కంప్యూటర్, అంతర్జాలం మరియు పాఠశాలలు: అనుసంధానం సమంజసమైనదేనా ?

ప్రతి ప్రశ్నకూ విస్తృత  సమాచారాన్ని అందిస్తోన్న  అంతర్జాలం పిల్లలను ఎలా ప్రభావితంచేస్తోంది ?  

పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోన్న అంతర్జాలాన్ని, కంప్యూటర్లను గృహంలోనూ, పాఠశాలలోనూ  వారు సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు  విద్యావేత్తలు, మరియు తల్లితండ్రులు ఎలా సహాయపడగలరో ఆలోచిస్తున్నారా?  

లాంటి  క్లిష్ఠప్రశ్నలకు సమాధానాలను అందివ్వడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.

కంప్యూటర్ అంతర్జాలం మరియు పాఠశాలలు

సాంకేతికపరిఙ్ఞానం “ గార్డెన్ మూర్”  నియమాన్ని అనుసరించి మారుతున్నదేమో అనిపింఛేంత నాటకీయంగా మారుతున్నది. గార్డెన్ మూర్ చెప్పినట్లుగా ప్రతి 18 నెలలకొకసారి కంప్యూటర్ సామర్థ్యం రెట్టింపౌతోండడం వలన, విద్యపై ఈ సాంకేతిక పరిఙ్ఞానం చూపగల  ప్రభావాన్ని ఒక నిర్ధుష్ఠకోణం నుండి చూడడం కష్టం. వేగంగా పెరుగుతున్న సాంకేతికతతో పాటు మానవుని ఆలోచనలలు, సృజనాత్మకత, వివిధ సామర్థ్యాలు కూడా వేగవంతమౌతున్నాయి. కరెంటు కంటే వేగంగా మారుతున్న ప్రక్రియలు, అనుభవాలు, సాంప్రదాయ అభ్యసనం అనే ప్రపంచం లో మనము ఉన్నాము.ఇప్పటి యువతరంలో ఇలాంటి వేగవంత మైన ఆలోచనలను చూడవచ్చు

ప్రస్తుత ప్రపంచంలో సమాచారాన్ని చాలావేగంగా  అందించగల వనరుగా అంతర్జాలం అభివృద్ధి చెందుతోంది. పిల్లలను విద్యావంతులుగా  చేసే పధ్ధతుల మౌలిక స్వరూపాలలో విద్యాసాధనాలుగా బాహుళ్యం పొందిన కంప్యూటర్లు, అంతర్జాలం సమూలమైన మార్పులను తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు virtual పాఠశాలలు కూడా ఏర్పడుతున్నాయి.  ఈ సమచార విప్లవకెరటం జిడ్డూ క్రిష్ణమూర్తి పాఠశాలలను కూడా ముంచివేస్తున్న ఈ తరుణంలో విద్యావేత్తలందరూ విద్యయొక్క స్వరూప స్వభావాలను ప్రభావితం చేస్తూన్న వివిధ సమస్యలను పరిశీలించాల్సిన సమయం ఇది.

క్రిష్ణమూర్తి పాఠశాలలు విద్యార్థులలో ఒక్క మేధస్సుని మాత్రమే అభివృద్ధి చెయ్యలని కాకుండా, సమగ్రంగా అభివృద్ధి చెయ్యలనే అంశం వలన ఒక ప్రత్యేకతను కలిగిఉన్నాయి.  పిల్లలను  విద్యావంతునిగా  చెయ్యడం ఙ్ఞానేంద్రియాల ద్వారానే మాత్రమే సాధ్యమైతుంది. అందుకనే  ఇక్కడ వినడం, చూడడం, మరియు  అభ్యసించడమనే నైపుణ్యాల పై దృష్ఠిసారిస్తారు. మీధ్యాస నిరంతరం కంప్యూటర్ తెరపై ఉంటే ఎన్ని ఙ్ఞానేంద్రియాలు అచేతనస్థితిలో ఉంటాయి ? మిమ్ములను మీరే ప్రశ్నించుకోండి.  విద్యార్థులు  కళాశాల విద్యను  పూర్తీచేసే సమయానికి  సుమారుగా 10, 000 వేల గంటల సమయం అవుతుంది.  వికసించాల్సిన భుధ్ధిబలాలపై ఇది ఎంత దుష్ప్రభావం చూపుతుందో ఆలోచించడండి.

