వ్రాసేనైపుణ్యాన్ని ఆనందకరమైన కృత్యాలతో అభివృద్ధిచేయడం

Resource Info

ప్రాథమిక సమాచారం

విద్యార్థులను నిత్యజీవితంలోని అంశాల గురించి  కానీ లేదా వారు సులువుగా అవగాహన చేసుకోగలిగిన అంశాలగురించి  వ్రాయమన్నప్పుడు ఈ నైపుణ్యం ఆసక్తికరంగానూ  ఆనందంగానూ మారుతుంది.  పిల్లలు తగినంతగా పదజాలాన్ని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కలిగిఉండరు గనుక సాధారణంగా వ్రాయడానికి విసుగును  ప్రదర్శిస్తారు.  చర్చలను నిర్వహించడంతో మొదలుపెట్టి  మేధోమథనం, ఆలోచనలను క్రమంలో ఉంచడం,  పదజాలాన్ని పెంపొందించడం మొదలైన కృత్యాల ద్వారా విద్యార్థులలో విద్యార్థులలో వ్రాయడంఅనే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.   

Duration: 
(పూర్తి రోజు)
పరిచయం: 

పిల్లలలో వ్రాసే నైపుణ్యాన్ని అభివృధ్ధి  చేయడానికి కొంత మార్గదర్శకత్వం అవసరం. వ్రాసేవారు నిరంతరం  వ్రాసిన వాటిలో వ్యాకరణానికి సంబంధించిన దోషాలపై దృష్టిపెడితే వారిలో సృజనాత్మకతకు ఆటంకాలు ఏర్పడతాయి. సృజనాత్మక వ్యక్తీకరణ పిల్లలకు ఆనందాన్ని ఇవ్వడమేకాక  వారిలోని ఉధ్వేగాలను వెలిబుచ్చేందుకు ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సూచించిన కొన్ని కృత్యాలు  పిల్లలలో వ్రాయడంలో భయాన్ని అధిగమించడానికే కాక భాషపై ఆసక్తిని పెంచడానికి కూడా  ఉపయోగపడుతాయి. 

సోపానాలు: 

ఈ క్రింద ఇచ్చిన వనరులలో కొన్ని ప్రత్యేకపధ్ధతులలో వ్రాయడానికి ఉపయోగపడితే కొన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి తోడ్పడుతాయి. కొన్ని సూచనలు కూడా ఇయ్యబడ్డాయి.

కృత్యాలు :

1.     వర్ణనాత్మకంగా వ్రాయడం

    1a. నాగురించి వ్రాయడం

చాలా మంది పిల్లలు తమను  గురించి వ్రాయడానికి ఇష్టపడుతారు. ఇందుకోసం మనం వారికి ప్రత్యుత్తరసూచక ప్రశ్నలద్వారా సహాయం చేస్తే వారిగురించి వారే ఒక పేరాను సులువుగా వ్రాయగలరు. ఉదాహరణకు  

నీ పేరేమిటి ?

నీ వయస్సు ఎంత ?

మీ నివాసం  ఎక్కడ ?

ఎవరితో కలసి నివసిస్తూ ఉంటారు ?

మీ గురించి వర్ణించడానికి కనీసం మూడు విశేషణాలను ఉపయోగించండి.

నీకు ఇష్టమైన పనులు ఏవి ?

మరిన్ని వివరాలకోసం మొదటి అభ్యాసపత్రం : నాగురించి చూడండి.

 2b. పరిసరాలను వర్ణించడం

విద్యార్థులను వారికి తెలిసినవాటి గురించి వ్రాసేలా ప్రోత్సహించాలి.  ఉదాహరణకు వారి పాఠశాల, వారు సందర్శించిన జాతర, లేదా వారి పెంపుడు జంతువు గురించి , వారు ఎంచుకొన్న అంశం గురించి వ్రాయడానికి అవసరమైన పదాలను తెలుసుకోవడానికి  మేధోమదనాన్ని నిర్వహించవచ్చు.  వారు పదాలను చెపుతుండగా నల్లబల్లపై వాటిని వ్రాయవచ్చు లేదా కొన్ని పదాలను సూచించడం ద్వారా మార్గదర్శనం చేయవచ్చు.

