అనుభవజన్య పద్ధతిలో భాషాభ్యసనం:

ఈ  పధ్ధతిలో పిల్లలలో పదాల స్థాయిని గుర్తించడానికి అతనిలోని మౌఖిక భాషాస్థాయిని  ఉపయోగించుకొం టారు. ఈ పధ్దతి పిల్లల ఆలోచనలను గౌరవించి, వాటిని వివిధారూపాలలో ముఖ్యంగా మౌఖికంగా వెలిబుచ్చాడానికి ప్రాధాన్యతనిస్తారు.దీనినే  తరువాత ఉపాధ్యాయుడు కానీ విద్యార్థి కానీ వ్రాతరూపంలో ప్రదర్శిస్తారు.

భాషానుభవాల ద్వారా భాషాభ్యసనం:

ప్రాథమికస్థాయి  విద్యలో విధ్యార్థులు అర్థవంతంగా చదవడానికి మరియు వ్రాయడానికి ఉపయోగపడే ఒక ఉపయుక్తమైన  పద్దతే   భాషానుభవాల ద్వారా భాషాభ్యసనం.  ఇది విద్యార్థుల భాషానుభవాలను వారి భాషాభివృద్ధికి ఉపయోగించుకొంటుంది. ఇది బాషకు సంబంధించిన అన్ని నైపుణ్యాలను ఒక దగ్గరకు చేరుస్తుంది. ఈ పధ్ధతిలో పిల్లలు మాట్లాడేతీరు, అతను చదివేపద్దతిని అతని అనుభవాలు భాషావిషయాన్ని      తెలియచేస్తాయి.  ఈ పధ్ధతిలో చదివిన అంశాన్ని వీకేతనం కోసం కాకుండా,   ప్రాధాన్యతను ముద్రణలోని విషయాన్ని తన స్వంతఆలోచనలో మాట్లాడడానికి ఇస్తారు. ఇలాంటి  వ్రాతసామాగ్రి పిల్లలు అనుభవాల అధారంగా తయారు కాబడినవి కావున పిల్లలు చాలా ఆసక్తి తో వాటిని చదవడానికి ప్రాధాన్యతను ఇస్తారు.

ప్రత్యక్షంగా జరిగిన లేదా ఏర్పరిచిన అభ్యసనానుభవన్ని అందరూ కలసి సంఘటితంగా తమ అనుభవకథగా వ్రాస్తారు. విద్యార్థులు  వివిధ సామర్థ్యాలు కలిగిన ఉన్నప్పుడు ఈ పధ్ధతి  ఎంతో ప్రభావవంతమైనది. విద్యార్థులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి, లేదా కథల యొక్క సంక్షిప్త  వివరణను లేదా  సమస్యలకు సమాధానాలు లేదా  టి.వి ప్రదర్శనల పై వ్యాఖ్యానాలు లేదా  స్వంత కథలు లేదా ఏవైన ప్రత్యేక మైన సంఘటనలు సంబంధించిన సన్నివేశాలను మొదలైన వాటిని ఇందుకోసం వినియోగించుకోవచ్చు.

ఉపాధ్యాయుడు ఒక అనుభవాన్ని తన విద్యార్థుల కోసం ఏర్పరుస్తారు. ఈ అనుభవాన్ని పిల్లలకు కల్పించిన  తరువాత ఉపాధ్యాయుడు తరగతిగదిలో ఒక చర్చను చేస్తూ దీనిలో ఆ నుభవాన్ని పునర్విమర్శ చేస్తారు, అనుభవాన్ని కథగా చెప్పడానికి అవసరమైన పదజాలాన్ని, కథలోని ముఖ్యసంఘటనల జాబితాను తయారుచేసుకొని తరువాత దీనిని   కథగా వ్రాస్తారు. ఉదాహరణకు పిల్లలు తమ పాఠశాలలోని ఉద్యానవన సందర్శనానుభవం  మొదలైనది. ఈ అనుభవాన్ని వారెంతో  ఆనందిస్తారు అలాగే దీనిని ఒక దస్తావేజుగా మార్చడానికి  ఇష్టపడుతారు.

