గుర్తింపుకి నోచుకోని ప్రముఖులు : కానీ వారిని ప్రముఖులుగా నిలిపిన విన్నూత్న పద్ధతులు –అనంత్ గంగోలా

ఉపాధ్యాయులందరిలోనూ కొందరు మాత్రమే మిగిలిన వారి కంటే ప్రముఖంగా కనిపిస్తారు ? వీటికి గల కారణాలు ఏవి ?  ఈ ప్రశ్న అందరిలోనూ ఎంతో ఆలోచనలను,  మరెందరో ఉపాధ్యాయుల చిత్రాలను వారి మదిలో నిలుపుతుంది. నాకు ప్రముఖులుగా అనిపించే వారిలో మాత్రం, నిస్సందేహంగా మారుమూల గ్రామీణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న ఉపాధ్యాయులే.  దీనికి కారణం గడచిన 15, 20 సంవత్సరాలుగా నేను  గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూఉండడమే. అంతేకానీ పట్టణ లేదా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు.  

నేను నాయకునిగా భావించిన మొదటి వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్యాంప్ 4  గ్రామంలోని ప్రత్యామ్న్యాయ  పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులను నిర్వహిస్తోన్న మహేష్ ఓద్. నేను మొదటిసారిగా ఆ పాఠశాలను  సందర్శించిన దృశ్యం నాకిప్పటికీ గుర్తుంది. పాఠశాలలోని పిల్లలందరూ పలకలతో, నోటు పుస్తకాలతో  మాకు కొన్ని లెక్కలను ఇవ్వండి అంటూ నన్ను చుట్టుముట్టారు. నేను ఒకరి తరువాత ఒకరికి లెక్కలను వేసి ఇస్తున్నాను, వారు ఆన్ని చతుర్విద ప్రక్రియలలోని లెక్కలను ఇంకా ఇంకా అడుగూతూనే ఉన్నారు. పిల్లలు ఎంత వేగంగా సమస్యలను పరిష్కరిస్తున్నారంటే, ఒకరికి నేను కొన్ని లెక్కలు ఇచ్చేలోపే మిగిలిన వారు వారికిచ్చిన  సమస్యలను సాధించుకొని వస్తున్నారు. కొంత సేపటికి సమస్యలను ఇచ్చి ఇచ్చి నేను అలసిపోయాను.  కానీ పిల్లలలో ఇసుమంతైనా అలసట కనిపించలేదు. నాకు నాయకులుగా అనిపించిన ఉపాధ్యాయుల గురించి చెపుతానని చెప్పి విద్యార్థుల గురించి చెపుతున్నాననే  అనుమానం మీకు రావచ్చు. కానీ నేను ఉపాధ్యాయుని గురించే చెపుతున్నాను ఎందుకంటే ఆ విద్యార్థులలో నాకు వారి ఉపాధ్యాయుడే కనిపిస్తున్నాడు. 

నేను సందర్శించిన అన్ని పాఠశాలలో కనిపించిన సన్నివేశాలకు విభిన్నమైన సన్నివేశాలు నాకు ఈ పాఠశాలలో కనిపించాయి, అందువలననే నాకు మహేష్ హీరో అయ్యాడు. అతనిలో నేను చూసిన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలలో  కొన్నింటిని మీతో పంచుకొంటాను. అతడు విద్యార్థులందరూ సామర్థ్యం  కలవారేనని  నమ్మడం ఎంతో ప్రత్యేకమైనది . అతను ప్రతి ఒక్క విద్యార్థిని చాలా జాగ్రత్తగా చూసుకొంటూ వారితో సంభాషించే సమయంలో  విద్యావిషయాలు లేకుండా చూసుకొంటాడు.  ఉదాహరణకు ; శోభా, మీ ఇంట్లో  దూడ ఎలా ఉంది?  సునీల్... ఊరికి వెళ్ళిన మీ మామ తిరిగి వచ్చాడా? రేఖా... నీకు ఈ రోజు జడ ఎవరు వేశారు? ఇలాంటి సంభాషణ వలన పిల్లలు చాలా సౌకర్యవంతంగా, భయం లేకుండా ఉన్నారు. మహేష్  విద్యార్థులను ఒక బృందంగా కాక, అందరిని పేరు పేరునా పిలుస్తూ వారి బోధనకోసం వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించేవాడు. మహేష్ తరగతిగదిలో ఎపుడూ పాపా, ఒరే లాంటి ఇతర సంబోధనలను వినలేదు. పిల్లలందరూ  అతన్ని ఇష్టపడటానికి ఇదో కారణమై ఉంటుందని నాకనిపిస్తుంది.

