అభ్యసనం ఆనందకరంగా ఎందుకు ఉండకూడదు ?

 

అందరికీ కనువిప్పు కలిగించిన ఒక  అనుభవాన్ని వివరించడంతో దీనిని మొదలు పెడతాను.  కొన్ని సంవత్సరాలక్రితం  మేము  పిల్లల కోసం రచనలు ఎలా చేయాలి ?  అన్న సమావేశాన్ని ఔత్సాహిక రచయితల కోసం  ఏర్పాటు చేసాము.  పిల్లల రచనల ఆవశ్యకత, అవసరం గురించి ఈ సమావేశ పరిచయభాగంలో వివరించిన తరువాత వారిని రచనలు చేయమని చెప్పాము.  ఆ రోజు చివరలో మేము తిరిగి సమావేశమైనప్పుడు కొంత మంది రచయితలు తమ రచనలను ప్రదర్శించడానికి తయారుగా ఉన్నారు. “గంట మోగాగానే తరగతిగది నుండి పిల్లలు ఆనందంగా బయటకు వచ్చారు” అనే  వాక్యంతోనే చాలామంది  తమ రచనలను మొదలు పెట్టారు.  ఏ ఒక్కరు కూడా “గంట మోగగానే  పిల్లలందరూ ఆనందంతో, కొత్తవిషయాలను అన్వేషించాలానే ఉత్సాహంతో తరగతిగదిలోకి ప్రవేశించారు” అని మొదలు పెట్టలేదు.     

పాఠశాల అంటేనే ఒక భయంగొల్పే, విసుగుకలిగించే, నిస్తేజమైనదనే భావనను వదిలితేనే పిల్లలు ఆనందంగా ఉంటారని చూడడం అలవాటై పోయింది. ఇలాకాకుండా పాఠశాల అంటే ఆనందమైన అనుభవాలను అందించేదిగా, పిల్లలు ఉత్సాహంగా రావడానికి ఇష్టపడే స్థలంగా చేయలేమా?

1986 జాతీయ విద్యావిధానం  “శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని”  ప్రోత్సహించింది. పిల్లలకు “ఆత్మీయతో వారిని ప్రోత్సహించే విధంగా ఉండే పద్ధతులను”  ఈ విధానం నొక్కి వక్కాణించింది.

అయితే మన పాఠశాలల్లో  ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి వలన ఈ విధానం ఆచరించడానికి కష్టంతో కూడుకున్నది కావచ్చుకానీ, కొంత సహకారాన్ని అందించినప్పుడు ఇది అసంభవమైనది మాత్రం కాదు.  ఉపాధ్యాయులు పిల్లలకోసం ఉత్సాహకరమైన, ఆనందకరమైన అభ్యసనానుభవాలను అందించడానికి N.C.E.R.T,   U.N.I.C.E.F.  సహాయంతో చేసిన ఒక ప్రయత్నమే Children’s Media Laboratory (CML)

Children’s Media Laboratory (CML)లో ఉపయోగించే సామగ్రిని పిల్లల అవసరాలకు, ఆసక్తులకు, సామర్థ్యాలకు అనుగుణంగా, వారికి కావలసిన అనుభవలని అందించే విధంగా తీర్చిదిద్దారు. ఈ సామగ్రి అంతా కృత్యాధార బోధన మరియు ఆట-పాటల పధ్ధతిలో తయారుచేశారు. ఇందులోని ఇతివృత్తాలను కూడా పిల్లల సంస్కృతికి దగ్గరగా ఉండేలా ఉండేలా తీర్చిదిద్దారు.  

బొమ్మల పుస్తకాలు, బొమ్మ కార్డులు , పోస్టర్లు , ప్లయింగ్ కార్డు లు Children’s Media Laboratory (CML)లో సామగ్రిలో ఉండేవి. కొన్ని బోర్డ్ గేములు, శ్రవణసంబంధిత వనరులు అలాగే ఉపాధ్యాయులు కృత్యాలకు ముందు, తరువాత చేయదగిన పనుల గురించి ఒక మార్గదర్శిని కొన్ని స్లైడలను slides and slide tapes తయారు చేసింది.