ప్రశ్నలు, సందేహాలు మన మెదడుని చేతనావస్థలోఉంచి మనలను ఆలోచింపచేస్తాయి. కానీ ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతిప్రశ్నకు సమాధానం దానితోపాటే మరెంతో అదనపు సమాచారం సులువుగా లభిస్తూన్నందున,  మనం మనకు తెలియదు ? అన్న ఒక మంచి భావనను కొంతవరకూ  కోల్పోతున్నాము.  అంతర్జాలం ప్రతిసమస్యకు పరిష్కారం అందిస్తుందని, అలాగే చాలా మంది అనుభవజ్ఞులు ఉచితంగా సమాధానాలు అందించగలదనే భావనను పిల్లలకు ఇస్తోంది. ఇవి స్వశక్తిని, స్వంతజ్ఞానాన్ని నశింపచేస్తాయి. క్రిష్ణమూర్తీ పాఠశాలలు విశదపరిచేవిషయాలలో ఒక non-aristotelian సిద్ధాంతం -ఎవరైనా కూడ ఒక విషయానికి సంబంధించిన జ్ఞానాన్నంతటినీ పొందలేరు ఎందుకంటే నిజానికి అందులొ లభించే ఙ్ఞానమే చాలా తక్కువ.  ఙ్ఞానసమపార్జనకు  మూలమైన ఈ భావనను అంతర్జాలం  ఒక క్లిక్ తో తుడుచి వేస్తుందేమోనని అనిపిస్తోంది. నిజంగా మనకలాంటిది  అవసరమా? “మన  మెదడు మనలను అదుపులో ఉంచుకొంటే  యాధార్థం మరియు దానివలన కలిగే ఆనందాన్నిమనము కోల్పోతాము, అత్మఙ్ఞానమే మేధస్సుకు ముఖ్యమైనది అదే లేకపోతే అభ్యసనం అజ్ణానానికి, భాదలకు, దుఖానికి దారితీస్తుంది” అనే కృష్ణమూర్తి గారి మాటలను మనం ఆలకించాలి.  

మరో స్థాయిలో ఈ సమాచార విప్లవం సమాచారానికి, ఙ్ఞానానికి మరియు ప్రఙ్ఞకు మధ్యగల తేడాను  స్పష్టంగా చూపుతోంది. ఇది నాకు జిడ్డూక్రిష్ణమూర్తి గారి పరిణితి స్థాయిని సూచిస్తుంది. బాగా ఆలోచించగలవారు సమాచారం స్వతంత్రఅర్థాన్ని కలిగి ఉంటుందని, సమాచారానికి గల పూర్వోత్తర సందర్భానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలుసుకొంటారు మరియు జ్ఞానానికి , ప్రఙ్ఞకు ప్రత్యక్ష సంభందం లేనట్లు తెలుసుకొంటారు. విద్యావేత్తలకు తెలియ చేసే అంతఃసూచనమేమిటంటే  సమాచారం మరియు ఙ్ఞానం వేరు వేరని అలాగే ఙ్ఞానాన్ని మనము ఎంచుకోలేమని, ఒకరి నుంచి మరొకరికి అందించలేమని, కనుక్కొలేమనీ,  మరియు పోల్చలేమని.  అయితే మన పాఠశాలలు విద్యాప్రణాళికలో సమాచారానికి , ఙ్ఞానానికి మధ్య సమన్వయాన్ని ఎలాసాధిస్తాయి ? ఈ రెండింటిని గుర్తించవచ్చా, పూర్తీగా పాఠ్యప్రణాళికతో నిండిన విషయపరిఙ్ఞానాన్ని బోధించడం వలన అలాంటి ఫలితాలు ఉంటాయా ?