మహేష్ లో  నేను గమనించిన ఇంకో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, పిల్లలకు బోధన గరపడంలో తనకే అన్నీ తెలుసనని భావించ లేదు. ఎవరైనా విద్యార్థి ఒక గణితసమస్యతో తన వద్దకు వస్తే ఆ సమస్యను తాను వ్యక్తిగతంగా  పరిష్కరించకుండా ఆ విద్యార్థిని  మరొక విద్యార్థివైపుకి మళ్లించి విద్యార్థులిద్దరూ కలసి  ఆ సమస్యను పరిష్కరించేలా చేసేవారు. ఈ విధంగా విద్యార్ధులు ఎవరైనా సమస్యా పరిష్కారంకోసం తన దగ్గరికి వచ్చినపుడు, పరిష్కారాన్ని సులువుగా  సూచించక అ విద్యార్థే స్వంతంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు మార్గాన్ని చూపడంకానీ లేదా సహావిద్యార్ధి సహాయంతో దానిని పరిష్కరించేలా కానీ  చేసేవాడు. ఈ విధంగా పరిష్కారాలు సులభంగా లభించేవికాదు అలాగే విద్యార్ధులు ఎపుడూ అభ్యసనంలో లీనమయ్యేవారు. ఈ పద్ధతి  పిల్లల స్వయం అభ్యసనానికి తోడ్పడుతుంది అంతేకాక ఈ పధ్ధతిలో  పిల్లలు సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడు వారు చాలా ఆనందపడేవారు.  తరువాత హీరో ఉపాధ్యాయులు సరస్వతి గారు.

ఈ పాఠశాల “మహేష్”  పాఠశాలకు పూర్తీగా విభిన్నమైనది. ఈ పాఠశాలలోని పనులన్నీ ఒక క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. పిల్లలు 5 లేదా 6 మంది ఒక బృందంగా  కూర్చొనిఉన్నారు. ఆ రోజు ఏ గ్రూపు ఏ పని చేయాలనే ప్రణాళిక సిద్ధంచేయ బడిఉంది. పాఠశాల ప్రారంభం కాగానే సరస్వతి పిల్లలందరిని వారి వారి గ్రూపు లలో కూర్చోపెట్టి వారికి నిర్ధేసించిన పనిని అప్పగించింది. తరువాత  గ్రూప్ ల దగ్గరకు వెళ్లి వారు ఆ పనులను మొదలు  పెట్టడానికి సహాయపడింది. వివిధ గ్రూపులకి ఇచ్చిన పనులు విభిన్నమైనవి. ఈ పనులన్నీచేయ డానికి  ఆమె చాలాముందుగానే తగిన ప్రణాళికను సిద్ధంచేసుకొంది, ఇది ఏ గ్రూపుని ఎక్కడ కూర్చోపెట్టాలి అనే విషయంతో పాటు అన్నిపనులకు సంభంధించినది.  కొన్ని గ్రూపుల వారు తరగాతిగదిలోనే కూర్చొని పనులు చేస్తూండగా మరికొన్నిగ్రూపులు పాఠశాల ఆవరణంలో తమ పనులను నిర్వర్తిస్తున్నాయి.  ఇన్ని పనులు జరుగుతున్నా ఎక్కడా , ఏవిధమైన  అల్లరి, అస్తవ్యత కనిపించలేదు.

పిల్లలకు పనులను ఇవ్వడం వాటిని నిర్వర్తించిన తరువాత సరిచూడడం  రెండూ కూడా విద్యార్థుల మధ్యనే జరుగుతోంది. అక్కడ సరస్వతి గారు ఒక ఉపాద్యాయురాలుగా కాకుండా తోటి విద్యార్థులకు సహాయపడే  పై తరగతికి చెందిన ఒక విద్యార్థిలాగా అనిపించారు.  ఒక గ్రూపు వారు మొక్కలు వాటిభాగాల  పై పని చేస్తున్నారు. ఈ అంశాన్ని సరస్వతి గారు పాఠ్యపుస్తకాన్ని చూపిస్తూనో, లేదా చిత్రాన్ని గీస్తూనో బోధించలేదు, పిల్లలను ఒక మొక్కను వేర్లతోసహా తీసుకొని రమ్మని చెప్పి  ఆ మొక్క సహాయంతో వేర్లను, కాండాన్ని, పత్రాలను మొక్కలోని ఇతర భాగాల గురించి చర్చించింది. తరువాత పిల్లలను వారి నోటు పుస్తకాలలో మొక్కను చిత్రించమని చెప్పింది. ఆ తరువాత మొక్కలలోని భాగాల గురించి పాఠ్యపుస్తకం ఆధారంగా బోధించింది. విద్యార్థులకు బోధించాల్సిన అంశాల గురించి సరస్వతిగారికి క్షుణ్ణంగా తెలుసు.

