ఉపాధ్యాయుల కారకత్వం -విజయ శంకర వర్మ

ఉపాధ్యాయుల ఎజన్సీ

భారతదేశ పాఠశాల విద్యలో సంస్కరణలకోసం చేపట్టిన ప్రయోగాలు, ఉదాహరణకు  హొసంగాబాద్ విఙ్ఞాన శాస్త్ర బొధనా కార్యక్రమం గుణాత్మ విద్యలో ఉపాధ్యాయులు అత్యంత కీలక పాత్ర పొషిస్తారని చూపాయి.  ఉపాధ్యాయులకు సంస్కరణల పై  సానుకూల అలోచన కలిగి మనస్ఫూర్తిగా అమలుజరిపితేనే అవి ఫలవంతమయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు సంస్కరణల పట్ల సానుకూల వైఖిరి లేకపొతే అవి  విఫలమయ్యే  దిశగా పయనిస్తాయి.

సాధారణంగా విద్యాప్రణాళిక అభివృధ్ధి మరియు పాఠ్య పుస్తకాల తయారీ ముఖ్యంగా, N.C.E.R.T.  లాంటి సంస్థల ఆధ్వర్యంలో జరిగినపుడు, అది అత్యంత కేంద్రీకృత కార్యక్రమంగా అధికార క్రమానుగతంగా పై స్థాయినుండి క్రింది స్థాయికి  ప్రవహించేదిగా ఉంటుంది. అలాగే మేధోసంపద  అంతా సంస్థకే  లేదా సంస్థ ఏర్పాటు చేసిన విషయ నిపుణలకు మాత్రమే ఉంటుందనే  నమ్మకంతో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను నామమాత్రంగా  ఈ కార్యక్రమానికి  ఆహ్వానిస్తారు.  ఇలాంటి (విద్యాప్రణాళిక అభివృధ్ధి మరియు పాఠ్య పుస్తకాల తయారీ) కృషిలో విషయ  ఆవశ్యకతన మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం చేయకుండా, పిల్లల కోసం తయారు చేస్తున్నారు కాబట్టి వారి  భావనాభివృద్ధికి  సరిపోయ్యేలా, పాఠశాలలో లభ్యమయ్యే వనరులను, మరీ ముఖ్యంగా ఎవరైతే ఉపాధ్యాయులు యదార్థంగా బోధిస్తున్నారో వారి బోధన తయారీనీ,  సంసిధ్ధతను, కూడా దృష్టిలో పెట్టుకోవాలి.  దీనిని  సాధించాడానికి కల ఒకే ఒక మార్గం ఏమిటంటే  బృందం ఈ భాధ్యతను నిర్వర్తిస్తున్న బృందం కొంతమంది  ఉపాధ్యాయులను ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పొషించేందుకు అనుమతి నివ్వాలి. పాఠ్యప్రణాళిక అభివృధ్ధి మరియు పాఠ్య పుస్తకాల తయారీ ప్రక్రియలో, ఉపాధ్యాయుల బోధనా అనుభావాలకు, స్వంత అభిప్రాయలకు  తావివ్వకుండా బృంద సభ్యులు అన్నీ తమ అభిప్రాయాలనే రుద్దకూడదు.

ఇంతవరకు చెప్పిన విషయాన్ని మనం అభినందించడానికి మనం ప్రత్యేకంగా కృషి చేయ్యాల్సిన అవసరం లేదు.మరి ప్రశ్న ఏమిటంటే ఆచరణలో చూడాల్సిన  ఈ  నియామాలలో చాలా భాగం అతిక్రమణ భాగంలోనే ఎందుకు  చూస్తున్నాం ?  మిగిలిన ఈ వ్యాసభాగం లో దీనికి గల కొన్ని కారణాలను  పరిశీలించడానికి ప్రయత్నిద్దాం.

