గణితోపాధ్యాయుల కోసం అంకాత్మక వనరులు-ఎస్ యన్ గణనాథ్

గడచిన పది  పదహైదు సంవత్సారాలలో  సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వచ్చిన మార్పులు  గణితోపాధ్యాయులు  తరగతిగదిలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ  ఉపయోగించుకోగల  ఎన్నో  అంకాత్మక వనరులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ వనరులకు గల కొన్ని ప్రత్యేక లక్షణాల వలన ఇవి ఉపాధ్యాయులకు ఆకర్షణీయంగా అగుపించాయి. ఆ ప్రత్యేకలక్షణాలలో కొన్ని

·         వనరులు విస్త్రుతంగా అందుబాటులో ఉండడం

·         వనరులు వివిధ అంశాలకు, వివిధస్థాయిలకు  సంబంధించి ఉండడం

·         సృజనాత్మకంగా ఉండడం

·         వీటిని అంతర్జాలం అందుబాటులో ఉన్నా లేకున్న ఉపయోగించుకోగలిగే అవకాశం ఉండడం  

·         గణితశాస్త్రం సార్వత్రీకమైనందున , వివిధ దేశాలలో వివిధ ప్రాంతాలో  అభివృద్ది చేసిన  గణితవనరులను, సులభంగా మన అవసరాలకు తగినట్లు మార్చుకొని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండడం

·         ఇవి వివిధ రూపాలలో(దృశ్యరూపం, శ్రవణరూపం) ఉండడం    

·         తక్కువ వెలతో నిర్మించడానికి వీలవ్వడం

·         ప్రభుత్వ, ప్రైవేటు లేదా పట్టణ, గ్రామీణ  అనే భేదభావం లేకుండా అన్ని ప్రాంతాలకు  సమాచార సాంకేతికపరిజ్ఞానం అందుబాటులోకి  రావడం మొదలైనవి.      

ఈ అంకాత్మక వనరులు ఉపాధ్యాయులకు  ఇంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మిగిలిన వాటిలాగే వీటిని విమర్శించే వారూ లేకపోలేదు. తరగతిగదిలో బోధనాభ్యసన ప్రక్రియ పై వీటి ప్రభావం గురించి తెలుసుకొనేందుకు  చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ ప్రయోగాల దత్తాంశాల విశ్లేషణలు కొంత ఉపయుక్తమైన విషయాలను తెలియజేస్తున్నాయి. ఐతే ఇవే చివరిఫలితాలు కావు వీటిపై ఇంకా పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉంది.

ఈ అంకాత్మక వనరులు అభ్యసన ప్రక్రియలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి  ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ఈ క్రింది విషయాల కోసం వీటిని ఉపయోగించవచ్చు.

·         కొత్త అంశాన్ని పరిచయం చెయ్యడానికి

·         భావనలను ఏర్పరచడానికి

·         అభ్యాసం కోసం

·         స్వీయ అధ్యయనం కోసం

·         గ్రూపు పని కోసం   ఇంకా మరెన్నింటికో

వీటిని ఉపాధ్యాయులు వారి తరగతిగది అవసరాల అనుగుణంగా ఉపయోగించు కోవచ్చు.

నాకు తెలిసిన కొన్ని అంకాత్మకవనరుల వివరాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.  ఇవే అద్భుతమైనవని కాదు. ఇది ఒక సూచిక మాత్రమే. ఇలాంటి వనరులు అంతర్జాలంలో ఇంకా అనేకం ఉన్నాయి. ఈ విషయంలో పాఠకులదే తుది నిర్ణయం. కానీ ఇక్కడ పేర్కొన్న విషయాలు నాకు చాలా ఉపయోగపడడమే కాక ఎంతో ఆనందాన్ని కూడా ఇచ్చాయి.

ఈ వనరులను కొన్ని విభాగాలుగా విభజించి  మీకోసం పొందుపరుస్తున్నాను.     

 

వ్యాఖ్యలు

pragathiprasadmeda యొక్క చిత్రం

మీరు పొందుపరచిన ఈ వెబ్ సైట్లు మాకు ఎంతగానో వుపయోగాకరమౌతాయి . ధన్యవాదములు...

venkatesu.kambham యొక్క చిత్రం

డియర్ సర్ మీరు పొందు పరచిన సైట్స్ బాగున్నాయు
నేను ఒక సైట్ రూపొన్దించాను
www.telugumaths.com
for maths ppts and scienceppts telugu ,english ppts for telugumedium students
please see it send your opionion sir

18336 registered users
7154 resources