ఇందుకోసం

రెండవ అభ్యాసపత్రం: పాఠశాలలో ఒక రోజు 

మూడు అభ్యాసపత్రం:  నా పెంపుడు జంతువు కుక్క 

నాల్గవ అభ్యాసపత్రం :  వర్షాకాలంపై ఇచ్చిన  అభ్యాసపత్రాలను పరిశీలించండి.

 

1c. వ్యక్తులను వర్ణించడం

పిల్లలలో తగినంతగా పదజాలాన్ని పెంపొందించడానికి వారికి  వివిధ హావబావాలును ప్రదర్శిస్తున్న  ముఖచిత్రాలను ఇవ్వాలి. విద్యార్థులు వాటిని వర్ణించాలి.  ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొన్ని కొత్తపదాలను ఉదాహరణకు వంపులు తిరిగిన కేశాలు, కొనతేలిన ముక్కు, వెడల్పుగా ఉన్న కళ్ళు లాంటి పదాలను పరిచయంచేసి సహాయపడవచ్చు. ఈ విధంగా వారు చివరకు వ్యక్తులను స్పష్టంగా వర్ణించేలా అభివృధ్ధి చేయవచ్చు.  విద్యార్థులను వార్తాపత్రికలలో ప్రచురించే వివిధ వ్యక్తుల చిత్రపతాలను సేకరించి తరగతిగదికి తీసుకొని రమ్మని చెప్పడంద్వారా భావనకు తగిన పునర్భలాన్ని ఇవ్వవచ్చు.

ఇందుకోసం ఐదవ అభ్యాసపత్రం: వ్యక్తులను చూడవచ్చు

1d. భావాలను వర్ణించడం

విద్యార్థులను కొందరు వ్యక్తుల చిత్రాలను తీసుకొనిరమ్మని చెప్పాలి. వీటిని వార్తాపత్రికలు లేదా పత్రికలనుండి సేకరించవచ్చు. విద్యార్థులను చిత్రాలలో కనిపించేముఖభావాలను వర్ణించమని చెప్పండి. ఈ కృత్యాన్ని  పదజాలాభి వృధ్ధికి కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఉపాధ్యాయుడు కూడా కొన్ని కొత్తపదాలను వారికి పరిచయం చేయవచ్చు.

ఇందుకోసం  ఆరవ అభ్యాసపత్రాన్ని: భావాలేమిటి ?  చూడండి 

1e.పొరుగువారిని వర్ణించడం

విద్యార్థులను ఇప్పుడు వారు నేర్చుకొన్న కొత్తపదాలను ఉపయోగించి వారి పొరుగువారిని వర్ణించమని చెప్పండి. ఇందుకోసం వారి వర్ణనలో పొరుగువారు ఎలా కనిపిస్తారు, ఎలాంటి వారు మొదలైన అంశాలు ఉండవచ్చని తెలపండి. అతను లేక ఆమె దయగలిగిన వ్యక్తి లేక క్రూరుడు,సిగ్గరి, మొదలైనవి

ఇందుకోసం ఏడవ అభ్యాసపత్రం: నాకిష్టమైన పొరుగువారు  చూడండి

2. వివరాణాత్మకంగా వ్రాయడం

చెప్పండి. విద్యార్థులకు కొన్ని ప్రత్యుత్తరప్రశ్నలను ఇవ్వడం  ద్వారా సహాయపడవచ్చు.

ఇందుకోసం ఎనిమిదవఅభ్యాసపత్రం: గ్రామంలో జరిగే జాతర సందర్శన  చూడవచ్చు  

3. విశదీకరించి వ్రాయడం:

విద్యార్థులను  ఒక సంఘటనకు సంబంధించిన కారణాన్ని లేదా వివరణను వ్రాయమని చెప్పండి. ఇది ఒక ఇతివృత్తాన్ని తర్కాన్ని కలిగి ఉండాలి.