నేను చెప్పబోయే తరువాత నాయకుడు రమేష్. ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మోరీ విభాగంలో ఒక మారుమూల గ్రామంలో ఏకోపాధ్యాయునిగా విధులను నిర్వహిస్తున్నారు. ఇతనిని సున్నితత్వానికి పర్యాయపదమని చెప్పవచ్చు.  పిల్లలు చెప్పే విషయాలను వినడానికి ఇతను చూపించే   ఓపిక ఇతనిని ప్రత్యేకంగానిలుపుతోంది.  ఎన్నో సందేహాలతో తనను చుట్టుముట్టిన పిల్లల సందేహాలన్నే ఓపికగా విని, చాలా జాగ్రత్తగా అందరికీ తగిన సమాధానాలను చెప్పాడు.  తరగతిగది కార్యకలాపాలన్నీ ప్రజాస్వామ్యపద్ధతిలో నిర్వహించబడతాయి. ఇతని పాఠశాలలో ఏ కార్యక్రమం కూడా మొక్కుబడిగా నిర్వహించబడదు. అన్ని కార్యక్రమాలు కూడా పిల్లల అభీష్టం మేరకే జరుగుతాయి. నేను దీనిని “పిల్లల పాఠశాలగా”  అభివర్ణిస్తాను ఎందుకంటే ఈ పాఠశాలలో  తీసుకొనే ప్రతి నిర్ణయం పిల్లలు తీసుకోనేదే.

రమేష్ గారిలో నేను చూసిన  మరొక ముఖ్య లక్షణం, పిల్లల నిర్ణయానికి అనుగుణమైన బోధనను ఎంచుకోగల సామర్థ్యం.  ఒక ఉపాధ్యాయునిగా  తను బోధించే అంశాలపై గొప్ప సాధికారతను కలిగి ఎపుడూ దృఢవిశ్వాశంతో కనిపిస్తాడు.

ఇతఁడు సన్నివేశానికి అనుగుణంగా సృజనాత్మకతను కలిగి ఉండడం వలన సహచర ఉపాధ్యాయులకు భిన్నంగా కనిపిస్తారు.

నేను అధినాయకులుగా పేర్కొన్న వారి పాఠశాలలోని బోధనాపద్ధతులు నిస్సందేహంగా మిగిలిన పాఠశాలలోని బోధనాపద్ధతులకన్నా విభిన్నమైనవి. ఈ అదినాయకుల అందరిలోనూ  గల  లక్షణాల గురించి  పరిశీలించినపుడు ,  వీరందరికి, పిల్లలంటే గౌరవం, అభిమానం, పిల్లలను అభ్యాసనాప్రక్రియలో నిష్క్రియా గ్రహీతలుగా కాకుండా  క్రియాశీలకులుగా చేయడం, పిల్లలలో ప్రశ్నించడాన్ని ప్రోత్సహించడం, పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి తగినంత అవకాశాన్ని కల్పించడం, తరగతిగదిలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం మొదలైనవి అగుపించాయి. ఇలాంటి పాఠశాలలలో అభ్యసనాప్రక్రియ యాంత్రికంగా కాకుండా, వివిధ కృత్యాల నిర్వహణతో గతిశీలకంగా, ఆసక్తికరంగా ఉంటుంది.

ఇవేకాక వీరందరిలోనూ  కనిపించిన ఇంకొక ముఖ్యలక్షణం వీరందరూ తమను తాము ఇప్పటికీ చాత్రోపాధ్యాయులుగానే  భావిస్తున్నారు కానీ అన్నీ తెలిసిన ఉపాధ్యాయులుగా ఎపుడూ భావించలేదు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఇప్పటికీ వారిలో ఉంది. కావున వీరు నిరంతరం చదువుతూ కొత్త విషయాలను తెలుసుకోవాలను కొంటారు.  అయితే  కొద్దికాలం పాటు వీరు చదవనంత మాత్రాన వీరి ప్రతిభా పాటవాలు మసివారవు.

____________________________________________________________________________________________    అనంత్ గంగోలా :  అజీమ్ ప్రేమ్ జి ఫౌండేషన్ , ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగానికి అధిపతి. ఇతను Indian Institute of Social Sciences నుండి M.Phil ను ఉదయ్ పూర్ నుండి Futurology ని చేశారు.  మధ్యప్రదేశ్ లోని Neelgirh ఆదిమజాతలుల అక్షరాస్యత మరియు అభివృధ్ధి కోసం పనిచేశారు అలాగే Raisen జిల్లాలో జిల్లా ప్రాథమిక విద్యాపథకానికి అధికారిగా పనిచేశారు.  ఇతను Jordan లోని United Nations Leadership Academy నుండి మరియు Prof. Ramesh Chandra Bhatt ప్రతిభావేతనాన్ని అందుకొన్నారు. దక్షణఆఫ్రికాలోని Johannesburg లో Earth Summit కు మనదేశానికి ప్రాతినిథ్యం వహించారు. ఈయనను anant@azimprejifoundation.org ద్వారా సంప్రదించవచ్చు.         

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

చాలా చాలా బాగున్నది.వారి లాగా నేను చేయలేక పోయినానని భాధాగా ఉన్నదీ.ఐనప్పటికీ నా వంతు కృషి ఇప్పటికి కొనసాగిస్తాను.చివరి వరకు నా పిల్లల ప్రపంచం.

18627 registered users
7275 resources