ఉపాధ్యాయుడు ముందుగా విద్యార్థులను మన కథకు మనము పేరేమి పెడదాము? అని అడుగుతాడు.దీని వలన పిల్లలు ఒక అంశానికే పరిమితం అవుతారు. అనుపమ “పాఠశాలలోని ఉద్యానవన సందర్శన”  అని చెపుతుంది “పాఠశాల ఉద్యానవనం” అని రాజా చెపుతాడు, “మనమేమి చేశాము”  అని షా చెపుతాడు. ఉపాధ్యాయుడు వీటిని నల్లబల్లపై ఒక దానిక్రింద ఒకటి వాటిని చెపుతూ వ్రాస్తుంది.తరువాత వాటినే మరొకసారి చదువుతుంది.

నడక

పాఠశాలలోని ఉద్యానవనం

మనమేమి చేసాము

తరువాత ఉపాధ్యాయుడు ఈ విధంగా చెపుతారు, ఈ మంచి ఆలోచనల గురించి మరింత ఆలోచిధ్దాం , దీనిని మనం  “నడక” అని పేరు పెడితే వారికి అవగాహన కానీ విషయం ఏమిటి ? చదివేవారికి వారికి “మనం  పాఠశాలలోని ఉద్యానవనానికి  వెళ్ళినట్లు తెలియదు” అని నీరవ్ చెప్పడు. చదవరులకు  “అది ఎలాంటి  నడకో తెలియదు”  అని అరున్ చెప్పాడు. ఇది మ”నమేమి చేసామో” అనే శీర్షికకు కూడా వర్తిస్తుంది అని టామీ అన్నాడు.  మీలో ఏవరైనా  ఎవరైనా బాగా ఆలోచించి మనం చెప్పాలనుకొంటున్న అన్ని విషయాలను స్పష్టంగా తెలియచేసేలా ఒక  శీర్షికను  చెప్పగలరా?  “పాఠశాల ఉద్యానవనంలో  వ్యాహాళి”  అని టామీ అన్నాడు.  దీనిని ఎవరూ చెప్పలేకపోతే  ఉపాధ్యాయుడు   మనము పాఠశాలలోని ఉద్యానవనంలో నడచిన నడకను ఏమంటాము? అది మనం  నడిచామని చెపుతుందా ? చెపితే ఎక్కడ నడచామో కూడా చెపుతుందా ? అనే ప్రశ్నలతో సిధ్దంగా ఉండాలి. సరే. ఐతే మీలో ఎంతమంది  ఈ శీర్షిక బాగుందని అనుకొంటున్నారు ? అందరూ బాగుందని అనికొన్నారు.

ఉపాధ్యాయుడు  ఈ శీర్షిక పేరును ఒక పెద్ద కాగితం పై వ్రాసారు. ఆమె వ్రాస్తున్నపుడు దానిని పలుకుతూ వ్రాశారు. ఇప్పుడు ఎవరు దీనిని తరగతి అందరికోసం చదివి వినిపిస్తారు ?  ఆమె కొంతమంది పిల్లలను ఎంపిక చేసుకొని వారిని కాగితం వద్దకి రమ్మని చెయ్యి చూపూతు దానిని చదవమని చెప్పింది. ఇప్పుడు అందరూ పలుకుదాం అని ఆమె చెప్పగానే తరగతిగదిలో అంతవరకూ స్పందించని వారు కూడా ఆమె తన చేతిని ఎడమ నుండి కుడికి జరుపుతూ ఉంటే అందరూ చదివారు.

తరువాత ఆమె ఇప్పుడు,  మనం  పాఠశాలఉద్యానవన  నడక గురించి ఏమని చెపుతాం ? అని ప్రశ్నించగానే   మేము “మేం ఉడతను చూసామ్”  అని అరవిందు చెప్పాడు ,  ఉపాధ్యాయురాలు “ మేము తోటలో ఉడతను చూసాము అని చెప్పింది”  ఈ వాక్యాన్ని పిల్లలు తిరిగి చెప్పారు. ఇదే విధంగా మిగినిలిన వాక్యాలను కూడా కలిపారు. నిజానికి ఈ కథ మొదట్లో చాలా చిన్నదే కావచ్చు కానీ మరి కొన్ని కథలను కలుపడం వలన పెద్దకథ ఆవుతుంది.