ఇందుకోసం తొమ్మిదవఅభ్యాసపత్రం: నాకిష్టమైన ఆటను చూడవచ్చు  

4. వృత్తాంత వివరణ :

విద్యార్థులను పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల గురించి లేదా మరేదైనా  వృత్తాంతం గురించి  వివరణ రూపొందించమని చెప్పవచ్చు. ఈ నివేదికలోని అంశాలు యధార్థాలై ఉండాలని వారి అభిప్రాయాలను  ఇందులో వ్రాయకూడని చెప్పాలి. ఇందుకోసం వార్తాపత్రికలలో వచ్చిన కొన్ని వృత్తాంతవివరణలను  చదివివినిపించవచ్చు.  

ఇందుకోసం పదవఅభ్యాసపత్రం: మా పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ను చూడవచ్చు  

5. ఉత్తరాలను వ్రాయడం

ఉత్తరాలు సాధారణంగా ఐదుభాగాలను కలిగి ఉంటాయి.

శీర్షిక

ఇందులోనే  తేదీతో పాటు చిరునామా కూడా ఉంటుంది. శీర్షిక తరువాత తగినత ఖాళీని వదలాలి

సంబోధన

సంబోధనను ఎపుడూ కామాతో ముగించాలి. దీనిని సాధారణంగా ప్రియమైన పదాన్ని చేర్చుతూ పాటు మనం ఉత్తరాన్ని వ్రాస్తున్నవ్యక్తికి మనతోకల సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని  వ్రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రియమైన మామయ్యకు, ప్రియమైన శర్మా గారికి, లేదా హాయ్ మీనా 

ఉత్తరంలోని ముఖ్యవిషయం: ఇందులో మనం తెలియచేయాల్సిన విషయాన్ని వ్రాస్తూఉంటాము.

ముగింపులో సంబోధన:  ఇది ఏకవవాక్యంలో ఉండి  కలిగి కామాతో పూర్తీఅవుతుంది.    

ఉదాహరణకు ప్రేమతో, నమస్సులు

సంతకం 

ఉత్తరం రాసే వారి సంతకం లేదా పేరుని టైపుచేయడం. సంతకాన్ని నలుపు లేదా నీలపు రంగుపెన్నుతో చేయవచ్చు. అవసరంలేనిచో ఈ భాగంలేకుండా కూడా ఉత్తతరాన్ని వ్రాయవచ్చు.

సంతకం క్రింది వ్రాసే సమాచారం :

సంతకామ్ చేసిన తరువాత వ్రాయాల్సిన సమాచారం ఏదైనా ఉంటే వ్రాయవచ్చు. ఈ భాగంకూడా ముఖ్యవిషయాలను కలిగి ఉండవచ్చు.

ఇందుకోసం పదకొండవ అభ్యాసపత్రం:  సాధారణలేఖ ను చూడవచ్చు  

ఇందుకోసం పన్నెండవ  అభ్యాసపత్రం:  వ్యావఖారిక లేఖ ను చూడవచ్చు  

విద్యార్థులను తమ తక్షణ అవసరాలగురించి తక్షణం ప్రతిస్పందించాల్సిన అంశాలపై  ఉత్తరాలను వ్రాసేలా ప్రోత్సహించాలి.( మాదిరి ఉత్తరాలను అభ్యాసపత్రాలుగా ఇచ్చారు). నిజానికి విద్యార్థులు పోస్ట్ కార్డ్ పై తల్లితండ్రులకు ఉత్తరాలను వ్రాసి పోస్ట్ చేయాలి. ఈ కృత్యం ద్వారా విద్యార్థులకు దేశంలో గల తపాలావ్యవస్థను పరిచయం చేయవచ్చు.  

6. పుస్తక సమీక్ష

విద్యార్థులు పుస్తక సమీక్షను వ్రాసేందుకు మార్గదర్శకత్వం వహించాలి. మార్గదర్శకత్వానికి అవసరమయ్యే కొన్ని ప్రశ్నలు

·         పుస్తకం పేరేమిటి ? రచయిత్ ఎవరు ?

·         పుస్తక ఇతివృతం ఏమిటి ?

·         ముఖ్య పాత్రలు ఎవరు ?

·         కథలో ఏమి జరుగుతుంది ?