బొమ్మల పుస్తకాలు :

ఎక్కువ బొమ్మలు కలిగిన  కొన్ని కథల పుస్తకాలను, భావనలకు సంబంధించిన కొన్ని పుస్తకాలను, కొన్ని గేయాల పుస్తకాలను CMLలో భాగంగా ముద్రించారు.  ఇందులో కొన్ని పూర్వ పాఠశాల విద్యార్థులకు చదివి వినిపించడానికి, 6 – 8సంవత్సరాల పిల్లలకు అనుగుణంగా ఉండేలా కొన్ని  ఉన్నాయి. ఈ కథలపుస్తకాల లోని ఇతివృత్తాలు, పాత్రలు అన్నీ వారి పరిసరాలకు అనుగుణంగా ఉండడం వలన కథలలోని పాత్రలతో వారిని వారు చాలా సులభంగా పోల్చుకోగలరు.  భావనల పుస్తకాలు కూడా ఇలాంటి పద్ధతిలో తయారు చేసినవే, ఉదాహరణకు రంగులు ఆకారాలు పుస్తకం, ఇందులో ఆరు రంగులను, నాలగు వస్తువులతో వివరించారు. “ఎరుపు అంటే ఏమిటి” ? అనే పుస్తకం పండుమిరపకాయలను, టోమాటోలను, పోస్ట్ బాక్స్ ను ఎర్రటిముంత, తన తల్లి పెట్టుకొనే ఎర్రటి బొట్టు, ఎపుడైనా మోకాలుకీ దెబ్బతగిలితే వచ్చే ఎర్రటి రక్తం గురించి ఉండేవి.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులని ఈ పుస్తకాలను ప్రాథమిక వనరులుగా ఉపయోగించుకొని వీటి ఆధారంగా పిల్లలతో సంభాషణలను జరపడానికి ఇలాంటి మరిన్ని కృత్యాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.           

బొమ్మల కార్డు లు , పోస్టర్లు , ప్లేయింగ్ కార్డు లు

Children’s Media Laboratory (CML)లో భాగంగా అభివృద్ధి చేసిన కార్డులు, పిల్లలలో క్రమానుబధ్ధ ఆలోచనల, సమయ పరిజ్ఞానం, క్రమానుగతం, సంఖ్యా సంబంధ భావనలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడినవి. కార్డులలో  పిల్లల జీవితంలోని రోజువారి  సంఘటనలను ఒక క్రమపద్ధతిలో విశ్లేషించి వాటిని  బొమ్మల రూపంలో వ్యక్తం చేయబడినవి. ఉదాహరణకు బావి నుండి నీటిని తోడడాన్ని నాలుగు చిత్రాల రూపంలో చూపారు  1. బకెట్ ను బావిలోకి జార విడచడం 2. బకెట్ ను బావి నుండి బయటకు తోడడం  3. కడవను నీటితో నింపడం  4. నిండిన కడవను నెత్తిన పెట్టుకొని బావి దగ్గర నుండి బయలుదేరడం. పిల్లలు ఈ బొమ్మలను చదివి వాటిని క్రమపద్ధతిలో ఉంచాలి.

ప్లేయింగ్ కార్డు లు: ఇవి సాధారణంగా బజారులో దొరికే కార్డుల వంటివే, కాకపోతే వీటిపై కూరగాయలు, పండ్లు, జంతువుల, పక్షుల మరియు కీటకాల బొమ్మలు ఉండేవి. ప్రతిపెట్టే  రకానికి  8 కార్డుల ప్రకారం  మొత్తం40  కార్డులను కలిగి ఉంటుంది. దీని ప్రదానోద్దేశ్యం పిల్లలలో పదజాలాభివృద్ది మరియు వర్ఘీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యడం. తరువాత ధశాలలో వీటితో పలు-ఆటలు ఆడవచ్చు.

ప్రకటనా చిత్రాలు : పిల్లలలో వారికి పరిచితమైన సన్నివేశాల ద్వారా, మౌఖిక నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యడమే ఈ ప్రకటనా చిత్రాల ప్రధానోద్దేశ్యం. ఉదాహరణకు ఒక ప్రకటనాచిత్రం గ్రామంలోని బస్సులు నిలుపు స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ చిత్రాన్ని చూడగానే పిల్లలలు సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలను ఆ కార్డుల వెనుకవైపు ఇచ్చారు.      