కంప్యూటర్ అనేది ఒక సమాచార సాధనం. టెలీఫోన్ కంటే సమగ్రంగా మరియు వేగంగా, టెలివిజన్ అందించే సమాచారం కంటే ఎక్కువ సమాచారాన్ని మరియు రేఖాచిత్రాలను కంప్యూటర్ అందజెయ్యగలదు.  ఎక్కువ విషయపరిజ్ఞానం ఉపయోగంలో గల వృత్తిపరిశ్రమలో కంప్యూటర్ ఒక విప్లవాన్ని సృష్ఠించింది. విషయపరిజ్ఞానం రంగులలో మనోహరంగా ఉండి, దీనికి చిత్రాలు, ధ్వనులు మరింత అదనపు సమాచారం ఇవన్నీ సాంకేతికపరిజ్ఞానాన్ని నూతనం చేస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు ఇప్పటికే పిల్లలను తప్పుదోవపట్టిస్తూంటే,  పిల్లలకు మనం ఆశించే ఉత్తమ సమాచార మరియు వినోదాన్ని పంపిణీచేసే  ఒక సాధనంగా కంప్యూటర్ ఉండగలదా ?      

తల్లితండ్రులను మరియు  విద్యావేత్తలను కలవరపరుస్తోన్న మరొకఅంశం భవిష్యత్తులో టి వీ కార్యక్రమాలన్నీ  అంతర్జాలంనుండే వస్తాయని. ఇంతేకాకుండా అంతర్జాతీయ విషయాలు, అవసరం లేని విషయాల గురించిన చిత్రాలు,విశేషాలు చాలా విపులమైన వివరణల చేరివేత ఇలాంటి వాటి గురించి కూడా తల్లితండ్రులు మరియు  విద్యావేత్తలు ఆలోచించాలి.

అంతర్జాలానికి ఎటువంటి విచక్షణా ఉండదు. ఒక యువకునికి మరియు పిల్లవానికి, పేదవానికి మరియు సంపన్నునికి, ఎటువంటి భాషా వ్యత్యాసం, విచక్షణా  లేకుండా అంతర్జాలం  ప్రతిస్పందిస్తుంది.  భాషాబేధాలేవి లేకుండా అందరిని దగ్గర చేసే సామర్థ్యందాని కున్నట్లు చెపుతున్నప్పటికీ నిజానికి అది అంతరాలను సృష్ఠిస్తోంది.  పిల్లలు అంతర్జాలంలో తమ ఊహలను,  మాయా ప్రపంచాన్ని అన్వేషిస్తూ పోతారు. దీని వలన కుటుంబాన్ని మరచిపోతారు.  ఈ భ్రమలు చివరికి వారిని తమ ఆలోచనల ద్వారా యధార్థమేమిటో తెలుసుకోలేకుండా చేస్తాయి. పిల్లలను ఈ అంతర్జాలం బారిన పడకుండాఎలా కాపాడుకోవాలి ? అన్నది ఇప్పుడు విద్యావేత్తల మరియు ఉపాధ్యాయుల ముందున్న సమస్య.

సామాజిక వేత్తలు చెప్పినట్లు 19వ శతాబ్దంలో మానవజీవితం  ఉమ్మడికుటుంబంతో పూరింపబడితే, 20వ శతాబ్దం ప్రపంచమంతా టెలివిజన్  చుట్టూ తిరిగింది,  21వ శతాబ్దంలో దీని స్థానాన్ని కంప్యూటర్లు మరియు అంతర్జాలం ఆక్రమించాయి. అమెరికాలో జరిపిన ఒక సర్వేలో దాదాపుగా 78% మంది తల్లితండ్రులు తమ పిల్లలు సృజనాత్మకంగా  ఉండడానికి వ్యక్తిగత కంప్యూటర్లే కారణమని అలాగే 48 % మంది  కంప్యూటర్లు మరియు అంతర్జాలం వలన తమ పిల్లలు పాఠశాలల్లో బాగా రానిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను  ఊరిస్తోన్న కంప్యూటర్లు మరియు  అంతర్జాలం యొక్క  దుష్పరిణామాలను గమనిస్తూ,  తల్లితండ్రులు మరియు  విద్యావేత్తలు తగినంతాగా  అప్రమత్తమై ఉన్నారా లేరా  అని అశ్చర్యం వేస్తోంది?     

క్రిష్ణమూర్తి గారు ఆశించినట్లుగా లేత మనసులుకు పాఠశాలలు అందించాల్సిన అమాయకత్వాన్ని  గానీ విలువైన శైశవదశను ఇవ్వడానికి అవకాశం లేనంత వేగంగా వారు అభివృధ్ధి చెందడం మరో ముఖ్య సమస్య.

18615 registered users
7272 resources