మన పరిసరాల గురించి తెలుసుకొందాం

Resource Info

ప్రాథమిక సమాచారం

అన్వేషణ ద్వారా నేర్చుకోవడం జీవితం అన్నీ దశలలోనూ జరుగుతుంది. పిల్లలలో అన్వేషణ ఒక సాహసమైనదిగా మారి  ఈ పధ్ధతిలో అభ్యసించిన భావనలను వారు ఎప్పటికీ గుర్తుంచుకొనేలా చేస్తుంది. మొక్కల మరియూ జంతువుల నిశిత పరిశీలన పాఠ్యపుస్తకాలలో కంటే ఎక్కువ విషయజ్ఞానాన్ని అందిస్తాయి.  

Duration: 
04 hours 00 mins
పరిచయం: 

అన్వేషణ ద్వారా నేర్చుకోవడం జీవితం అన్నీ దశలలోనూ జరుగుతుంది. పిల్లలలో అన్వేషణ ఒక సాహసమైనదిగా మారి  ఈ పధ్ధతిలో అభ్యసించిన భావనలను వారు ఎప్పటికీ గుర్తుంచుకొనేలా చేస్తుంది. మొక్కల మరియూ జంతువుల నిశిత పరిశీలన పాఠ్యపుస్తకాలలో కంటే ఎక్కువ విషయజ్ఞానాన్ని అందిస్తాయి.  

లక్ష్యం: 

·   పరిశీలన మరియు  నోట్ వ్రాసే నైపుణ్యాలను పెంపోదించడం

·   దృశ్య మాధ్యమం ద్వారా వ్రాసే నైపుణ్యాన్నికలిగించడం 

సోపానాలు: 

ఉద్యానవన  సందర్శన   :

ఒక నిర్దేశిత నియమావళితో విద్యార్థులను ఒక ఉద్యానవనానికి తెసుకొని వెళ్ళి వారిని అన్వేషించి  ఆనందించమని చెప్పండి. వారిని

*      వివిధ రకాలైన మొక్కలు, చెట్లను,  పొదలను చూడమని చెప్పండి.

*      వివిధ రకాల  పత్రాలను పరిశీలించమని చెప్పండి.

*      అలాగే వారిని మొక్కలను  సందర్శిస్తున్న కీటకాలను కూడా పరిశీలించి, వారి పరిశీలనలను నమోదు చేసుకొమని చెప్పండి.

తరువాత  విద్యార్థులందరూ ఒక్క దగ్గర కూర్చొని వారి పరిశీలనను ఈ క్రింది ప్రశ్నల  అధారంగా  చర్చించమని  చెప్పండి

1.      మొక్కలు తమ ఆహారాన్ని ఎలా తయారు చేసుకొంటాయి?

2.      కొన్ని మొక్కలే పూలను కలిగిఉంటాయి ? ఎందుకు?

3.      గడ్డి అంటే ఏమిటి?

4.      మొక్కల వయస్సును ఎలాకనుగొంటారు ?

5.      ఉద్యానవన సంరక్షకునితో అతను ఉద్యాన వానాన్ని ఎలా సంరక్షిస్తాడో తెలుసుకోండి

ఇంటిపనిగా పిల్లలను వివిధరకాలైన ఆకులను సేకరించి వాటిని scarp bookలోఅంటించమని చెప్పండి. వారికెదురైన  ప్రత్యేకమైన చెట్టును లేదా పత్రాన్ని లేదా పుష్పం గురించి వ్రాయమని చెప్పండి. ఇది విరామసమయ కృత్యంగా తీర్చిదిద్దితే అభ్యసనం చాలా ఆనందకరంగా ఉంటుంది.

డిస్కవరీ లేదా అనిమల్ ప్లానెట్ channel  నుండి జంతువుల లేదా మొక్కల జీవిత చరిత్రకు సంబంధించిన ఒక వీడియో చిత్రాన్ని చూపండి. సందేహాలను అడగమనండి. వారి సందేహాలను తీర్చండి. ఇలాంటి కార్యక్రమాన్ని మూడుభాగాలుగా చెయ్యండి  ప్రతి సెషన్  తరువాత జంతువుల ఆహారపు అలవాట్ల గురించి వాటి ప్రవర్తన గురించి చర్చించండి.

