుకొంటారు, కొంత మంది కకావికలుగా అవుతారు ఎందుకు  ? అన్నది చిరకాలం నుండి అన్వేషిస్తున్న ప్రశ్నే. అర్థవంతం కాని పదాలతో  కాలం మరియు  స్మృతి మరియు ధారణలకు  మధ్యగల  సంభంధం పై  ప్రయోగాలను నిర్వహించిన మొదటి  శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్. విస్మృతి వేగం, ధారణ పరిమాణం  అభ్యసించిన అంశం యొక్క అర్థం, క్లిష్టత స్థాయి , అంశంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం, అభ్యాసకుని మేధస్సు, అనుభవం , ప్రేరణ  పునశ్చరణ  అంశాల  అంశాలపై ఆధారపడి ఉంటుంది, ఇందులో మరువకూడని మరొక  ముఖ్య అంశం ఉపాధ్యాయుని ప్రభావం.   

సరైన బోధనా మెలుకవలను  ఉపయోగించకపోవడం వలన పిల్లలలో విస్మృతి పెరిగే అవకాశం ఉంది. కావున ఉత్తమ బోధనా మెలుకవలను ఆచరించడం ద్వారా ఈ విస్మృతిని నివారించవచ్చు.  సరిగా అవగాహన చేసుకోని లేదా  పూర్తీగా తప్పుగా అవగాహన చేసుకొన్న భావనలు కాలంగడిచే కొద్దీ లేదా ఈ భావనలను ఉపయోగంలో లేనందున విస్మృతి సంబవించవచ్చు. విఘాతం లేద ఆటంకం వలన కూడా విస్మృతి జరుగుతుంది. ఒకే ఉద్దీపనం లేదా దగ్గరపోలికలు కలిగిన ఉద్దీపనానికి  వివిధ రకాలైన ప్రతిస్పందనలు ఉండడం  వలన ఈ విఘాతం లేద ఆటంకం ప్రక్రియ సంభవిస్తుంది. ఉదాహరణకు  ఒక పదాల ఉద్దీపన జాబితాకు,  రెండు వేరు వేరు ప్రతిస్పందనల జాబితాలు ఉన్నపుడు  రెండవజాబితాలోని పదాలు  మొదటిజాబితాలోని పదాలు  అంతరాయం ఏర్పరుస్తాయి.      

అభ్యాసకుడు అభ్యసనా అనుభవాలను ఇతర అనుభవాలకు అనుసంధానం చేసుకొన్నపుడు  అభ్యసనం ఎక్కువకాలం స్మృతిలో ఉంటుంది. ప్రణాళిక బద్ధంగా అభ్యసించిన విషయం ఇతర విషయాల అభ్యసనానికి ఎప్పటికీ ఆటంకం కాదు. అవగాహనతో అభ్యసించినది ఏదైనా చిరకాలం గుర్తుంటుంది.  

విస్మృతి వేగం మరియు  కొంతకాలం గడచిన తరువాత జరిగే విస్మృతి పరిమాణం రెండూ కూడా  అభ్యసనం జరిగిన తరువాత జరిగే పునశ్చరణ  జరిపే అవధులపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా అంశాన్ని మరలా గుర్తుకుతెచ్చుకొనేందుకు మాత్రమే అభ్యసించి పునర్విమర్శ చేయకపోతే అవి తొందరగా మరచిపొయ్యే అవకాశం ఉంది.  పునర్విమర్శ,  అభ్యసనం చేసిన విషయాలను గుర్తుంచుకొవడానికి మంచి పద్ధతి. పునర్విమర్శ అనేది పఠనంలా కాకుండా కొత్తభావాలకోసం జరగాలి.      

బోధించిన విషయాలను విద్యార్థులు ఎక్కువకాలం గుర్తుంచుకొనే సామర్థ్యాన్ని కలిగించడానికి ఈ క్రిందివాటిని ఆచరించాలి.

1.     తగినంతగా ఉన్మూఖీకరణ చేయాలి

2.    అందరి విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవాలి.

3.    బోధించిన అంశాన్ని ఆకోణంలోనే వారు ఆవగాహన చేసుకొన్నారని దృఢపరచుకోవాలి.

4.    నియమితకాలం ప్రకారం పునరావలోకనం నిర్వర్తిస్తూఉండాలి.

5.    అభ్యసనాంశాలను నిత్యజీవిత అనుభవాలకు జోడించగలగాలి

6.    అభ్యసించాల్సిన విషయాలను క్లుప్తంగా ఒక క్రమపధ్ధతిలో అమర్చాలి.

7.    అభ్యసించిన అంశాలను గుర్తుంచుకొనేలా వారిని ప్రోత్సహించండి

8.    పరస్పరం అడ్డుపడే రెండు అంశాలను వెంటవెంటనే బోధించకండి.

9.    కొత్తసామాగ్రిని ఆంత్రంగా అందజేయకండి, వీటివలన తగినంతాగ

10. బోధించే అంశాలకు మూర్త ఉదాహరణలను, నిత్యజీవిత అనుభవాలను జతచేయండి.  

____________________________________________________________________________________________

 ఈ వ్యాసాన్ని Mary Dorothy Fermandez  రచించారు. తొలుత టీచర్ ప్లస్ (సంచిక 19 జూలై ఆగష్ట్ 1992)  పత్రికలో ప్రచురించారు, కొన్ని మార్పులతో ఇక్కడ ప్రచురిస్తున్నాము.

 

      

 

వ్యాఖ్యలు

skreddy_g యొక్క చిత్రం

స్మృతి కి సంబందించిన విషయాలను రచయిత చక్కగా వివరించారు.ముక్యంగా టీచర్స్ కు ఈ విషయాలు నిత్యం అవసరం అవుతాయి.

sairamnakka యొక్క చిత్రం

నేర్చుకున్న విషయాలను నిజ జీవితం లో జోడిస్తే శాస్వితంగా గుర్తు పెట్టుకుంటారు.

18617 registered users
7272 resources