ఇందుకు మేము గమనించిన  ఒక ముఖ్య కారణం ఏమిటంటే వ్యవస్థ యొక్క సహజ స్వభావమైన  అన్నింటిని నియంత్రణలోనే ఉంచుకోవాలని ప్రయత్నించడం మరియు వికేంద్రీకరణకు అనుమతించక పోవడం.  ఉదాహరణకు  ఈమధ్యే N.C.E.R.T  నిర్వహించిన కృషిని గమనించండి. తొలుత 2005- జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం రూపొందించడం ఆపిదప దీని ఆధారంగా పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకాలను తయారు చేయడం.  ఈ చర్చలను దేశవ్యాప్తంగా  నిర్వహించడానికి భారతదేశమంతా నిపుణులు ప్రయాణించారు. ఈ చర్యను డీల్లీలో కేంద్రీకరించకుండా ముందుగా నాలుగు ప్రాంతీయ కేంద్రాలలో చర్చలను నిర్వహించి, జాతీయ విద్యాప్రణాళిక రూపొందిన పిదప మొదలు పెట్టి,  ఆ కేంద్రాలకు స్వతంత్రంగా పనిచేసేలా అనుమతిచ్చి  ఉండిఉంటే ఇంకా మంచి ఫలితాలు లభించి ఉండేవని నా అభిప్రాయం. అలా చేయడం వలన 2005- జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం సూచించినట్లుగా, నాలగు స్వతంత్ర పాఠ్యప్రణాళికలు రూపొందించడమే కాకుండా నాలుగు ప్రాంతీయ పాఠ్య పుస్తకాలు కూడా  రూపొందేవి.   ఇంతేకాక ప్రాంతీయ సామర్థ్యాల అభివృధ్ధి పరిచేది.  అలాగే వికేంద్రీకరణకు  కూడా  అవకాశంలభించేది. ఇది పాఠ్య ప్రణాళిక అభివృధ్ధిలోను పాఠ్యపుస్తకాల రచనలోను బోధనచేస్తున్న ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో  పాల్గొనడానికి అవకాశాన్ని ఇచ్చిఉండేది.   ఇలాంటి ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా వినిపించే బలమైన వాదన ఏమిటంటే, ఈమొత్తం చర్యలను ఫలవంతం చేసేందుకు సరైన ప్రాంతీయ సామర్థ్యాలు అందుబాటులోలేవు. ఇది  “గుడ్డు మొదలా, కోడి మొదలా సామెత లాంటిది ?. వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహించకపోతే ప్రాంతీయ సామర్థ్యాలు ఎలా అభివృధ్ధి చెందుతాయి.?

కొంతవరకు అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే వివిధ సాంఘీక విద్యాపరమైన కారణాల వలన  పాఠశాల ఉపాధ్యాయుల సరాసరి సామర్థ్యాల స్థాయిలు ఉండాల్సిన స్థాయిలో లేవు. కాబట్టి దీనికొసం  మనమేమి చెయ్యవచ్చు? ఈ రోజుల్లో ఎక్కడా సరిగా పని  చెయ్యలేని  వారే చివరికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వస్తున్నారు. ప్రభుత్వం కూడా  ఉపాధ్యాయుల సామార్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోకుండా, విద్యా కేటాయింపులను తతొందరపాటు గ్గించుకోవడానికి విధానాలతో  విద్యావాలెంటీర్లను నియమిస్తూ ఉపాధ్యా సంఘాల అధికారాలను కూడా హరిస్తోంది .