 పాఠశాలలోని ఉధ్యానవనంలో నడక :

మేము ఒక ఉడుతను చూశాం.

అది చెట్టు పైకి పరిగెత్తింది.

అది చెట్టుపై కూర్చొని మమ్ములను చూసింది.

అది చెట్టు పై కూర్చొని ఉండగా మేము చూసాము.

మేము ఒక పక్షిని కూడా చూశాము.

ఉపాధ్యాయుని తో పాటు తరగతి మొత్తం, కథను  చదువుతారు. పిల్లలు తోటలో నడుస్తూ తమ చిత్రాని తామే గీస్తారు. అన్ని చిత్రాలను ఒక దగ్గర అతికించి కథకు ఒక రూపాన్నిస్తారు. ఉపాధ్యాయుడు  కథకు సంబందించిన వాక్యాలను ఒక చార్ట్ పై  వ్రాస్తారు. వీటినికి ఒక దగ్గర ఉంచుతారు.

పిల్లలు ఈ వాక్యాలను జతపరిచి పదాలను పోల్చి చదువుతారు. ఒక వారంలోనే విద్యార్థులందరూ "వారి కథను" చదువుతారు.( ఇప్పుడు ఉపాధ్యాయుడు  విద్యార్థులకు జంతుప్రదర్శనశాల సందర్శన, సముద్రతీర  సందర్శన  మొదలైన అంశాలను ఇస్తారు)

ఆ చార్ట్ దేని గురించో, లేదా ఆ కథ పేరేమిటో ఎవరు గుర్తుంచుకొంటారు అని అడిగినప్పుడు,  కొందరు పిల్లలు  కథను మొత్తం నేను చదవగలను అని దానిని నిరూపించవచ్చు. ఇంకొందరు కొన్ని వాక్యాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆ వాక్యాల పట్టీలను ఆ చార్టుతో జత చెయ్యమని చెప్పవచ్చు. పిల్లలు కథ ఆధారంగా వాక్యాలను సరైన క్రమం లో అమరుస్తారు.ఉపాద్యాయుడు వాక్యాలను పదాలుగా  లేదా చిన్న చిన్న విభాగాలుగా  చేసి విద్యార్థులతో వీటిని వాక్యాలుగా చెయ్యమనవచ్చు. ఉపాధ్యాయుడు పిల్లల అవధానాన్ని కొన్ని పదాల మీద కేంద్రీకరిస్తాడు ఉదాహరణకు “మనం”   కథలో ఈ పదాన్ని ఎవరు కనుగొంటారు?  వాక్యాలను చదివి విని మనము ఆ పదాన్ని కనుకొందాము,  అని కృత్యాన్ని నిర్వహించి మిగిలిన పాదాలతో ఈ కృత్యాన్ని కొనసాగిస్తారు.

తరువాత ఆమె పదాల కార్డులను పట్టుకొని చూపుతూ పిల్లలను చదవమని చెపుతూ వారు గుర్తుపట్టగలరో లేదో పరీక్షించింది.ఇంకనూ చదవలేని వారికి ఆమె చదవడంలో సహయపడింది. ఇంకా ఆమె వారి కథావగాహనా సామర్థ్యాన్ని, కథలోని ముఖ్య విషయాన్ని  ఇతర విషయాలను అడిగి పరిక్షించవచ్చు ఉదాహ్రనకు  మనం   ఏ సందర్శశానకు  వెళ్ళాం  ? సందర్శనా సమయంలో ఏమి చూసాం ? అతను ఏమి చూస్తున్నాడు? మొదలైనవి . ఇలాంటి బృంద బోధనలో నిదానంగా  నేర్చుకోనే పిల్లలు తొందరగా నేర్చుకొనే పిల్లలను చూసి,  వారు కూడా తొందరగా నేర్చుకొంటరు.

ట్వింకీ ఒకటవ తరగతి

ట్వింకీ మా కుక్క పేరు.

ట్వింకీ మా పాటశాలలొ ఉంటుంది.