టివీ లో  ప్రసారంకాబోయే  ఒక కార్యక్రమాన్ని విద్యార్థులకు ముందే  తెలియచేసే   చూడమనండి. తరువాత రోజు ఆ కార్యక్రమం గురించి చర్చించండి.

కానీ

మీరు  విద్యార్థులను చూడమనే కార్యక్రమం  వారి తరగతికి చెందినదిగా చూసుకోండి అలాగే  ఆ కార్యక్రమాన్ని ఎలా చూడాలి  ఎందుకు చూడాలీ మొదలైన విషయాలకు సంబంధించి నిర్దిష్టమైన సూచనలను ఇవ్వండి.

·         ఉదాహరణకు వారి పాఠ్యాంశం అడవి జంతువులకు సంబధించినదై అందునా సింహాలకు గురించి అయితే వారిని సింహాలకు సంబంధించిన కార్య క్రమాన్ని చూడమని చెప్పండి

·         విద్యార్థులు ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చూడడానికి  వీలైయ్యేలా, వారికి ఛానెల్ వివరాలను,  కార్యక్రమం ప్రసారమయ్యే  సమయాన్ని ఇతర విషయాలను అందించండి.

·         ఆ కార్యక్రమంలో ఏ భాగాన్ని చూడాలో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు వారిని  సింహాల ఆహారపు అలవాట్లను,  వాటి కుటుంబ విషయాలను,  అవి వేటాడే విషయాన్ని చూడమని స్పష్టంగా చెప్పాలి. వీలైతే వారి ఇంటిపని నోటు పుస్తకాలలో వ్రాసిపంపండి దీనిద్వారా వారి తల్లితండ్రులకు కూడా విషయం స్పష్ఠంగా తెలుస్తుంది.

·         వివరాలను నోటుపుస్తకంలో నమోదు చేసుకోమని చెప్పండి. వారు కార్యక్రం చూసిన సమయానికి,  చర్చను నిర్వహించే సమయానికి ఎక్కువ వ్యవధి లేకుండా చూసుకోవాలి.

టివీ లో ముందే నిర్ణయించిన ఒక కార్యక్రమాన్ని  చూసిన తరువాత;

తరగతిగదిలో చర్చను, సింహాన్ని అడవికిరాజు అని ఎందుకంటారు?  లాంటి చాలాసరళ మైన ప్రశ్నలతో  మొదలుపెట్టవచ్చు. కొంత సమయం తరువాత  కార్యక్రమంగురించి చర్చించవచ్చు.   

వారు చూసిన అన్ని వస్తువుల జాబితాను చెయ్యమని చెప్పండి.

ప్రతి వస్తువు పేరుని నల్లబల్లపై వ్రాయండి.

ఏదైనా మరచి పోయిఉంటే దానిని గుర్తుకుతెచ్చు కోవడానికి ప్రొత్సహించండి. మొత్తం తరగతిని నాలుగు గ్రూపులుగా విభజించండి ప్రతి గ్రూపు వేరు వేరు అంశాల పై విషయాలను సేకరిస్తుంది.

గ్రూపు 1 సింహాల గురించిన సాధారణ సమాచారాన్ని లేదా వాటి ఆవాసాల గురించి

గ్రుపు 2 వాటి వేటాడే పధ్ధతుల గురించి  

గ్రూపు 3 సింహాల ఆహారపు అలవాట్లను గురించి

గ్రూపు 4 వాటి కుటుంబ పధ్ధతుల గురించి సమచారాన్ని సేకరిస్తారు.