ఇలా చేస్తూ మనం మరిచిపోతోన్న  ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మకతను పెంచకుండా గుణాత్మక విద్యను పెంచలేమని.  దీన్ని సరిచెయ్యడానికి ఉన్న ఒకే ఒక సరైన మార్గం  ఉపాధ్యాయులు  పని చేసే పరిస్థితులను మెరుగుపరచడం, అంటే ఒక్క జీతాల గురించే మాట్లాడడం లేదు ప్రతిభావంతులను ఈ వృత్తిలోకి  ఆకర్షించేలా వీరు పనిచేసే పరిస్థితులను  మెరుగుపరచాలి. ఇందుకోసం  పాఠశాలలో మంచి సౌకర్యాలు, మెరుగ్గా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలి. మెరుగైన పరిసరాలు, మెరుగైన భౌతిక వసతులు, మెరుగైన పని పరిస్థితులు, మెరుగైన  గ్రంధాలయాలు, ప్రయోగశాలలు నిర్మించాలి.  అలాగే ఉపాధ్యాయులను  విద్యావ్యవస్థలోని ప్రభుత్వకార్యాలయాలలోని సిబ్బంది ప్రాభల్యాల నుంచీ తప్పించాల్సి ఉంది.

సమావేశాల్లో గుణాత్మక పాఠశాల విద్యకోసం, పాఠశాల ఉపాధ్యాయులే కేంద్రం అని ఎలుగెత్తిచాటడం  అలంకరణ అయిపోయింది. నిజానికి ఇలా కాకుండా  పాఠశాల ఉపాధ్యాయుల విద్యావిషయక గుణాత్మకతను పెంచడమే కాక బోధనపట్ల వారి నిభద్దతను కూడా పెంచాలి.  ఉపాధ్యాయులల్లో క్రమంగా పెరుగుతున్న గైర్హాజరీ మనం వెంటనే దృష్టిసారించాల్సిన అంశం. జవాబుదారీతనం అనే చట్టం చేయడం ద్వార  ఉపాధ్యాయులలో గల ఈ సమస్యను  పరిష్కరించడం  చాలా కష్టమని నా అభిప్రాయము.  ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టల్సిందే,  ఇది కనీసమైన చర్య కానీ ఎవరైతే బోధించక పోవడం తప్పుకాదని భావిస్తారో వారు పాఠశాలకు రావాలని ప్రభుత్వం చట్టం చేసినా  వారు బొధించక పోవచ్చు. పిల్లల ప్రగతికి ఉపాధ్యాయులే జవాబుదారీ అనే విషయం ఉత్తేజకరంగా ఉన్నా, మూల్యాంకనానికి చాలాచాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాథమిక స్థాయిలో  దీనిని ఏలా చేస్తారు. పిల్లలు విఫలమైతే, వారు కృంగి పోతారనే నెపముతో ఉపాధ్యాయులు విద్యార్ఠులకు ఎక్కువ హాని కలిగిస్తున్నారు.  కానీ నిజానికి  ఇది ఉపాధ్యాయుల అలసత్వం వల్లనే జరుగుతోంది.