బోర్డ్ గేములు

ఇవి సాధారణంగా బయట మనం  చూసే పామూ నిచ్చెన(Snakes and Ladders)లేదా లూడో( Ludo) లాంటివి. వీటి లాగానే  పిల్లలలో వ్యక్తిగత పరిశుభ్రత- పోషణ, పదజాలభివృద్ది  లేదా గణన నైపుణ్యాలు అభివృద్ది చేసేందుకు అనువుగా కొన్ని బోర్డ్ గేములను తయారు చేశారు. ఉదాహరణకు  సఫాయీకీ సీదీ, “Safai Ki Seedhi”  (పరిశుభ్రతకు సంబంధించిన ఆట )   పౌష్టిక్ ఆహార్ కా ఖేల్ “Paushtik Aahar Ka Khel” (పౌష్టిక ఆహారానికి  సంబంధించిన ఆట) భాషాకి ఉడాన్“Bhasha ki Udan” (భాషకు సంబంధంచి ఆట) మరియు గణిత్ ఖేల్ “Ganit Khel” (గణితానికి సంబంధించిన ఆట) మొదలైనవి. ఇందులో సఫాయీకీ సీదీ అనే ఆట పిల్లలలోమంచి  అలవాట్లను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. రోజూ పళ్ళు తోముకోవడం, లాంటి మంచి అలవాట్లను ఎన్నుకొన్నప్పుడు నిచ్చెనఎక్కడం, గోర్లలోమట్టి  లాంటి  చెడు అలవాటుకు ఆటలో  రెండడుగులు వెనుకకు వెళ్ళాలి. భాషాకి ఉడాన్“Bhasha ki Udan” (భాషకు సంబంధంచి ఆట)లో పిల్లలు కొన్ని వస్తువులను గుర్తుపట్టి వాటి పేరుని చెప్పాలి. తరువాత ఆ వస్తువు యొక్క మొదటి అక్షరంతో మరి కొన్ని పదాలను చెప్పాలి.  గణిత్ ఖేల్ “Ganit Khel” (గణితానికి సంబంధించిన ఆట)లో  పిల్లలకు  ఒకటి రెండు తరగతులలో పరిచయం చేసిన సామర్థ్యాల అభ్యాసం కోసం ఆటలు ఉంటాయి.  

ఆడియో టేప్ లు : (శ్రవణ సంబంధ వనరు)

Children’s Media Laboratory (CML)లో తయారు చేసిన ఆడియో టేప్ లు(శ్రవణ సంబంధ వనరు)  ముఖ్యంగా  కథలు, పాటలు ఆటలు, పిల్లల మధ్య జరిగిన సంబాషణలు  మొదలైన వాటిని కలిగి ఉన్నాయి. ప్రతి ఆడియో టేప్(శ్రవణ సంబంధ వనరు) 15 నిమిషాల వ్యవధి కలిగి ఉన్నది. ప్రతి ఆడియో టేప్ (శ్రవణ సంబంధ వనరు)కు దానిని ఎలా ఉపయోగించాలో, అందులో ఏమి ఉన్నదో  వివరిస్తూ చిన్నపుస్తకం కూడా ఇచ్చారు. హిందీ భాషలో ఉన్న వీటిని ప్రస్తుతం కోటా రేడియో ప్రసారం చేస్తోంది.

స్లైడ్ టేప్ లు

పిల్లలు తమ పరిసరాల గురించి బాగా ఆసక్తిని పెంచుకోవడానికి, తెలుసుకోవడానికి  అవసరమైన ఇతివృత్తాలపై  స్లైడ్ టేప్ లు ఉంటాయి. ఇవి ధ్వనితో కూడి ఉంటాయి. వన్యమృగాలు,సాధుజంతువులు పుష్పాలు, మొక్కలు  మొదలైనవి ఇందులోని కొన్ని ఇతివృత్తాలు.  

చివరిగా (CML) అనే కార్యక్రమం పూర్వ ప్రాథమిక విద్య /ప్రాథమిక విద్య పాఠశాలల ఉపాధ్యాయులకు  పిల్లలను అభ్యసనం వైపు ఆకర్షించడానికి అనువుగా ఉండే సామాగ్రిని ఉపాయాలను పరిచయం చెయ్యడానికి చేసిన  ఒక ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ సామగ్రి అంతా ప్రస్తుతం చాలా పాఠశాలల్లో ఆనాసక్తిగా, నిస్తేజంగాఉండే, బోధనాభ్యసన ప్రక్రియలకు  సహాయంగాఉండి  ఇచ్చిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించినపుడు వాటిని ఆసక్తికరంగా ఆనందకరంగా తీర్చి దిద్దడానికి ఉపయోగపడుతుంది..

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

పూర్వ ప్రాధమిక విద్య లో దశ,నిర్దేశ,ప్రణాళిక ,విద్యా శాకాదికారులతో,విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తో సమన్వయ లోపం మరియు శిక్షణ లేకపోవడం. చాలా చోట్ల సొంత భవనం లేక పోవడం పిల్లలు ఆనందంగా టాయ్స్, సేఫ్ ద్రింకింగ్ వాటర్,మొథెర్స్ మీటింగ్ ఖచ్చితంగా జరగాలి.ఆన్ లైన్ లో ఉంచాలి.

18336 registered users
7154 resources