ఈ చర్చను ఒక పధ్ధతిప్రకారం, విద్యార్థులు  చెప్పిన విషయాలతో ఎక్కువగా  విభేధించకుండా నల్లబల్లపై వ్రాయండి.  విద్యార్థులు ఇంకా ఏదైనా ముఖ్యసమాచారాన్ని మరచిపోయిఉంటే వాటిని వివరించండి. ఉదాహరణకు:  సింహం ఆకలిగా లేకపోతే వేటాడుతుందా?  ఇంటి దగ్గర దీనికి సంబధించిన నోట్ ని తయారు చెయ్యమని చెప్పండి. వారు ఈ అంశాం పై ఒక చార్ట్ ని కూడా తయారుచెయ్యవచ్చు.

సముద్రతీరానికి యాత్ర

తరగతిగదిలో  బయటపడని ఆలోచనలను మేల్కొలపడానికి విద్యార్థులకోసం సముద్రతీర యాత్రను నిర్వహించండి. మీ నగరం  సముద్రతీరంలో ఉంటే మీరు దానిని తప్పక సందర్శించవచ్చు. ఈ యాత్రయొక్క లక్ష్యాల గురించి విద్యార్థులకు  ముందుగానే స్పష్ఠంగా చెప్పాలి.  దీని బదులుగా మీరు నదీతీరానికి గానీ  లేదా ఒక కొలను దగ్గరికి గానీ యాత్రను మార్చి దానికి అనుగుంగా పరిశీలనలను మార్చుకోవచ్చు.

·         వారిని  ప్రత్యేకంగా ఆల్చిప్పలు, శంఖువులు, నత్తలను పరిశీలించమని చెప్పండి.

·         పిల్లలు తగినంతగ అన్వేషించడానికి ఆనందించడానికి సమయాన్ని కేటయించండి

·         దీని తరువాత అందరూ వృత్తాకరంగా కూర్చూని ఆ యాత్ర గురించి చర్చను నిర్వహించవచ్చు.  చర్చను నిర్వహించడానికి  ఈ క్రింద ప్రశ్నలు ఉపయోగపడుతాయి.

1.      నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుంది?

2.      శంఖువులు ఎలా ఏర్పడతాయి ?

3.      నీటికి దగ్గర గల ఇసుక ఎందుకు నునుపుగా ఉంది తీరంలో ఎందుకు గరుకుగా ఉంది?

4.      సొరచేపలు, తిమింగలాలు సముద్రతీరంలో ఉంటాయా? ఉండవా? ఎందుకు ?

5.      అలలు ఎలా ఏర్పడతాయి ?

6.      ప్రతి ప్రశ్నను చర్చించి వారినుండి  సమాధానాలను తెలుసుకోండి . వారికి అలోచించడానికి తగిన సమయం ఇవ్వండి. మీరు ఊహించని అభిప్రాయాలను వారు చెపుతారు. వివరాలను  చెప్పమని తొందరపెట్టకండి.

7.      ఇంకాఇతర మిగిలిన పరిశీలనలను వివరించండి అలాగే వారికి సముద్రతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి వివరించవచ్చు.

వారు ఈ చర్చల మరియు పరిశీలనల  ఆధారంగా ఒక పత్రాన్ని తయారుచెయ్యవచ్చు. పిల్లలను ప్రయోగాలను, తప్పులను చెయ్యనివ్వండి, ప్రశ్నించడాన్ని ప్రోత్సహించండి.  “వారు పక్షులు గూళ్ళలోనే ఎందు కుంటాయి ?  అని అడిగితే  “మనం కనుక్కొందాం “ అని చెప్పండి.  అభ్యసనం అనేది విసుగుకలిగించకూడదు.  అభ్యసనాన్ని ప్రతిరోజూ అనందించేదిగా చెయ్యాలి.

ఈ వ్యాసం మొదట టీచర్ ప్లస్  పత్రికలో (సంచిక 64,)  జనవరి  ఫిభ్రవరి  2000లో ప్రచురించ బడింది. దానినే ఇక్కడ కొన్ని మార్పులతో ప్రచురించడం జరిగింది.

18302 registered users
7138 resources