ఇప్పుడు ఈ చర్చ స్పష్ఠంగా విలువలకి సంభంధించినది. ప్రతి ఒక్కరూ బలప్రయోగంతో కాకుండా తమ సామర్థ్యానికి తగ్గట్టు తమ విధులలను నిర్వర్తించాలి .ప్రస్తుత  సమాజంలో వృత్తి  పరమైన భాద్యతలకు  జవాబుదారిగా ఉండడం, వృత్తిపట్ల నిభధ్ధత అన్న విలువలను చాలా తేలికా తీసుకోవడం జరుగుతోంది  అనడానికి చాలా అధారలున్నాయి.  ఉపాధ్యాయుల గైర్హాజరు మరియు సరిగ్గా బోధించకపోవడం అన్నవి ఇందుకు సాక్ష్యాలు. దీనికి కారణాలు విచ్ఛిన్నమౌతున్నకుటుంబ సాంప్రదాయాలు, మద్య తరగతి కుటుంబాలలో పెరిగి పోతున్న వ్యాపారదృక్పథం లాంటి కారణాలతో పాటు , ఆధునికత్వం పేరుతో  పిల్లలకు  తమ ఇంటి వద్ద మంచి విలువలను అందించే అవకాశాలు మరీ తగ్గిపోవడడం. పిల్లలు ఉత్తమ  విలువలను గ్రహించడానికి మరొక ముఖ్య ఆధారమైన  పాఠశాలలో కూడా విలువలను కోల్పోతున్న  ఉపాధ్యాయులతో పాటు బహుళ సంస్కృతి, బహుల మతాల విలువలను, నీతిని బోధించడానికి కల కొన్ని సమస్యలు కూడా పిల్లలు ఉత్తమ విలువలను పెంపోదించుకోలేక పోవడానికి కారణమౌతున్నయి. ఎవరి విలువలను, ఎవరికి సంబంధించిన నీతిని బొధించాలి ? ఎందుకంటే ఇవన్నీ సాంప్రదాయంగా మతానికి సంభందించిన మూలాలలో ఉన్నాయి. అందరూ ఒప్పుకొనే  సమాధానం లేదు.  అందువలన దేనినీ బోధించడం లేదు. ఈ విషయాలను పాఠశాలలో బొధించడానికి మనం మతానికి కులాలకి అతీతంగా, సరైన కారణాలతోనూ, సహేతుకతతోను గల ఒక అధారాన్ని ఏర్పరచుకోవాలి. ఇలాంటి వాటిని బోధించడం ద్వారా, ఇలాంటి ప్రసంగాలను వినడం ద్వారా   ఉపాధ్యాయులలో, సాధారణ ప్రజలలో మార్పువచ్చి చివరకు మనం కోరుకొనే వృత్తి పరమైన భాధ్యత జవాబుదారీతనం పెంపొదుతాయని ఓ నమ్మకం.దీనినే కదా మనం అంతా కోరుకొనేది.

ఈ వ్యాసంలో మనం చర్చించిందేమిటంటే  ఉత్తమ విద్యా వ్యవస్థకి కీలకం  ఉత్తమమైన మరియు నిభద్దత కలిగిన ఉపాధ్యాయులు. పాఠ్యప్రణాళికను మరియు పాఠ్యపుస్తకాల రూపొందించడంలో ఉపాధ్యాయునికి ప్రముఖ పాత్ర ఉండాలి అందుకొసం ఈ ప్రక్రియను వికేంద్రీకరించాలి.గుణాత్మకమైన వ్యక్తులను ఈ వృత్తిలోకి ఆకర్షించాలంటే వారికి మెరుగైన జీతాలే కాక మెరుగైన పనిచేసే పరిస్థితులను, సౌకర్యాలను కల్పించాలి. ఉపాధ్యాయుల జవాబుదారీ తనాన్ని చట్ట ప్రక్రియల ద్వారా నియంత్రిస్తూ ఆదే సమయంలో ఉత్తమ విలువలను ఉపాధ్యాయులలోను , విద్యార్థులలోను పాఠశాల వ్యవస్థ ద్వారా అలవరచినప్పుడే  ఇవన్నీ సిద్ధిస్తాయి

________________________________________________________________________________________________________________________________.

విజయ శంకర వర్మ  డిల్లీ విశ్వవిద్యాలం లో భౌతిక శాస్త్రాచార్యుడు మరియు విశ్రాంత ప్రణాళికాధికారి. ప్రస్తుతం డిల్లీలోని  అంబేద్కర్ విశ్వవిద్యాలంలో ప్రణాళికా విభాగానికి సలహాదారునిగా ఉంటున్నారు . ఈయన  హొసంగాబాద్ విఙ్ఞానశాస్త్ర బొధనా కార్యక్రమం లో  డిల్లీ విశ్వవిద్యాల నుండి పాల్గొన్న విద్యా విషయక బృందానికి  అనుసంధాన కర్తగా వ్యవహరించారు. వీరిని  varma2@gmail.com  ద్వారా సంప్రదించవచ్చు.

    

 

18336 registered users
7154 resources