ఉత్తమ ప్రశ్నలు అడిగే నైపుణ్యం -ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రశ్నలు

వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులలో  ప్రశ్నించడమనే సామర్థ్యాన్ని పెంపొందించడం వలన వారిలో ఆలోచనా నైపుణ్యం మరియు భావావగాహన భావన పెరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను సులభమైన అవగాహనకు సంబంధించిన ప్రశ్నలను కాకుండా ఫలితాన్ని ఊహించమని, లేదా ఇచ్చిన సమాచారాన్ని కొత్తసన్నివేశంలో ఉపయోగించడానికి అవసరమయ్యే ప్రశ్నలను,  అలాగే ఆ సమాచారాన్ని సరిచూడడానికి  సంబంధించిన ప్రశ్నలను అడగాలి.

క్రింద, ఒక కథ ఆధారంగా వివిధరకాలైన ప్రశ్నలతో విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని, అవగాహనా సామర్థ్యాన్ని  పెంపోదించడానికి మరియు ఇందులో వారి సామర్థ్యాలను   అంచనా వేయడమెలానో  వివరించారు.

కథ

 

      

ఒక సారి సింహానికి జబ్బు చేసింది. అడవిలో ఉన్న వైద్యులందరినీ సింహాన్ని పరీక్షించడానికి పిలిపించారు.

మొదట జీబ్రా వచ్చింది. జీబ్రా “తలుపును తడుతూ రాజా నేను లోపలికి రావచ్చా ? అని అడిగింది.  “లోపలికి రా అని”  సింహం బదులిచ్చింది. జీబ్రా సింహాన్ని నోరు తెరవమని అడిగింది.

 "రాజా మీ నోటి నుండి చాలా చెడువాసన వస్తోంది "  అని జీబ్రా అనింది.

 అలా చెప్పడానికి "నీకెంత ధైర్యం" అని సింహం గద్దించింది.  

"రాజా వైద్యునిగా నిజాన్ని చెప్పవలసిన బాధ్యత కనుక నేను అలా చెప్పాను నన్ను క్షమించండి"   అని జీబ్రా పలికింది.

కానీ సింహం కోపంతో జీబ్రాను చంపివేసింది.

తరువాత వైద్యుడు హైనా వచ్చి సింహం వాకిలి తట్టింది.  "లోపలికి రండి" అని సింహం పలికింది

హైనా కూడా సింహాన్ని నోరు తెరవమంది

"ఎంత సువాసన వస్తోంది రాజా మీనోటి నుండి"  అని హైనా పలికింది.

సింహం  కోపంతో నేనేమన్నా వెర్రివాడిననుకొన్నావా? నన్నెందుకు పొగుడుతున్నావు ? అని హైనాను గద్దించింది.

"రాజా నన్ను క్షమించండి,  నిజం చెప్పడానికి నాకు భయం వేసింది"  అని హైనా చెప్పింది.

 తప్పులను క్షమించే గుణం నాకు లేదని సింహం హైనాను చంపివేసింది.

తరువాత జిత్తుతుల మారి నక్క వచ్చింది. రాజా నేను లోపలికి రావచ్చా ? అని గేటు బయట నుండి నక్క సింహాన్ని అడిగింది.

లోపలికి రా,  అని సింహం గద్దించింది

నక్క  “రాజా  మీరు నోటిని కొంత తెరువగలారా అని అభ్యర్థించింది?

నా శ్వాశ గురించి నీవేమైనా  చెప్పాలను కొంటున్నావా ?   అంటూ సింహం నోరు తెరిచింది.

రాజా దురదృష్టవశాత్తూ నాకు జలుబు చేసి నేను మీ శ్వాశ గురించి ఏమీ చెప్పలేను అని నక్క తెలిపింది.   

 

A.     ఆలోచనా నైపుణ్యాన్ని పెంపోదించడానికి  కథావగాహనకు సంబంధించిన ప్రశ్నలు :

ఏమిటి  ?ఎప్పుడు ? ఎవరు ?  మొదలైన  ప్రశ్నలు  

1.     ఎవరు జబ్బుబడ్డారు ?  

2.    జబ్బు బడ్డ సింహాన్ని ఎంత మంది వైద్యులు పరీక్షించారు ? వారు ఎవరు ?

3.    సింహం నోరు తెరవగానే జీబ్రా ఏమి చెప్పింది ?

4.    సింహం జీబ్రాను ఏమి చేసింది ?

5.    సింహం నోరు తెరవగానే నక్క డాక్టర్ ఏమి చెప్పింది ?

 

B.     నిగమన పధ్ధతిలో ప్రశ్నించే నైపుణ్యాలు  

జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు

1.     సింహం జీబ్రాను ఎందుకు చంపివేసింది ?

2.     సింహం హైనాను ఎందుకు ఛంపివేసింది ?

3.     ఈ జంతువులలో సత్యాన్ని చెప్పిన జంతువులు ఏవి ? అవి ఎందుకు సత్యాని తెలిపాయి?

  భావాత్మకమైన ప్రశ్నలు

1.     సింహం జీబ్రాను ఎందుకు చంపిపినపుడు నేకేమనిపించింది  ?

2.    నక్క సింహానికిచ్చిన సమాధానం విని నేకేమనిపించింది ?  

ఫలితాన్ని అంచనా వేయడం  

1.   కథను ఆధారం చేసుకొని  ఈ క్రింది జంతువుల గురించి మీ అవగాహనను  వ్రాయండి: 

--జీబ్రా

---హైనా

---నక్క

---సింహం

2.            వీటిలో తెలివైన జంతువు  ఏది? ఎందుకు?

సాధారీకరణకు సంబంధించిన ప్రశ్నలు

1.     కథ నుండి మీరేమీ గ్రహించారు ? అలా ఎందుకనిపించింది ?

అనుప్రయోగం :

1. నక్క కథలో చెప్పిన విధంగా కాకుండా మరెవిధంగా నైనా సింహానికి చెప్పడం వలన నక్క తనను కాపాడు కోగలదా ?

C. ఆలోచనా నైపుణ్యాలు : డిడక్టివ్ రీసనింగ్ 

  మూల్యాంకనం

1.     నక్క ఆచరించిన విధానం సరైనదేనా ? కాదా ? సహేతుకంగా వ్రాయండి.

2.    సింహం నక్కను మరియు హైనాను మాత్రమే చంపిఉండాలి ? వాక్యానించండి

3.    ఈ కథను మీరు చదివిన  మరో ఇలాంటి కథతో పోల్చండి.  

18617 registered users
7272 resources