ట్వింకీ మా పాఠశాల కుక్క

ట్వింకీ మాతొ ఆడుకొంటుంది

ట్వింకీ మా వేనకాలే పరిగెడుతుంది

ట్వింకీ  కి పాలు బ్రెడ్ అంటే చాలా ఇష్టం

ఈ విధంగా ఈ పద్ధతి పిల్లవాని మౌఖిక భాషా నేపధ్యాన్ని “పదాలను”  గుర్తించడానికి ఉపయోగించుకొంటుంది. విద్యార్థి ఆలోచన ఎంత చిన్నదైనా  ఆ అలోచనను వివిధరూపాలతో పాటు ముఖ్యంగా  మౌఖికంగా వ్యక్తపరచడాన్ని  గౌరవించడమే కాక ప్రోత్సహిస్తుంది.  ఈ ఆలోచనను విద్యార్థికానీ ఉపాధ్యాయుడు కానీ లిఖితరూపంలో ప్రదర్శించవచ్చు. దీనిని విద్యార్థులందరితో కలిసి చదువుతారు, ఇది విభిన్నమైన వనరులద్వార లిఖిత భాషను చదివినట్లౌతుంది. ఇదంతా కూడా చదివే వారి ఆలోచనలను పదాల ఉఛ్చారణనూ, చదవాడాన్ని మరియు  వ్రాయడాన్ని, మెరుగుపరుస్తుంది. ఇలా భాషానుభవాల ద్వారా భాషాభ్యసనం పధ్ధతి పాఠశాలతొలిదశలలో భాషలోని ప్రాథమిక నైపుణ్యాలైన వినడం, మాట్లాడం, ఊచ్ఛారణను మరియు వ్రాయడాన్ని అభివృధ్ధి చేస్తుంది.

ఉపాద్యాయుడు ప్రతిరోజూ ఈవిధంగా విద్యార్థులు రచించిన విషయాల నుండీ ఏదో ఒక విషయాన్ని చెప్పవచ్చు లేదా  భాషను కళల ద్వారా చెప్పే అవకాశం కల్పించవచ్చు లేదా వారికి ఇష్టమైన అంశాలను చర్చించవచ్చు,అలాగే  వారు చూసిన దానిని,  వినినదానిని, రుచిచూసిన వాటిని,  వాసన చూసినవాటిని,  అనుభూతిని పొందిన వాటిని లేదా వారి ఊహలను మరియు  ఆవిష్కరణలనూ వ్రాయడానికి,  చిత్రీకరించడానికి ఒక నిర్ధిష్ఠమైన సమయాన్ని స్ఠలాన్ని కేటాఇంచవచ్చు. వారి నిత్యాను భవలను కథల రూపంలో చెప్పమనండి, వారి ఊహలను అనుభావాలను పుస్తకంగా  వ్రాయండి.

వ్యాఖ్యలు

sairam యొక్క చిత్రం

నేను లింగంగుంట,కావలి మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అనపల్లి సుమంత్ ఒకటవ తరగతి విద్యార్ధి నా వద్దకు వచ్చి మూడు నెలలో పూర్తి చేసి నాకు చదివిన పుస్తకం తిరిగి అదే చదవాలంటే బోరుగా ఉన్నధి అని చెప్పగానే ఆ తరగతి బోధించే ఉపాద్యాయుడు నా తరగతి విద్యార్ధి కదా నేనే ఉంచుకుంటాను అంటే సర్ది చెప్పి ఆ బాబు కు రెండవ తరగతి టెక్స్ట్ బుక్ ఇచ్చి రెండవ తరగతిలో 10వ తరగతి ఐక్యరాజ్య సమితి,శ్రీ అంబేద్కర్ జీవిత చరిత్రతను పుస్తకం బాగా చదివి సొంతంగా రాసుకొని నెల్లూరు లో జరిగిన వ్యాస రచన పోటీలలో 9 మరియు 10 వ తరగతి వారితో పోటిపడి రెండవ భహుమాతి సాధించాడు ప్రస్తుతం బి టెక్ చదువుతున్నాడు తల్లితండ్రులు మాత్రం 10వ తరగతి మాత్రమే చదివినారు.మీకు చాలా కృతజ్ఞతలు.

17934 registered users
6760 resources