·         ఈ పుస్తకమంటే మీకేందుకు ఇష్టం ?

ఇందుకోసం పదమూడవ అభ్యాసపత్రం : నా కిష్టమైన పుస్తకం ని చూడండి

7. కథలు

7a. కథలు వ్రాయడం

పిల్లలకు పదాల వ్యాకరణం అంటే కష్టం కావున వ్రాయడానికి విసుగుని చూపిస్తారు. మనం వారు వ్రాసేవిషయాల్లో వ్యాకరణానికి సంబంధించిన పదాలనిర్మాణంలో తప్పులను వెదుకుతూ ఉంటే వారు సృజనాత్మకంగా వ్రాయలేరు. సృజనాత్మకంగా వ్రాయడం పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రారంభంలో విద్యార్థులను వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి, పదనిర్మాణాన్ని, వ్యాకరణాన్ని చూడకూడదు. విద్యార్థులను స్వంతంగా సరళమైన భాషలో కథలను వ్రాయడానికి ప్రోత్సహించాలి. పిల్లలు కథలను వ్రాయడానికి సహాయకారిగా ఇక్కడ కొన్ని కృత్యాలను ఇచ్చారు.

ఒక చిత్రం సహాయంతో దీనిని ప్రారంబించవచ్చు. విద్యార్థులకు ఒక చిత్రాన్ని చూపి దాని ఆధారంగా ఒక కథను వ్రాయమని చెప్పండి.

మీరు కథ మొదటి పేరా మొదటి వాక్యాన్ని చెపుతూ పిల్లలకు సహాయపడవచ్చు. లేదా కథముగింపుని తెలియచేసే వాక్యాన్ని తెలిపి దాని ఆధారంగా కథను వ్రాయమని చెప్పవచ్చు. కథను వ్రాయడానికి అవసరమైన సూచనలను సలహాలను ఇవ్వండి.

కథ దేని గురించి ?

కథ ఎక్కడ జరుగుతున్నది ?

కథ మొదట్లో ఏమి జరుగుతుంది ?

తరువాత ఏమౌతుంది ?

సూచన: అద్భుతమైన కథలు ఆసక్తికరమైన ముగింపుని ఇస్తాయి.         

ఇందుకోసం పద్నాల్గవ అభ్యాసపత్రం: కథను వ్రాయడం  ని చూడండి

7b: కథల పుస్తకాన్ని తయారుచేయడం:

ఇపుడు విద్యార్థులను కథను మొదట చిత్తుప్రతిగా వ్రాసి దానిని సవరించి,  సంకలన పరచమని చెప్పండిఈ ప్రతిని మీరు కొన్ని సూచనలతో సరిచేయవచ్చు.

కథను కొన్ని విభాగాలుగా చేయవచ్చు.

ప్రతివిభాగానికి ఒక చిత్రాన్ని జతచేయండి. ఈ చిత్రం ఆ భాగంలోని ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా చూడండి.   

8. గొడపత్రికను ఏర్పాటుచేయడం

విద్యార్థులను గొడపత్రికను ఏర్పాటుచేసేలా ప్రోత్సహించాలి. ఇందులోని వివిధవిభాగాలను నిర్వహణకోసం  వేరు వేరు విద్యార్థులకు కేటాయించాలి  ఉదాహరణకు సంఘటనలపై నివేదికలను రూపొందించడం ఒకరికి, ప్రకటనల విభాగం ఒకరికి, సాహిత్యవిభాగం ఒకరికి,ప్రహేళిక విభాగం ఒకరికి కార్టూనుల, జోకుల విభాగం ఒకరికి లేదా సృజనాత్మకంగా మరేదైనా విభాగాన్ని ఏర్పాటుచేస్తే దానికోసం ఒకరిని ఇలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఏర్పాటుచేయాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ లేదా బృందంగా గానీ పనిచేయవచ్చు. ఒకరిద్దరు విద్యార్థులు ఈ పనిని సరిచూడవచ్చు. ఈ మొత్తం కృత్యాన్ని విద్యార్థులే చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయుడు కొంతవరకు సహాయం చేయవచ్చు. ఈ కృత్యం విద్యార్థులలో వ్రాయడానికి ఆసక్తిని కలిగించడమేకాక  విద్యార్థులు తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది

9.  సహాయక వాక్యాలను వ్రాయడం

సహాయక వాక్యాలను వ్రాయమని చెప్పడం ద్వారా  ద్వారా పిల్లలలో భావవ్యక్తీకరణను ప్రోత్సహించవచ్చు. ఈ సహాయక వాక్యాలు  విద్యార్థుల సృజనాత్మకు దోహదపడుతాయి. ఇవి వారిలో వ్రాసేనైపుణ్యాలు మెరుగౌతాయి.     

9a.విశదంగా వ్రాసేందుకు సహాయక వాక్యాలను అందించడం

విశదంగా వ్రాసేందుకు సహాయక వాక్యాలు ఒక సంఘటనలోని దశలను తెలియచేస్తాయి. విద్యార్థులు వీటిని సరైన క్రమంలో ఉంచి వీటిని వివరించవచ్చు. ఇవి ఒక వాస్తవమైనవి కావచ్చు లేదా ఒక కాల్పనికానికి చెందినవైనా అవవచ్చు.  

ఉదాహరణకు,

నేను తప్పిపోయిన రోజు,

మిమ్ములను ఎక్కడికైనా తీసుపోగల ఒక మాయాతివాచి గురించి,

మీ నానమ్మ మిమ్ములను చూడడానికి వచ్చినరోజు

పాఠశాలలో మీ మొదటిరోజు

మిమ్ములను ఒకరోజు మీ పాఠశాలప్రధానోపాధ్యాయున్ని చేస్తే,

ఒక రోజు నిద్రలేవగానే మీరు అంతర్దానమయ్యారని మీరు తెలుసుకొన్నారు, తిరిగి మీరు యధాస్థితికి ఎలా వచ్చారో వ్రాయండి.

9b. అనునయపూరిత సహాయవాక్యాలను వ్రాయడం:  వీటి వలన విద్యార్థి తనదృక్కోణానానికి వెనుకగల కారణాలను తర్కాన్ని వివరిస్తాడు.

9c విశదంగా వ్రాయడానికి సహాయాపడే వాక్యాలు : ఒక ప్రక్రియను క్రమంలో అవగాహనచేసుకొనేందుకు ప్రక్రియను వివరించేందుకు ఈ వాక్యాలు ఉపయోగపడుతాయి.  

ఉదాహరణకు మీకిష్టమైన ఆటను ఆడేవిధానం గురించి వ్రాయండి

ప్రతి వ్యక్తికి స్నేహితులు ఉండాల్సిన అవసరం ఉందా?

మీ పట్టణంలో నివసించడంలో ఉన్న సౌలభ్యాలు, కష్టాలు ఏమిటి వ్రాయండి ? సహేతుకంగా వివరించండి. 

10. పత్రికలకోసం వ్రాయడం

విద్యార్థులను పత్రికలకు వ్రాసేలా ప్రోత్సహించాలి. కొన్ని కాగితాలను ఒక దినచర్య పుస్తకంలా తయారుచేసుకొని విద్యార్థులను ఈ పుస్తకంలో ప్రతిరోజూ ఒక పేజీ వ్రాసేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అవకాశాన్ని కలిగించడమే దీని ముఖ్యఉధ్ధేశ్యం, కావున పద నిర్మాణాన్ని, వ్యాకరణాన దోషాలను చూడకూడదు. విద్యార్థులు ఈ కృత్యాన్ని కొనసాగించేలా చూడడమే ఉపాధ్యాయుని ముఖ్యకార్యం. వారికి ఆమోదయోగ్యమైతే ఈ విషయాలను ఇతర విద్యార్థులతో పంచుకోవచ్చు.  ఈ కృత్యాలన్నింటి ద్వారా ఉపాధ్యాయులు  విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా విద్యార్థులు దినచర్యపుస్తకంలో ఇతరులతో మాట్లాడని  విషయాలనే వ్రాసే అవకాశంఉంది.      

18489 registered users
7234 resources